నిర్బంధం నీడలో..


Thu,April 18, 2013 12:16 AM

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లా మందమపూరిలో ఓసీని వ్యతిరేకించే జనం, ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించకుండా 144 సెక్షన్ పెట్టి అరెస్టులు చేసి అడ్డుకోవడాన్ని ఏమనుకోవాలి? సింగరేణిలో భూగర్భ గని విధానం కాకుండా ఓపెన్‌కాస్టు విధానంతో బొగ్గు బావులను తవ్వడాన్ని ఇటీవల వేగవంతం చేశారు. ఇప్పటికే 15 ఓపెన్‌కాస్టు గనులు నడుస్తున్నాయి. రానున్న ఐదేండ్లలో మరో పది, ఈ ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు వరకు ఓపెన్‌కాస్టు గనులు వస్తున్నాయి.

ఓపెన్‌కాస్టు గనుల వల్ల పెద్ద ఎత్తున జీవన విధ్వంసం జరుగుతున్నది. నిరంతరం జరిగే బ్లాస్టింగ్‌ల వల్ల అందులోంచి వెలువడే దు మ్ము, ధూళి 10-15 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రామాలలో పంటలు పండకపోవడం,భూములు ఎక్కడికక్కడ బీళ్లుపడిపోతున్నాయి. చాలామంది అనారోగ్యానికి గురై, రకరకాల రోగాల బారిన పడి చచ్చిపోవడం లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సింగరేణి యాజమాన్యం ఎక్కడ కూడా నిబంధనల ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడంలేదు. దీంతో తెలంగాణలో గ్రామాలు ఎడారుల్లా మారుతున్నాయి. పచ్చటి పొలాలతో గలగల పారే నదులతో, చెరువులతో అలరారిన గ్రామాలన్నీ వల్లకాడులా మారుతున్నాయి.

ఈ విధ్వంసం ఆగాలంటే తెలంగాణ సాధనతోనే సాధ్య మవుతుందని, స్వరాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు ఓసీలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేయ డం, తర్వాత విడుదల చేయడం లేదా కొన్ని చోట్ల కేసులు పెట్టడం జరుగుతున్నది. ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా రాస్తారోకోలు, ధర్నా లు చేస్తున్న ప్రజలను గానీ, నాయకులను గానీ, సంస్థలను గానీ నిర్బంధించిన సందర్భాలు తక్కువే. అయితే మందమర్రి ప్రాం తంలో కేకే 2 మెగా ఓపెన్‌కాస్టును వ్యతిరేకిస్తున్న ఎర్రగుంటపల్లె, మామిడిగూడెం, దుబ్బగూడెం, కాసిపేట, సోమగూడెం లాం టి ప్రాంతాల ప్రజలను ఆందోళనను నిర్వహించకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర ప్రారంభించింది.

ఈ నెల 15న ప్రజలంతా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. వారిని చైతన్యవంతులను చేసి అక్కడివరకు తీసుకెళ్ళడానికి టీపీఎఫ్ లాంటి సంఘాలు సిద్ధమయ్యాయి. ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించడానికి ప్రచార కార్యక్షికమాన్ని నాలుగురోజులపాటు చేపట్టడం జరిగింది. అయితే సింగరేణి యాజమాన్యం, అటు ప్రభుత్వం ధర్నాపై కూడా ఆంక్షలు విధించింది. ధర్నా నిర్వహించకుండా ఒక్కరోజు ముందునుంచే మందమర్రి పట్టణమంతా 144 సెక్షన్ విధించింది. ముందస్తుగా ప్రజాసంఘాల నాయకులను గ్రామ పెద్దలను అరెస్టు చేశారు. దీనికి నిరసనగా నాయకులు దీక్ష చేపట్టారు.

నాయకులను విడుదల చేయాలని దుబ్బగూడెం గ్రామస్థులు రాస్తారోకోకు దిగారు. ఇటు ఎర్రగుంటపల్లె తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. నాయకులను విడుదల చేసినా యాజమాన్యం, ప్రభు త్వం చర్యలను చూస్తే గనులు ఎలాగైతే సమ్మెల సందర్భంలో పోలీసు లను పెట్టి నడిపిస్తారో అదే పద్ధతిని అవలంబిస్తారనే అనుమానం కలుగుతున్నది. ఆయా గ్రామాల ప్రజలకు సంబంధించిన భూము ల్లో, గ్రామాల్లో బొగ్గుబావులను ఆ గ్రామాల ప్రజల ఆమో దం లేకుండానే రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎలాంటి మానవత్వం లేకుండా పోలీసులను పెట్టి ఓపెన్‌కాస్టు బొగ్గుబావులను తవ్విస్తారా? మందమపూరిలో రానున్న కేకే 2 ఓసీ శ్రీకారం అవుతుం దా? ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున ప్రజలను నిర్బంధించి వారి భూముల్లో, వారి ఊళ్లలో వారి మనోభావాలకు విరుద్ధంగా బొగ్గు బావులను తవ్వడం అన్యాయం. క్షమించరాని తప్పు అనే విష యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందిపజలు ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసనను తెలియజేయకుండా చేయడం వారి గొం తును నొక్కడం సరైంది కాదు. సింగరేణి ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుని న్యాయ పోరాటం చేస్తున్న ప్రజలవైపు నిలబడాల్సిన అవసరం ఉన్నది.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం