తెలంగాణ విలన్ కాంగ్రెసే


Sat,October 6, 2012 04:30 PM

Raju12-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపించబోతున్న కాంగ్రెస్ పెద్దలు ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్, అహ్మ ద్ పటేల్, చిదంబరంలకు కృతజ్ఞతలు. ‘ఘనమైన’ రాజకీయ చరిత్ర కలిగిన వీరంతా సోనియాను నాలుగ్గోడల నడుమ కీలుబొమ్మగా మార్చి దేశ రాజకీయాలను నడిపిస్తున్నారు. గతంలో దేశ రాష్ట్రపతి మాత్రమే ‘రబ్బరు స్టాంపు’గా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రపతికి తోడు ప్రధాని కూడా రబ్బరు స్టాంపుగా మారారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది డబ్బు సంచులకు అమ్ముడుపోయే ఈ దుష్ట చతుష్టయం. ప్రలోభాలకులోనై ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన నేతలు కాంగ్రెస్‌లో నెహ్రూ కాలం నుంచే ఉన్నారు. ఆ రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి వంటి నిజాయితీ గల నేతలు కొందరైనా ఉండేవారు. శాస్త్రి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మచ్చుకైనా లేరు. అటువంటి వారు ఒక్కరిద్దరై నా ఆ పార్టీలో ఉండి ఉంటే తెలంగాణకు ఇన్ని అవస్థలు ఉండేవి కావు. మన పక్షా న గొంతు వినిపించే వారు.

ఇంకా భ్రమలు అనవసరం. ఏప్రిల్ 27 2001న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ పార్టీని ప్రారంభించిన రోజే స్పష్టం చేసినట్టు ‘తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీయే’ ఈ సంగతిని అందరికన్నా ముందు బట్టబయలు చేసి కాంగ్రెస్ ప్రజాస్వామ్య ముసుగును చింపివేసిన తొలి తెలంగాణ బిడ్డ ప్రజాకవి సుద్దాల హన్మంతు. ‘రంగు రంగుల మారి నెవురయ్యా నీ రంగూ బూరంగమాయె నెవురయ్యా’ అంటూ తెలంగాణ పల్లెల్లో గొంతెత్తి పాడుతూ 1948లోనే కాంగ్రెస్ పై, నెహ్రూపై ప్రజల కున్న భ్రమలను పటాపంచలు చేశారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన 13 నెలల్లోపే హైదరాబాద్ సంస్థానంలోని రెండు లక్షల మంది ముస్లింలను, మూడువేల మంది హిందువులను ఊచకోత కోసిన, సజీవంగా తగులబెట్టిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ పాలకులది. ప్రజలకు నాయకత్వం వహించిన వామపక్ష పార్టీల నేతలైన కొందరి వర్గ సంకర రాజకీయ వైఖరుల వలన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మనుగడ సాధ్యమైంది. సుద్దాల వంటి కవుల కృషి వృథా అయింది. కాంగ్రెస్‌పై భ్రమలు తొలగవల్సిందిపో యి మూడు తరాల తర్వాత కూడా ఆ భ్రమలు నేటికీ ఉండడం ఒక విషాదమే. ప్రజల ఆకాంక్షలనే లక్ష్యాలుగా చేసుకొని పనిచేసే నేతలు కరువైనందునే కాంగ్రెస్ రాజ్యం సాగుతున్నది.

తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ ద్రోహపూరిత చరివూతకు నిలు సాక్ష్యం. స్వతంత్ర దేశంగా ప్రపంచపటంలో స్థానం సంపాదించుకోవలసిన తెలంగాణ దేశంపైకి తమ సైన్యాలను ఉసిగొల్పి దౌర్జన్యంగా ఆక్రమించుకున్న చరిత్ర కాంగ్రెస్ పాలకుల ది. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆంధ్రతో తెలంగాణను కలిపింది కాంగ్రెస్ పాలకులే. నెహ్రూ సమక్షంలో ఢిల్లీలో చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందాన్ని కాలరాసిందీ కాంగ్రెస్ పాలకులే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించిన 369 మంది యువతీయువకులను తుపాకీ గుళ్లకు బలిచేసింది కాంగ్రెస్ పాలకులే. తెలంగాణకున్న రాజ్యాంగ రక్షణలను ఆంధ్రుల సంతృప్తి కోసం ఆరు సూత్రాల పేరు తో అణగదొక్కిందీ కాంగ్రెస్ పాలకులే. యాభైఐదేళ్ల సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క తెలంగాణ ముఖ్యమంవూతినీ రెండేళ్ల కాలం కూడా సీట్లో ఉండనివ్వకుండా పదవీచ్యుతుల్ని చేసిన చరి త్ర కూడా కాంగ్రెస్ పాలకులదే. తెలంగాణకు ప్రత్యే క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విభాగం ఉండాలనే పెద్దమనుషుల ఒప్పందంలోని నియమాన్ని తుంగలో తొక్కి తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆంధ్ర నేతల కింద అణిగిమణిగి ఉండే కట్టు బానిసలను చేసిందీ కాంగ్రెస్ పార్టీయే.

పొత్తు కలిస్తే చాలు తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్‌ఎస్ పార్టీని నమ్మించి అవసరం తీరగానే నమ్మక ద్రోహం చేసిందీ కాంగ్రెస్ పార్టీయే. 2009 డిసెంబర్9న తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ప్రకటన చేసి సరైన కారణం చూపకుండా సీమాంధ్ర నేతల డబ్బు మాటలకు అమ్ముడుబోయి ఇచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిందీ కాంగ్రెస్ పార్టీయే. గత ఇరవై నెలల్లో ఏడువందల మంది తెలంగాణ ముద్దుబిడ్డల బలిదానాలకు, ప్రొఫెసర్ జయశంకర్‌తో సహా వందలాది మంది క్యాన్సర్ (మానసిక ఒత్తిడే క్యాన్సర్‌కు మొదటి కారణం) మరణాలకు ప్రత్యక్ష బాధ్యత కాంగ్రెస్ పాలకులదే. ఇచ్చిన తెలంగాణను ఎత్తగొట్టడంలో పరోక్షపాత్ర తెలుగుదేశం పార్టీది ఉన్నా ఆ పార్టీపై, నేతలపై తెలంగాణ ప్రజలకున్న భ్రమలు ఏనాడో తొలిగిపోయినవి. ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టలేని దుస్థితికి నెట్టబడింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ పార్టీలు, నేతలు, ప్రజలు దృష్టి పెట్టవలసింది కాంగ్రెస్ పార్టీపైనే.

యాభై ఐదేళ్ల సమైక్య పాలనలో 39 ఏళ్లు తెలంగాణను పాలించింది కాంగ్రెస్ పార్టీయే. ఈ సుదీర్ఘ పాలనలో నిజాం స్థాపించిన పరిక్షిశమలను ఆనవాలు లేకుం డా చేసిన ‘ఘనత’ కాంగ్రెస్ పాలకులదే. నిజాం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు శిథిలమవుతున్నా పట్టించుకోలేదు. తెలంగాణలో అరవై లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే నిజాం ప్రభుత్వ ప్రణాళికలను కాలరాసింది కాంగ్రెస్ పాలకులే. తెలంగాణ నుంచి ప్రవహించే కృష్ణా, గోదావరి నదుల నీటిని ఈ ప్రాంతానికి దక్కనివ్వకుండా సీమాంవూధకు తరలించిందీ కాంగ్రెస్ పాలకులే. కాంగ్రెస్ పాలనలో ఏనాడూ తెలంగాణ గడ్డమీద పౌరహక్కులు అమలు చేయలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని దళిత రిజర్వేషన్లనే ఒకే ఒక్క అంశం తప్ప మరేదీ తెలంగాణలో అమలు కాలేదు. స్పార్టకస్‌ను బలితీసుకున్న బానిసల యుగపు దౌర్జన్యం, మధ్య యుగాల నాటి ముష్కరుల పాలనే ఇన్నేళ్లుగా తెలంగాణలో అమలైంది.

రజాకార్ల అమాను ష కాండ ఇంకా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పాలన రూపంలో కొనసాగుతూనే ఉన్నది. నేటి రైతుల, విద్యార్థుల, వృత్తి పనివారల ఆత్మహత్యలకు ప్రధాన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. పచ్చటి పల్లెలతో, ఎటు చూసినా కనులకింపైన జలాశయాలతో, పాడి పంటలతో విలసిల్లిన తెలంగాణ వల్లకాడుగా మారడానికి కాంగ్రెస్ పాలకులే కారణం. ఈ ముదనష్టపు సమైక్య రాష్ట్రం ఏర్పడకముందు ‘అన్నమో రామచం ద్రా’ అని ఇంటి ముందుకు వచ్చిన కరువు పీడిత కర్నూలు, కడప జిల్లా జనానికి పాలు, పెరుగు(చల్ల) పోసి ఆదరించిన పాపానికి పాలమూరు జిల్లా పాడిపంటలకు దూరమైంది. వరదల్లో సర్వస్వం కోల్పోయి తమ ఇళ్ల ముందుకొచ్చిన కృష్ణా, గోదావరి జిల్లా వాసులకు దాహం తీర్చిన నల్లగొండ అవిటిదైంది. నేసిన బట్టలిచ్చిన పోచంపల్లి పీనుగుల పెంటయింది. దున్నుకోవడానికి నేలనిచ్చిన, నీళ్లనిచ్చిన నిజామాబాదు బిడ్డలు దుబాయి, మస్కట్‌లలో దిక్కులేని చావు చస్తున్నరు. ఆంధ్రుల ఆధిపత్యానికి తెలంగాణ వల్లకాడుగా మారడానికి, ఇక్కడి బిడ్డల దశాబ్దాల గోసకు కారణం కాంగ్రెస్ పార్టీయే.

శత్రు కనిపెట్టిన తర్వాత, శత్రు వ్యూహం అర్థమైన తర్వాత ఇంకా ఉపేక్షించవలసిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ద్రోహిగా, కాంగ్రెస్ నేతలను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలి. తెలంగాణ యెడ చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ బిడ్డలు ద్రోహపూరిత కాంగ్రెస్‌లో ఏ మాత్రం ఉండకూడదు. ఒకపక్క చర్చల పేరుతో ప్రజలను నమ్మిస్తూ మరోపక్క తెలంగాణ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాల్జేస్తున్న కాంగ్రెస్ పాలకుల నిజస్వరూపాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. సీమాంధ్ర నేతల కుక్క బిస్కెట్లకు చొంగలు కార్చుకుంటూ మోకరిల్లే తెలంగాణ ఇంటి దొంగలకు సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ముందు ఇంటి దొంగల భరతం పట్టకుండా బయటి దొంగలను దారికి తేలేము.
తెలంగాణ వ్యవసాయ క్షేత్రంలో కలుపుమొక్కలే కాంగ్రెస్ నేతలు.

కలుపు మొక్కలను నాశనం చేయకుంటే పంట చేతికి రాదు. తెలంగాణ పేరు చెప్పి ఓట్లడిగి ప్రజావూపతినిధులైన నేతలందరికీ డెడ్‌లైన్ పెట్టి పదవులకు పార్టీలకు రాజీనామా చేయించాలి. కలుగులోని ఎలకను బయటికి లాగడానికి చేసే ప్రయత్నమే కాంగ్రెస్ విషకౌగిలిలో చిక్కుకున్న తెలంగాణ నేతలను బయటికి తేవడానికి జరగాలి. 134 శాఖలలోని ప్రభుత్వ ఉద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొంటూ ప్రతిరోజూ వారివారి కార్యాలయాల దగ్గర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది చాలదు. ఉద్యోగులు, విద్యార్థులు బృందాలుగా తెలంగాణ ద్రోహులైన కాంగ్రెస్ శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల, మంత్రుల నియోజకవర్గాలకు పోయి ఇంటింటికి ప్రచారం చేయాలి. తాము ఎన్నుకున్న నేతలు ఎంత ద్రోహం చేస్తున్నారో ఆ ప్రజల్లో బట్టబయలు చేయాలి. ఏ అధికారం కోసం తెలంగాణను ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నదో ఆ అధికారం నుంచి ఆ పార్టీ వైదొలిగేలా ఈ ఉద్యమం సాగాలి. ఏం చేయకుంటనే తెలంగాణ నేతలపై కేసులు పెడుతున్న రు.

ఇంకా కేసులకు భయపడే స్థితిలో తెలంగాణ బిడ్డలు లేరు. నాలుగున్నర కోట్ల మందికి సరిపోయే జైళ్లు ఈ రాష్ట్రంలోనే కాదు- దేశంలోనూ లేవు. అనేక కార్యక్షికమాల రూపంలో తెలంగాణ బిడ్డల శక్తిని విభజించే కన్నా కాంగ్రెస్ ద్రోహుల భరతం పట్టే కార్యక్షికమాన్ని రూపొందించడం అవసరం. తన ఉనికిని తెలంగాణ లో కాపాడుకోవాలన్నా, కాంగ్రెస్ పాలనను ఎన్నికల దాకా కొనసాగించుకోవాల న్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతుంది. లేదా కాంగ్రెస్ సమాధిపైనే తెలంగాణను తెచ్చుకుందాం.1969 ఉద్యమంలో యాదవడ్డి అనే యువకుడు పాతబస్తీలో ఉంటూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. ఉద్యమం ఆగిపోయిన తర్వాత ఒకనాడు అమీర్‌పేట చౌరస్తాలో చెన్నాడ్డి కారును ఆపి షేక్‌హ్యాండ్ ఇస్టున్నట్టు చేయిచాపి చెంప చెళ్లు మనిపించాడు. తెలంగాణకు చెన్నాడ్డి చేసిన ద్రోహానికి అతని సామాజిక వర్గానికే చెందిన తెలంగాణ బిడ్డ బుద్ధి చెప్పిండు. అలాంటి యాదవడ్డిల అవసరం తెలంగాణకు ఇప్పుడేర్పడింది.

-వి. ప్రకాశ్
పొఫెసర్ జయశంకర్ తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ సెంటర్)

35

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ