కలం కవాతుకు కదులుదాం


Thu,November 1, 2012 05:58 PM

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం ది. తెలంగాణ నేతలంతా పోరాటాల పొక్కిలిలో కదం తొక్కుతున్నారు. ఈ సమయంలో ఇక్కడి మట్టిరేణువులు సైతం తెలంగాణ కోసం పోరు గీతం ఆలపిస్తాయని, ఆకాశం నుంచి ఆకాశంలోకి వెళ్లిన ప్రధాని పర్యటన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలంగాణ జర్నలిస్టుల కలం వేట్లకు ఎక్కడ గురికావాల్సి వస్తుం దోన ని, ప్రపంచ దేశాలకు ఇక్కడ తెలంగాణ గోస వినిపిస్తారేమోనని ఈ ప్రాంత మీడియాను జీవవైవిధ్య సదస్సులోకి అనుమతించలేదు. ఇది అప్రజాస్వామికమే కాదు, మొత్తం ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభమైన ‘మీడియా’కు అవమానకరం.
తెలంగాణ ప్రజల కన్నీటి గాథల్ని తమ కలాల్లో సిరాగా నింపుకొని రక్తాక్షరాలతో జనం మెదళ్లను కదిలిస్తున్న చారివూతక కర్తవ్యాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ కలం ధీరుల సాహసం అనన్యమైంది. ‘పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై పేలుతాం’ అన్న స్ఫూర్తితో దేశ ప్రధాని ప్రసంగాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు వినిపించడానికి, ఇక్కడ జరుగుతున్న జీవవైవిధ్య సదస్సులో అంతరించిపోతున్న ఈ ప్రాంత జనజీవనం, వనరుల విధ్వంసం, ప్రజల ఆకాంక్షను వెలుబుచ్చే ప్రశ్నలతో పాటు డిసెంబర్ 9న పార్లమెంటు సాక్షిగా‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ’ ప్రారంభమవుతుందని ప్రకటించిన మాట గురించి నిలదీయడానికి సిద్ధమైన తెలంగాణ మీడియాను లోనికి వెళ్లకుండా నిరాకరించగలిగింది. కానీ వాళ్లు అడగాల్సిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక దేశ ప్రధానిని తప్పించగలిగిన సీమాంధ్ర సర్కార్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై పత్రికా స్వేచ్ఛపై దాడి చేసింది.

ఇది రాజకీయ నాయకులు తలదించుకోవాల్సిన సందర్భం. వారు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నది కాదు.. వారి అభివూపాయాలేవైనా స్వేచ్ఛగా ప్రకటించుకునే, ప్రచారం చేసుకునే అవకాశం కల్పించడంలోనే ప్రజాస్వామ్యం వెళ్లివిరస్తుంది. ఈ స్ఫూర్తిని దేశ ప్రధాని సమక్షంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో నిరాకరించడం అన్యాయం. ప్రభుత్వ చర్యను ఖండించి, నిలదీయాల్సిన తోటి మీడియా సహజ సిద్ధంగానే శ్రీకృష్ణకమిటీ రహస్య నివేదికకకు అనుగుణంగా స్పందించకపోవడం దురదృష్టకరం.
ఇది తెలంగాణ జర్నలిస్టులకో, ఈ ప్రాంత ప్రజలకో జరిగిన ఆకాంక్షకో జరిగిన అవమానం కాదు. ప్రశ్నించే గొంతుల్ని నులిమేసి.. తమవంతపాడే పత్రికా ‘మేనేజ్’ మెంట్లకు నాలుగు ప్రకటనల మెతుకులు విదిల్చే కుటిల నీతితో ఓ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని పాతిపెట్టే ప్రయత్నం క్షమించరానిది. తమకు తాము తెలంగాణ జర్నలిస్టులు ఈ అవమా న్ని, అప్రజాస్వామిక వైఖరిని భుజానికెత్తుకుని ఎలుగెత్తిచాటడానికి నిర్వహిస్తున్న తెలంగాణ జర్నలిస్టుల ‘కలం కవాతు’ అభినందనీ యం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను, పత్రికా విలువలు, ప్రజాస్వామిక హక్కుకై కదం తొక్క డం చారివూతాత్మకమైనది. ‘అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక ’ అన్న బైరన్ స్ఫూర్తితో మొత్తం సమాజమంతా కలం వీరుల కవాతుకు మద్దతు పలకాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, అమరుల స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం శ్రమిస్తున్న ‘కలం యోధుల’కు వందనాలు. కలం కవాతుకు తెలంగాణ టీచర్ల పక్షాన సంపూర్ణ సంఘీభావం ప్రకటిన్తున్నాం. కలం యోధులకు అండగా నిలుద్దాం.

-కె.ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య

Featured Articles