భూ ఆక్రమణలకు చెక్!


Fri,July 21, 2017 01:28 AM

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే తొలిసారిగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టిన మన ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి చరిత్రకెక్కాలంటే ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలె. ఈ సంస్కరణల క్రతువులో గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకూ ఉద్యోగులంతా సహకరించాలె. ప్రజలు కూడా భాగస్వాములైతే తప్ప మార్పు సాధ్యం కాదు.

కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది వార్తల్లో ప్రధానాంశ మే. తాను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు మేలు చేసే దిగా ఉంటుంది. జీరోతో ప్రారంభమైన కొత్త రాష్ట్రంలో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ప్రజ లు హృదయపూర్వకంగా ఆహ్వానించడం గత మూడేండ్లుగా చూస్తున్నాం. ఉద్యమకాలంలో ఊరూరా తిరిగిన సందర్భంగా తాను అధ్యయనం చేసి న సమస్యలు, వాటి మూలాలు, ఏం చేస్తే ఆ సమస్యలను శాశ్వతంగా తొలిగించవచ్చు అన్న అంశాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తారు. సందర్భానుసారంగా ఆయా రంగాల నిపుణులతో, పార్టీ సీనియర్ నాయకులతో కూలంకషంగా చర్చిస్తారు. ఈ క్రమంలోనే అంతిమంగా ఏ పథకమైనా కార్యరూపం దాల్చుతుంది.
నిజాం కాలం నాటి చట్టాలనే మన ప్రభుత్వాలు, అధికారులు అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ఆచరణలో ప్రజలు పడే ఇబ్బందులను మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో అమలవుతున్న భూ చట్టాలను చూస్తే మనకు భయంకరమైన అనుభవాలు కనిపిస్తాయి. నేను ఒక రైతు బిడ్డగా , గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక సామాన్య మనిషిగా ఆలోచించినప్పుడు లోపభూయిష్టమైన భూ చట్టాలకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించాలనిపించింది. ఏ దేశానికైనా ప్రధాన సంపద భూమి మాత్రమే. అది సేద్యం కోసం కావచ్చు, పరిశ్రమల కోసం కావచ్చు, నివాస స్థలాల కోసం కావచ్చు,నగరాల విస్తరణ కోసం కావచ్చు. అంతటి కీలకమైన భూములు దేశంలోనే కాక మన రాష్ట్రంలో ఎట్ల ఉన్నాయో పరిశీలిస్తే ఒక సాలెగూడు జ్ఞప్తికి వస్తుంది. ఏ భూమి ఎవరితో, ఎక్కడ ఉందో, పట్టాలు ఎవరి పేరున ఉన్నాయో, అవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలను చూస్తే అసలు భూములు ఉండటమే మేం చేసుకున్న పాపమా? అని ప్రజ లు ఆవేదన చెందాల్సిన పరిస్థితి.

భూములు వ్యవసాయానివైనా, ఇండ్ల స్థలాలకు సంబంధించినవైనా, ఇతరత్రా ఉపయోగాలకు కొన్నవైనా, లేదా వంశపారంపర్యంగా సంక్రమించినవైనా కావచ్చు వాటి చుట్టూ వివాదాలు చుట్టిముట్టి అత్యధిక మంది ప్రజలు కోర్టులు, రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కోకొల్లలుగా కనిపిస్తాయి. అర్థం కాని చట్టాలు, అవసరం లేని నిబంధనలు, అక్కరకురాని భూ ప్రక్రియలు, చట్టాల్లో పేజీ పేజీలో చోటు చేసుకున్న లోపాలే ఈ పరిస్థితులకు కారణం. ఉదాహరణకు ఒక రైతు కావచ్చు, భూమి కలిగిన సామాన్య వ్యక్తి కావచ్చు తన భూమి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే 1954 చట్టం నుంచి మొదలై సేత్వార్, పహాని, పట్టాదారు పాస్‌పుస్తకం, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఈసీ. మొదలైన అనేక రికార్డులను సేకరించుకోవాల్సిన దుస్థితి ఉన్నది. ఇందుకు బూజుపట్టిన చట్టాలే కారణం.

మన రాష్ట్రంలో అనేకరకాల భూములున్నాయి. నిజాంకు సంబంధించిన జమీన్ జాయజాత్ భూములు, దర్గాలు, మసీదులకు సంబంధించిన వక్ఫ్ భూములు, హిందూ దేవాలయాలకు చెందిన దేవుడి మాన్యాలు, క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించిన భూములు, భూదాన్ భూములు, ఇనాం భూములు, జాగీర్ భూములు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి దొరలు, దేశ్‌ముఖ్‌లు, దేశాయ్‌లు, దేశ్‌పాండేలు మొదలుకొని భూస్వాములు, రైతులు, సామాన్యుల ఆధీనంలోని రకరకాల భూములకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. విచిత్రమేమంటే ఇన్ని ప్రత్యేకతలు గల భూములున్న రాష్ట్రంలో తాతల కాలంలో చేసిన ముక్కిపోయిన చట్టాలనే అమలుచేస్తూ అందువల్ల ప్రజలు పడుతున్న అవస్థలను పట్టించుకున్న వారే కరువయ్యారు. ఒక భూ విక్రయం జరిగిందంటే కొనుగోలుదారుడికి ప్రభుత్వమే భరోసాగా నిలిచి ఆ భూమి హక్కులు సంబంధిత కొనుగోలుదారుడికి సంక్రమించేటట్లు చేయాలి. కానీ ఇం దుకు భిన్నంగా దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అమలవుతున్న భూ చట్టాలు, అధికారులు తీసుకుంటున్న చర్యలతో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జటిలమయ్యే పరిస్థితి నెలకొన్నది. భూమి మార్పిడి జరుగాలంటే పలు కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి. తొలుత ఈసీ తీసుకోవాలి, సేత్వార్ సరిగా ఉందో, లేదో చూసుకోవాలి. పహాని ఏ పట్టాదారుడికి ఉందో తెలుసుకోవాలి. సంబంధిత భూమిలో అనుభవదారులెవరో కనుక్కోవాలి. ఉంటే ఎంతమంది కుటుంబసభ్యులో, వారితో వచ్చే చట్టపరమైన సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. ఇలా భూమి కొనుగోలు చేయడం ఒక సంతోషకరమైన పరిణామం కాకుండా ఒక భారమైన సమస్యగా మారుతున్నది. ఈ బాధలన్నీ తొలిగిపోయేవిధంగా భూ చట్టాలలో సమూల మార్పులు రావాలె. భూముల సమస్యలకు సంబంధించి రైతులు, సామాన్య ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగి ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్న సందర్భాలు అన్నీ, ఇన్నీ కావు. ఒక వ్యక్తి తను న్యాయంగా, చట్టపరంగా జరిపే కొనుగోళ్లలో, భూమి కొన్న తర్వాత సర్వీస్ పేరుతో, రిజిస్ట్రేషన్ పేరుతో, పేరు మార్పిడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందే విషయంలో జరిగే అక్రమ ఆర్థిక లావాదేవీలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది అధికారుల చేతివా టంతో భూ కొనుగోలుదారులు కుదేలవుతున్నారు. ఇలాంటి అక్రమాలకు కట్టడి చేయాలంటే చట్టాల్లో సమూల మార్పులు రావాలె.
prabhkar
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూములకు సంబంధించి చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలని నిర్ణయించడం మంచి పరిణామం. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు రైతులందరికీ అందాలంటే, ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సొమ్ము దక్కాలంటే రాష్ట్రంలో భూములపై స్పష్టత రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇం దులోభాగంగానే రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే రెవెన్యూ శాఖ లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పాలకుల హయాంలో అవినీతికి అడ్డా గా మారిన రిజిస్ట్రేషన్ల శాఖనే పూర్తి గా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కలెక్టర్లు చేసిన కసరత్తులో లక్షలాది తప్పులు దొర్లినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నది. భూముల క్రయ, విక్రయాలను అక్రమ దందాగా మార్చిన కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వమే నేరుగా భూ అక్రమాలపై కన్ను పెట్టింది. ఇందులో భాగంగానే మియాపూర్ భూముల వ్యవహారం బయ టపడింది. ఏదేమైనా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దుచేయడం, ఏండ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగుల బదిలీ, జాగీర్‌దారు చట్టంలో మార్పులు తీసుకురావడం, భూదాన్ చట్టంలో సవరణలు తేవడం, రాష్ట్రంలోని భూములన్నిటిపైనా ఎలాంటి వివాదాలు లేకుండా స్పష్టమైన రికార్డులు ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వంటి ప్రభుత్వ చర్యలు రెవెన్యూ శాఖలో భారీగా తలపెట్టిన సంస్కరణల్లో భాగమే.

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే తొలిసారిగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టిన మన ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి చరిత్రకెక్కాలంటే ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలె. ఈ సంస్కరణల క్రతువులో గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకూ ఉద్యోగులంతా సహకరించాలె. ప్రజలు కూడా భాగస్వాములైతే తప్ప మార్పు సాధ్యం కాదు.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)

832

PRABHAKAR K

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles