జనం కోసమే జయశంకర్ సారు


Sat,October 6, 2012 04:29 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2
చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన.
ఒక లక్ష్యం కోసం ప్రజల కోసం సంపూర్ణంగానే జీవించిన. తెలంగాణ వస్తది. నాకు బాధేమీ లేదన్నడు’.


jayasenkarఈ పదేళ్ల కాలమంతా సారు కేసీఆర్‌తోనే ఎక్కువ కాలం గడిపారు. 17 మే 2001న ఉదయం తొమ్మిది గంటలప్పుడు నేను జయశంకర్ సారును కేసీఆర్ ఇంటి కి తోల్కపోయిన. సింహగర్జన సభకు తయారైన కేసీఆర్ సారును ఆశీర్వదించమని పాదాలు మొక్కిండు. ఈ సంఘటన ఊహించని సారు ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని కేసీఆర్‌ను రెండుచేతులతో పైకి లేపి కౌగిలించుకొని ‘నీస్థానం అక్కడ కాదు ఇక్కడ’ అంటూ.. గుండె ను చూపెట్టిండు. తెరాస పదేళ్ల ప్రస్థానం చాలావరకు సారు దిశానిర్దేశంలోనే సాగింది.


కేసీఆర్ కేంద్రమంవూతిగా ఉన్నప్పుడు వివిధ పార్టీల నేతలను కలిసి తెలంగాణకు మద్దతు కూడగట్టడంలో జయశంకర్ సారు ముఖ్యపాత్ర వహించారు. నేను రాసిన ‘తెరాస పదేండ్ల ప్రయాణం’ పుస్తకానికి ముందుమాట రాస్తూ కేసీఆర్ గురించి ఇలా అభివూపాయపడ్డారు. ‘ఆయన వ్యక్తిత్వానికి నాదృష్టిలో రెండు పార్శ్వాలున్నాయి. తెలంగాణ వాదిగా, ఒక రాజకీయ నాయకునిగా.. చంద్రశేఖరరావుది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. తెలంగాణ సమస్యలన్నింటిని కూలంకషంగా అధ్యయనం చేసి, విమర్శనాత్మకంగా విశ్లేషించి వాటన్నింటిని ప్రజల భాషలో ప్రజలకు వివరించడంలో చంద్రశేఖర్‌రావు ఆయనకు ఆయనే సాటి.... ఆయన అసమాన ప్రతిభాశాలి అని నేనే కాదు, ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. రెండవది-ఒక రాజకీయ నాయకునిగా చంద్రశేఖర్‌రావు వ్యక్తిత్వం ఒక్కమాటలో చెప్పాలంటే సమకాలీన రాజకీయ సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే ఏ వ్యవహారశైలి అవసరమో, ఆయన అదే అవలింబించారు. దానికి భిన్నంగా వుంటే రాజకీ య మనుగడే ప్రశ్నార్ధకమయ్యేది.


జయశంకర్ సారుకు వ్యక్తిగత జీవితం అంటూ లేదు. జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిండు. ఎన్నడూ తన గురించి ఆలోచించలేదు. పెళ్లి ఆలోచన కూడా దగ్గరికి రానియ్యలేదు. బ్రహ్మచారిగానే జీవించాడు. వరంగల్ పక్కన ఉన్న అక్కంపేట సారు స్వంత ఊరు. లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించిన ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకుల్లో సారు నడిపి కొడుకు.
సారు కుంటుంబానికి హన్మకొండ నడిగడ్డన అశోకా హోటల్, ఫాదిరీ దావఖాన నడుమ విలువైన ఆస్తి ఉండే ది. కుటుంబ అవసరాల కోసం పెద్దలే ఆ ఆస్తిని అమ్మిం డ్లు. సారు భాగానికి వచ్చిన అక్కంపేట ఊరిలోని ఆస్తిని కొంత తను చిన్నప్పుడు చదివిన బడికి దానం చేసిండు. సారు రిటైరైనంక వచ్చిన పైసలతోని హన్మకొండ అడ్వకేట్ కాలనీలోని ఒక అపార్ట్‌మెంటులోని నాలుగో అంతస్తులో చిన్న ఫ్లాట్ కొన్నడు. ఇరవై ఏళ్లకింద సారు బంధువుల్లోంచి ఒక పదమూడేళ్ల పిల్లగాన్ని చేరదీసిండు. ఆ పిల్లగాని పేరే బ్రహ్మం. అప్పటికే బ్రహ్మం తల్లిదంవూడులు మరణించిండ్లు. ఉన్న ఒక్క అన్న తర్వాత చనిపోయిం డు. అనాథగా వున్న బ్రహ్మం రెండు దశాబ్దాలుగా సారు తోనే వున్నడు. కొడుకు కన్న ఎక్కువగా సారుకు సేవ చేసిండు. బ్రహ్మంకు పెళ్లిచేసిన సారు వాళ్ల బిడ్డకు తన తల్లిపేరు మహాలక్ష్మి పెట్టుకున్నడు. సారు చనిపోయే ముందు రోజు రాత్రి మహాలక్ష్మికి గుడ్‌ైనైట్ చెప్పిండు.

చివరి రోజుల్లో దావఖానలో ఉన్నప్పుడు సారు తన వ్యక్తిగత విషయాలు చాలా నాతో చెప్పిండు. ముఖ్యం గా తన అన్న వాసుదేవరావుగురించి. పక్కింట్లోనే వున్నా ఎన్నడూ సారుతో అన్నకు మంచి మాట లేదు. ఆయన వైఖరి గురించి చెప్తూ ఎంతో బాధ పడ్డారు. ఒక పక్క సారు దావఖానల ఉంటే వాసుదేవరావు ఒక సీమాంధ్ర పత్రికాఫీసుకుపోయి జయశంకర్ సారును అపఖ్యాతి పాలు చేసే విధంగా అబద్ధాలతో, నిందలతో ఒక లేఖను ఇచ్చి తన పేరు వేయకుండా ప్రచురించమని అడిగి నాడ ని, పత్రిక బాధ్యులు ఆలేఖను ప్రచురించలేదని సారు నాతో చెప్పిండు. ఇది అన్న సంగతి. తమ్ముడు ప్రసాదు అమెరికాలో స్థిరపడ్డాడు. సారుకు తమ్ముడంటే పంచవూపాణాలు. ఏడాదికోసారి ఆయన ఇండియాకు వచ్చి సారును కలవడమో.., సారు అమెరికాకు వెళ్లి తమ్ముని తో గడపడమో చేసేవాళ్లు. సారు చనిపోయే సమయం లో తమ్ముడు, ఆయన భార్య వెంటే ఉన్నారు. ముగ్గురు చెల్లెండ్లు సారుతో మంచిగనే ఉన్నరు. దావఖానల సారు ను కలిసి మాట్లాడిండ్లు.

సారుకు అత్యంత ఆత్మీయమైన కుటుంబం తోట ఆనందరావు, కనకదుర్గల గారిది. తోటతో కలిసి తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సారు చురుగ్గా పాల్గొన్నా రు. పదహారేళ్ల క్రింద తోట ఆనందరావుగారు మరణిం చారు. అప్పటికి ఆయన ప్లిలలిద్దరు చిన్నవయసు వాళ్లు. ‘మామ’ అంటూ ఆ పిల్లలిద్దరూ సారును ప్రేమగా పిలుస్తరు. తన ప్రేమను వారికి పంచిండు. ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా ఆపిల్లలిద్దరితో గడిపేవాడు. సారులేని లోటు తెలంగాణ ఉద్యమానికి ఎలా పూడ్చలేనిదో ..ఆ పిల్లలకుకూడా అంతే. అదేవిధంగా సారుకు బాల్యమివూతులు వెంక శ్రీధరస్వామి, తెలంగాణ ఉద్యమ మిత్రులు డా.గోపాలక్షికిష్ణ (మెడిసిటీ) తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సారుకు ఆప్తులే. సారు కు ఆపరేషన్ అయినప్పుడు గవర్నర్ ‘బోకే’ పంపిండు. సారును అక్టోబర్ 2న రాజ్‌భవన్‌కు ఆహ్వానించి ప్రభు త్వ ఖర్చుతో మంచి చికిత్స అందిస్తనన్నడు. ‘ఈ ప్రభు త్వ సహాయాన్ని నేను తీసుకోనని’ థాంక్స్ చెప్పి సారు వచ్చేసిండు.

సారు మరణం గురించి చివరగా ఒక ముఖ్య విష యం చెప్పక తప్పదని అనుకుంటున్న. జయశంకర్ సారుకు ఎన్నడూ ఏ జబ్బూ రాలేదు. ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకొనే వారు. ప్రతి శనివారం కేవలం పండ్లరసం మాత్రమే ముప్పయ్యేళ్లు తీసుకున్నరు. ఈ మాయదారి క్యాన్సర్ ఎందుకచ్చిందని సార్‌నే అడిగిన. గత సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ దాకా రాత్రి 2 గంటల కన్న ముందు ఎన్నడూ నిద్రపోలేదన్నడు సారు. శ్రీకృష్ణ కమిటీకి నివేదిక తయారు చేయడానికి ఎవ్వలడిగితే వాళ్లకోసం నిద్రాహారాలు లేకుండా గడిపిండు. తెరాస నుండి కాంగ్రెస్ దాకా, అమెరికా, ఇతర దేశాల్లో ని తెలంగాణ సంఘాలదాకా అంతా సారునే ఇబ్బంది పెట్టిండ్లు. మనకు శ్రీకృష్ణ కమిటీపై నమ్మకం లేకపోయి నా తెలంగాణ పోరాటం ధర్మపోరాటం కాబట్టి మన వాదనలు విన్పించడంలో వెనక్కి పోవద్దని సారు అనుకున్నడు. చివరికి శ్రీకృష్ణకూడా ఢిల్లీలో సారుకు పనిచెప్పిండు.‘మీరు ఆర్థిక శాస్త్రవేత్త కదా. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ఒక రాష్ట్రంగా మనగలుగుతుందా? వనరుల పరిస్థితి ఏమిటి? ఒక నోటు తయారు చేసి ఇవ్వండి’ అని సారును అడిగిండు. సారుకు కొంచెం నమ్మకం కలిగింది. తెలంగాణ కోసం ఏం చేయడానికైనా సారు ఎప్పుడూ సిద్ధమే. రాత్రింబగలు కష్టపడి శ్రీకృష్ణకు రిపో ర్టు తయారు చేసి ఇచ్చిండు. ఇట్ల నిద్రలేకుండ, టైం కు తిండిలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన సారుకు సరిగ్గ ఆరోజుల్లోనే కొంచెం కడుపు నొప్పి, గ్యాస్ సమ స్యా మొదలైంది. సారు సీరియస్‌గా తీస్కోలే. ఏం కాదనుకున్నడు. తన పనులన్నీ అయినంక జూలై నెల చివర ఆప్త మిత్రుడైన డాక్టర్ గోపాలక్షికిష్ణకు తన అనారోగ్యం గురించి చెప్పిండు. ఆయన వెంటనే సారుకు అన్ని పరీక్షలు చేయించిండు. గ్యాస్ట్రిక్ క్యాన్సరని తేలింది. గోపాలక్షికిష్ణ సారుకు చెప్పిండు. సారు ఏమాత్రం చలించలేదు. తనకు క్యాన్సర్ వచ్చిందన్న బాధ ఒక్క క్షణం కూడా సారు ముఖంలో కన్పడలేదు. డాక్టర్లే ఆశ్చర్యపోయిండ్లు. మీరున్నరు గదా చూసుకోవడానికి అన్నడు . వెంటనే ఆపరేషన్ చేసిండ్లు. అప్పటికే పరిస్థితి విషమించిది. అయితే తెలంగాణ సంకల్పమే సారును ఇంత కాలం బతికించింది. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డా. నాగేశ్వరడ్డి సారుపై అభిమానంతో ఉచితంగా చికిత్స చేసిండు. దవాఖాన నర్సులకు, సిబ్బందికి సారు టిప్స్ ఇచ్చినా ఓ ఒక్కరూ తీసుకోలేదు. సారు దీవెనెలుంటే చాలన్నరు.

చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ‘ఒక లక్ష్యం కోసం ప్రజలకోసం సంపూర్ణంగానే జీవించి న. తెలంగాణ వస్తది. నాకు బాధేమీ లేదన్నడు’. నాలు గు రోజుల క్రితం హన్మకొండలో చివరిసారి (శుక్షికవారం) సారును కలిసిప్పుడు సారు మనశ్శాంతి కోసం ఒక అబద్ధం చెప్పిన. (సారు పేపరు చదువుతలేడు.టీవీ చూస్తలేడు) ‘తెలంగాణకు ఢిల్లీ నుంచి శుభవార్తలు వస్తున్నయ్. కాంగ్రెస్ నేతలు రాజీనామాలకు సిద్ధమం టున్నరు. ఢిల్లీ దిగి వచ్చి వారంలోపే తెలంగాణ ప్రకటన చేస్తదని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్తున్రు.’ ఈమాటలు వినగానే చాలా రోజులుగా సారు ముఖంలో చూడని వెలుగు, చిరునవ్వు, కళ్లలో మెరుపు కనిపించింది.
సారుతో చివరిసారి నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రజావూపతినిధులదే. డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు చిదంబరం అనేకసార్లు సారుతో ఫోన్‌లో మాట్లాడిండు. తెలంగాణ తప్ప మరేమీ వద్దని, ఇంకే ప్రకటన చేసినా తెలంగాణ ప్రజలు అంగీకరించరని, కేసీఆర్ దీక్ష మానరని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే కేంద్రం ప్రకటన చేసింది.

డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండకపోవడం తెలంగాణలో ఆరువందలకు పైగా బలిదానాలకు కారణమైంది. సారు మనస్తాపానికి గురికావడానికి, టెన్షన్‌తో గడపడానికి కూడా కారణం కేంద్రం తెలంగాణను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడమే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగించి ఉంటే సారు ఎంతో ఆరోగ్యంతో మరో ఇరవై ఏండ్లు బతికేవారు. సారు మరణానికి బాధ్య త వహించల్సింది కేంద్రవూపభుత్వమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే సారుకు మనం అందించే నిజమైన నివాళి.

-విపకాశ్
(తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్)

41

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ

Featured Articles