తెలంగాణ బైండోవర్!


Fri,June 14, 2013 12:18 AM


తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు నడుస్తున్నాయి. కేసులు ఎత్తేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఒక కేసు పోతే మరో కేసు పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రతి గడపకు ఒక కేసు అనే విధంగా ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి తయారైం ది. తెలంగాణ బిల్లు కోసం తీర్మాణం చేసి పంపాలని అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీ మిన హా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీఆర్‌ఎస్, సీపీ ఐ, బీజేపీ, న్యూడెమోక్షికసీ పార్టీలు ముందుండి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో పదిజిల్లాల్లో ఇప్పటికే పదిహేను వేలమందిని పోలీసులు బైండోవర్ చేశా రు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై బైండోవరై ఉన్నారు. గతంలోనూ ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా ‘సాగరహారం’ సందర్భంగా 30 వేల మందికి పైగా ఉద్యమకారులను నిర్బంధించి బైండోవర్ చేశారు. అయినా అన్ని అవాంతరాలను అధిగమించి ఉద్యమ కార్యక్షికమాన్ని విజయవంతం చేశా రు. తెలంగాణ బిడ్డలు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిసారీ పోలీసులు అతిగా వ్యవహరించి లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగించడం, కాల్పులు జరపడం ఆనవాయితీగా మారింది. తాజాగా ‘చలో అసెంబ్లీ’కి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రశాంతంగా ర్యాలీ జరుపుతున్న వారిపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జి చేయడం అమానుషం. ఇటు సింగరేణిలో కూడా బొగ్గుగని కార్మికులను బైండోవర్ చేస్తున్నారు.

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సహా వందలాదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి జిల్లాలో ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకుని బైండోవర్ల పేరిట పోలీస్‌స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. దీన్నంతా చోద్యంగా చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్తామని ఆఖరిసారి తేల్చుకుంటామని, తెలంగాణ ఇవ్వకుంటే వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయమని కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. కొందరు మంత్రులు కార్యక్షికమాన్ని ఇందిరాపార్కుకు పరిమితం చేసుకోండి, అనుమతి కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. అవసరం లేని సానుభూతిని ప్రదర్శించే ప్రయ త్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ నుంచి తెలంగాణ మట్టి బిడ్డ ల హృదయాల నుంచి ఎప్పుడో వారిని ‘తడిపార్’ చేసేశారు. సాంఘిక బహిష్కరణ మానసికంగా ఎప్పుడో జరిగింది. ఆ పార్టీతో సహా అందులో కొనసాగుతున్న ప్రతి ఒక్కరినీ ఇక భౌతికంగా బహిష్కరించాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి జానాడ్డి, ఎంపీ మధుయాష్కీ లాంటి వారు ఇప్పటికైనా గుర్తించాలి. వారిని వారు మోసం చేసుకోవడం ఇప్పటికైనా మాని చలో అసెంబ్లీ కార్యక్షికమానికి కలిసి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి కృషిచేయాలి. ఢిల్లీ దర్బార్ మెడలు వంచే విధంగా ఉద్యమంలో ముందుండాలి. ఈ చలో అసెంబ్లీ కార్యక్షికమం ఇంకా కాంగ్రెస్‌పై నమ్మకం పెట్టుకుని తెలంగాణ పాట పాడుతున్న వారందరికీ ఆఖరి పిలుపుగా భావించాలి. తెలంగాణ ఆకాంక్ష ఇప్పటిది కాదు. ఊరికే వచ్చింది కాదు. సీమాంధ్ర పాలకుల జులుంను, వివక్షను ఎదిరిస్తూ ఉద్యమిస్తూ కెరటంలా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప మనుగడ లేదని నిర్ణయించుకుని సాగుతున్న ఉద్యమం ఇది. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించడానికి ఎలాంటి ‘బైండోవర్’ నిర్భంధాలనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి! అందరం ఈ బైండోవర్‌లను ఛేదిద్దాం... తెలంగాణ బిడ్డలదంతా ఒకే మాట, ఒకే బాట అని చాటి చెబుదాం. చలో అసెంబ్లీ ని విజయవంతం చేద్దాం. తెలంగాణ సాధించుకుందాం.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles