జయశంకర్ సార్ బాటలో..


Sat,October 6, 2012 04:32 PM

Jayashankar2ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రయత్నాలు ఆనందంతో పాటు ఆవేదనను కలిగిస్తున్నవి. జీవితమంతా తెలంగాణ సమాజంకోసం పరితపించిన మహనీయుడు ఆయన. ప్రాథమిక ఉపాధ్యాయుడి స్థాయి నుంచి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ వరకూ ఎదిగి, ప్రజల్లో ఒకడిగా ఒదిగి సామాన్య కార్యకర్తగా తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ ఆదర్శవూపాయుడు. ప్రాంతీయ అసమనాతల వల్ల ప్రజలు కోల్పోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక,సాంస్కృతిక అంశాల్లోని వివక్షను ఎలుగెత్తి చాటిన జయశంకర్ సార్ జయంతిని తెలంగాణ ‘టీచర్స్ డే’ గా ప్రకటించుకోవడం సరియైనదే. కాకుంటే.. తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డుపడ్డ వలస పాలకలను ‘టీచర్స్ డే’ ప్రకటించమని ప్రాధేయపడడం కంటే.. ఆయన అకుంఠిత దీక్షను తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం అనునిత్యం పోరాడిన సార్ ఆశ య సాధనకు ఉపాధ్యాయులుగా, ఉద్యమకారులుగా, సంస్థలుగా ఆయన జయంతినైనా, వర్ధంతినైనా వివిధరంగాల సంక్షోభాన్ని సమీక్షించుకుంటూ ఆయా రంగాల్లో ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించడానికి ఒక పోరాట దినోత్సవంగా జరుపుకోవటం ఇవ్వాల్టి అవసరం.

జయశంకర్ సార్ కలలు కన్న రేపటి తెలంగణలో ఆయన జయంతిని తెలంగాణ ‘టీచర్స్-డే’గా ప్రకటించుకోవడం, ఆయన వర్ధంతి జూన్ 20ని తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చుకునే ‘పోరాట దినం’గా స్ఫూర్తి సభల్ని నిర్వహించుకోవటం ఉద్యమశక్తుల ఆవశ్యకతగా మార్చుకోవాలి. ఆయన ఆశయాల సాధనకోసం తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చెయ్యాల్సిన కృషి ఇంత మాత్రమే కాదని మొదటగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. జయశంకర్‌సార్ కలలు గన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంతటి సుదూర స్వప్నమో చూస్తున్నాం. అది కేవలం గీతలు గీసుకుని వేరుపడే భౌగోళిక తెలంగాణ ఏర్పాటు కాదు. అది పదిశాతం విజయమేనని, మిగిలిన తొంభైశాతం విజయం ఉద్యమ శక్తుల తదనంతర కృషి వల్లనే బంగారు తెలంగాణగా మారుతుందని ఆయన చెప్పిన అంశాల్ని అందరమూ గుర్తించాల్సి ఉన్నది.

ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా, తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ-చర్చ) చైర్మన్ వేదకుమార్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంకాలం తెలంగాణకు సంబంధించిన వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ,సాంస్కృతిక అంశాల్లో జరుపుతున్న చర్చల్లో భాగంగా తెంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల కర్తవ్యాలు-భవిష్యత్ కార్యాచరణ గూర్చి చర్చను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. ఆయా సంఘాలు సహాయ నిరాకరణ , సకల జనుల సమ్మెలో నిర్వర్తించిన పాత్రతో పాటు, ఇవ్వాల్టి స్థితినుంచి ఉపాధ్యాయులు, సంఘాలు నిర్వర్తించాల్సిన కర్తవ్యాల గురించి ఆలోచించుకోవాలి.
ఈ సందర్భంలో అనేక ఉపాధ్యాయ సంఘాలు అనివార్యంగా జయశంకర్ సార్‌ను స్మరించడం యాధృచ్చిమేమి కాదు. కాకుంటే 1952నాటి నాన్ ముల్కీ ఉద్యమం మొదలు నిన్న జరిగిన టీఎన్జీవోనేత స్వామిగౌడ్ అభినందన సభ వరకు సాగిన సుధీర్ఘ ప్రయాణంలో జయశంకర్ సార్ కృషిని గుర్తించవలసి ఉన్నది.

జీవితమంతా తెలంగాణ కోసం ఉద్యమ వ్యాప్తిని, భావజాల ప్రచారాన్ని , రాజకీయ ప్రక్రియను నిరంతరం కొనసాగించిన ఆయన స్ఫూర్తి వ్యక్తిగత స్వలాభాల కోసం వేదికగా మారడమే ఇవ్వాళ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ఆటంకంగా మారిందని గుర్తించాల్సి ఉన్నది. నలభై రెండు రోజుల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల చారివూతాత్మక పోరాటానికి జీవం పోసిన జయశంకర్ సార్ ఆలోచనా విధానం ఆయన కళ్లారా చూడాలనుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించకుండానే కనుమూయడం ఓ బాధాకరమైన సందర్భం. తెలంగాణ వస్తుందన్న అచంచల విశ్వాసంతో కన్ను మూసిన జయశంకర్‌సార్ స్ఫూర్తి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై ‘మాతెలంగాణ మాగ్గావాలె’ అని గొంతెత్తి అరిచినా ఏకం కావాల్సిన రాజకీయ పార్టీల అనైక్యతా, అవకాశవాద విధానాల వల్ల తెలంగాణ వస్తుందన్న సంకేతాలు రోజు రోజుకూ దూరమవుతున్న సందర్భంలో ఇవ్వాళ మనం నిలబడి ఉన్నాం. తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపై నిలబెట్టి కలబడిన జేఏసీ తదితర పోరాట సంస్థలు ఏకం కావాల్సే ఉంది. పోరాటాల్ని ఎన్నికలు, ఓట్లు ,సీట్ల చుట్టూ తిప్పడం కాదు.

2014 జమిలిగా సాగాల్సిన ఉద్యమంతోనే రాజకీయ ప్రక్నియను వేగవంతం చేయగలం అన్న ఆలోచనా విధానాన్ని అన్ని సంస్థలు స్వీకరించాల్సి ఉన్నది. తెలంగాణ ఏర్పాటుతోనే సకల సమస్యలు పరిష్కారమవుతాయన్న దాటవేత వైఖరితో తెలంగాణ ఎదుర్కొటున్న సకల సంక్షోభాల్ని కన్నెత్తి చూడకపోవడం జయశంకర్‌సార్ స్ఫూర్తికి విరుద్ధం.

అట్లా ఇవ్వాళ కోల్పోయిన మెడికల్ సీట్లు, తరలిపోతున్న సాగర్ నీళ్లు, బొగ్గు, విద్యుత్తు, విద్య, వైద్య రంగాల్లో మొత్తం తెలంగాణను దోచుకుంటున్న సీమాంధ్ర వలస దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా తెలంగాణ పరిరక్షణ సాధ్యం కాదు. ఆ కోవలోనే తెలంగాణ విద్యారం గం వలసాంధ్ర కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కకుందనడానికి, హైదరాబాద్ నగరంలో ఇంటర్ విద్య లో తిష్టవేసిన కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం ప్రభుత్వ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసింది. ప్రభుత్వ పాఠశాల విద్య, ఆంగ్ల, ఆంధ్ర ఆధిపత్యవిధానాలతో కూనారిల్లుతున్నది.

కామన్ స్కూల్ విధానంలో అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం, ఉపాధ్యాయ సంఘాల కృషి కొనసాగాల్సిన అవసరం ఉందన్నసారు ఆశయం కోసం సంఘాలు ప్రయత్నించవలసిన కర్తవ్యాన్ని స్వీకరించాల్సి ఉన్నది. ఎట్లాంటి పదవులమీద, వ్యక్తిగత సంపాదన , హోదాల కోసం కాకుండా తెలంగాణే ఏకైక లక్ష్యంగా సాగిన జయశంకర్‌సార్ స్ఫూర్తి అన్ని ఉపాధ్యాయ సంఘాలకు, నాయకులకు ఆదర్శమైతే తప్ప ఉద్యమమైనా, విద్యారంగమైనా కాపాడుకోవడం కష్టమని స్పష్టమవుతున్నది. జయశంకర్‌సార్ చూపిన బాటలో భావజాల వ్యాప్తి, ఉద్యమశక్తి రాజకీయయుక్తి ప్రక్రియల్లో పోరాటాల నడవాల్సి ఉన్నది. ప్రజాకాంక్షను నెరవేర్చడానికి పదవులకోసం కాకుండా ప్రజలకోసం భేషజాలను వదిలి ముందుకు సాగవలసి ఉన్నది. కన్నీళ్లతో కాకుండా కార్యదీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు సకల రంగాల సంరక్షణకు రాజకీయ విద్రోహాలకు వ్యతిరేకంగా ఒక్కటై నిలబడి కలబడాలి. అన్నిరంగాల్లో ఆయన ఆకాంక్షల్ని రేపటి తెలంగాణలో నెరవేర్చుకోవాలి. ఆయన ఆలోచనలకు పదును పెట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇది అందరి కర్తవ్యం కావాలి.

-కె. ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య