సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం


Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార్టీల ప్రతినిధులు సీమాంధ్ర నేతల చేతుల్లో (వయా ఢిల్లీ) కీలుబొమ్మలుగా ఉంటారు తప్ప ప్రజల ఆకాంక్షలను నెరవేర్చరు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నా ప్రజలు ఆశించిన సీమాంధ్ర ఆధిపత్య పీడ పూర్తిగా తొలగలేదు. తెలంగాణ ప్రజల నెత్తిన కత్తిలా వేలాడుతూనే ఉన్నది. ప్రజలు ఆశించిన సంపూర్ణ తెలంగాణ లక్ష్యం ఇప్పటికీ మిగిలే ఉన్నది. ఈ సందర్భంగా బ్రిటిష్ పాలన-భారత ప్రజల స్వాతం త్య్ర పోరాటాన్ని, అనుభవాలను యాది చేసుకునే అవసరం వచ్చింది.
బ్రిటిష్ పాలకుతో ఆంధ్ర ప్రజలను పోల్చితే తప్పు కానీ సీమాంధ్ర పాలకులను పోల్చవచ్చు. తెలంగాణ ఆర్థిక వనరులను దోచుకోవడానికి తెలుగు జాతి సమైక్యత నినాదమిచ్చి దోపిడీని సుస్థిరం, చట్టబద్ధం చేసుకోవడానికి రాజకీయాధికారం కొనసాగించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సీమాం ధ్ర ప్రత్యక్ష రాజకీయాధిపత్యం అంతరించింది. కానీ తెలంగాణ
వనరుల దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ దోపిడీని నిరాటంకంగా కొనసాగించడానికి బ్రిటిష్‌వారు అనుసరించిన విధానాన్నే ఆచరిస్తున్నారు.
ఆంధ్ర-తెలంగాణ వేరుపడ్డ తర్వాత కూడా ఆంధ్రలో ఉంటూ తెలంగాణ రాజకీయాలను ప్రత్యక్షంగానో,
పరోక్షంగానో శాసించాలనుకుంటున్నారు. తద్వారా తమ పాలనలో చేసిన అక్రమాలు బయటపడకుండా జాగ్రత్తపడాలని, వీలైతే వనరుల దోపిడీని సుస్థిరం,చట్టబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
దేశంలో గతంలో ఏర్పడిన కొత్త రాష్ర్టాల వలె రాష్ట్ర విభజన జరగనివ్వకుండా అనేక ఆంక్షలతో తెలంగాణను విభజించారు.
తమకు కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతిలో హైదరాబాద్ శాంతిభద్రతలు, పదేళ్ళ దాకా విద్య లో రిజర్వేషన్ల కొనసాగింపు, ఉమ్మడి హైకోర్టు, నదీ జలాల బోర్డులు, జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన, ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రకు అప్పగించడం.. ఇవన్నీ తెలంగాణ వనరుల దోపిడీకి, ఆధిపత్య కొనసాగింపునకు, ప్రశ్నిస్తే ఇక్కడి ప్రజలను అణగదొక్కడానికి ఉద్దేశించినవే. ఈ ఆంక్షలు కొనసాగినంత కాలం తెలంగాణ వలసాధిపత్యం నుంచి విముక్తి పొందినట్లు అంగీకరించలేము, తెలంగాణకు స్వయంపాలన లభించినట్లు భావించలేము.ఈ ఆంక్షలకు గరిష్ఠ పరిమితి పదేళ్లు.
ఈ పదేళ్లలో తెలంగాణలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆంధ్ర పార్టీలైన టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తున్నాయి.తమకు నమ్మిన బంట్ల వలె పనిచేస్తున్న కొందరు తెలంగాణ నాయకులనే వారీపనికి ఉపయోగిస్తున్నారు. వీరిని ఎన్నికల్లో గెలిపించడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన సిసలైన, స్వంత అస్తిత్వం ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థలను ఓడించడానికి పడరాని పాట్లు
పడుతున్నారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల అధిష్ఠానాలపై తమకున్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణలోని తమ అనుకూల శక్తులను ఎన్నికల్లో గెలిపించుకోవడానికి, ఒకే కూటమిగా ఏర్పడడానికి తద్వారా టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా నిరోధించడానికి కుట్రలు పన్నుతున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్న యువతీ యువకుల ఓట్లను చీల్చడానికి ఈ ప్రాంతంలో ఫ్యాన్స్ ఉన్న పవన్ కల్యాణ్‌ను జనసేన పేరుతో రాజకీయాల్లోకి దించింది ఈ ఆంధ్ర ఆధిపత్యవాదులే.
గతంలో తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మి వందలాది యువకుల బలిదానాలకు కారణమైన సీమాంధ్ర మీడియాలోని ఒక వర్గం ఈ సీమాంధ్ర ఆధిపత్యవాదుల కుట్రల అమలుకు చేయగలిగినంత చేస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్ తెచ్చిన తెలంగాణపై ఆంక్షలు తొలగింపుకు, సంపూర్ణ తెలంగాణ సాధనకు, సీమాంధ్ర ఆధిపత్యవాదాన్ని పూర్తిగా అంతం చేయడానికి ఏం చేయాలి? ఎలాంటి ఎత్తుగడలు, కార్యాచరణను అవలంబించాలి?
ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఉనికి లేకుండా చేయాలి. ఆ పార్టీల్లోని జనబలం ఎంతో కొంత ఉండి ప్రజాప్రతినిధులుగా గెలువగలిగే నాయకులను, లేదా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యే నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం.. తద్వారా ఆంధ్ర పార్టీల కుట్రలను అమలు కాకుండా నిరోధించడం..ఈ బాధ్యత టీఆర్‌ఎస్ నాయకత్వంపై ఉన్నది. సమర్థవంతంగానే కేసీఆర్ ఆ పనిచేస్తున్నారు.
గతంలో టీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తి పోసి బూతులు తిట్టి, తెలంగాణవాదులపై మానుకోటలో బుల్లెట్లతో, రాళ్ళతో దాడిచేసి గాయపరిచిన కొండా దంపతులు, తాండూరు జాక్ నేతలపై దాడి చేయించి అక్రమ కేసులు పెట్టించిన మహేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ గిరిజన నేత నగేష్‌ను తెరాసలోకి వస్తామనగానే ఆహ్వానించి వారి గతాన్ని మన్నించి అభ్యర్థులగా ఎన్నికల్లో పోటీ కి అవకాశం ఇస్తున్నది టీఆర్‌ఎస్.
ఎన్నికలు ఓ యుద్ధం వంటివి. శక్తిమంతమైన ఆయుధం శత్రువు చేతిలో ఉండే కన్న మన చేతిలో ఉండాలనుకోవడం యుద్ధనీతి. ఒకసారి యుద్ధభూమిలో దిగిన తర్వాత ధర్మం, అధర్మం గురించి ఆలోచించరు. గెలవడమే ప్రధానం. గెలవడానికేం చేయాలో అన్నీ చేయాలి. మానుకోటలో గాయపడ్డ తెలంగాణ బిడ్డల ఆవేదన నిరసన, సోషల్ మీడియా ద్వారా వెల్లడవుతున్నది. కొండా సురేఖ పట్ల ఇదే వ్యతిరేకత ఆమె ప్రతినిధ్యం వహించే రాజకీయ క్షేత్రంలో ఎప్పుడూ లేదు.
మానుకోట సంఘటన జరిగిన కొద్దిరోజులకే జరిగిన పరకాల ఎన్నికల్లో ఆమెపై గెలవడం టీఆర్‌ఎస్‌కు ఎంత కష్టమైందో అందరికీ తెలుసు. కొండా సురేఖ జనాదరణ ఉన్న వెనుకబడిన కులానికి చెందిన తెలంగాణ ఆడపడుచు. ఒక లక్ష్యం కోసం ఆమె తప్పులను మన్నించే ఔదార్యం తెలంగాణ సమాజానికి ఉంది. ఇంత కాలం దోచుకున్న, బిడ్డల బలిదానాలకు కారణమైన వారినే వారి కర్మకు వదిలేసి పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్నది తెలంగాణ.
ఇప్పుడు ఆంధ్ర పార్టీలకు ఉనికి లేకుండా చేసే ఆలోచనలు కావాలి. ఆవేశం-ఉద్యమాలకు అవసరం కాని, ఎన్నికల రాజకీయాలకు కాదు. ఆంధ్ర పార్టీల్లో చిట్టచివరి నాయకుడు మిగిలి ఉండేదాకా వలసాధిపత్య కత్తి మన నెత్తిన వేలాడుతున్నట్టే.బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినంత మాత్రాన వాటిని మోయాల్సిన అవసరం లేదు. ఇవి ఆంధ్ర పార్టీలు కాకున్నా ఈ పార్టీల అధిష్ఠానం సీమాంధ్ర పెట్టుబడిదారుల, నాయకుల ఒత్తిళ్లకులోనై తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడడం, తెలంగాణ
వనరుల దోపిడీకి మున్ముందు సహకరించే వీలుంది.
బీజేపీ అగ్ర నేతలు కొందరు ఆంధ్ర పార్టీతో అంటకాగడానికి ఆ పార్టీ తెలంగాణ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముం పు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీ య పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార్టీల ప్రతినిధులు సీమాం ధ్ర నేతల చేతుల్లో (వయా ఢిల్లీ) కీలుబొమ్మలుగా ఉంటారు తప్ప ప్రజల ఆకాంక్షలను నెరవేర్చరు.
తెలంగాణపై ఆంక్షలు పోవాలన్నా, పోలవరం ఆపాలన్నా, సంపూర్ణ తెలంగాణ సాధనకైనా టీఆర్‌ఎస్ అభ్యర్థులును గెలిపించి రాబోయే ఐదేళ్లు టీఆర్‌ఎస్ పాలనను కోరుకోవడమే తెలంగాణ వాదుల ముందున్న ప్రస్తుత కర్తవ్యం.
-విపకాశ్
జయశంకర్ తెలంగాణ ఆర్ అండ్ డీ సెంటర్ అధ్యక్షులు

230

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ

Featured Articles