అణచివేత అసాధ్యం


Sat,October 6, 2012 04:35 PM

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్నాలకు కేంద్రం కదిలి, తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నదన్న ‘సకల జనుల’ స్వప్నాన్ని చిదిమేయడానికి సీమాంధ్ర నేతలు మళ్లీ పావులు కదుపుతున్నారు. రాజీనామా చేయని తెలంగాణ నాయకుల ఉత్తర ప్రగల్బాలకు మళ్లీ తెలంగాణ మోసపోతుందేమోనన్న అనుమానం కలుగుతోంది. సక ల జనుల సమ్మెలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వర్గాల పట్ల ప్రభు త్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాలు ప్రభుత్వ తీరును తెలుపు తున్నాయి. మొదట కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మె ప్రభావం లేదని బుకాయించినప్పటికీ వాస్తవాలను నిరాకరించలేని స్థితి నెలకొన్నది. దీంతో మూడు స్థాయిల్లో చర్చల గురించి మాట్లాడుతున్న ఆజాద్, ప్రణబ్‌లు సీమాంధ్ర నాయకుల వైఖరి వల్ల మరింత ఆలస్యం ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నది.
సకల జనుల సమ్మెను ఏదో ఒక రూపంలో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది.

దీనిలో భాగంగానే సీమాంధ్ర బస్సుల్ని బందోబస్తుతో నడిపిస్తున్నది. కోదాడ నల్లబండ గూడెం నుంచి పోచంపల్లి అడ్డరోడ్డు దాకా జాతీయ రహదారి పక్క గ్రామాలు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నాయి. రోజూ జాతీయ రహదారి వెంట ఏదో ఓ గ్రామం నుంచి ఉద్యమ కారులను అరెస్టు చేస్తూ, కేసులు పెట్టి జైళ్లలోకి పంపిస్తున్నది. దీన్నిబట్టి చూస్తే శ్రీకృష్ణ కమిటీ రహస్య అధ్యాయంలోని అణచివేత చర్యలకు ప్రభుత్వం పూనుకుంటున్నదని అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులకు మద్దతుగా బయలుదేరిన కోదండరాంను అరెస్టు చేయ డం, ఎన్‌ఎంయు నేతలను లోబర్చుకొని ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయ పూనుకోవడం ద్వారా ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో బోధపడుతున్నది.

కూకట్‌పల్లిలో ఎన్‌ఆర్‌ఐ కాలేజీని నడిపించాలని విద్యార్థుల చదువుల పేర, సీమాంధ్ర తల్లిదంవూడుల కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీచర్లు సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి ఒకవైపు, విద్యాశాఖమంత్రి శైలజానాథ్ మరోవైపు హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు. అయినా పాఠశాలల పునః ప్రారంభం రోజు అక్టోబర్ 10న ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల తెర్చుకోకపోగా, ఉవ్వెత్తున టీచర్ల ఆందోళనలు సమ్మె ఉధృతిని తెలియజేశాయి. నాలుగురోజులు ఆగితే వాళ్లే విరమించుకుంటారని సీమాంధ్ర నేత లు కాంగ్రెస్ కోర్ కమిటీ ముందు మాట్లాడారు. ఇది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన రాజకీయ పార్టీల కుటిలత్వాన్ని తెలియజేస్తున్నది. స్వామిగౌడ్‌పై భౌతిక దాడి మొదలు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న ఉద్యోగ, ఉపాధ్యా, కార్మికుల్ని బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నది ప్రభుత్వం. దీనికి కొంత మంది తెలంగాణ ద్రోహులను ఉపయోగించుకుంటున్నది.

శ్రీకృష్ణ కమిటీ రహస్య అధ్యాయంలోని పొలిటికల్, మీడియా మేనేజ్ తో ఉద్యమాన్ని హింసా వలయంలోకి నెట్ట జూస్తున్నది. ఉద్యోగుల్ని వెనక్కి నెట్టడం ద్వారా తమ స్వార్థపూరిత ఆకాంక్షల్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నది. అందుకోసం చర్చల పేరిట పాడిం దే పాట అన్న చందంగా కాలయాపన చేస్తున్నది. అటు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధానిగానో చేయా లని అంటూ తెలంగాణకు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయి. కేంద్రం సరైన నిర్ణ యం తీసుకోకపోతే ప్రజల ఆకాంక్ష మేరకు మా నిర్ణయం మేం తీసుకుంటామని నేతలు ప్రకటిస్తున్నారు. కానీ అందులో కొందరు ఇంకా రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామిక, శాంతియుత పోరాటాన్ని హింసాయుతంగా మలిచి అణచివేయాలనుకుంటున్నది. ఈ కుట్రలను గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా పోరాటం చేయాల్సింది పోయి, వారి కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి నెల రోజులుగా తమ జీతాల్ని, జీవితాల్ని పణంగా పెట్టి ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతంగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం తప్ప మరో మార్గం లేదు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సంఘాలను చీల్చి, నాయకులను లోబరుచుకునే కుట్రలు మానుకోవాలి. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. అంతకు మించి బెదిరిపులతోనో, కుట్రలతోనో సమ్మెను విచ్ఛిన్నం చేసినా, కాళోజీ అన్నట్టు ‘తెలంగాణ వెనుకబాటు తనం పోయేంతవరకు ఈ పోరాటాన్ని ఎవరూ ఆపలేర’న్న సత్యాన్ని గుర్తించాలి.

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య