బతుకు-ఉద్యమాన్ని బతికించు


Sat,October 6, 2012 04:33 PM

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దునియాకో సాత్ లేకే చలో’ అని తన తోటి సమాజాన్ని కదలించాల్సిన, తమతోపాటు నడిపించాల్సి న ‘యువతరం’ తెలంగాణ కోసం బలిదానాలను కొనసాగిస్తున్నది. పూటకో మాట మాట్లాడే రాజకీయపార్టీల వైఖరుల వల్ల తెలంగాణ కోసం పిడికెపూత్తిన చైతన్యం నీరు గారి పోతున్నది.‘తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది మేమే’ అన్న నాయకులు, తెలంగాణకు మేం వ్యతిరేకం కాదన్న మోసపూరిత నాయకుల వైఖరి వల్లే బలిదానాలు జరుగుతున్నాయి. ఉపఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించినా తెలంగాణ రాలేదన్న నిరాశతో తెలంగాణ సమాజం పుట్టెడు దుఃఖంతో కుములుతున్నది.‘బలిదానాలు వద్దు-బరిగీసి గెలుద్దాం’ ఆత్మహత్యలు వద్దురా-తెలంగాణ ముద్దురా,పోరాడి సాధించుకుం దాం అంటూ తెలంగాణ బిడ్డల పట్ల సీమాంధ్ర మీడియా కపట ప్రేమను కనబరుస్తున్నది. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచకపోగా, ఆత్మ ‘హత్య’ల పరంపర కొనసాగుతున్నది.
తెలంగాణ తల్లిపేగు ఎక్కడో ఓ చోట తెగిపడుతూనే ఉన్నది. సకల జనుల సమ్మె చైతన్యం పాలమూరులో రెండువర్గాలు చీలిపోయింది.

తెలంగా ణ కోసం రాజీనామా చేసిన త్యాగధనులను గెలిపించినా కేంద్రం కదలదని తేలిపోయింది.కీలెరిగి పెట్టిన వాతలు..చేసిన పోరాటాల వేడికి ‘గండ్ర’ గొడ్డల్లాంటి ఆత్మాభిమానాన్ని తెగనరికే విద్రోహ రాజకీయ నాయకుల ప్రకటనలు తెలంగాణ గుండెల్ని కాల్చివేస్తున్నది.అయినా బతుకంతా పోరాటం చేస్తున్న బిడ్డలు, ఆవేశాలకు లోనై బలిదానాలకు పాల్పడితే ‘ఆత్మహత్యలు కూడా ఉద్యమం అవుతుందా?’ అని అవహేళనగా మాట్లాడే గాదె వెంకటడ్డిల దురహంకారాన్ని చూసై నా మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి. వందల బలిదానాలు ఒక్క సీమాంధ్ర నాయకుడిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించలేకపోయాయి. ఇది తెలిసినా ఆ నాయకుల దు ర్మార్గపు ప్రకటనలకు బలికావడం ఉద్యమానికి ఎంత నష్టం అవుతుందో ఆలోచించాలి.

తెలంగాణ కోసం ఈ ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలన్నీ యుద్ధభూములుగా మారాయి. బుల్లెట్లను క్రికెట్ బంతుల్లా విసిరికొట్టిన వీరత్వం ఎందుకంత దిగాలు పడుతున్నది. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన వాళ్లు ఇవ్వాళ బలిదానాలకు ఎందుకు పాల్పడుతున్నారో దానిపట్ల పరిశోధన చేయాల్సి ఉన్నది. రాజకీయ నాయకుల అవకాశవాద ప్రకటనలకు కుంగిపోయి ఆత్మహత్యల వ్యూహంలో మా యమైపోతే విద్యార్థి, యువజనులు లేని తెలంగాణ వస్తుంది. ఆ తెలంగాణలో నాయకులకు పదవులొస్తాయి, మరిన్ని నిధులొస్తాయి. శుష్కవాగ్దానాలతో అప్పుడూ యువతరాన్ని మోసం చేయ చూస్తాయి. కనుక అలాంటి రాజకీయ విద్రోహులకు ఎదురొడ్డి పోరాడాల్సిన తరం బలిదానాలకు పాల్పడడం సరికాదు.

అంతకన్నా ఇవ్వాళ చనిపోతున్న విద్యార్థులు, చదువుతోపాటు తాము ఉంటున్న గ్రామాలను, అక్కడి రాజకీయపార్టీలను కదలించవచ్చు. పోరా ట రూపాల గురించి ఆలోచించవచ్చు. తమకు తాము ఓ పోరాట రూపా న్ని ఎంచుకోవచ్చు. మొదటి దశలో ఉస్మానియాలో బీటెక్ చదువుతున్న నల్లగొండ జిల్లాకు చెందిన సాయికుమార్ మరణం ఆయన మిత్రుణ్ని కుంగదీసింది. అప్పుడు మేం వెళ్లి ఆత్మహత్యలు పరిష్కారం కాదని అతనికి నచ్చచెప్పాము. ఆ విద్యార్థి తర్వాత పోరాటాల్లో జాతీయ రహదారిని దిగ్బంధించగల చైతన్నాన్ని ప్రదర్శించాడు.నక్రేకల్‌లో చెరుకు సుధాకర్ క్రియాశీలక పోరాటం ప్రభుత్వాన్ని కదిలించగలిగింది. అలాంటి పోరాట రూపాలు ఇవాళ లేకపోవడం గురించి ఆలోచించాలి. ఇవ్వాళ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఒక్కరోజులో పరిష్కారం కావు. కాబట్టి విద్యార్థిలోకం తమ గ్రామాల్లోని ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించాలి. ఎంత చదివినా తెలంగాణ పిల్లలకు ఎందుకు అవకాశాలు రావడం లేదో వాటిపై ఆలోచించాలి.ఇక్కడ నెలకొల్పిన ఐటీ నుంచి సిమెంట్ కర్మాగారాలు, మన నీళ్లు, నిధులతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న కంపెనీల పట్ల ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటాలు నిర్మించాలి. తెలంగాణ వచ్చాక కేజీ నుంచి పీజీ దాకా ఉన్నత విద్య అన్ని రాజకీయ నినాదం’తో సీమాంధ్ర కార్పొరేట్ కాలేజీల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించవచ్చును.

తెలంగాణ ఉద్యమంలో వీరోచితమైన పాత్ర నిర్వహించిన తెలంగాణ డాక్టర్లు, లాయర్లు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఆయారంగాల్లో ఆంధ్రా వలసాధిపత్యానికి వ్యతిరేకంగా ‘ప్రత్యామ్నాయ వ్యవస్థల్ని రూపొందించే ప్రక్రియలను చేపట్టాలి. అవకాశవాద రాజకీయ పార్టీల ధోరణులకు స్వస్తి చెప్పి మళ్లీ సకలజనుల సమ్మె స్ఫూర్తితో.. యువతరంలో ఆత్మస్థైరాన్ని నిం పి, ఉద్యమ చైతన్యాన్ని అక్కున చేర్చుకోవాలి.

జయశంకర్‌సార్ అన్నట్టు తెలంగాణ తెచ్చుకోవడం పదిశాతం విజయమే అవుతుంది. మిగిలిన తొం భై శాతం విజయం ఆ తెలంగాణలో మనం కలలుగన్న ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి చేయాల్సిన కృషిలో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ప్రజలు సన్నద్ధమైతే అన్ని రాజకీయ పక్షాలను నిలదీసే చైతన్యాన్ని ప్రదర్శించాలి. దీనికోసం పోరాటాల రూపాలను మార్చుకోవాలి. తెలంగాణ కోసం పరితపించే విద్యార్థి, యువజనులను, సమస్త శక్తులను ఏదో ఒక రూపంలో ఏకం చేయాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరి ప్రయత్నం వాళ్లు కొనసాగించా లి. ప్రజలను, పోరాటాన్ని సజీవంగా ఉంచే ప్రక్రియకు ఉద్యమ శక్తులు శ్రీకారం చుట్టాలి. జీవితమం పోరాటం. ఏటికి ఏదురీదడమే సాహసం. జీవితం అనే యుద్ధంలో ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు అని ప్రకటించిన భగత్‌సింగ్ స్ఫూర్తిని ఇవ్వాళ్టి యువతరం గుర్తుకు తెచ్చుకోవాలి. కళ్లారా తెలంగాణ చూడాలన్న సంకల్పంతో రేపటి తెలంగాణలో మన కలలు సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
ఇప్పటికి రాలిన నెత్తుటి చుక్కలు చాలు. మనం పుట్టిన నేలకు కన్న తల్లికి గర్భశోకం చాలు. తెలంగాణ కోసం చావు తప్ప మరో మార్గమేదైనా ఫరవాలేదు. బతుకు ఉద్యమాన్ని బతికించు.

-కె. ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles