వ్యవసాయానికి వెన్నుదన్ను


Wed,April 26, 2017 12:38 AM

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది రైతే. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగనడం, ఓట్ల పండుగ రాగానే రైతే రాజు అని కొంగ జపం చేయడం డ్బ్భై ఏండ్లుగా సాగుతున్న తతంగం. పాలకుల నిర్లక్ష్యంతో పాటు అతివృష్టి,అనావృష్టి ఎడాపెడా విరుచుకుపడుతూ అన్నదాతల జీవన చక్రాన్ని ఛిద్రం చేశాయి.

టీఆర్‌ఎస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న ప్రగతి నివేదన సభకు స్వచ్ఛందంగా హాజరై ప్రత్యక్షంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవాలని రాష్ట్ర రైతాంగం సమాయత్తమవుతున్నది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై వరంగల్ చేరుకోవాలని లక్షలాదిమంది రైతులు స్వయంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.


ఎక్కడ చూసినా సాగునీరు లేక నెర్రెలు బారిన నేలలు, ఎండిపోయిన బావులు కనిపించేవి. ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డారంటే వ్యవసాయమంటే ఆంధ్రా ప్రాంతానికి మాత్రమే చెందినట్లు, తెలంగాణలో వ్యవసాయం చేసేటోళ్లు లేనట్లు వ్యవహరించారు. అప్పటి ఉమ్మడి పాలకులు సృష్టించిన కృత్రిమ సమస్యలతోనే తెలంగాణలో వ్యవసాయం కుప్పకూలిందే తప్ప ఇక్కడ నైపుణ్యం ఉన్న రైతులు లేక కాదు. ఉదాహరణకు నల్లగొండ జిల్లా ముషంపల్లికి చెందిన బైర్ల రామిరెడ్డినే తీసుకుంటే ఆయనకు వ్యవసాయమంటే ఎక్కడలేని మక్కువ. నీటి కోసం భగీరథ యత్నం చేశారు. 60 బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. చివరకి ఆయన బోర్ల రామిరెడ్డిగా అందరి దృష్టిలో పడ్డారు. ఒక సందర్భంలో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఏం కావాలి పెద్దాయనా అనడిగితే తెలంగాణ కావాలని నిలదీసిన రైతు ఫణికర మల్లయ్య తెగువ మనకు కనిపిస్తుంది. వ్యవసాయంపై ఆధారపడి చేయడానికి అనువైన పరిస్థితులు లేక తీవ్ర వేదనకు లోనైన ఆయన గుండె లోతుల్లోంచి ఈ మాటలు వచ్చాయి.

మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే రైతుబిడ్డ కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయ న అధికార పీఠం మీదకూర్చొని సీఎంగా ఆలోచించడం లేదు. సామా న్య రైతుగానే ఆలోచిస్తున్నారు. అన్నదాతల వెతలు తనకు స్వయంగా తెలుసు కాబట్టే రాష్ట్రంలో వ్యవసాయరంగానికి జీవంపోసే చర్యలు తీసుకుంటున్నారు. ఆయన తపనంతా రైతుల బాగు గురించే. రైతు సంక్షే మం గురించి కేవలం వేదికల పైన మాట్లాడటానికో, అసెంబ్లీలో చర్చించడానికో కేసీఆర్ పరిమితం కాలేదు. మూలాల్లోకి వెళ్లి ఏం చేస్తే రైతుల వెతలు తీరుతాయన్న అంశంపై అధ్యయనం చేస్తున్నారు. శాస్త్రీయ దృక్పథంతో పనిచేసి రైతును నిజంగా రాజుగా మార్చే యజ్ఞం చేస్తున్నారు. ఈ నెల 21న జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో చూసినా, 23న ప్రధానితో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో రైతుల అంశాలనే ప్రముఖంగా ప్రస్తావించడం కేసీఆర్ నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం. నిజానికి టీఆర్‌ఎ స్ ప్లీనరీ పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయడానికి.

కానీ రోజంతా జరిగి న ప్లీనరీలో తీర్మానాల నుంచి కేసీఆర్ ప్రారంభ, ముగింపు ఉపన్యాసమంతా రైతుల శ్రేయస్సు కోసం చేపట్టాల్సిన చర్యల గురించే. దీంతో పార్టీ ప్లీనరీ కాస్త రైతు సంక్షేమ సదస్సుగా మారింది. వ్యక్తిగతంగా ప్రధానితో కలిసిన సందర్భంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్నారు. అసంఘటితరంగ కార్మికులను పొలం పనుల్లోకి తేవాలన్నారు. గుర్తించిన పంటలు, వ్యవసాయ-వాతావరణ ప్రాంతాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఉత్పాదకత పెంచాలని, ఇం దుకు వివిధ రాష్ర్టాల్లో తరచూ పరిశోధన సంస్థలను ప్రోత్సహించాలని, పన్ను మినహాయింపునిచ్చి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని కోరారు. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే వ్యవసాయానికి అదనపు ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు, నష్టాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని, పంటల బీమా పథకాల అమల్లో అవాంతరాలను తొలిగించాలని స్పష్టమైన సూచనలు చేశారు.

కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే నాటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి ఉన్నాయి. ఓ వైపు వాటిని పునరుద్ధరిస్తూనే మరోవైపు అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా తన ప్రథమ ప్రాధమ్యం వ్యవసాయమేనని అనతి కాలంలోనే చాటుకున్నా రు. రైతుల కన్నీళ్లు తుడువాలంటే తక్షణ ఉపశమన చర్యలు, సమస్యల శాశ్వత పరిష్కారానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని టీఆర్‌ఎస్ ప్రభు త్వం నిర్దేశించుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తురు కళ్లజూసిన ఎర్రజొ న్న రైతుల బకాయిలను కేసీఆర్ చెల్లించారు. ఉమ్మడి పాలకులు బకాయి పెట్టిన దాదాపు రూ.500 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను రైతులకు విడుదల చేశారు. గ్రామాల్లో వ్యవసాయాన్ని పునరుజ్జీవం చేసేందుకు మిష న్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. కోటి ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో కేసీఆరే స్వయంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అదునుకు ముందే విత్తనాలు, ఎరువులను ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టారు. పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఎన్నికల హామీకి కట్టుబడి 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. భూసార పరీక్షలు, పంటల మార్పిడీపై అవగాహన, నకిలీ విత్తనాలను అరికట్టే చర్య లు, నకిలీ విత్తనాలు అమ్మే డీలర్ల నుంచే రైతులకు పరిహారం ఇప్పించే లా చట్టం తెచ్చారు. తెలంగాణను సీడ్‌బౌల్‌గా తీర్చిదిద్దడం వంటి ఎన్నో చర్యలు తీసుకున్నారు. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించడం, వారి కుటుంబాల్లోని యువతులకు కల్యాణలక్ష్మీ పథకాన్ని వర్తింపజేయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా వ్యవసాయంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అయినా ఎక్కడో వెలితి ఉన్నది. దాన్ని శోధించాలి. శాస్త్రీయ దృక్పథంతో చర్యలు తీసుకోవాలి. అప్పుడే వ్యవసాయరంగం పచ్చని పంటలతో వికసిస్తుంది. పల్లెలన్నీ ఆర్థిక పటిష్టత పొందుతాయని కేసీఆర్ భావించారు. ఇందులో భాగమే పైన పేర్కొ న్న అంశాలన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా ప్రకటించిన ఉచిత ఎరువుల సరఫరా నిర్ణయం మరో ఎత్తు. నిజానికి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ప్రధాన కారణం ఎరువులే. రైతులు ఎరువుల కోసం వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున సొమ్మును అరువు తెచ్చుకోవడం సర్వసాధార ణం. నగో నట్రో తాకట్టుపెట్టి మరీ ఎరువుల కోసం అన్నదాతలు అప్పు లు చేయాల్సిన పరిస్థితి. కాలం కలిసిరాక పంటలు చేతికి రాకపోతే ఇక అంతే సంగతులు. తెచ్చిన అప్పుపై వడ్డీ పాపం పెరిగినట్లు తడిసి మోపెడవుతుంది. తీసుకున్న అప్పులు కట్టమని వడ్డీ వ్యాపారులు రైతుల కుటుంబాలను వేధిస్తారు. మరోవైపు వివిధ బ్యాంకుల ద్వారా తెచ్చుకు నే లోన్లు కూడా సింహభాగం ఎరువుల కోసమే. సమయానికి తీసుకున్న అప్పు చెల్లించకపోతే బ్యాంకులు రైతుల ఇండ్లను జప్తులు చేసే పరిస్థితి కూడా పల్లెల్లో ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఎరువులు కొనడమే. రైతులకు ప్రాణసంకటం. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎరువుల కోసం 8 వేల చొప్పున ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మం సజావుగా అమలు జరిగి రైతులపై ఎరువుల భారం తొలగాలన్నదే కేసీఆర్ అభిమతం. రైతుల శ్రేయస్సు కోసం దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. ఈ కార్యక్రమాలతోనే రైతులు బాగుపడుతారని కేసీఆర్ అనుకోవడం లేదు. రాష్ట్రంలో ఉన్నది పూర్తిగా రైతు ప్రభుత్వం. తెలంగాణలో రైతులే రాజు లు. వ్యవసాయరంగాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడా కావాలె. ఉచిత ఎరువుల నిర్ణయం రాష్ట్ర రైతాంగానికి కొత్త ఊపిరినిచ్చింది. టీఆర్‌ఎస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న ప్రగతి నివేదన సభకు స్వచ్ఛందంగా హాజరై ప్రత్యక్షంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవాలని రాష్ట్ర రైతాం గం సమాయత్తమవుతున్నది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై వరంగల్ చేరుకోవాలని లక్షలాదిమంది రైతులు స్వయంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. రైతులంతా వరంగల్ దారి పడుతుండటంతో ఓరుగల్లు సభ దేశంలోనే ఇప్పటివరకూ ఎక్కడా జరుగని రీతిలో కిసాన్ మహాసభ గా మారుతుందనడంలో అతిశయోక్తిలేదు.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
Prabhakar

395

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles