సోనియా జీ..దిల్ సే సోచో


Fri,July 5, 2013 12:43 AM


దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్ నహీ కర్‌సక్తే.. జర సోచో సోనియాజీ :! అప్ బీ జర దిల్‌సే సోచో.. ఔర్ దేదో. ‘తెలంగాణ.. మెదడుతో తక్కువ, గుండెతో ఎక్కువ ఆలోచించే వాడే తెలంగాణ వాడు. అచ్చమైన మట్టి మనుషులం మేము. ఇప్పటికయినా ఇచ్చేయండి మా తెలంగాణ మాకు..’ అని మొత్తం యావత్ తెలంగాణ ఈ రోజు సోనియాగాంధీని కోరుతున్నది. విషయం కోర్ కమిటీలో లేదు, యూపీఏలో లేదు. ఉన్నదంతా సోనియాగాంధీ చేతుల్లోనే.. ఈ విషయం మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున టీ కాంగ్రెస్ నాయకులు పెట్టిన తెలంగాణ సాధన సభలో వెల్లడయిపోయింది. అమ్మపై నమ్మకం మాకుందని ప్రతి ఒక్కరూ చెప్పేశారు.1200 మంది బలిదానాలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఈరోజు సోనియమ్మ ఏం చెబుతుందోనని ఎదురు చూస్తున్నారు.

నాలుగున్నర కోట్ల ప్రజల 60 ఏండ్ల ఆకాంక్ష సాకారం కోసం ప్రతి గడప ఎదురు చూస్తున్నది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ రాకతో ఆయన మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలు, ఆయన మీడియాలో చేసిన ప్రకటనలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.కాంగ్రెస్ 60ఏండ్లుగా చాలాసార్లు తెలంగాణ ఏర్పాటు విషయంలో మోసం చేస్తూనే వచ్చింది. ప్రపంచంలో ఏ ఉద్యమంలో లేని విధంగా తెలంగాణ ఉద్యమం లో బలిదానాలు ముందుకొచ్చాయి. దానికి కారణం కాంగ్రె స్ పార్టీ. తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్‌నేతలు యూపీఏ చైర్మన్ సోని యా గాంధీపై పెట్టుకున్న నమ్మకం ఈసారి వమ్ము అవుతుందా? లేదా నిజమౌతుందా? అనేది రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నట్లు జరగకపోతే ఏం చేయాలని అనుకుంటున్నా రో కాంగ్రెస్ నేతలు ప్రజలకు చెప్పాలి.

గతంలో చాలా సందర్భాలలో, చివరికి ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల శవాలపై ప్రమాణాలు చేసి తెలంగాణ ఇవ్వకపోతే, తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే తాము పదవులను త్యజిస్తామని, తమకు పదవులు ఒక లెక్క కాదని పేర్కొన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమ పార్టీయిన టీఆర్‌ఎస్‌ను తెలంగాణలో ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగడం కో సం కృషి చేస్తున్నది. అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్షికమాలు విజయవంతం కావడానికి మార్గదర్శమైన తెలంగాణ జేఏసీ పట్ల ప్రజల్లో ఎంతో విశ్వసనీయత ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్, తెలంగాణ ఇవ్వడం లేదు కాబట్టి, ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి ఆపార్టీని వదిలేసి ఉద్యమ పార్టీయిన టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీలు జీ వివేకానంద్, మందా జగన్నాథం, మాజీ ఎంపీ కేశవరావు, మాజీ మంత్రి వినోద్, వారి అనుచర వర్గం పట్ల కాంగ్రె స్ నాయకులు మాట్లాడుతున్న తీరు అవమానకరంగా ఉన్నది. తెలంగాణ సాధన కోసం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన వారిని రేపు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ వారికి ఉండే గౌరవం తెలంగాణలోఉంటుంది. వారు ఎవరి ముందు తలదించుకునే విధంగా పరిస్థితి ఉండబోదని ప్రజలు చెబుతున్నారు.

తెలంగాణ విషయంలో ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వక పోతే ఏం చేస్తారో ప్రజలకు వివరించాలి. కోర్ కమిటీ సమావేశం తరువాత తెలంగాణను మీరు ప్రకటిస్తారో, లేక గతంలో మాదిరిగా తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి పూనుకుంటారో ప్రజలకు తేలిపో తుంది. కాబట్టి ప్రజలను ఇంకా అయోమయంలో పడేసి, చీకట్లో ఉంచి ఎన్నికలు గెలవడానికి ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరు కోరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి నాటకాలనింటినీ అర్థం చేసు కోలేని అమాయకులేం కాదు.ఎన్నో మోసాలకు గురైన తెలంగాణ మట్టి బిడ్డలు ఇంకా కాంగ్రెస్‌ని నమ్మడం లేదు. కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేస్తేగాని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ను ఇస్తేగాని ఆ పార్టీ తెలంగాణలో పోయిన నమ్మకాన్ని తిరిగి దక్కించుకునే పరిస్థితి వస్తుంది. ఏదో తెలంగాణ ఇచ్చేస్తామనే పనికిరాని ప్రకటనలు చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. సోనియా గాంధీ ఇప్పటికైనా ఈవాస్తవాలను గమనించాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాలను స్పష్టంగా తమ నాయకురాలితో చెప్పాలి. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండటమే కాకుండా రోడ్ మ్యాప్‌తో సహా ప్రకటన చేసేలా కాంగ్రెస్ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచాలి

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles