నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.


Sat,October 6, 2012 04:28 PM

Jayashanker1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవరు పిలిచినా ఉద్యమంలో పాల్గొంట’నని చెప్పేవారు జయశంకర్ సారు. అట్లనే చేసిండు.

సూర్య చంద్రులున్నంత కాలం, సృష్టి సాగినంత కాలం తెలంగాణ ప్రజల మహోన్నత పోరాటాల చరిత్ర నిలిచే ఉంటుంది. తెలంగాణ చరివూత లో అంతర్భాగంగా జయశంకర్ గారిని రాబోయే తరాల ప్రజలు సదా స్మరిస్తూనే ఉంటారు.

తెలంగాణ తల్లి ప్రసవించిన అత్యుత్తమ పుత్రులలో మొదటి శ్రేణిలో నిలిచిన మహోన్నత వ్యక్తి జయశంకర్. కొన ఊపిరి ఉన్నంత వరకు నమ్మిన ఆశయం కోసం ప్రజల కోసమే జీవించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటా రు. అలాంటి త్యాగధనులను మరణం జనం నుండి ఎప్పటికీ వేరుచేయలేదు. భౌతికంగా జయశంకర్ సారు మనల్ని వీడినా మనందరి మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారు.

జయశంకర్ సారు జీవితాన్ని తెలంగాణ ఆరు దశాబ్దాల ఉద్యమాన్ని వేరు చేసి చూడలేము. 1952లో వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమై హైదరాబాద్‌లో మహోద్యమ రూపం దాల్చిన ‘నాన్ ముల్కీ గోబ్యాక్’ ఉద్యమంలో ఆనాటి విద్యార్థి జయశంకర్ కీలకపాత్ర నిర్వహించారు. సిటీ కళాశాల వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ఎందరో విద్యార్థులు అమరులైనారు. ఆ సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ ‘ఆనాటి సిటీ కళాశాల విద్యార్థుల ర్యాలీకి వెళ్తూ భువనగిరి వద్ద ఫెయిలై ఆగిపోయిన బస్సు టైంకు హైదరాబాద్ చేరి ఉంటే ఆ ర్యాలీ మొదటి వరుసలో నేనుండే వాణ్ని. ఆనాటి కాల్పు ల్లో చచ్చినా బాగుండేది. యాభై ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల కడగండ్లు, కన్నీ ళ్లు చూసే దుస్థితి నాకు దాపురించకపోయేది’ అంటూ ఎంతో ఆదేదనతో మాట్లాడేవారు.

జయశంకర్ సారుతో నా సంబంధం గురుశిష్యుల అనుబంధం. 1975 లో నేను వరంగల్ సికెఎం కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు సారు ప్రిన్సిపాల్‌గా మా కళాశాల బాధ్యత తీసుకున్నడు. సారు ప్రిన్సిపాల్‌గా రావడం వెనుక పెద్ద కథే ఉన్నది. అంతకన్న ముందు సికెఎం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య కొట్లాటలు, కత్తిపోట్ల ఘటనలు జరిగినయి.


విప్లవకవి వరవరరావుగారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టంది ప్రభుత్వం. వరవరరావు గారు సికెఎం కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అప్పటి వరంగల్ కలెక్టర్ బాలరాజ్ గారిని ఆహ్వానించింది యాజమాన్యం. విద్యార్థులమైన మేము వేదికపై ‘వరవరరావును బేషరతుగా విడుదల చేయాలని’ పెద్ద బ్యానర్ పెట్టినం. కలెక్టర్ వేదికపైకి వస్తూనే కోపంగా ఆ బ్యానర్ కాగితాలను చించివేసారు.

దాంతో మేమంతా ఆవేశంతో ‘కపూక్టర్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేసి నం. కొందరు కోపంగా వేదికపైకి దూసుకుపోయిండ్లు. పరిస్థితి చేయిదాటి పోతున్నదని తెలుసుకున్న పోలీసులు లాఠీచార్జీ చేసిండ్లు. గాల్లోకి కాల్పులు జరిపిండ్లు. సభ రద్దయింది. పోలీసు రక్షణలో కలెక్టర్ వెళ్లిపోయిండు. యాజమాన్యం తలపట్టుకున్నది. అప్పటి ప్రిన్సిపల్ అంజయ్యతో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రమంతా కొత్త ప్రిన్సిపాల్ కోసం జల్లెడ పట్టి సిటీ కాలేజీలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఒప్పించి వరంగల్‌కు తోల్కొచ్చిం డ్లు. సారుకు అప్పటికే మంచి అధ్యాపకునిగా పేరున్నది.

లెక్చరర్‌గా ఆదిలాబాద్ షురువైన సారు ప్రస్థానం సిటీ కాలేజీ మీదుగా వరంగల్ చేరింది. సారు రాంగనే సికెంఎం కాలేజీల పరిస్థితి అర్థం చేసుకున్నడు. మా విద్యార్థి నాయకులతో మాట్లాడి నచ్చ చెప్పిండు. ఆ తర్వాత ఎన్నడూ సికెఎంల క్రమశిక్షణ దారితప్పలేదు. వందలాది మంది ఉత్తమ విద్యార్థులను సృష్టించడమే కాకుండా ఉస్మానియా వీసీగా పనిచేసిన జగన్మోహన్‌డ్డి వంటి పెద్దల అభినందనలను కూడా సికెఎం పొందగలిగిందంటే అదంతా సారు కృషి వల్లనే అని వేరే చెప్పనక్కరలేదు.

కాకతీయ యూనివర్సిటీయే సికెఎం కాలేజీకి అనుబంధంగా పనిచేస్తున్నదని జగన్మోహనడ్డి వ్యాఖ్యానించారు. సికెఎంకు సంబంధించి ఎప్పుడూ గుర్తుండే మరోసంఘటన వరవరరావు గారిని తిరిగి అధ్యాపకులుగా నియమించడం. అప్పుడు జిల్లా నుండి మంత్రిగా ఉన్న హయక్షిగీవాచారి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జయశంకర్‌సారు వరవరరావు సర్వీసు కొనసాగింపు కోసం అప్పటికే ముఖ్యమంవూతితో రాత పూర్వకమైన ఆదేశాలను పొంది ఉన్నారు. సిఎం సంతకం చూపించి హయక్షిగీవచారి నోరు మూయించారు. హయక్షిగీవాచారితో ఇలాంటి ఘటనే మరో సందర్భంలో పునరావృతమైంది.

సారు కాకతీయ యూనివర్సిటీ రిజివూస్టార్‌గా ఉన్నప్పుడు హయక్షిగీవాచారి మంత్రిగా ఉన్నారు. తనకు ఇష్టమైన ఒక వ్యక్తిని అటెండర్‌గా నియమించాలని లెటర్ సార్‌కు పంపిండు. తెచ్చిన వ్యక్తి ముందే సారు లెటర్ చింపి మీ మంత్రికి చెప్పుకోమన్నడు. కోపంతో మంత్రి సారును తన చాంబర్‌కు వచ్చి కలవమన్నడు. ‘నాకు మీతో పనిపడ్డప్పుడు తప్పక వస్త. ఇప్పుడు నాకు పనిలేదన్నడు’ దీంతో మరింత కోపంతో ఊగిపోయి హుటాహుటిన జయశంకర్ సారింటికే హయక్షిగీవచారి వచ్చిండు. ‘ఒత్తిళ్లకు లొంగనని’ సారు కరాఖండిగ చెప్పిండు. తెల్లమొహం వేసుకొని మంత్రి వెనుదిరిగిండు.

ఆ రోజుల్లో హయక్షిగీవాచారి అంటే వరంగల్ జిల్లాలో హడల్. వామపక్షవాదులనెందరినో కాంగ్రెస్ వాళ్లు హత్య చేయడం వెనుక ఈయన హస్తం ఉన్నదని ప్రచారం జరిగింది. ఏ బెదిరింపులకూ చలించని వ్యక్తిత్వం సారుది. కాకతీయ యూనివర్సిటీకి వీసీగా సారు పనిచేస్తున్న రోజుల్లో అప్పటి సిఎం నేదురమల్లి జనార్ధన్‌డ్డి సారుకు ఒక లేఖ పంపిండు. తనకు కావలసిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వమని- ఆ లెటర్ పక్కనబెట్టి ‘రూల్స్‌కు విరుద్ధంగా మీ కోర్కెను నెరవేర్చలేనని’ సిఎంకు సారు చెప్పిండు. దానికి సిఎం కోపగించుకోకపోగా ‘మీలాంటి నిబద్ధత, నిజాయితీ కల్గిన వ్యక్తిని వీసీగా నియమించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉన్నదని‘ సారును అభినందించిండు.


తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అరవై ఏళ్లు ప్రయాణించిన జయశంకర్ సారు జీవితాన్ని సమీక్షించడమంటే తెలంగాణ ఉద్యమ చరివూతను రాయడమే అయితది. ఆ అరవై ఏళ్లలో నాలుగు తరాల తెలంగాణ నేతలతో, ఉద్యమకారులతో కలిసి పనిచేసిండు. 1952-56లో బూర్గుల, కె.వి. రంగాడ్డిలతో, 1969-74లో తన సమకాలికులైన భూపతి క్రిష్టమూర్తి, ప్రతాప్‌కిషోర్, సంతపురి రఘువీర్‌రావు, మదన్‌మోహన్, మల్లికార్జున్, ఆనందరావు తోట, శ్రీధరస్వామి, వరవరరావు వంటి నేతలతో, 1996లో తన తర్వాతి తరం వారమైన మాలాంటి వారితో, కెసిఆర్‌తో కలిసి పనిచేస్తూ తెలంగాణ ఉద్యమ దిశానిర్దేశం చేసారు. ఈ అరవై ఏళ్లలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో విద్యార్థులు, నాయకులు ఆ తర్వాత రకరకాల ఉద్యమాల్లోకి కొట్టుకుపోయారు.

కొందరు అగ్రకులాల వ్యతిరేకతతో, మరికొందరు అగ్రవర్గాల వ్యతిరేకతతో కుల, వర్గ పోరాటాల్లోకి మళ్లినారు. తెలంగాణ ఉద్యమంలో 1969లో పాల్గొన్న నేతపూందరో ఆ ఉద్యమంలో అణచివేయబడిన తర్వాత శ్రీకాకుళం, ములుగు-ఖమ్మం నక్సలైట్ ఉద్యమంలో, విప్లవపోరాటాల్లో చేరిపోయారు. ఎంతోమంది ఇప్పటికీ ఎన్ని రకాలుగా దారి మార్చినా జయశంకర్ సారు మాత్రం ఊపిరి ఉన్నంతదాకా ‘తెలంగాణ’ బాట వీడలేదు. ఇది సారుకు మాత్రమే సొంతమైన ప్రత్యేకత. ఎస్.ఆర్. శంకరన్, హరగోపాల్, జీవన్‌లతో పౌరస్పందన వేదికలో జయశంకర్ ముఖ్యపాత్ర నిర్వహించారు.

పౌర స్పందన వేదిక చర్చల్లో.. నక్సలైట్ల సమస్య తెలంగాణ వెనుకబాటుతనం నుండే వచ్చిందని, వలస దోపిడీ పోతే నక్సలైట్లు ఉండరని వాదించేవారు. శాంతిచర్చలు తమ తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా సాగాలని ఆశించారు.
1954లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ ముందు హాజరైన విద్యా ర్థి బృందంలో నేతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం గురించి ఫజల్ అలీకి, కమిటీ సభ్యులకు వివరించారు జయశంకర్. విలీనానికి వ్యతిరేకంగా 1955-56లో సాగిన ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్నారు. 1969లో తన సహచరులను ప్రోత్సహించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఒక పుస్తకాన్ని ప్రచురించి ఆనాటి ఉస్మానియా వీసీ, ఆంధ్రమహాసభ నాయకులుగా ఉద్యమంలో పాల్గొన్న రావాడ సత్యనారాయణ గారిచే హైదరాబాద్ వైఎంసిఎలో, హన్మకొండలో ఆవిష్కరింపజేసిండు.


ఆ పుస్తకం 1969 ఉద్యమకారులకు ఒక కరదీపికగా ఉపయోగపడటమేగాక అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కూడా ఆలోచింపచేసింది. ఆ పుస్తకం ఆంగ్లభాషలో ఉండడం వల్ల రాష్ట్రేతరులకు కూడా తెలంగాణరాష్ట్ర ఆవశ్యకతను తెలుసుకునేట్లు చేసింది. పొత్తూరి వెంక గారి చొరవతో ఇందిరాగాంధీ జయశంకర్‌గారిని మరికొందరు మేధావులను పిలిపించుకొని తెలంగాణపై చర్చించింది. 1971లో తెలంగాణ ప్రజాసమితి పక్షాన లోక్‌సభకు అభ్యర్థిగా పోటీచేసే అవకాశం సారుకు వచ్చింది. డిపాజిట్ పైసలు కూడా తన వద్ద లేనందున ఎంపి అవకాశాన్ని పోగొట్టుకున్నానని సారు చెప్పిండు.


1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవరు పిలిచినా ఉద్యమంలో పాల్గొంట’నని చెప్పేవారు జయశంకర్ సారు. అట్లనే చేసిండు. ప్రజాకవులైన కాళోజీ సోదరులకు సారు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. 1956లో సమైక్యవాదిగా ఉన్న కాళోజీ తెలంగాణ వాదిగా మారడంలో ఎంతో కొంత సారు పాత్ర కూడా ఉన్నది. సారుపై కాళోజీ ప్రభావం బలంగానే ఉన్నది. వీరిద్దరి కామన్ ఎజెండా ‘సామాన్య ప్రజలు’ కావడమే. ప్రజల గొడవే వీళ్ల గొడవ.


1987లో తెలంగాణ (నాట్యకళ) ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మొదలుకొని అనేక ప్రజాసంఘాలకు, ఆనాటి తెలంగాణ రీజనల్ కమిటీ నుండి నిన్నటి శ్రీకృష్ణ కమిటీ దాకా, తెలంగాణ ప్రజాసమితి నుండి నేటి టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వరకు, ఎవ్వరడిగినా వారికి తెలంగాణ గురించి గంటలకొద్ది చెప్పిండు, రాసిచ్చిండు. నేను రాసిన ‘టిఆర్‌ఎస్ పదేండ్ల ప్రయాణాని’కి సారు రాసిన ముందుమాటే సారు చివరి మాటైతదని ఎప్పుడూ అనుకోలె. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రారంభం నాడు సారును టీవీల చూసి ఏడ్వని వాళ్లు లేరు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో సారు పాత్రే కీలకం. అప్పటి ప్రధాని దేవెగౌడ 1996 ఆగస్టు 15న ఎర్రకోటపై ‘ఉత్తరాఖండ్’ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన తర్వాత తెలంగాణ వాదుల్లో కొత్త ఆశలు చిగురించినయి. వరంగల్‌లో భూపతి క్రిష్టమూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ సభ జరిగింది. కొండా మాధవడ్డి, జయశంకర్ సారు మాట్లాడిండ్లు. తెలంగాణ ఆవేశం నిద్రలేపిండ్లు. నవంబర్ ఒకటిని విద్రోహదినంగా పాటించాలన్నరు. నిజామాబాద్‌ల పోశెట్టి, మరికొందరు లాయర్లు సారుని పిలిచిండ్లు. హైదరాబాద్‌లో పాశం యాదగిరి సభ జరిపిండు. భోనగిరిల గుప్తనాగారం అంజయ్య, లాయర్లు, తెలంగాణవాదులు సభ జరిపిండ్లు. ఇంద్రాడ్డి ‘జై తెలంగాణ’ పార్టీ పెట్టిండు.

సూర్యాపేటల డా. చెరుకు సుధాకర్, వి. ప్రకాశ్, భరత్, బెల్లయ్యనాయకులు తెలంగాణ మహాసభ షురు జేసిండ్లు. యాభైవేల మంది ఈ సభకు వచ్చిండ్లు. తెలంగాణవాదులకు నమ్మకం కలిగింది. లక్షమందితోని ఏఐపిఆర్‌ఎఫ్ హన్మకొండల సభ పెట్టింది. తెలంగాణ జనసభ పుట్టిం ది. అన్ని సబలల్ల జయశంకర్‌సారు మాట్లాడిండు. అందరికీ పెద్ద దిక్కు సారే. దేశంలనే కాకుంట అమెరికాల ‘తెలంగాణ డెవెలప్‌మెంట్ ఫోరం’ స్థాపనలో సారుదే కీలకపాత్ర. సారు, జనార్థనరావు అమెరికాల ఎన్నో సభల్ల తెలంగాణ గురించి చెప్పిండ్లు. శ్రీకృష్ణ కమిటీకి నలభైకి పైగా దేశాల నుంచి నివేదికలు రావడం వెనుక సారు పాత్ర ఉన్నది. బాలగోపాల్ సారు పిలిస్తే ఆంధ్ర, రాయలసీమల ఎన్నో మీటింగులకు పోయి అక్కడి వాళ్లకు తెలంగా ణ ఎందుకడుగుతున్నమో చెప్పిండు. ఇయ్యాల ఆంధ్రల జనం తెలంగాణకు వ్యతిరేకంగా లేరంటే దానికి సారు మీటింగులు, టీవీలల్ల మాటలు కొంత కారణం.1999లో తెలంగాణ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని తెచ్చింది. జనసభ కార్యకర్తలను నక్సలైట్లుగా ముద్రవేసి ‘ఎన్‌కౌంట ర్’ పేరుతో చంపింది. సభలు పెట్టుకోనివ్వలేదు. నాతో సారు చెప్పిండు. ‘తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి మనకున్న శక్తి, వనరులు చాలవు. కేవ లం ఉద్యమాలతో మాత్రమే తెలంగాణ తేలేము. ఈ సంకీర్ణ రాజకీయ యుగంలో తెలంగాణ కోసం ఒక బలమైన రాజకీయ పార్టీ ఉండాలె. ఉద్యమాల పునాదిమీద ఆ పార్టీ ఎదగాలె. ప్రజలను ఆకట్టుకునే ఒక నాయకుడు కావాలె. ఎవరైనా ముందుకు వస్తరేమో కనుక్కోండి’ అన్నడు. సారు మాట లు నిజమేనన్పించింది.

అప్పటికే జయశంకర్ సారు, ప్రొ. కేశవరావు జాదవ్‌ల ఆధ్వర్యంలో మేము 28 సంఘాలతో తెలంగాణ ఐక్యవేదికను సెప్టెంబర్ 28, 1997న ఏర్పాటు చేసి కార్యక్షికమాలు నిర్వహిస్తున్నం.సభలు, ధర్నాలు, ప్రెస్‌మీట్లు , కరపవూతాలు వంటి వాటికే మేం పరిమితమైనం.


జయశంకర్ గారి సలహాతో నేను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలోని కొందరు తెలంగాణ వాదులను కలిసిన. అప్పటి ప్రతిపక్షనేత పీజేఆర్ తెలంగాణ సమస్యలపట్ల ఎక్కువగా స్పందించిండు.రోజూ సాయంత్రం ఆయన ఇంటికి పోయి బాగా రాత్రయ్యేదాకా వుండి తెలంగాణ గురించి చెప్పినం. జయశంకర్, జాదవ్‌లను పీజేఆర్ ఇంటికి తోలుకపోయి వాళ్లతో చెప్పించిన. నెలలు గడిచినయ్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు సీమాం ధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లయి వున్నయి. పీజేఆర్‌ను ఎన్నిక ల్ల ఓడించిండ్లు. ఓడిపోయినంక తెలంగాణ అంటరు.

నన్ను ఇడిసిపెట్టు. ఎవ్వలు ముందుకు వచ్చినా నా సపోర్ట్ వుంటది అని పీజేఆర్ చెప్పటంతో ఇంక నమ్మదగ్గ నాయకుపూవ్వరూ లేరని నిరాశ చెందినం. సరిగ అదే టైంల కేసీఆర్ చంద్రబాబుకు విద్యుత్‌చార్జీల పెంపుపై బహిరంగ లేఖ పత్రికల్లో వచ్చింది. తెలంగాణ పెద్దలు కేసీఆర్‌ను కలిసిండ్లు. ఆ సమయానికి జయశంకర్ సారు అమెరికల వున్నడు.సారుకు కేసీఆర్ ఫోన్ చేసిండట. ఈ సంగ తి నాకు పోన్ చేసి చెప్పిండు సారు. నన్ను వెళ్లి కేసీఆర్‌ను కలవమని చెప్పిం డు. అప్పుడే కేసీఆర్ రమ్మంటున్నడని భరత్‌కుమార్ (అడ్వోకేట్ )నాదగ్గరికి వచ్చిండు.

కేసీఆర్ ను కలిసినంక కొంచెం నమ్మకం వచ్చింది. ఆ రాత్రే సార్ కు చెప్పిన. నాయకుల కోసం మన వెదుకులాట ముగిసింది. కేసీఆర్ సీరియస్‌గానే ప్లాన్ చెస్తున్నడు. మీరు వెంటనే రావాలని సార్‌ను అడిగిన. కొద్ది రోజులకు పారు అమెరిక నుండి వచ్చిండు. ఏమాత్రం ఆలస్యం చేయకుండ సారును కేసీఆర్ ఇంటికి తోల్కపోయిన. కేసీఆర్ , జయశంకర్‌ల తొలి కలయికకు, చివరి కలయికకూ ప్రత్యక్ష సాక్షిని నేనే. వారం రోజుల క్రింద సారు దావఖానల ఉన్నప్పుడు కేసీఆర్ కలిసిండు.అదే ఆఖరి కలయిక. మొదటి సారి కలిసినప్పుడు సారు కేసీఆర్‌తో అన్నమాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నయి.‘ఈ యాభై ఏళ్లలో ఎంతో మంది నాయకులతో కలిసి పనిచేసిన. మీ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తమనే నమ్మకం నాకు ఏర్పడింది.’

-వి. ప్రకాశ్
(తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్)

43

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష