ధనబలమే అర్హతా?


Thu,May 23, 2013 12:46 AM

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న పార్టీలు ఇచ్చిన సం దేశం.. మనదేశం నిండెర బహు దోషం.. టాటా బిర్లా దాల్మియాలకు దాసోహంరా మనదేశం.. అని ఒక కవి చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. డబ్బులుంటే చాలు.., పెట్టుబడి ఉంటే చాలు ..కడుపుల సల్ల కదలకుండా ఏ ఎన్నికలైనా గెలిచేస్తాం..అనే ధీమా రాను రాను దేశంలోని పెట్టుబడిదారుల్లో పాతుకుపోతున్నది. చాలామంది డబ్బులు సంపాదించిన తర్వాత సంఘసేవల పేరిట ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఏ రాజకీయ పార్టీ అయితేనేమి తమకు పదవి కావాలనే పరిస్థితి ప్రస్తుత రాజకీయాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది. టికెట్ ఇచ్చేటోడు మనోడే..గెలిపించేటోడు మనోడే. ఇం కేం కావాలి! ఓడితే ఎక్కడైనా చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న చోట ఓడుతాం. మరోసారి ప్రయత్నిస్తాం.. మరోచోట పోటీ చేస్తాం. అనే విధంగా పరిస్థితి తయారైంది. దేశంలో పెట్టుబడిదారులే ప్రజావూపతినిధులు గా అర్హత సాధిస్తున్నారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థుల్లో 180 మందికిపైగా పెట్టుబడిదారులే అని తేలింది. 90 మందికిపైగా గత ఎన్నికలలో పోటీ చేసిన పాత ఎమ్మెల్యేలే ఈసారి విజయం సాధించారు. గత ఎన్నికల సందర్భంగా వారు చూయించిన ఆస్తులు ఈసారి 135 శాతం పెరిగాయట.

ఇంత పెద్దమొత్తం ఆస్తులు ఎలా పెరిగాయో దీనికి సమాధానం వారే చెప్పాలి. ఎమ్మెల్యేల ఆస్తులు ఏయేటికాయేడు పెరుగుతున్నాయన్నమాట. అందుకేనేమో మనరాష్ట్రంలో సైతం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు 2014 ఎన్నికలలో పెట్టుబడిదారులనే అభ్యర్థులుగా దించడానికి సిద్ధమవుతున్నాయి.అభ్యర్థుల గుణగణాలు, వారి చరిత్ర, వారికి ఉన్న ప్రజా సంబంధాలు ఏమిటి? వారు ప్రజలతో ఎలా ఉంటారు? ప్రజల కోసం త్యాగా లు చేసిన చరిత్ర ఏమైనా ఉన్నదా లాంటివి ఇప్పుడు పార్టీలకు అవసరం లేదు. ఎలక్షన్‌లకు కోట్ల రూపాయలు పెట్టుకుంటారా? ఇతరత్రా ఖర్చులు చూసుకుంటారా? పార్టీకి డొనేషన్ ఎంత ఇస్తారు? ఇలాంటి వారినే అభ్యర్థులుగా కావాలంటున్నాయి రాజకీయ పార్టీలు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కాస్త ఆర్థికంగా గట్టిపడ్డ వారినే తప్ప, ఇతరులను ఈసారి ఎంపిక చేసే పరిస్థితి ఏ రాజకీయపార్టీలోనూ కనిపించడం లేదు.అంతా కొత్త వారిని రంగంలో దించే పరిస్థితి కనబడుతున్నది. తప్పనిసరిగా గతం కన్నా భారీగానే పెట్టుబడిదారులు 2014ఎన్నికలలో దిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో ఇదే ఒరవడి కొనసాగుతున్నది.

కాంగ్రెస్, టీడీపీలలో అయితే పెట్టుబడిదారుల కోసమే వేట కొనసాగుతున్నట్లు ఉన్నది. అంటే దీని అర్థం ఎన్నికలలో ఖర్చు పెట్టండి.. ఎన్నికల అనంత రం ప్రజాధనాన్ని పిండుకోండి. పెట్టుబడిదారులారా అన్ని రంగాలలో మీరే వర్థిల్లండి అనే విధంగా ఉన్నది. సామాన్యులు, నిరుపేదలు ఎవరు ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ పదవి నుంచి మొదలు సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ లాంటి స్థానిక సంస్థల పదవులలో సైతం ఇదే పరిస్థితి. మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు సైతం గ్రామ స్థాయి నాయకులను ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి కనబర్చినప్పుడు మీరు ఎంత పెట్టుకోగలరు? సర్పంచి అయి తే ఇంత, మున్సిపల్ కౌన్సిలర్ అయితే ఇంత ఖర్చు చేసుకునేటట్టు ఉంటేనే నిలబడడండి అనే చర్చ ప్రతీచోట ప్రస్తుతం వినబడుతున్నది. ఇప్పటికే పార్లమెంటులో చూసినా, ఇటు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో చూసి నా పెట్టుబడిదారులదే రాజ్యం.

వారి మాటకే విలువ. రిజర్వేషన్‌లు వచ్చినా వాటికి అనుగుణంగా కేటాయింపులు వచ్చినా అందులోనూ పెట్టుబడిదారులను వెతికే రాజకీయ పార్టీలు ఉన్నంత వరకు డబ్బున్న వాడే ధర్మకర్తగా కొనసాగుతారు అంటే అతిశయోక్తి కాదు. ఓటర్లు సైతం డబ్బును ప్రధానంగా ఖర్చు చేసే అభ్యర్థులనే చూస్తున్నారనేది కర్ణాటకలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి అనుచర వర్గం విజయం సాధించడం చూస్తుంటే స్పష్టమవుతుంది.

తెలంగాణ సాధనలో ముందున్న టీఆర్‌ఎస్ 2009 ఎన్నికలలో చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు లాంటి సామాన్యునికి సైతం టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రజాభీష్టం మేరకు జరగాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్టీలు ఎన్ని కుట్రలకైనా పాల్ప డవచ్చు. కాబట్టి ఈప్రాంత ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles