పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?


Thu,October 18, 2012 05:57 PM

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధులకు ఆదర్శం’ అయితే ఎంత బావుండు. ‘పొట్టి శ్రీరాములు’ త్యాగాన్ని కొనియాడే నాయకులు, ప్రభుత్వం ఆయనపై గౌరవం, ఆయన త్యాగానికి గుర్తింపును ఇ వ్వదలిస్తే తెలంగాణ మనోభావాలను కూడా గుర్తించి ఉండేవారు. ఒక్క బంట్రోతు ఉద్యోగాన్ని కొల్లగొట్టడాన్ని సహించలేని ‘ఆంవూధులు’ మద్రాసు నుంచి విడిపోవడానికి చేసిన పోరాటాన్ని, ఆ పోరాటంలో అసువులు బాసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజు (డిసెంబర్-15) పాఠశాలల్లో నివాళులర్పించడానికి ఉత్తర్వులిచ్చారు. మరి తెలంగాణ ఉద్యమం కోసం చేసిన త్యాగాలను, ప్ర జల ఆకాంక్షను పాలకులు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు! తెలంగాణ విషయంలో సాచివేత వైఖరితో అడ్డుపడటం ఆయన స్ఫూర్తిని నిరాకరించడం కాదా?

పొట్టి శ్రీరాములు కొనసాగించిన దీక్ష తీరును, ‘మవూదాసు’ పట్ల అనుసరించిన వైఖరిని ఆనాడు నెహ్రూ తీవ్రంగానే గర్హించారు. తెలంగాణ విడిపోవటం పట్లనైనా, లేదా కలయిక పట్లనైనా నెహ్రూ వ్యాఖ్యలు గుర్తించగల్గిన స్థితిలో నేటి నాయకులు ఇన్నారా? మరి, పొట్టి శ్రీరాములు వర్ధంతిని మొత్తం తెలుగు జాతి కోసం చేసిన త్యాగంగా కొనియాడడం సరి కాదు కదా.

ఇవ్వాళ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధాని గానో చేయాలని మాట్లాడే నేతలు నాటి స్థితిని మర్చి పోయారా? పొట్టి శ్రీరాములు మరణం వల్ల కూడా సాధ్యపడని ‘మవూదాసు’ను గుర్తించగలరా? పొట్టి శ్రీరాములు హైదరాబాద్ రాష్ట్రాన్ని ‘ఆంధ్ర’లో విలీనం చేయడం కోసం పోరాడలేదు కదా? కుట్రలు కుతంవూతాలతో ‘తెలంగాణ’ను ఫజల్ అలీ కమిషన్ అభివూపాయాలకు భిన్నంగా ‘ఆంధ్ర’ ప్రదేశ్ అవతరణ జరగడానికి పొ ట్టి శ్రీరాములుకు సంబంధం ఏమిటో విద్యార్థులకు చెబుతున్న పాఠంలో ఏమైనా చెప్పారా? ఈ పాఠం చెప్పుతున్నప్పుడు తెలంగాణ ప్రాంత పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని తెలంగాణ టీచర్లకు చరిత్ర వక్రీకరణలు గుండె గాయాలుగా ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటాయి.


కొలువుల కోసమో భాష కోసమో మద్రాసుతో కలిసి ఉండలేక విడిపోవడం ప్రజాస్వామికమైనప్పుడు, అత్యంత అప్రజాస్వామికంగా ‘ పెద్ద మనుషుల ఒప్పందం’ పేర అమలు కాని రాష్ట్రపతి ఉత్తర్వులు, ఫలితంగా పది జిల్లాల్లో ఆగమైన బతుకులు, నీళ్ళు, బీళ్ళు, గనులు సమస్త రంగాల్లో తెలంగాణ బతుకు విధ్వంసం అవుతున్నప్పుడు విడిపోవాలనడం అప్రజాస్వామికం ఎలా అవుతుంది.‘దురుద్దేశపూరితం’గా ఆక్రమించుకున్న సామ్రాజ్యవాదులకు మాత్రమే ప్రజల ఆకాంక్ష తప్పుడుగా కనిపిస్తుంది. ఆంధ్రవూపదేశ్ అవతరణను ‘సామ్రాజ్యవాద విస్తరణ వాద కాంక్ష’గా అ న్న నెహ్రూ మాటల్ని గౌరవించినా తెలంగాణ పట్ల పాలకుల వై ఖరి ఇట్లా ఉండేది కాదు.


అందుకోసం ఉద్యమిస్తున్న ఉద్యమ కారులపై వందలాది కేసులు మోపి, నాసా, పీడీ, నల్లచట్టాలతో నిర్బంధిస్తూ పాఠాలు చెప్పే టీచర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమది కాని పా ఠాన్ని తమ బతుకు చిత్రాన్ని మార్చి ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిన ఆంధ్రవూపదేశ్ అవతరణ గురించి కాని, అందుకు ఊతమిచ్చిన పొట్టి శ్రీరాములు అమరత్వాన్ని గాని తెలంగాణ పిల్లలు టీచర్లు ఎట్లా కీర్తిస్తారు? పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు గాంధీజీ ఆశీస్సులతో హరిజనులకు దేవాలయ ప్ర వేశం కోరుతూ దీక్ష చేపడితే.. స్పందించి నాటి ప్రభుత్వం అనుమతిస్తే, ఈనాటి ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం దళిత విద్యార్థులపై వందలాది కేసులు పెట్టి జైళ్ళల్లో నిర్బంధిస్తోంది.


తెలంగాణ జీవితానికి, చరివూతకు సంబంధం లేని పొట్టి శ్రీరాములు త్యాగం తెలంగాణ బిడ్డలకు ‘పాఠం’కావడమే సమైక్య రాష్ట్ర ఆధిపత్యానికి నిదర్శం. అసలు తెలంగాణ త్యాగాలను చరివూతను కనుమరుగు చేసిన పాఠ్యాంశాలను తొలిగించి, వాటి స్థా నంలో తెలంగాణ పోరాట చరివూతను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టాలి. జయశంకర్ సార్ లాంటి పోరాట వీరుల చారివూత పాఠాలుగా చెప్పాలి. పాఠాలు, విగ్రహాలు, విద్రోహాలతో మొత్తం తెలంగాణ ఆకాంక్షల్ని నీరుగార్చే పాలకులకు పొట్టి శ్రీరాములు కూడా ఆదర్శం కాజాలడు. అట్లాంటి ‘ఆంధ్ర’ వీరుడి అమరత్వంతో తె లంగాణ చరివూతను ఉద్యమాన్ని అవహేళన చేయడం దోపిడీ తత్వమే తప్ప మరొకటి కాదు. ఆంధ్ర రాష్ట్ర వీరుడిగా పొట్టి శ్రీరాములును గుర్తిస్తూనే.. తెలంగాణ బిడ్డలు తెలంగాణ అమరులకు జోహర్లు అర్పిస్తున్నారు.

-కె. ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్


35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles