సమైక్యవాదం అర్థంలేనిది


Fri,August 2, 2013 11:34 PM


సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను డిమాండ్ చేస్తున్నవారుగానీ సమైక్యాంధ్ర అవసరం ఏమిటనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలు గా ఉద్యమాలు చేసినం. మావి కృత్రిమమైన ఉద్యమాలు కావు. అర్థం పర్థం లేని డిమాండ్ సీమాంవూధవాదులది. మీ రాష్ట్రం మీకు ఏర్పడితే జరిగే ప్రయోజనాలేమిటో కూడా మీకు తెలియదు. తెలంగాణకు బోలె డు వనరులున్నాయి. మొత్తం రాష్ట్రానికే కాదు దక్షిణ భారత దేశానికి, అటు ఢిల్లీ దాకా పలు విద్యుత్ ప్లాంట్లతో సహా 4500 పరిక్షిశమలకు అందించే బొగ్గు మాది. రాష్ట్రానికి సంవత్సరానికి 3 వేల కోట్ల దాకా, కేంద్రానికి 3 వేల కోట్ల దాకా డివిడెంట్లు, పన్నులు, రాయల్టీలు ఇస్తున్నది తెలంగాణ. అంతెందుకు దక్షిణ మధ్య రైల్వేకు ఏటా 10 వేల కోట్ల దాకా ఆదాయం వస్తే అందులో నాలుగు వేల కోట్లు తెలంగాణలోని సింగరేణి సంస్థ ద్వారా వచ్చే ఆదాయమే. నీళ్ళ కేటాయింపులో, పరిక్షిశమల ఏర్పాటులో అన్యాయమే. ఈ అన్యాయాలు 60 ఏండ్లుగా సహి స్తూ వస్తున్నాం. ఇగ సహించుడు మాతో కాదు. ఇగ మేము ఈ బాధను భరించలేం. 1969లో 369 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. ఇప్పుడు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసిండ్రు. ఇంకేం కావాలి. కానీ కేంద్రం తెలంగాణను ఇవ్వడానికి సిద్ధమవుతుందనగానే, సీమాంవూధలో సమైక్యాంధ్ర నినాదం మొదలవుతుంది.

సమైక్యాంవూధను ఎందుకు కోరుకుంటున్నారో అక్కడి రాజకీయ నాయకులు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరముంది. విభజన వల్ల మీకు జరిగే నష్టమేంటి? మా రాయలసీమ, మాది రాయల రక్తం అని మాట్లా డే రాయలసీమ నాయకులు నిజానికి ఎప్పుడూ ఫాక్షన్ గొడవలతోనే తమ రాజకీయ ఆధిపత్యం తోనే 60 ఏండ్లు గడిపేసిండ్రు. ఒక్కసారి అక్కడి ప్రజల గురించి పట్టించుకున్నది, అక్కడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసింది ఏమైనా ఉందా..? అక్కడి ప్రజలు వారిని ప్రశ్నించాలి. రాయల తెలంగాణను కాంగ్రెస్ ఇస్తుందని, ఆ ఆలోచన ఉందని వార్తలు వచ్చాయి. అది నిజం కాదని తేలిపోయింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఆంధ్ర సంగతే తీసుకుందాం. అక్కడి అభివృద్ది సగం తెలంగాణ వనరులతోనే జరిగింది. ఇక్కడి బొగ్గు తోనే అక్కడి విద్యుత్ ప్లాంట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలలోనైనా ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలలోనైనా 610 జీవో ప్రకారం ఉద్యోగాలు న్యాయంగా ఇచ్చిన దాఖలాలు ఎక్కడై నా ఉన్నాయా. ఈ అన్యాయాన్ని మేమెందుకు భరించాలి. మేమేమైనా ఆంధ్రా గోబ్యాక్, సీమాంధ్ర గోబ్యాక్ అంటున్నామా. సీమాంధ్ర వారికి రక్షణ లేని కార్యకలాపాలనేమైనా చేపడుతున్నామా. రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పడే ప్రయోజనాలను ఇక్కడ తెలంగాణ ప్రజలు పొందడమే కాకుండా అటు సీమాంధ్ర ప్రజలు కూడా విభజన ఫలితం గా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం సీమాంధ్ర నాయకులు అక్కడి ప్రజలను పావులుగా వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈసారి వమ్ము అయిపోతాయని ఆ ప్రాంత ప్రజలే చెప్తున్నారు.

ఎన్నోసార్లు రాష్ట్రంలో వరదలు వచ్చిన సందర్భంలో జాతీయ విపత్తుగా గుర్తించినప్పుడు తెలంగాణలోని సింగరేణి సహా ఎన్నో సంస్థల ఉద్యోగులు, ప్రజలు కోట్ల రూపాయల సహాయాన్ని సీమాంధ్ర ప్రజలకు అందించిన విషయాన్ని ఎప్పటికీ అక్కడి ప్రజలు మరిచిపోరు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ విషయాలను మరిచిపోతున్నారు. అసలు ప్రజలలో ఆలోచనే లేని సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. సీమాంవూధలోని కొంతమంది పిడికెడు నాయకుల కల్లబొల్లి మాటలకు అక్కడి ప్రజలు మభ్యపడడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ అయినా, యూపీఏ అయినా వెంటనే తెలంగాణ విషయంలో నిర్ణయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయాన్ని ఆలస్యంగానైతేనేమి తీసుకున్నారు. ఇక పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి ప్రయోజనాలు వారికి రాజకీయ పార్టీలకు సంబంధించి ఉండవచ్చు. కానీ ప్రజలకు తెలంగాణ ఏర్పాటు వల్ల కొంత సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ ప్రాంత వనరులు సంపూర్ణంగా వినియోగంలోకి వస్తాయని గతంలో ఇదే ప్రభుత్వాలు, ఇదే పాలకులు ప్రకటించిన ప్రణాళికలను అమలు చేయవచ్చని, తద్వారా ఈ ప్రాంతంలో కొత్తగా లక్షలా ది ఉద్యోగాలను తీసుకుని రావచ్చని అన్నారు. ఉపాధి అవకాశాలతోపాటు కనీసం ఒక్కపూట కడుపునిండా భోజనం తినలేని పరిస్థితుల్లో ఉన్న ఏజెన్సీలలోని గిరిపువూతుల జీవితాలలో వెలుగు వస్తుందని తెలంగాణవూపజలు భావిస్తున్నారు. తెలంగాణను బొందల గడ్డలుగా మార్చే ఓపెన్‌కాస్టు గనుల స్థానంలో వందలాది భూగర్భ గనులు వస్తాయని తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ కోసం జరిగిన వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలు ఇక్కడ అందరిని ప్రశ్నిస్తున్నాయి. ఆ తల్లిదంవూడులు తెలంగాణ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంవూతితో సహా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితర సీమాంధ్ర నాయకులు మానవత్వం ఉన్న మనుషుల్లా వ్యవహరించాలని, మానవీయ కోణంలో ఈ సమస్యను గుర్తించి తెలంగాణ ఏర్పడడంలో సహకరించాలని కోరుతున్నాను.

-ఎండీ. మునీర్

81

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles