ర్యాంకుల రాట్నం


Sat,October 6, 2012 04:33 PM

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గద్గద స్వరంతో ఏడుస్తున్నట్టు తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదు పు చేసుకుంటూ అసలు విషయం చెప్పాడు. ఎంసెట్‌లో తప్పక ర్యాంకు వస్తుందన్న తన కుమారునికి తొంభై మార్కులే రావడంతో ఇక మెడికల్ సీటు రాదు.దీంతో.. భార్యా పిల్లలు శోకసమువూదంలో మునిగిపోయారన్నాడు. దీంతో కొంత ఆందోళనతోపాటు, విద్యారంగం గురించి అనేకచోట్ల మాట్లాడుతున్న, రాస్తున్న ఉపాధ్యాయ సంఘం కార్యకర్తగా షాక్‌కు గురయ్యాను. ఈ ఆందోళన ఒక్క బాలయ్య సార్‌ది కాదు. మొత్తం తెలంగాణ సమాజమంతా ఆ మాట కొస్తే భారత సమాజమే ఇలా తయారైం ది. ‘విద్య’ అంటే కేవలం ఐఐటీలు, సాఫ్ట్‌వేర్‌లు, మెడికల్ సీట్లు, అమెరికన్ డాలర్లు తప్ప మరొకటి కాదన్నట్లుగా తయారైంది. ఎంసెట్‌లు, ఐఐటీలు, అంతర్జాతీయ ఉద్యోగాలే జీవితమన్న భావజాలం విస్తృతంగా ఆవరించి ఉన్న సమాజమిది. ఓ ఉపాధ్యా య సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఓ విషాదసంఘటన తెలిసింది. కుటుంబం లో ఇద్దరు టీచర్లు. వారి పిల్లలు అత్యంత ప్రతిభతో తప్పక ఐఐటి వస్తుందని ప్రచారం జరిగింది.చివరికి కొద్ది మార్కుల వ్యత్యాసంతో ఐఐటీ సీటు రాకపోవడంతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక టీచర్ తన కొడుకుకు ఐఐటీ రాలేదని ఆత్మహత్య చేసుకునే దుస్థితి నేటి విద్యారంగంలో కొనసాగుతున్నది. ఇవాళ అనేక కుటుంబాలు ఆరో తరగతి నుంచే పిల్లలకు ఐఐటీ కోచింగ్ కోసం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. రోజూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దకాలం ముందు తరగతి గదిలో పిల్లల్ని నువ్వేమౌతావంటే..రకరకాల వృత్తులు, ఉద్యోగాల గురించి తమ ఇష్టమైన రంగాల గురించి చెప్పేవాళ్లు. కాని ఇవ్వాళ పిల్లంతా చెప్పే సమాధానం ఒకటే. సాఫ్ట్‌వేర్, ఐఐటీ, మెడిసిన్ తదితర కోర్సులు తప్ప మరే ఇతర చదువు ల గురించి చెప్పడంలేదు. జీవితాశయాలు, ఆకాంక్షల గురించి చెప్పే పరిస్థితి లేదు.

గోరటి వెంకన్న పాటలో రాసినట్టు ‘వవ్వారె మావోనికి వచ్చిందట ఓ కల/ ఐఐటీ కొట్టినట్టు అమెరికాకు పోయినట్టు’అన్నది అందరి ప్రయాస అయింది. అందరి కలలు ‘డాలర్’ కలలైనవి కనుకనే ఇప్పుడు ఇష్టమున్నా లేకు న్నా, లెక్కలొచ్చినా, రాకున్నా చదువంటే ఐఐ టీ, ఎంసెట్‌లే. ప్రస్తుతం ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు ఇంటర్‌కే పరిమి తం కాకుండా కార్పొరేట్ స్కూళ్లు, టెక్నో స్కూళ్లు వచ్చి దీనిని ఆరో తరగతి వరకు తీసుకొచ్చాయి. భవిష్యత్తులో ఒకటో తరగతి నుంచే ఐఐటీ అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒక్కొక్క కార్పొరేట్ కాలేజీకి హైదరాబాద్ చుట్టూ వందల బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచీలు ఐఐటీ, ఎంసెట్ తదితర కోర్సుల పేరిట కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇంటర్ ఇంటెన్సివ్ కోచింగ్ పేరిట రెండు లక్షల వరకు వసూలు చేస్తున్న కాలేజీల యాజమాన్యాలున్నాయి. ఒక్క మెరుగైన బ్యాచ్ విద్యార్థుల ర్యాంకులను మాత్రమే పత్రికల్లో ప్రచారం చేస్తూ పిల్లల తల్లిదంవూడుల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి. ఇన్ని బాధలు పడినా చివరికి ఏదో ర్యాంకుతో, పోయిన డబ్బు, నెరవేరని ఐఐటీ కలతో నీరు కారిపోతున్నారు. తరువాత ఇక ఇంజనీరింగ్ టాప్ టెన్‌లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల కోసం వేట ప్రారంభిస్తున్నారు. హైదరాబా ద్ చుట్టూ ఉన్న వందల ఎకరాల భూములను ఆక్రమించి ఉన్న ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్‌మెంట్, ఎన్నారై కోటాల పేరుతో లక్షల రూపాయలు కొల్లగొట్టిడానికి ఎప్పడూ సిద్ధంగా ఉంటున్నవి. దీంతో లక్షలపోసి మేనేజ్‌మెంట్ కోటాలో సీటు కొనలేక, ఏదో ఒక కాలేజీలో చేరి విద్యా ప్రమాణాలులేని ఇంజనీరింగ్ చదువు లు చదివి ఎటూ పనికిరానివారుగా తయారవుతున్నారు.
సుమారు ఇరవై వేల మందికి ఒక డాక్టర్, సీమాంధ్ర ప్రాంతంలో నియమించబడి ఉంటే, తెలంగాణలో అరవై వేల మందికి కూడా ఒక డాక్టర్ నియామకం కాలేని స్థితి. ఇక్కడ గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలు ఉంటే.. ఆంధ్రలో పదికి పైగా కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఎక్కువమంది, ఇక్కడ తక్కువ మంది విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉన్నది. ఈ వివక్ష ఎప్పటినుంచో కొనసాగుతున్నది. ఉస్మానియా , కాకతీయ, గాంధీ కళాశాలలోనూ వైద్యశాలలను కేవలం ఆరోగ్యశ్రీ కి వెచ్చించే ఖర్చుతో ప్రజలందరికీ ఉచితంగా వైద్యం, విద్య అవకాశం ఉన్నా ప్రభుత్వం నిరాకరిస్తున్నది.

నల్లగొండ జిల్లాలో నిర్మాణమవుతున్న ‘నిమ్స్’ను తెలంగాణ వైద్య విశ్వవిద్యాలయంగా మార్చడం ద్వారా మరిన్ని సీట్లు లభిస్తాయి. జిల్లాకో మెడికల్ కాలేజీని ప్రభుత్వం నెలకొల్పినట్టు అవుతుంది. దీని ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీల, హాస్పిటళ్ల దోపిడీని అరికట్టవచ్చు. కాని ఇట్లాంటి ఆలోచన సీమాంధ్ర ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వ రంగంలో ఇంటర్ విద్యను ఇంజనీరింగ్ విద్యను బలోపేతం చేయడం ద్వారా సీమాంధ్ర ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టడంతోపాటు, మెరుగైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశాలు ఉన్నవి. కేవలం రెండు కోర్సుల గురించే కాకుండా ఇవ్వాళ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో సూదివేయగల నర్సులు, కంపౌండర్ కూడా లేని దుస్థితి కొనసాగుతున్నది. వ్యవసాయరంగంలో పనిచేయగలిగిన ఇతర సోషల్ సామాజిక శాస్త్రాల పట్ల గత పాలకులు అనుసరించిన విధానాల వల్ల మొత్తం విద్యారంగం, సమాజం సంక్షోభంలోకి నెట్టివేయబడింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ‘విద్య’ నుంచి తప్పుకోవడం ద్వారా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును ఆయోదించడం ద్వారా అసలు ‘విద్య’ చదువుకొన’ గలిగిన వాళ్ళకే అందబోతున్నది .

విద్యాహక్కులో భాగంగా కేవలం ఎనిమిది తరగతి వరకే (6-14) మా బాధ్యత అంటూ స్వయంగా కపిల్‌సిబల్ చేతుపూత్తేయడం ద్వారా మాములు విద్యతో ప్రభు త్వం చెప్పే ‘కనీస స్థాయి’కి సంబంధించిన విద్య కూడా పేద పిల్లలకు అందకుండా పోతున్నది. డబ్బున్న ధనిక వర్గాలకు ‘మూడవ తరగతికి మూడు లక్షలు చెల్లించే ఆర్కి డ్స్’ లాంటి జూబ్లీహిల్స్ పాఠశాలలు ఒకవైపు, మంచినీళ్లు మరుగుదొడ్లు లేని మధ్యాహ్నపు పురుగుల భోజనం కోసం బడికొచ్చే పేదపిల్లల విద్య ఇంకొకవైపు కొనసాగినం త కాలం, సమాన విద్యావకాశాలు ఉండవు. ఈ వివక్షను అంతం చేయకుండా విద్యారంగాన్నిపజాస్వామీకరించలేము.

-కె. ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య