సారు లేడని మనాది వద్దు...


Sat,October 6, 2012 04:29 PM

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి కారణం తెలంగాణ ప్రజలు చూపుతున్న చైతన్యమే. అందుకనే ‘తెలంగాణ తెచ్చుకునుడు పదిపైసల వంతైతే తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుడు తొంభై పైసల వంతు’ అన్నడు.

Jayashankar1జయశంకర్ సారు లేని తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని ఊహించ డం కష్టమే కావచ్చు. సారు లేని లోటు పూడ్చ లేనిదే కావచ్చు. ప్రజాకవి కాళోజీ, ప్రొఫెసర్ జనార్ధనరావులు చూడలేకపోయిన తెలంగాణను కనీసం జయశంకర్ సారు తప్పక చూస్తారనే విశ్వాసంతో ఉన్న తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు ఆయన మరణం ఒక షాక్ కావచ్చు. దాని నుంచి తేరుకోలే ని వారికి తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌పై ఆందోళన కలగడం సహజమే. జయశంకర్ సారు భౌతికంగా మనల్ని విడిచి ఆయన ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణ ప్రజలకు మార్గదర్శిగా నిలిచే ఉంటారు. ఎంతటి మహనీయునికైనా మరణం తప్పదు. శరీరం శాశ్వతం కాదు. వారందించిన జ్ఞాన సంపద, మార్గదర్శకత్వం, చరిత్ర శాశ్వతంగా నిలిచే వుంటాయి. జయశంకర్ సారు తెలంగాణ తత్వవేత్త. దూరదృష్టితో మనమేం చెయ్యాలో ముందే చెప్పిండు. కుటుంబ సభ్యులేం చేయాల్నో కూడా చెప్పిండు.

తనకు మెరుగైన వైద్యసేవలు అందించలేకపోతున్నట్లు డాక్టర్లు చెప్పంగనే తనను ఎట్ల హన్మకొండ స్వంత ఇంటికి చేర్చాల్నో, ఆఖరి శ్వాస విడిచేదాకా ఇంట్లో ఏవిధంగా వైద్యసేవలు అందిచాల్నో, నెలన్నర క్రింద బ్రహ్మంకు అమెరికల ఉన్న తమ్ముడు ప్రసాదుకు ఫోన్‌లోనే సారు చెప్పిండు. మరణించిన తర్వాత అంతిమ సంస్కార క్రియలు ఎలా నిరాడంబరంగా జరపాల్నో, ఎవవరు ఏ పనిచేయాల్నో అన్నీ ముందే స్పష్టంగ చెప్పిండు. ఎలాంటి ఆర్భా టం లేకుండా ‘పదకొండో రోజు’ జరపాల్నని ఏ ఒక్క విషయాన్ని వదలివేయకుండా.. కన్నీటి పర్యంతమవుతున్న బ్రహ్మం దంపతులకు చెప్పిండు. సుమారు పదకొండు నెలల క్రితమే తనకు ఇంకా ఎక్కువ సమయం లేదని తెలుసుకున్న సారు ఈ విషయాలు బ్రహ్మంకు చెప్పడం వరకే పరిమితం కాలేదు. తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు, సన్నిహితులకు కూడా తెలంగా ణ ఉద్యమ తొవ్వ ఎట్లుండాల్నో స్పష్టంగనే చెప్పిండు. ప్రతి టీవీ ఇంటర్వ్యూ ల, ఉపన్యాసాలల్ల చెప్పిండు. అలాగే.. తెలంగాణ తెచ్చుకున్నంక ఎట్ల అభివృద్ధి చేయాల్నో చెప్పిండు.
ఏ సమస్యనైనా శాంతియుతంగ పరిష్కరించుకోవచ్చునని సారు నమ్మకం. హైదరాబాద్‌ల తోట ఆనందరావు ఇంట్లనే సారు మకాం. ఆ ఇల్లు హబ్సిగూడలో ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్నది. ఎన్నోసార్లు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని సారు కండ్లార చూసిండు.

తన ఆవేదనను తోట కుటుంబ సభ్యులతో పంచుకున్నడు. ‘ఆందోళన చేస్తున్న వారితో కూర్చొని మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించాలె. ఈ అమానుష హింసాకాండ కొత్త సమస్యలను సృష్టిస్తుంద’ని సారు తమతో అన్నట్లు కనకదుర్గ తోట చెప్పారు. ఈ పదిహేనేళ్లలో ఎన్నోసార్లు రాజ్యహింసను, బూటకపు ఎన్‌కౌంటర్లను జయశంకర్ సారు ఖండించిన సంగతి నాకు తెలుసు.‘తెలంగాణ ఉద్యమం శాంతియుత పద్ధతుల్లో సాగినంతకాలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని, సీమాంవూధుల ఆస్తులపై దాడులకు దిగాలని, ఆంధ్రా గోబ్యాక్ నినాదాలివ్వాలని, తెలంగాణ ద్రోహులపై భౌతిక దాడులు చేయాలని’ ఎవరై నా ఆవేశంతో మాట్లాడితే వారికి గతంలో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్య మం (1969)చేదు అనుభవాలను చెప్పి వారి అభివూపాయాలు మార్చుకునేటట్లు చేసిండు. ‘శాంతియుత ఉద్యమాల పునాదులపై రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలమని ’ సారు మనకు తొవ్వ చూపిండు.

ఆఖరి క్షణాల్లో కూడ అవే మాటలు చెప్పిండు.‘తెలంగాణలోని సుమారు మూడు వంతుల ప్రజలు ప్రత్యక్షంగా ఉద్యమాలల్ల పాల్గొంటున్న రు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య పోరాటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీన్ని ప్రభుత్వాలు ఎంతో కాలం నిర్లక్ష్యం చేయలేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంతోకాలం అడ్డుకోలేరని’ సారు అనేవారు.శాంతియుతంగా సుమా రు ఇరవై రోజులు సాగిన సహాయనిరాకరణ ఉద్యమాన్ని జయశంకర్ సారు మెచ్చుకున్నడు. సర్కారుపై ఒత్తిడి పెంచటానికి సహాయ నిరాకరణ బలమైన ఆయుధమన్నడు.

తెలంగాణ కోసం బలిదానాలు అవసరం లేదన్నడు. విద్యార్థుల బలిదానా ల సంఘటనలు బాధ పెడుతున్నా.. తనలోని ఆవేశాన్ని బయటకు రానీయని స్థితవూపజ్ఞత సారులో కనిపించేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అమలు కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని సారు అభివూపాయం. కాంగ్రె స్, తెలుగుదేశం పార్టీల వైఖరిని, తెలంగాణలోని ఆ పార్టీలకు చెందిన నేతల ను ఎన్నో సందర్భాల్లో సారు తప్పు పట్టిండు. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఏర్పడిన విస్తృత అంగీకారాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పాంత్రంలోని కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితికి కారణం నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి పన్నిన పన్నాగాలు, వేసిన ఎత్తుగడలు కారణం. వాటి ముందు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం నిర్వీర్యమై, పరాధీనమై దాసోహమైపోయింది.


‘డిసెంబర్ 9 కేంద్ర ప్రకటనను ఉద్దేశిస్తూ.. ఈ చారివూతక నిర్ణయాన్ని కూడా అమలు చేయించుకోవడంలో తెలంగాణ పాంత్ర కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. అది తెలుగుదేశంపార్టీ నాయకత్వానికి సంతోషాన్ని కలుగజేసింది.’ (టీఆర్‌ఎస్ పదేండ్ల ప్రయాణం- ముందుమాట నుంచి) తన ను కలిసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తెలంగాణ నేతలతో జయశంకర్ సారు ఎప్పుడూ నిర్మోహమాటంగానే మాట్లాడిండు.

వరంగల్ జిల్లాకు చెందిన ఒక టిడిపి సీనియర్ శాసనసభ్యుడు సారును కలిసి ‘మమ్మల్నేమి చేయమంటరు?’ అని అడిగినప్పుడు ‘తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయకత్వం కింద పనిచేస్తూ తెలంగాణ అని మీరెంత అరిచినా ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని నమ్మరు’ అని మొఖం మీదే చెప్పిండు. తెలుగుదేశం నేతలు సారుకు ఎన్‌టిఆర్ అంటే గౌరవమని అన్నరు, కానీ అది నిజంకాదు.‘ఆర్థికంగా నష్టపోతే తిరిగి నిలదొక్కుకోవచ్చు. సంస్కృతిని కోల్పో తే తిరిగి నిర్మించుకోలేం’ అన్న కాళోజీ మాటలు చెప్తూ ..ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం చరివూతలో ఎన్న డూ లేనంతగా జరిగిందని సారు అనేవారు. తెలంగాణ రీజనల్ బోర్డును కూడా రద్దు చేసిన ఎన్‌టిఆర్‌ను సారు తెలంగాణ వ్యతిరేకిగానే చూసిండు. ఎన్.టి.ఆర్ అంటే ఒక నటునిగా కూడా సారు ఇష్టపడలేదు. నాగేశ్వరరావు నటనను ఇష్టపడే వాడు. సారు హేతువాది. పౌరాణిక సినిమాలు చూడకపోయేది.


ఈ ప్రాంత మాజీ పిసిసి అధ్యక్షుడొకరు ఈ మధ్యనే సారును చూడటానికి వచ్చి తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అడిగిండు .‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ప్రజలముందుకు రావడానికి సిద్ధపడ్డప్పుడు తెరాస విలీనం సంగతి మాట్లాడుకుందామని మెత్తగానే మందలించిండు. సారును తనే వి.సి చేసిన్నని పొన్నాల బొంకుతున్నడు.అప్పుడు జిల్లా చేపల మంత్రిగా పనిచేస్తున్నడు.అప్పటి సి.ఎం. నేదురుమల్లి ఒక మాట ఫార్మాలిటీ కోసం పొన్నాలకు చెప్పివుంటడు. ఏ పొస్టు కోసం సారు ఏ కాంగ్రెసాయనను పైరవీ చేయమన్లేదు. పన్నేండేళ్ళ కింద ఉస్మానియా వి.సి ఇస్తమని టిడిపి ప్రభుత్వం అంటేనే వద్దన్నడు సారు.

పోయిన సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల ప్రచారం సభలల్ల సారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరిని బట్టబయలు చేసిండు. ‘తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెరాస అభ్యర్థులపై పోటీ చెయ్యలేమన్నవారే పోటీకి సిద్ధపడ్డరు. ఇదేందని అడిగితే ‘అధిష్ఠానం మాట మాకు శిరోధార్యమన్నరు. పోటీపెట్టినా ప్రచారానికి దిగమన్నరు. ఆతర్వాత ప్రచారానికీ సిధ్ధపడ్డరు. రేపు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది లేదని అధిష్ఠానం అంటే కూడా ఈప్రాంత కాంగ్రెస్ నేతలు ‘అధిష్ఠానం మాట మాకు శిరోధార్యం’ అంటరని జయశంకర్ సారు కాంగ్రెస్ నాయకుల నిజస్వరూపాన్ని ప్రజల ముందుట పెట్టిండు.

ఈ ప్రాంత కాంగ్రెస్, టిడిపి నేతలది పచ్చి అవకాశవాద వైఖరిని సారు ఎప్పుడూ అనేవారు. కొందరు కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు సారును కలిసి మమ్మల్ని ఉద్యమంలో తన వెంట తీసుకుపోమ్మని కె.సి.ఆర్‌కు చెప్పిండి అని అడిగినప్పుడు మీరు గతంలో రాజీనామా చేస్తమని మాట తప్పిండ్లు. మిమ్మ ల్ని ఎలా నమ్మమంటరు? అని ఎదురు ప్రశ్నించి వారిని మాట్లాడకుండ చేసిండు.


తెలంగాణ ప్రస్తుత దశ, టిఆర్‌ఎస్ నేతృత్వం గురించి ప్రస్తావిస్తూ.. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం ఒక నిర్ణాయక దశకు చేరుకుంది. ఈదశలో ఏమాత్రం అజాక్షిగత్తగా ఉన్నా ఈ ప్రాంత ప్రజలు శాశ్వతంగా నష్టపోతారు. కనుకనే పోరాటాన్ని నిర్విరామంగా కొనసాగించటం అనివార్యం. ఉద్యమ క్రమంలో అనేక సంస్థలు, వేదికలు ఆవిర్భవించాయి. అందరి ధ్యేయం ఒకటే కనుక, పోరాటాలు ఎటువంటి వైరుధ్యాలు లేకుండా కొనసాగించడం చాలా అవసరం. అన్ని వేదికలు, సంస్థలు సమష్టిగా పోరాడటం వాంఛనీయం. కనీసం సమన్వయంతో లేదా సమాంతంగానైనా ముందుకు సాగాలి. ఉద్యమ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రధాన చోదకశక్తిగా ఆవిష్కృతమైన వాస్తవాన్ని ఈసందర్భంగా మరవకూడదు (టీఆర్‌ఎస్ పదేండ్ల ప్రయాణం- ముందుమాట) అంటూ జయశంకర్ సారు ప్రస్తుతం సాగుతున్న ఉద్యమానికి తొవ్వ చూపెట్టిండు.

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి కారణం తెలంగాణ ప్రజలు చూపుతున్న చైతన్యమే. అందుకనే ‘తెలంగాణ తెచ్చుకునుడు పదిపైసల వంతైతే తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుడు తొంభై పైసల వంతు’(రాజ్‌న్యూస్ ఇంటర్వ్యూలో) అన్నడు.

తెలంగాణ ఎవరికోసం? దేనికోసం? సామాన్య ప్రజలకు ఏం లాభం కలుగుతది? రేపటి తెలంగాణల ఆర్థిక ప్రగతి సామాన్య మానవునికి ఉపయోగపడేలా ఉండాలి. సామాజిక న్యాయం జరగాలి. అభివృద్ధిలో, రాజకీయ ప్రకియలో న్యాయబద్ధమైన వాటా దక్కాలి. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల విద్య సామాన్యునికి అందకుంటపోతున్నది. పాఠశాల నుండి కళాశాల స్థాయి దాకా ప్రభుత్వమే ఉచిత విద్యనందించాలి. గ్రామీణ ప్రాంతాల వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యసౌకర్యాలను గ్రామాల్లో ఉన్న వారికి అందించాలి. వ్యవసాయ పారిక్షిశామిక అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలి. సిసలైన ప్రజాస్వామ్య సంస్కృతి ఏర్పడాలి.ఇవన్నీ చేయటానికి వేలమంది కార్యకర్తలం, నాయకులం తయారుగున్నం. సారు పోయిండనే మనాది వద్దు మన యాదిల ఎప్పటికీ మనతోనే వుంటడు.

తెలంగాణ సమగ్ర చరివూతను జయశంకర్ సారు రాయాలనుకున్నడు. చరివూతను సీమాంవూధులు ఏవిధంగా వక్రీకరించిండ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. రజాకార్ల సంఘటనలను మతకల్లోలాలుగా చిత్రీకరిస్తున్నరని, నిజానికి రజాకార్లలో అంతా ముస్లింలే లేరని, హిందూ భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల గుండా లు ఉన్నారని, దాడులు హిందువులపై మాత్రమే జరుగలేదని నిజాం పాలనకు వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటానికి అండదండలందించిన ముస్లింలపై.. షోయబుల్లాఖాన్ వంటి పాతికేయులపై కూడా జరిగినయని ... ఇలాంటి విషయాలన్నీ చరిత్ర రచన ద్వారా వెలుగులోకి తేవాలన్నడు. కోటిలింగాల చరివూతను బయటికి తేవాలన్నడు. జాగృతి సంస్థ ద్వారా కవిత చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకుపోవాలన్నడు. కవితను అభినందించిండు.

చివరి రోజుల్లో సారు చికిత్స పొందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ దవాఖాన లనే తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంటు సెంటర్, సంస్థను ఏర్పాటు చేయమని సారు సలహా ఇచ్చిండు. ఈ సంస్థ ద్వారా చరిత్ర రచన చేయాలన్నడు. తెలంగాణలో వివిధ రంగాలను అధ్యయనం చేస్తున్న నిపుణులను, చరిత్ర కారులను సమన్వయం చేసుకుంటూ రాబోయే తరాలకు తెలంగాణ చరివూతను అందుబాటులోకి తేవాలన్నడు. చరిత్ర రచన అంకితభావంతో చేయాలన్నడు. ఉద్యమాలలో నిరంతరం తలమునలై ఉండే వారితో ఈ పని జరగదన్నడు. సారు చెప్తుంటే నాకు 28 ఏళ్ళ క్రింద బాలగోపాల్ మాటలు గుర్తుకు వచ్చినయి. బస్సులో కలిసి పోతున్నం. బాలగోపాల్ చరివూతకు సంబంధించి బిపిన్ చంద్ర రాసిన పుస్తకం చదువుతున్నడు. చర్చ చరివూతపై సాగింది. ఆధునిక భారత దేశ చరివూతను ఎవరూ సరిగా రాయలేక పోయారు. ఆపని చేయాలనుకుంటున్న. పౌరహక్కుల ఉద్యమ బాధ్యతల వలన చరిత్ర రచన సాధ్యం కావడం లేదన్నడు.’ మన చరివూతను వెతుక్కొని మనమే రాయాలని జయశంకర్ సారు మనపై బాధ్యత పెట్టిండు.


ప్రొ॥ జనార్ధనరావు, బాలగోపాల్, ఎస్.ఆర్.శంకరన్‌లు చనిపోయిన తర్వాత అడివి బిడ్డలైన ఆదివాసులను ఎవరూ పట్టించుకున్నట్లు కన్పిస్తలేదు. జర్మనీ నుంచి వచ్చి హెమెండార్ఫ్ ఆదిలాబాద్ ఆదివాసుల అభివృద్ధికి ఎంతో చేసిండు. అటువంటి కృషి మనం చేయలేకపోతున్నమని బాధపడ్డడు. 1998 లో కలరా సోకి వేలాది మంది ఆదిలాబాద్ ఆదివాసీలు మరణించినప్పుడు తెలంగాణ ఐక్యవేదిక తరుఫున గిరిజన గూడాలకు పోయినం. నార్నూర్ పక్కన ఖైర్‌దాట్వ గూడెంలో 14 మంది వారం రోజుల్లో ఎట్ల చనిపోయిండ్లో చెప్పినపుడు సారు కండ్లల్ల నీళ్ళు తిరిగిన సంగతి యాదికి వచ్చింది.

అడవి బిడ్డలను కాపాడుకోవాలన్నడు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచటానికి మద్యాన్ని విచ్చలవిడిగా జనానికి అలవాటు చేస్తున్న సర్కారు వైఖరిని సారు తప్పుపట్టిండు. ఆర్థిక స్థోమతను పెంచుకోవాలంటే అనేక మార్గాలున్నయని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసిన జయశంకర్ సారు అభివూపాయం. ఒక ప్రజాస్వామిక ఉద్యమం సాగుతున్నప్పుడు మద్యం అలవాటును మాన్పించడం సాధ్యమేనన్నడు. 1946-47లో భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు తెలంగాణ పల్లెలను విడిచి పట్నాలకుపోయిన తర్వాత ప్రజలు స్వచ్చంధంగానే తాగుడు మాని భూస్వాముల భూములు దున్నుతూ అభివృద్ధి కార్యక్షికమాలపై మనసు పెట్టిండ్లని సారు గుర్తుచేసిండు. తాగుడుతో లక్షల జీవితాలు పాడయిపోతున్నయి. ఏమైనా చేయగలుగుతమేమో ఆలోచించమన్నడు.

సారుకు మాట్లాడే శక్తి పూర్తిగా లేకుండాపోతున్నదని అర్థమైంది. మరో రెండురోజులకు హన్మకొండకు తీసుకపోతననంగ నేను సారుతో చాలా రాత్రిదాకా ఉన్నాను. చాలా విషయాలు చెప్పాలనుకున్న. ఓపికపోయింది. మాట వస్తలేదన్నడు. మీ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఒక ట్రస్ట్‌ను మీ పేరుతో మీ కుటుంబ సభ్యులతో కలిసి పెట్టడానికి అనుమతి నిస్తారా? అని అడిగాను. సరే, అన్నడు. సుమారు ఆరేళ్ళ కింద సారుతో తెలంగాణ మ్యూజియం ఏర్పాటు నా జీవిత లక్ష్యం అని చెప్పిన. (రామప్పగుడి పక్కన ఉన్న మా కుటుంబ ఉమ్మడి ఆస్తిలో దాన్ని ఏర్పాటు చేస్తనని చాలా ఏళ్ళ కింద కె.సి.ఆర్, రామచంవూదమూర్తి గారికి కూడా చెప్పి ఉన్న.

ఆ మ్యూజియం కు మీ పేరు పెట్టుకుంటనన్న. ‘నేనంత గొప్ప వ్యక్తిని కాను’ అన్నడు సారు. మీ కంటే గొప్ప వ్యక్తి పేరు చెప్పండి ఆపేరే పెడుతానన్న. నవ్వి ‘సరే’ అన్నడు. సారు మరణించిన తర్వాత సంగతులు మాట్లాడుతున్నందుకేమో మంచం పక్కన ఉన్న బ్రహ్మం ఏడుపు ఆపుకోలేకపోయిండు. ఈ మధ్య ఎక్కడ కన్పిస్తలేరని జయశంకర్ సారును ఎవరైన ఉద్యమనేతలు అడిగితే ‘మీరే నాకు పని లేకుంట చేసిండ్లు’ అని నవ్వెటోడు. మీ ఆలోచనలను, అనుభవాలను మాకు అందించి తెలంగాణను తెచ్చుకునే, తెచ్చుకున్న తెలంగాణను బాగుచేసుకునే బాట చూపి, మా పైన పూర్తి నమ్మకంతో ‘సెలవంటూ’ ఈ లోకాన్ని వదిలిన ఓ మహర్షీ, ఓ మహాత్మా! మీరే మా జాతిపిత. మీకివే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల జోహార్లు. మీ ఆశయాలను సాధిస్తాం. మీరే మాకు స్ఫూర్తి.

-విపకాశ్
పొ॥ జయశంకర్ తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ సెంటర్)
నాలుగు తరాలతో నడిచిన యోధుడు-3

39

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ