నిర్బంధాలను ఛేదించి..


Sat,June 22, 2013 01:17 AM


చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిపొండి’ అని స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్ కలవరపెట్టింది. విద్యావారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలన్న కార్యక్షికమంలో చిత్తశుద్ధితో పాల్గొంటున్నా, అరెస్టుచేస్తే కూడా విద్యాహక్కు-చట్టంలో భాగంగా ఊరుకోనని చెప్పా ను. దీంతో స్థానిక పోలీసులు ఊరుకున్నా, మిర్యాల గూడలో అరెస్టులు బైండోవర్‌లు కేసులు, బారీకేడ్లు, చెక్‌పోస్టులు తదితర కార్యక్షికమాలు చూస్తే..శత్రుదేశ దాడినుంచి రక్షణకోసం తీసుకుంటున్న రక్షణలుగా తోచి భయం వేసింది. మా ప్రాంత నాయకుడు, మం త్రి తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించాడు. కనీసం ప్రజల ఆకాంక్షలకు నోరు తెరి చి అసెంబ్లీకి కాకపోయినా, ఇందిరాపార్క్‌కైనా వస్తా డని ఆశించాం. తన బాధ్యతగా కనీసం షరతులతో కూడిన అనుమతి కోసమైనా ప్రయత్నించి , తమ చిత్తశుద్ధిని కాపాడుకుంటారనుకున్నాను. అట్లాంటి ప్రయత్నం జరగలేదు. కానీ ఉద్యోగులు, ఉద్యమ నేతలపై రోజూ బైండోవర్ కోసం వత్తిడి పెరి గింది. దీంతో అనివార్యంగా అసెంబ్లీకి వెళ్ళాలనిపించింది. నిత్యం ప్రజాస్వామ్యం గురించి, గాంధీజీ హిం స-ఆహింసల గురించి మాట్లాడే ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఇందిరాపార్క్ వరకైనా ఎందుకు పోని వ్వరని అడిగిన వారెవ్వరూ లేరు. గతంలో లాగా మిలియన్ మార్చ్, సాగరహారం అనుమతించకపోతరా అనుకుని నాతోపాటు మరో నలుగురం బయలు దే రాం. నూటయాభై కిలోమీటర్ల దారిలో ఆరు అంచెల భద్రతా వలయాల్ని, బారికేడ్లను దాటడానికి మేం పడ్డ కష్టాలు, చెప్పిన అబద్ధాలు, చూపిన సాక్ష్యాలు మాకు పరాయి దేశంలో ఉన్నట్లుగా అనిపించింది.

అంతిమంగా ఆటో డ్రైవర్, కొద్దిమంది పోలీసుల సహకారంతోనే యుద్ధభూమిని తలపించే అశోక్‌నగర్ చౌర స్తా ‘గాంధీనగర్ గల్లీ చేరుకున్నాం. నేకొక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, ప్రజాస్వామ్యమంటే, భావవూపకటనా స్వేచ్ఛ అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వమని అనుకుంటాం. ‘అసెంబ్లీ’ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నది పూర్తి అసత్యమని అర్థమైంది. ఎక్కడ నుంచి వస్తున్నారో, ఎట్లా వస్తున్నారో తెలియకుండానే గాంధీనగర్ గల్లీలన్నీ జనంతో నిండి పోయాయి. జై తెలంగాణ అంటూ నినదిస్తూ శాంతియుతంగా ఇందిరాపార్క్ వైపు బయలు దేరిన గుం పుల్ని ఇనుపటోపీల సైన్యం వెంబడించి, వేటాడి లాఠీలతో బాదడం చూశాక అదొక రణరంగంగా తోచింది. ఇక మనం వెళ్లలేం వెనకకు వెళ్లదామని నిర్ణయించుకున్నాం. ఏ గల్లీ నుంచి బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేనంత జనం. గుంపులు గుంపులుగా పరుగెత్తే జనాన్ని తరముతూ పోలీసు ర్యాపిడ్ యాక్షన్ వాహనాలు వెంటాడుతున్నాయి. టియర్‌గ్యాస్‌లు ముళ్ల కంచెలు, లాఠీ,తూటాలు‘జలియన్‌వాలాబాగ్’ను గుర్తు చేసిం ది. పొద్దటి నుంచి తిరిగిపోయిన జనం చేతుల్లో రాళ్లతో పోలీసుల్ని నిలవరించే ప్రయత్నం, ఉరుకులు పరుగులతో, యుద్ధ క్షేత్రంలో బందీలైనట్టుంది.ఏం చేసినా ఇంతమంది ప్రజల్ని నిలువరించడం కష్టం. అనివార్యంగా అనుమతించక తప్పదనిపించిం ది. అందుకోసం అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. మాబోటి వాళ్ళంతా జమై శాంతియుతంగా ఇందిరాపార్క్ దారికి, అడ్డంగా వేసిన ఇనుప కంచెల్ని, బారికేడ్లను తోసేసి వెళ్లొచ్చన్న సంకల్పంతో నడుస్తున్నం. జనం జై తెలంగాణ అంటూ కదలివస్తున్నారు. చూ స్తుంటే ఇక మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదనిపించింది.ఎట్టకేలకు ఉద్యమకారులు గుంపులు గుంపు లుగా ఇందిరాపార్కుకు, అసెంబ్లీకి చేరుకున్నారు. ఉద్యమకారులను నిలువరించేందుకు పోలీసులను మొహరించిన ప్రభుత్వం తనకు తెలియకుండానే ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేసింది. ఉద్యమ కారులను నిలువరించి గెలుద్దామనుకున్న ప్రభుత్వం దారుణంగా ఓడిపోయింది.

- కె ప్రభాకర్, టీటీఎఫ్ కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య