రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె


Fri,June 30, 2017 01:12 AM

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చేసిన వ్యవసాయాన్ని మళ్లీ లాభసాటిగా మార్చి అన్నదాతల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపాలన్న గొప్ప ఆశయం. డ్బ్భై ఏండ్లుగా సాగుతున్న పాలకుల నిర్లక్ష్యంతో పాటు అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులబతుకులు చితికిపోయాయి. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేని దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి.

ఉమ్మడి పాలకుల హయాంలో వ్యవసాయం అంటేనే విరక్తి కలిగింది. వానలు పడితే విత్తనాలు, ఎరువులు దొరుకుతాయో లేదోననే ఆందోళన వెంటాడేది. సాగుకు పెట్టుబడి ఎక్కడ తేవాలనేది పెద్ద సమస్యగా ఉండేది. ఏదో రకంగా తనువు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే పంట లు పండుతాయో లేదో, పండితే గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనేది జవాబు దొరుకని ప్రశ్నలు. ఇన్ని సంశయాల మధ్య నలిగిపోతున్న రైతన్నలకు సేద్యం అసాధ్యంగా మారింది. నైరాశ్యం ఆవరించిన రైతులు చివరికి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పంటల సాగులో మెళకువలను కూడా పాటించ లేదు. 1980వ దశకం జూన్‌లో వానకాలం ఆరంభంలోనే కురిసే తొలకరి జల్లులతో మురిసిపోయే రైతులు వెంటనే దుక్కిదున్ని పెసర, మినుము, కంది, జనుము తదితర పునాస పంటలు వేసేవారు. కంది, మక్కజొన్న పంటలను ఒకే భూమిలో సాలు విడిచి సాలులో వేస్తారు. దానిలోనూ అంతరపంటగా దోసకాయ వంటి కూరగాయ విత్తనాలను కూడా విత్తుతారు. అదే సమయంలో వరి, మిరపనార్లు కూడా పోస్తారు. వరి పండించే పొలంలోనూ, మిరప పంట వేసే మెట్టభూమిలోనూ పెసర, జనుము తదితర పునాస పంటలను వేస్తారు. మిరప పైరు, వరి నాట్లు వేసే సమయానికి పునాస పంటలు రైతు చేతికి వచ్చి వారికి కొంత వెసులుబాటు కలుగుతుంది. అప్పుడు పంటల మార్పిడి పద్ధతులను రైతులు అనుసరించేవారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వానాకాలం, యాసంగి కాలం ముగిసిన తర్వాత రైతులు తమ భూముల్లో రాత్రివేళల్లో గొర్ల మందను నిలిపేవారు. అది భూములను మరింత సారవంతం చేసేది. ఇలా సేద్యం పద్ధతి ప్రకారం సాగి పాడిపంటలతో రైతుల లోగిళ్లు కళకళలాడాడేవి. రైతులు ఎంతో శాస్త్రీయంగా సాగుచేయడం వల్ల ఎక్కడ చూసినా భూములు పచ్చదనం పైటేసి కన్నులవిందు చేసేది.

మా బాపు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. మా అమ్మ మహిళా రైతు. నా చిన్నతనంలో మా అమ్మతో కలిసి నేను మా చేనుకు వెళ్లేవాడిని. ఆ సమయంలో ఎటువైపు చూసినా పచ్చబారిన భూములే కనిపించేవి. ఎవరి భూమిలో చూసినా విరగ పండిన పంటలే. కంది, పెసర, మిను ము, ఆముదం, జనుము, మక్కజొన్న పంటలతో భూములన్నీ వర్ణశోభితంగా వికసించేవి. ఇదంతా గతం. కొన్నేళ్ల తర్వాత మా బాపు పదవీ విరమణ చేసి ఖాళీగా ఉండటం ఇష్టంలేక వ్యవసాయం చేయాలని భావించారు. కానీ అప్పటికే పరిస్థితులన్నీ మారిపోయాయి. వ్యవసా యం ఒట్టిపోయింది. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. చిన్నతనంలో చూసిన పచ్చదనం మాయమైపోయింది. నీళ్లులేక భూములు నోళ్లు తెరి చాయి. పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. రైతుల్లో నైరాశ్యం ఆవరించింది. ఒకమాటలో చెప్పాలంటే 1990వ దశకం నుంచి వ్యవసాయానికి చీడపట్టింది. వాతావరణ సమతుల్యం మరింత దెబ్బతిని వానలు తగ్గిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటల వంటి చిన్న నీటివనరులు ధ్వంసమయ్యాయి. బోర్ల మీదే ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత లోతు బోర్లు వేసినా నీరు పడదు. బోర్లతో సాగుచేయడానికి మరో పెద్ద సమస్య కరెంట్. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీనికితోడు సేద్యానికి పెట్టుబడులు పెరిగాయి. అష్టకష్టాలు పడి పంటలు పండించి నా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక రైతులు బలవన్మరణాలకు పాల్పడాల్సిన దుస్థితి. అప్పటి పాలకుల కు వ్యవసాయమంటేనే చిన్నచూపు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారు. మద్దతు ధరలు ఇవ్వలేదు. ఎరువులు, విత్తనా లు బ్లాక్ మార్కెట్‌లో తప్ప బయట దొరుకలేదు. వారికే అంతుబట్టని భయమేదో తరుముతున్నట్లుండేది. ఏ పంటకు మార్కెట్‌లో ధర ఉం టుందో తెలియని స్థితి. ఒకసారి ఒక పంటకు మంచి ధర వస్తే, మరుసటి ఏడాది అందరూ అదే వేసి తీవ్రంగా నష్టపోయేవారు. ఎప్పుడు ఏ పం టకు ధర పలుకుతుందో తెలియని మార్కెట్ మాయాజాలంతో రైతు కుదేలైపోయాడు. ఉదాహరణకు గతేడాది మిర్చి పంటకు మార్కెట్‌లో విపరీతమైన ధర పలికింది. దీంతో ఈ ఏడాది రైతులు మిగిలిన పంటలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మిర్చి సాగుచేశారు. చివరికి ఏమైం ది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనివిధంగా మిర్చి దిగుబడులు పెరిగి మార్కెట్లలో నామమాత్రపు ధరలు కూడా రాని పరిస్థితి. ఇలా అస్తవ్యవస్తమైన సాగు పద్ధతులతో వ్యవసాయం దెబ్బతినడానికి అశాస్త్రీయ పద్ధ తులే కారణంగా చెప్పుకోవచ్చు.

ఇప్పటికైనా రైతుల్లో మార్పు రావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. వ్యవసాయ సంక్షోభం అనేది ఒక్క తెలంగాణకో, మరో రాష్ర్టానికో పరిమితమైంది కాదు. పలు అగ్రదేశాల్లోనూ ఆలుగడ్డ వంటి పంటలను గిట్టుబాటు ధరలు రాక రోడ్లపైనే పారబోసిన దృశ్యాలున్నా యి. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు శాస్త్రీయ కోణంలో కృషి జరుగాలి. అది తెలంగాణలో జరుగుతున్నది. స్వయంగా రైతు బిడ్డ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సామాన్య రైతుగానే ఆలోచిస్తూ అన్నదాతల వెతలు తనకు స్వయంగా తెలుసు కాబట్టే రాష్ట్రంలో వ్యవసాయరంగానికి జీవం పోసే చర్యలు చేపట్టారు. 70 శాతానికి పైగా ప్రజల జీవనాధారమైన వ్యవసా యరంగాన్ని ఒక పరిశ్రమగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదో అంతకుమించిన రాయితీలు రైతులకూ ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే రైతులేం చేస్తే బాగుపడతారో ఆ చర్యలు తీసుకుంటున్నారు. భూసార పరీక్షల నుంచి ప్రారంభమయ్యే వ్యవసాయ ప్రక్రియ, మార్కెట్లలో మద్దతు ధరలకే పం టలు అమ్మేవరకూ రైతుల వెన్నంటి నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. రైతులకు నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఏ భూములు ఏ పంటలకు అనుకూలమో ముందే చెప్తుతున్నది. సాగులో మెళకువలు నేర్పి ఎప్పటికప్పు డు అవగాహన కలిపించడానికి 5 వేల ఎకరాలకొక అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారిని, మండలానికో అగ్రానమిస్ట్‌ను నియమించింది. గత పాలకుల హయాంలో మాదిరిగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అదునుకు ముందే విత్తనాలు, ఎరువులను అందుబాటులో పెడుతున్నారు. బావులు, బోర్ల కింది వ్యవసాయానికి ప్రభుత్వం పగటిపూటే తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది.

మరో వైపు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో కేసీఆరే స్వయంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. వ్యవసాయానికి పునరుజ్జీవం పోసేందుకు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ ద్వారా అదనపు ఆయకట్టుకు నీరందిస్తున్నది. పెట్టుబడులకు కూడా కరువు లేకుండా ప్రభుత్వమే రైతన్నకు బాసటగా నిలిచింది. దీనికోసం వచ్చే ఏడాది నుంచి రెండు సీజన్లకు కలిపి ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రైతులకు పెట్టుబడి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కూడా ప్రభుత్వ మే బాధ్యత తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లను ప్రభుత్వం ఆధునీకరిస్తున్నది. మార్కెట్లలో మాయాజాలానికి కళ్లెం వేసింది. మార్కెట్లలో వ్యాపారులు, దళారులు కుమ్మక్కయి రైతులకు మద్దతు ధరలు రాకుండా కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టడానికి ప్రభుత్వమే మద్దతు ధరలకు అన్ని పంటలను నూరు శాతం కొనడానికి సిద్ధం గా ఉన్నది. ఏదైనా పంటకు మార్కెట్‌లో మద్దతు ధర లేకపోతే రావాల్సిన ధర వచ్చేంతవరకూ ఆ పంటను భద్రపర్చుకోవడానికి వీలుగా 17.075లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1024.50 కోట్ల తో 330 గోదాములను నిర్మిస్తున్నది. ఇలా ప్రభుత్వం వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నది.
prabhakar
ఇక మిగిలింది రైతుల వంతే. వారి ఆలోచనలోనూ మార్పురావాలి. మూడేండ్ల కిందటి వరకూ ఉమ్మడి పాలకుల హయాంలో వ్యవసాయం ఎట్లున్నది, ఇప్పటి పరిస్థితులకు బేరీజు వేసుకోవాలి. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు లేవు. భూసార పరీక్షలు మొదలు విత్తనాలు, ఎరువు లు, కరెంట్, పెట్టుబడులు, సరైన మార్కెటింగ్ సౌకర్యాలకు కొదువ లేకుండా అన్నీ ప్రభుత్వమే చూసుకుంటున్నది. రైతులపై ఎలాంటి ఒత్తి డి లేకుండా చేసింది. ఇక రైతులు వ్యవసాయంలో సృజనాత్మకంగా ఆలోచించాలి. మూస పద్ధతులను విడనాడాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. వానాకాలంలో ఏ పంటలు వేయాలి?, యాసంగిలో ఏ పంటలు వేయా లన్న అంశంపై నిర్దిష్ట ప్రణాళికలను రైతులే రూపొందించుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను పంటలను ఆచరించాలి. సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు ముందుకు వచ్చి న ప్రభుత్వానికి రైతుల చైతన్యం కూడా తోడైతే వ్యవసాయరంగం లాభసాటిగా మారి వ్యవసాయం దండుగ అన్న పరిస్థితి నుంచి వ్యవసా యం పండుగగా మారుతుంది.

(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
రైతులు వ్యవసాయంలో సృజనాత్మకంగా ఆలోచించాలి. మూస పద్ధతులను విడనాడాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. వానాకాలంలో ఏ పంటలు వేయాలి?, యాసంగిలో ఏ పంటలు వేయాలన్న అంశంపై నిర్దిష్ట ప్రణాళికలను రైతులే రూపొందించుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను పంటలను ఆచరించాలి. సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వానికి రైతుల చైతన్యం కూడా తోడైతే వ్యవసాయరంగం లాభసాటిగా మారి వ్యవసాయం దండుగ అన్న పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగగా మారుతుంది.

617

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles