మార్గం చూపిన నేతలు


Thu,May 30, 2013 11:34 PM


తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమైన చర్యగా పేర్కొనవచ్చు. పదేండ్ల తర్వాతైనా కాంగ్రెస్ నిజస్వరూపాన్ని వారు గుర్తించినందుకు సంతోషం. తెలంగాణలో 1969లో 369 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ హత్య చేసింది. ఇప్పుడు మలివిడత తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణాలను బలితీసుకున్నది.వేలాది మందిని జైలుపాలు చేసింది. అయినా కాంగ్రెస్ ఇంకా తెలంగాణ ఇస్తుందని ఆ పార్టీకి చెందిన తెలంగాణవాదులమని చెప్పుకునే ప్రజావూపతినిధులు దింపుడు కల్లం ఆశలు పెట్టుకోవద్దు. ఈనెల 30వ తేదీ వరకు తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ పెట్టిన ఎంపీలకు సైతం కొంత ఆశ ఉన్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నో మోసాలు చేసింది. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దగా చేసింది.తెలంగాణ ఆకాంక్షను అణచే ప్రయత్నాలు చేసింది.

2004 ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు, తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ వరుసగా మోసం చేస్తూనే వస్తున్నది. అబద్ధాలు ఆడుతూనే ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చావునోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను వెనక్కు తీసుకున్నది. దీనికి రెండు కండ్ల సిద్ధాంతకర్త టీడీపీ అధినేత చంద్రబాబు అయితేనేమి, వైఎస్సార్ సీపీ నాయకులయితేనేమి అందరు వత్తాసు పలికారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు తెలంగాణకు శత్రువైన సీమాంధ్ర పార్టీలన్నీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశాయి. నాయకులంతా అదే విధంగా పనిచేస్తున్నారు. తెలంగాణ కోసం పార్టీలో ఉండి పోరాడుతున్న తెలం గాణ కాంగ్రెస్ ఎంపీలు వివేకానంద్,జగన్నాథం,రాజయ్య, తదితరులు ఈనెల 30వ తేదీ వరకు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి అనుకూల ప్రకటన చేయని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమేనని ప్రకటించేశారు. ఇలా ప్రకటించిన తెల్లవారే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుసుకొని ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. తిరిగి 30న కేసీఆర్‌తో సమావేశమై జూన్ 2న ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి తుది నిర్ణయం జరిగినట్టే. వారిని చేర్చుకోనున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు.


ఇదే నేపథ్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర సదస్సు నిర్వహించింది. అందులో సీఎం కిరణ్ ,పీసీసీ అధ్యక్షుడు బొత్స తదితరులు హాజరయ్యారు. దీంట్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అనుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో 2014 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా వివేక్, జగన్నాథం, కేశవరావు మినహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇంకా కాంగ్రెస్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నారు. కొందరయితే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని, తమ పదవులను కాపాడుకోవడానికి కంటితుడుపు మాటలతో టైంపాస్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల అభీష్టం, తెలంగాణ బిడ్డల బలిదానాలు వారికి కనబడటంలేదు. తెలంగాణ సమస్య అనేది మెదడుతో కన్నా గుండెతో ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ అర్థమయి కూడా అర్థం కానట్లు ప్రవర్తిస్తున్న ప్రజావూపతినిధులే తెలంగాణ కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉన్నారు. సోనియాగాంధీ ఈ విషయాన్ని ఆలోచించడంలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించడంలేదు. రాహుల్‌గాంధీతో సమావేశమైతేనేమి, దిగ్విజయ్‌సింగ్ మాట ఇస్తేనేమి, మళ్లీ దాటవేస్తేనేమి, గులాం నబీ ఆజాద్ అవహేళన చేస్తేనేమి ఇక్కడి ప్రజలు మాత్రం ఉద్యమాన్ని ఆపేందుకు సిద్ధంగా లేరు.

తెలంగాణ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న వారికి బుద్ది చెబుతారు.ఇక్కడ ఇంకా తెలంగాణవాదులమని చెప్పుకుంటున్న ఎంపీలైనా, మంత్రులైనా,ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందనే దింపుడు కళ్లం ఆశలు పెట్టుకోవద్దని తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన మోసం చాలు. కంటితుడుపు మాటలు, జోల పాటలు ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ఇవ్వని ఆ పార్టీని వదిలేయండి. పదవులు ఇక్కడ ముఖ్యం కాదు, ప్రజల అభిమతం ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకోండి. వివేక్, వినోద్‌లు 60 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన నాయకులు. వారి తండ్రి కాకలుదీరిన కాంగ్రెస్ నాయకుడు జీ వెంకటస్వామి. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారే.88 ఏండ్ల కాక తెలంగాణ వస్తే చూడాలని ఉందని అప్పటిదాకా బతికి ఉంటానని చెప్తూనే ఉంటారు. ఆయన కూడా కాంగ్రెస్ ఇక తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి ఆదర్శవంతమైన నిర్ణయాన్ని ప్రస్తుతం ఆయన తీసుకున్నారు. ఆయన దారిలోనే మరికొందరు వస్తారని ఆశిద్దాం. ఉద్యమించి తెలంగాణను సాధించుకుందాం. టీడీపీలో ఉంటూ బాబు మోచేతి నీళ్లు ఇంకెన్ని రోజులు తాగుతారు.. ఇంకెన్ని రోజులు కల్లబొల్లి మాటలు చెబుతారు. మీరూ వచ్చేయండి. ప్రత్యక్ష్యంగా ఉద్యమం చేద్దాం. ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించుకుందాం. ఆంధ్రా పార్టీలను తెలంగాణలో బొందపెడుదాం.ఆంధ్ర పార్టీలను బొందపెట్టడం ద్వా రా, తెలంగాణ సాధించడం ద్వారా తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చిన బిడ్డల ఆశయాలను సాధించిన వారమవుతాం. అందరూ ఒక్కటై కదనరంగంలో తెలంగాణ సాధించుకునే దిశగా పయనించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించకుంటే బతికున్నా చచ్చినదానికిందే లెక్క.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles