అసత్య ప్రచారాలు


Thu,June 20, 2013 03:23 AM

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద్ అంతా మోహరించింది. చీమ చిటుక్కుమన్నా తమకు విషయం తెలిసిపోతుందని, అలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని సీపీ ప్రకటించారు. కనిపిస్తే జైళ్ళో పెట్టేస్తామని జిల్లాల్లో ప్రచారం చేయించారు. అయినా చలో అసెంబ్లీ విజయవంతం అయింది. అసెంబ్లీ వద్ద శాసనసభ్యులు బైఠాయించారు. వినయ్‌భాస్కర్, కావేటి సమ్మయ్యలు ఇద్దరూ అసెంబ్లీ పైకి ఎక్కారు. ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వారు జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముంగిట వరకు చేరుకుని నిరసనలు తెలిపారు. చాలామంది తెలంగాణవాదులు పోలీసుల లాఠీచార్జీకి గురయ్యారు.

ఉద్యమకారులందరినీ పశువులను తోసినట్టు వాహనాలలో తోసి తీసుకెళ్ళారు. తెల్లవారుజామున కిరణ్‌కుమార్‌డ్డి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు అసెంబ్లీకి చేరుకుని తమ ఛాంబర్‌లలో కూర్చున్నారు. పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. బస్సు రూట్లను రద్దు చేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్ళించారు. తమ సొంత పనుల కోసం బయటికి వెళ్ళిన వారిని సైతం పట్టుకెళ్ళారు. ఉపాధి కూలీలనూ బైండోవర్ చేశారు. ఇలా తెలంగాణలోని పది జిల్లాలలో పదిహేను వేల మందికి పైగా బైండోవర్ల పేరుతో దిగ్బంధించారు. దాదాపు లక్షా 50 వేల మందిని పోలీసులు హైదరాబాద్‌కు వెళ్ళకుండా అడ్డుకుని అక్కడక్కడా తాత్కాలిక నిర్బంధానికి గురి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ముళ్ళకంచెలు పెట్టి విద్యార్థుల మీద దాష్టీకం చేశారు.

వారిని కదలనీయకుండా వారిపై బాష్పవాయువు ప్రయోగించారు. ఇది రగులుతున్న తెలంగాణ ఆకాంక్షకు నిదర్శనం కాదా? ఇం త జరిగినా, జరుగుతున్నా దీన్ని మాత్రం కొందరు కుహనా మేధావులు, కొందరు సీమాంధ్ర తొత్తులు ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రభుత్వం మాటను తమ సర్వే మాటగా చిత్రిస్తూ చలో అసెంబ్లీ విఫలమైందన్నారు. ఉద్యమ స్వరూపం తెలియని వారు, ప్రజల ఆకాంక్షల పట్ల గౌరవం లేనివారు అనే మాటలు ఇవి. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని, ప్రజల పట్ల ప్రేమలేని వారి ఆకాంక్షలు తెలియని వ్యక్తు ల రాతలవి. ఉద్యమమంటే భయం లేకుంటే చలో అసెంబ్లీ విఫలమైతదని అనుకుంటే తమ ఏర్పాట్లపై తమకు నమ్మకం ఉంటే తెల్లవారుజామునే ముఖ్యమంత్రి అసెంబ్లీకి ఎందుకు వచ్చినట్టు? రైళ్ళను ఎందుకు రద్దు చేసినట్టు? బస్సులను ఎందుకు రూట్లు మార్చినట్టు?

ఒక లక్ష్యం సాధన కోసం ఎంతమంది అందులో పాల్గొన్నారనేది ముఖ్యం కాదు. ఆ కార్యక్షికమం, ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది ప్రధా నం. చరిత్ర తెలియని వారికి ఉద్యమ సెగ, సురుకు అంటని వారికి ఏం తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలి. 1980 దశకంలో దివంగత మర్రి చెన్నాడ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన పజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నల్లజెండాలను ప్రదర్శించాలని వామపక్షపార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

మంచిర్యాల నుంచి మందమర్రి, బెల్లంపల్లి నుంచి ముఖ్యమంత్రి కాగజ్‌నగర్ బహిరంగసభకు వెళ్లాలి. ఆయన వస్తున్న సందర్భంగా వామపక్షపార్టీల కార్యకర్తలను,నాయకులను ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాం తంలో పెద్ద ఎత్తున పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయి మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఉన్నవారిలో నేను కూడా ఉన్నాను.అంతకుముందే వేసుకున్న వ్యూహం ప్రకారం మందమర్రి మీదుగానే సీఎం వెళ్తారు. అక్కడ వందలాదిమంది వామపక్ష కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో కలిసిపోయి చెన్నాడ్డి అక్కడికి చేరుకోగానే నినాదాలు చేయడం మొదలైంది. ఒకరు జిందాబాద్ అంటే మరొకరు ముర్దాబాద్ అని నినాదాలు మిన్నంటాయి. వాస్తవానికి సీఎం కిందకు దిగి కాంగ్రెస్ వారి సన్మానాన్ని అందుకోవాలి. కానీ ఆయన కిందకు దిగలేదు. నల్లజెండాలు అంతవరదాకా జేబుల్లో పెట్టుకుని ఉన్న వామపక్ష కార్యకర్తలందరూ ఆ జెండాలను సీఎంకు చూపించారు. కోపంతో చెన్నాడ్డి తన కారు కిటికీ నుంచి ఒక కార్యకర్త వద్ద నుంచి నల్లజెండాను లాక్కున్న దృశ్యం కూడా ఉంది.

అనంతరం హుటాహుటిన పోలీసులు మేల్కొని అందరినీ చెదరగొట్టారు. కాగజ్‌నగర్ బహిరంగ సభలో చెన్నాడ్డి మందమపూరిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని నాకు నల్ల జెండాలు చూపెడతారా అని ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులను బొందపెడతానన్నాడు. ఈ విషయం అప్పట్లో పవూతికల్లో ప్రముఖంగా వచ్చింది. వేలాదిమందిని అరెస్టు చేసినంత మాత్రానా చెన్నాడ్డికి నల్లజెండాలు చూపించకుండా వామపక్షాలు ఆగాయా? అక్కడ నల్లజెండాల ప్రదర్శన కార్యక్షికమం విఫమైందని అందామా? నల్లజెండాల కార్యక్షికమం విజయవంతం అయింది. అలాగే ఈనెల 14న జరిగిన చలో అసెంబ్లీ విజయవంతమైంది. ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీదకు ఎక్కి తమ నిరసన తెలపడాన్ని, వారిని మార్షల్స్ ద్వారా కిందకు దింపడాన్ని ఏమంటరు..? తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతూ.. ఉద్యమ నాయకత్వంపై విమర్శలు చేస్తే ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే వారి భ్రమే అవుతుంది.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం