కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ


Mon,April 1, 2013 12:39 AM

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ్వకంతో గోదావరి సహా పల్లెలను స్మశాన వాటికలుగా మారుతున్నాయి. గతంలోఎక్కడన్నా బొగ్గుబాయి తవ్వుతున్నారంటే చుట్టు పక్క గ్రా మాల యువతకు ఉద్యోగాల మీద ఆశ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా ఉద్యోగాలలోకి తీసుకోవడం బందయి ఇరువైళ్లయింది. ఓపెన్ కాస్టుల ద్వారా బొగ్గు తవ్వకం విధానం1974 తర్వాత మొదలై తెలంగాణ ప్రాంత పర్యావరణ విధ్వంసం అడ్డూ అదుపులేకుండా చేసింది. జీవన విధ్వంసం ఊహించని స్థాయికి చేరింది. అండర్‌గ్రౌండ్ విధానం ద్వారా మానవ నివాసయోగ్యమైన భూ మి పైపొరకు నష్టం జరగదు. అందుకు భిన్నంగా ఓపెన్‌కాస్టు గనుల తవ్వకాల వల్ల సారవంతమైన భూమిపై పొర తలక్షికిందులు అయి భవిష్యత్తులో ఆప్రాంతం ఇక ఎన్నటికి జీవజాలం నివాసయోగ్యం కాని ఎడారిగా మారిపోతుంది.


ఒక్కచోట ఓపెన్ కాస్టు తవ్వితే చుట్టు పది కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వాగులు, వంకలు దిశలు కోల్పోవడం, ఇంకిపోవడం జరుగుతున్నది. ఓపెన్ కాస్టులు సృష్టించే కృత్రిమ మట్టి దిబ్బలు, బొందలగడ్డలు ఉత్తర తెలంగాణలోని పల్లె వాతావరణ స్వరూపాన్ని మార్చివేశాయి. బొగ్గు నిలువలు ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతంలోని అడవులు, గిరిజన ప్రాంతంలో విస్తరించి ఉండటం వల్ల ఆమేరకు అడవులు నష్టపోవడం, వాటితోపాటు అడవి జంతువులు, అరుదైన వృక్ష జాతులు, పశు పక్షాదులు అంతరించిపోతున్నాయి. ఓపెన్‌కాస్టుల నుంచి వెలువడే దుమ్ము, దూళి, ఇతర ప్రాంతాలకు విస్తరించి పెద్దఎత్తున పంటలకు నష్టం కలుగుతున్నది. శబ ్దకాలుష్యం, వ్యర్థ రసాయనాల వల్ల కలుషితమైన నీటి వనరులు ఎందుకు పనికిరాకుండా పోవడం వంటి పరిణామాల వల్ల బొగ్గు గనుల కింద భూములు కోల్పోతున్న వాళ్లేకాదు, ఓపెన్‌కాస్టు ప్రభావిత గ్రామాల ప్రజల జీవితాలలో విషం చిమ్ముతున్నాయి.

ఈ విధ్వంసం కోల్‌బెల్ట్‌లోని చారివూతక పట్టణాలకు కూడా వ్యాపించింది. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ప్రాంతంలో 21వ ఇంక్లయిన్, ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి కేకే 2 గని, దానితోపాటు ఎస్‌ఎంజీ 3, ఎస్‌ఎంజీ 1, కేకే 2ఏ లాంటి మూతపడ్డ గనులను ఓసీలుగా మార్చడం, రామకృష్ణాపూర్‌లో ఎంకే 4, ఎంకే 4ఏ గనులను ఓసీలుగా మార్చారు. మూతపడ్డ ఆర్కే 1, ఆర్కే 3, ఆర్కే 4 లాంటి గనుల నుంచి కూడా బొగ్గు వెలికితీసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతున్నది. మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి లాంటి పట్టణాలలో ఈ ప్రక్రియ మొదలు కానున్నది. అటు వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రాంతంలో ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారు. గోదావరిఖనిలోని ప్రధానమైన భూగర్భ గనులన్నింటిని ఓసీలుగా మార్పు చేసే పథకాలను రూపొందిస్తున్నారు.

ఓపెన్ కాస్టు గనులు తవ్విన చోట పర్యావరణ పరిరక్షణ కోసం ఆ భూమిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావడానికి అనుసరించే బ్యాక్ ఫిల్లింగ్ లాంటి కార్యక్షికమాలయితే చేపట్టడమే వదిలేశారు. ఇప్పటికే ఓసీల మూలంగా తెలంగాణ ప్రాంతంలో 120కి పైగా గ్రామాలు బొందలగడ్డలుగా మారాయి. 300 ఏండ్ల క్రితం ఏర్పాటైన గ్రామాలు సైతం కనుమరగయ్యాయి. గిరిజన ప్రాంతాలలో ఆశ్రమ పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రభావం పరోక్షంగా వందలాది గ్రామాల మీదపడి అనారోగ్య వాతావరణం ఏర్పడింది. చాలా మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నా వాటిని పట్టించుకున్న వారులేరు.
ఓపెన్ కాస్టుగనుల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయసేకరణ లో అధికారులు ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేదు. ‘ పొమ్మనలేక పొయ్యి పెట్టినట్లు ’ ఆయా ప్రభావిత గ్రామాలలో ఇండ్ల చుట్టు మట్టిని గనుల నుంచి తీసింది తీసినట్లుగానే దిబ్బలుగా పోసి వదిలేస్తున్నారు. దీని తో తప్పని పరిస్థితులలో గ్రామాలు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో తాళ్లపల్లి, దంతన్‌పల్లి లాంటి గ్రామాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. పర్యావరణ పరిరక్షణపై అంకెల గారడిని ప్రదర్శించి తప్పించుకుంటున్న సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఒక స్టేట్‌మెంటు ఇచ్చి ప్రజా వూపతినిధులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కేకే 2 గని వద్ద మందమపూరిలో జరిగిన పబ్లిక్ హియరింగ్ సమయంలో గ్రామాలు ఓసీలో పోతున్న ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ వివేక్ జీరో అవర్‌లో లేవనెత్తి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా ఈ విషయంపై పెద్దగా పట్టింపు లేదు. అక్కడ ఓసీ వద్దని ఆందోళన చేసిన స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదేలును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ పాశం యాదగిరి కూడా కేకే 2 వద్ద జరిగిన పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొన్నారు. ఆయన కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.

90 శాతం బొగ్గు నిలువలు తెలంగాణ ప్రాంతంలోని గిరిజన ప్రాంతంలోనే ఉన్నాయి. గనుల తవ్వకం పేరు మీద నిర్వాసితులవుతున్న వారిలో 80 శాతం గిరిజనులే ఉన్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం జాతీయ, అంతర్జాతీయంగా అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కింద గిరిజనుల రక్షణ కోసం ఉన్న చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసేతరులు ఉండరాదనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. 1/70 చట్టం ప్రకారం గిరిజనుల భూములకు రక్షణ కల్పించే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఆదివాసుల భూములు ఆదివాసేతరులు కొనరాదని, ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టు 1959 సూచించింది.1996 నాటి పంచాయతీ ఎక్స్‌టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా చట్టం ప్రకారం గిరిజన, గిరిజనుల ఆచార వ్యవహారాలు సం స్కృతికి ప్రత్యేకతలను, ఉమ్మ డి వనరులను కాపాడుకునే హక్కు కల్పించింది.

జెనీవా సదస్సు ఆదివాసులు జీవిం చే హక్కును సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించకుండా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ధేశించింది. కాని తెలంగాణ వనరుల దోపిడీ మీద ఉన్న ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజలపై లేని ఆంధ్ర వలస పాలకులు ఈ చట్టాలను అమలు జరపడం లేదు. సింగరేణి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణలోని నాలుగు జిల్లాలకు చెం దిన 60 మండలాల్లో ఇప్పటికే 6.04 లక్షల మంది గిరిజను లు నిర్వాసితులయ్యారు. నష్ట పరిహారం చెల్లింపులో అనేక అన్యాయాలు జరిగాయి. ఇంకా కోర్టులలో కొన్ని కేసులు మూలుగుతూ నే ఉన్నాయి. ఇటీవల గోదావరిఖని ప్రాంతంలో కొన్ని కేసుల ను లోక్ అదాలత్‌లో ప్రస్తుత సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య చొరవతో పరిష్కా రం చేశారు. ఇంకా కొన్ని పరిష్కారం చేయాల్సి ఉన్నది.మానవ విధ్వంసానికి కారణమవుతున్న ఓపెన్ కాస్టు గనిని స్పీకర్ ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయికి వెళ్లి చూడటం రాష్ట్ర చరివూతలో మొదటిసారే అయినప్పటికీ, జీవన విధ్వంసంను ఆపించగలుగుతారా?

ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్గొండ జిల్లాను కూడా కమిటీతో సహా కలిసి స్పీకర్ సందర్శించి పరిశీలించడం జరిగింది. అక్కడ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. సింగరేణి ప్రాంతంలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఓపెన్‌కాస్టు విధానంపై ప్రభు త్వం ప్రజలకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మేరకు స్పీకర్ ఆయన వెంట ఉన్న కమిటీ సభ్యులు కృషి చేస్తారని ఆశిద్దాం.

-ఎండీ. మునీర్


(నేడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓపెన్‌కాస్టు గనులను పరిశీలించేందుకు మణుగూరు పర్యటిస్తున్న సందర్భంగా..)

37

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles