రాజనీతి ఆచార్యుడు


Sat,May 27, 2017 11:33 PM

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. కేసీఆర్ ఏదన్నా చెబితే మొదట అపోహలు ఏర్పడుతాయి, తర్వాత ఊహలాగా అనిపిస్తది. ఆ తర్వాత ఉద్యమరూపం తీసుకుంటుంది. అదే ఊపిరిలాగా మారుతది, చివరికి నిజమైతది ఈ మాటలు కేసీఆర్ వ్యక్తిత్వానికి, రాజనీతిజ్ఞతకు అద్దంపట్టేలా ఉన్నాయి.

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన యోధుడు మన ముఖ్యమం త్రి కేసీఆర్. నిజాయితీ, నిబద్ధత, కఠోర దీక్ష, క్రమశిక్షణ ఆయనకు పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలు. మడమ తిప్పని మొండితనం, ప్రత్యర్థులకు అంతుబట్టని ఎత్తుగడలు, ఉద్యమాలను ఉరకలెత్తించే వ్యూహరచనలకు ఆయన ను మించినవారు ఎక్కడా కనిపించరు. ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో మకుటంలేని మహారాజులా వెలుగొందుతున్న విలక్షణ నేత కేసీఆర్. ఆయన పార్లమెంటరీ సంప్రదాయాలను తూచ తప్పకుండా ఆచరించే గొప్ప ప్రజాస్వామ్యవారధి. ప్రజ ల గుండెల్లో కలకాలం నిలిచిపోయే మంచి లెజిస్లేటర్. చమత్కారం, సందర్భానుసారం జాలువారే చలోక్తులు, ప్రత్యర్థులను ఏకిపారేసే పంచ్ డైలాగ్‌లకు కేసీఆర్ పెట్టింది పేరు. తాజా పరిణామాలనే చూడండి. తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడురోజుల పాటు పర్యటించి కేంద్రం తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చిందని అబద్ధాలు చెప్పి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ దేశంలోనే ఎవరూ ఎదురు తిరిగి అనే ధైర్యం చేయలేనంత పెద్ద నేతగా ఉన్న అమిత్ షా వ్యాఖ్యలపైనే సీఎం కేసీఆర్ తక్షణం స్పందించారు.

కేంద్రం ఇచ్చింది లక్ష కోట్లు కాదు, 65 వేల కోట్లు మాత్రమే. లక్ష కోట్లు ఇచ్చినట్టు అధికారికంగా లెక్కలు చెబితే నా ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తా అని అరగంటలోనే మూడు రోజుల గందరగోళానికి తెరదించారు. దటీజ్ కేసీఆర్. కోట్లాదిమంది ప్రజల మనోభావాల్ని తన ఒక్క గొంతుకతో సమూలంగా ఆవిష్కరించగలిగే చాతుర్యం కేసీఆర్‌కే సొంతం. భావగర్భితంగా ప్రసంగా న్ని రసమయం చేయగల శక్తియుక్తులు ఉన్న అతికొద్ది మందిలో ఆయనది ప్రముఖ స్థానం. కొత్త పదాలు, పదబంధాలను ఆయన సృష్టించగలరు. నిజాయితీగా నిబద్ధతతో ఏ పనిచేసినా లక్ష్యాన్ని చేరుకుంటామనడానికి తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రబల ఉదాహరణగా కేసీఆర్ మనముందు ఉం చారు. ఆయన ప్రజల భాషలోనే మాట్లాడుతారు. ఎంతపెద్ద స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్తం ఆయనది. అందుకే ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం ఉన్నది. కేసీఆర్‌కు ప్రజలపై నమ్మకం ఉన్నది అందుకే కేసీఆర్ దేశాన్నే ప్రభావితం చేసేలా ఉద్యమాన్ని నడిపి అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు.

కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ప్రజలు ఆరాధించే ప్రబల శక్తి. ఆయనే ఓ పాఠశాల. అలాంటి కేసీఆర్ స్కూల్‌తో 17 ఏండ్ల సాన్నిహిత్యం ఉన్న నేను కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన మూడేళ్లకు చేరుకున్న సందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. కేసీఆర్ స్కూల్‌లో ఓనమాలు నేర్చుకున్న అనేకమందికి ఆయనలో ఉన్న ఉద్యమ వ్యూహరచన, రాజకీయ చతురత, పరిపాలనాదక్షతలు తెలుసు. కేసీఆర్ స్కూల్‌లో తర్ఫీదైన వారెందరో మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ ఛైర్మన్‌లుగా ప్రజలతో మమేకమయ్యారు. కేసీఆర్ వద్ద పాఠాలు నేర్చుకున్నవారంతా సుదీర్ఘ రాజకీయ నాయకుల మాదిరిగా ప్రజల్లో ఒదిగిపోయారు. కేసీఆర్‌లో రాజకీయానికే రాజకీయం నేర్పే విలక్షణ నేత కనిపిస్తారు. గతం లో కేసీఆర్ టీడీపీలో ఉండగా నాడు ప్రభుత్వం జన్మభూమి వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేలా పథకాల రచనలో ముందుండి, అప్పటి టీడీపీ యంత్రాంగాన్ని ఆసాంతం కదిలించేలా అధినాయకుడి నుం చి కిందిస్థాయి కార్యకర్త వరకూ తరచూ శిక్షణ ఇచ్చిన చరిత్ర ఆయనకు ఉన్నది. ఈ విషయాలను అప్పుడప్పుడు తారసపడే టీడీపీ నాయకులతో పాటు ఇప్పుడు నాతో పాటు టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న పూర్వ టీడీపీ నాయకులు చెప్పినవే. కేసీఆర్ 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించే నాటికి టీడీపీకి, సిద్దిపేట ప్రజలకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలిసిన నేత కాదు. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉండేస్థాయికి ఆయన ఎదిగారు. దీనికి కారణం తను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే విషయంలో ఆయన ప్రదర్శించే నిజాయితీ, నిబద్ధత, కఠోరదీక్ష, క్రమశిక్షణలే.

ఈ లక్షణాలే ఆయనను ఒక సామాజిక కార్యకర్తగా, ఒక ఉద్యమనేతగా, నేడు ముఖ్యమంత్రిగా ఉన్నత స్థానం లో నిలబెట్టాయి. రాజకీయాల్లో కొనసాగాలనుకునేవారు అనేక విషయాల ను కేసీఆర్ స్కూల్‌లో నేర్చుకోవచ్చు. ఎలాంటి రాజకీ య నేపథ్యం లేకున్నా నాలాంటి వాళ్లమంతా నేడు అనే క పదవుల్లో కొనసాగుతున్నామంటే అందుకు కేసీఆర్ నేర్పిన పాఠాలే కారణం. రాజకీయ నాయకుడి స్వభా వం ఎలా ఉండాలి? వేషధారణ, హావభావాలు, ప్రజలతో మమేకమై మాట్లాడాల్సిన పద్ధతి, పదవి ఉన్నా, లేకపోయినా ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ లో క్రమశిక్షణగా మెలగడం, ఇలా అనేక అంశాలను ఆయన స్కూల్‌లో అధ్యయనం చేయవచ్చు. ఉద్యమకాలంలో ఒకరోజు నేను సాధారణ దుస్తులు ధరించి కేసీఆర్ గారి వద్దకు వెళ్లాను. నన్ను చూడగానే ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక పదం ఏం బట్టలయ్యా ఇవి అని. అంతే నేను నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ ఎదుటగానీ, ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పుడు గానీ తెల్ల దుస్తులు తప్ప మరో రకమైన దుస్తులు ధరించలేదు.

1983వ దశకంలో యువతరాన్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించింది ఎన్టీఆర్ అయితే 20వ దశాబ్దంలో మళ్లీ రాజకీయాల్లో కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్నది కేసీఆరే. నేడు ఎందరో రాజకీయ నాయకులను తయారుచేసిన కేసీఆర్ స్కూల్‌లో, ఆయన జీవితంలో చోటుచేసుకున్న ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క అద్భుత పాఠ్యాంశమే. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా కలలు కని ఆ కలలను నిజం చేసుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారేనని చెప్పడానికి కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రమే నిలువెత్తు నిదర్శనం. అసలు టీఆర్‌ఎస్ ఆవిర్భావమే ప్రతికూల పరిస్థితుల్లో జరిగింది. ఎంతమంది నాయకులు తనతో కలిసివస్తారో, ప్రజల మద్దతు ఉం టుందో తెలియదు. అయినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కేసీఆర్ తన పదవులను గడ్డిపోచ మాదిరి త్యజించారు. ఆకాశమంతా తెలంగాణ ఆకాంక్షను నెత్తినేసుకొని ఒంటరిగా ఉద్యమ బాటలో తొలి అడుగు వేశారు. ఆ సమయంలో అనేక అవమానాలు. ఉమ్మడి పాలకుల దాడులు, కుట్రలు, కుయుక్తులు. పార్టీని చీల్చాలని ఆంధ్రా పాలకుల వెన్నుపోటు రాజకీయా లు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం. భరించలేని నిందలు. జాతీయ పార్టీలు అదేపనిగా చేస్తున్న మోసాల మీద మోసాలు. టీఆర్‌ఎస్‌ను కిందామీద చేసిన ఆర్థిక ఇబ్బందులు.

ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినవారంతా పేదవర్గాలకు చెందినవారే. లేదా వామపక్ష భావాజాలం ఉన్నవారే. మొత్తమ్మీద ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఢిల్లీ పీఠాన్ని కదిలించి రాదనుకున్న తెలంగాణను సాధించారు. పాలకుడిగా కూడా అన్నీ అద్భుత విజయాలే. ఉద్యమకాలంలో ఊరూరా తిరిగిన అనుభవంతో ఏ వర్గం ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసు. అం దుకే వివిధ వర్గాలకు మేలు చేయడానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వయంగా రైతుబిడ్డ అయిన కేసీఆర్‌కు రైతులంటే పంచప్రాణాలు. అధికారం చేపట్టినప్పటి నుంచే రైతుల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ వారి అభిమానం పొందుతూనే ఉన్నారు. దేశంలో కాదు కదా ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఏడాది లో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున పెట్టుబడి అందించాలని తీసుకున్న అద్భుత నిర్ణయమే తెలంగాణ పునర్నిర్మాణ పథంలో కేసీఆర్ ఎంతవేగంగా అడుగులు వేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం. ధ్వంసమైన కులవృత్తులను చక్కబెడుతున్నారు. దేశంలో అద్భుత సీఎంగా కీర్తించబడుతున్నారు.
Prabhakar
ఇటీవల ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. కేసీఆర్ ఏదన్నా చెబితే మొద ట అపోహలు ఏర్పడుతాయి, తర్వాత ఊహలాగా అనిపిస్తది. ఆ తర్వాత ఉద్యమరూపం తీసుకుంటుంది. అదే ఊపిరిలాగా మారుతది, చివరికి నిజమైతది ఈ మాటలు కేసీఆర్ వ్యక్తిత్వానికి, రాజనీతిజ్ఞతకు అద్దంపట్టేలా ఉన్నాయి. ఎందుకంటే సామాజిక కార్యకర్తయినా, ఉద్యమ నేతయినా, మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడూ రాజనీ తి శాస్త్ర బోధకుడే. కేసీఆర్ స్కూల్‌లో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నవారంతా నిత్య విద్యార్థులే.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)

905

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles