మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం


Mon,April 29, 2013 12:14 PM


దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు. వాడవాడల్లో, బొగ్గుబావుల్లో శ్రామిక వాడలు మేడే సందర్భంగా ఎర్ర తోరణాలతో అలంకరణలు కనిపిస్తాయి. 125 సంవత్సరాల చరిత్ర గల సింగరేణితో పెనవేసుకుపోయిన జీవితంలో మా చిన్నప్పుడు మేడే ఒక పండుగగా జరిగేది. చికాగో వీరులను గుర్తు చేసుకుంటూ ప్రపంచ కార్మికుల పర్వదినంగా జరుపుకునేవాళ్లం. వాడ వాడలా ఎర్ర జెండాలను ఎగురవేస్తూ మేడే వర్ధిల్లాలి... చికాగో అమర వీరులకు లాల్ సలాం అని నినదిస్తూ..మేడేను జరుపుకునే వాళ్లం. సింగరేణిలోని ప్రతి కార్మిక వాడలోనూ ఆ రోజు ఎర్ర జెండా కనబడాల్సిందే. పార్టీలకు అతీతంగా అలాయ్ బలాయ్‌లతో మేడే జెండా రెపపలాడేది. హిందూ, ముస్లీం, సిక్కూ ఇసాయి ఈ మతం, ఆ మతం అంటూ తేడా లేకుండా కార్మికులంతా కలిసిపోయి ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ మేడే.

కార్మిక వాడలలో సాయంత్రం పూట మీటింగ్ లు జరుగుతాయి. నాయకులు వచ్చి మేడే గురించి వివరిస్తారు. కళాకారులు ఆట, పాటలతో అలరిస్తా రు. మేం పెరిగి పెద్దవాళ్లమవుతున్న క్రమంలో మేడే మాలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనల ను, కొత్త ఆశయాలను, ఆశలను కలిగించింది. మేడే ఎర్రజెండా ఎగరేసి మొక్కుబడిగా జరిగే పండుగ కాదని, ఒక ఆశయ సాధనకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చే వజ్రాయుధమని అర్థంమైంది. మేం యువకులుగా ఎదిగే నాటికి కోల్‌బెల్ట్ చుట్టూ అన్యాయపు చీకట్లు కమ్ముకొని ఉన్నాయి. బొగ్గు బాయి లో కార్మికుల దారుణ శ్రమదోపిడీ నిజాం ఫ్యూడల్ దొరలను మించిన బాయి దొరల ఇష్టారాజ్యం నెలకొని ఉండేది. ప్రభుత్వ అండదండల తో మాఫియా గుండా రాజ్యం నెలకొని ఉండేది. ఇరుకు మురికి కార్మి క వాడలలో మంచినీళ్లకు కరువుండేది. కానీ సారా కొట్టుకు కరువు లేకుండేది. సారా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, చివరికి ట్రేడ్ యూనియన్ నాయకులకు సొంత గూండాలు ఉండేవారు. ప్రభుత్వ ఉదాసీనత, పోలీసుల అండదండలతో గూండాయిజం పెచ్చరిల్లి కార్మికులను భయవూభాంతులకు గురిచేసేది. స్త్రీల మాన,వూపాణాలకు రక్షణ ఉండేది కాదు. గుండాల అరాచకాలు, హత్యల గురించి వినని రోజుండేది కాదు. అదిగో అటువంటి చీకటి రోజుల్లో మేడే స్ఫూర్తితో ఎగురుతున్న ఎర్ర జెండాలు మాలో కొత్త ఆవేశాన్ని, ఆలోచనలను నింపింది. కార్మికులు సంఘటితం కావడం, సంఘం పెట్టుకోవడమే నేరమైన కాలంలో నిత్య నిర్బంధాల మధ్య శేషగిరి రావు నాయకత్వం లో కార్మికులు రహస్యంగా బర్లిపిట్ మీద ఎర్రజెండా ఎగురవేసి మేడే జరుపుకున్న తొలినాటి రోజుల గురించి పిజ చంద్ తన శేషగిరి నవలలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ విధంగా మేడే రగిల్చిన పోరా ట చైతన్యం సింగరేణిలో తొలి కార్మిక సంఘం ఆవిర్భవానికి దారి తీసింది.ఆ చైతన్యమే భయం భయంగా బతికే బొగ్గు గని కార్మికులను అన్ని రకాల అణచివేతలకు, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడే యోధులను చేసింది. నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గెరిల్లాలుగా మార్చింది. శ్రామికవర్గ చైతన్యాన్ని పాదుకొల్పింది. అనేక హక్కులు సాధించడానికి దోహదపడింది.

కానీ తరువాత కాలంలో వంచన మొదలైంది. దోపిడీ కొత్త రూపుసంతరించుకుంది.వేరు పురుగులా కార్మికుల చైతన్యాన్ని తొలచివేసింది. అసమాన త్యాగాలు వెల్లు చోట పైరవీ కారుల రాజ్యమైం ది. దొడ్డి దారిలో పాత రోజులు పునరావృతమయ్యాయి. మళ్లీ సరి కొత్త ఎర్రజెండా ఒక పోరాట నినాదమై యువతరంలో కొత్త ఆశలను కలిగించింది. గూండాలకు వ్యతిరేకంగా దండు కట్టేలాచేసింది. భూస్వాముల అరాచకాలకు అడ్డుకట్ట వేసింది. నూతన సమాజాన్ని కలలుకంటూ ముందుకు ఉరికే ఒక యువతరాన్ని సమాజానికి అందించింది. నూతన విప్లవ వెల్లువకు నాంది పలికింది. బొగ్గు బావు లు అగ్నికణాలయ్యాయి. ప్రభుత్వ ఫాసిస్టు హత్యాకాండలో పదుల సంఖ్యలో పోరాట యోధులు బలైపోయారు. అమరుల రక్తంతో నల్లనేల రక్తసిక్తమయ్యింది. దోపిడీ పీడన లేని ఒక నూతన సమాజాన్ని కలలు కంటూ ముందుకు సాగింది. ఈ భూమి మీద దోపిడీ పీడనలు లేని శాంతియుత సౌభ్రాతృత్వ సమాజాన్ని నిర్మించే వరకు అలుపెరుగని పోరాటం చేయమనే స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది. తెలంగాణలో మన సంపద రక్షించుకోవడం కోసం రాష్ట్ర సాధన అనివార్యమైంది. మన ఉద్యోగాలు మనకు దక్కాలన్నా తెలంగాణ అనివార్యమైంది. మేడే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. మేడే వర్థిల్లాలి! ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి!!

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles