ప్రైవేటీకరణ కుట్ర!


Wed,March 27, 2013 10:50 PM

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టే కుట్ర పకడ్బందీగా అమ లు చేయడానికి కేంద్రం సిద్ధమవుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణలో, బొగ్గుగనులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పింది. దీంతో ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక వెల్లడించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేదు.ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నా యి. మొన్న కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం బడ్జెట్ ప్రవేశపెడుతూ.. రానున్న రోజుల్లో ప్రైవేటు భాగస్వామ్యంలో బొగ్గు గనులను తవ్వుతామని ప్రకటించారు.

దేశంలో 74 శాతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు బొగ్గే ఆసరా గా నిలుస్తున్నది. దేశంలో గుర్తించిన బొగ్గు నిక్షేపాలు మరో 200 ఏండ్లు తవ్వవచ్చు.ఇలాంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు దశాబ్దాలుగా నయా పైసా పెట్టుబడి పెట్టడంలేదు. 2016-17 నాటికి బొగ్గు అవసరాలు 960మిలియన్ టన్నులు దేశానికి ఉంటాయని,అందుకోసం ప్రస్తుతం విదేశాలనుంచి వంద మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటుండగా 2016-17 నాటికి 185మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటామని చిదంబరం అన్నారు. దీంతో భారతవూపభుత్వం విదేశీ బొగ్గు మోజులో పడిందని అర్థమవుతున్నది. స్వదేశ బొగ్గు సంస్థలను కుదేలు చేయడానికి పూనుకున్నారు.

ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక పారిక్షిశామిక విధానానికి వ్యతిరేకం గా 11 జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తుంటే ఇటీవల జాతీయ స్థాయిలో బొగ్గు సంస్థలలో కూడా 48 గంటల సమ్మె చేసినప్పటికీ దాని ప్రభావం బడ్జెట్‌పైపడలేదని స్పష్టంగా కనబడింది. 10శాతం కోలిండియా పెట్టుబడులను కూడా ఉపసంహరించే కుట్ర లో కేంద్రం ఉన్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. స్వదేశీ బొగ్గు సంస్థలు నిర్వీర్యం చేసి విదేశీబొగ్గును దిగుమతి చేసుకోవడం లాంటి విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది.

కోలిండియా ఇప్పుడున్న పరిస్థితులలోనే నూతన ప్రాజెక్టులను తవ్వుకుంటూ2016-17 నాటికి 780 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.సింగరేణి లక్ష్యాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెట్టుబడులు లేకపోవడంతో వచ్చి న లాభాలలోనే పెట్టుబడులను కూడా సమీకరించుకోవడంతోపాటు ప్రభుత్వ ఫైనాన్స్ కార్పోరేషన్‌ల నుంచి, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని బొగ్గు గనుల విస్తరణ కార్యక్షికమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అటు కేంద్ర ప్రభుత్వం కోలిండి యా నుంచి ఏడాదికి రూ. 10 వేల కోట్లు రాయల్టీ పేరిట, డివిడెంట్ల పేరిట, ఇతర పన్నుల పేరిట వసూలు చేసుకుంటూ ఉంటే ఇటు సింగరేణి నుంచి రూ.2వేల కోట ్లవరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ప్రభుత్వానికి పన్నులు, డివిడెంట్ల పేరిట చెల్లిస్తోంది. అయినప్పటికీ ఒక్కపైసా కూడా వీటిపై ప్రభుత్వాలు పెట్టడంలేదు.

2012-13 ఆర్థిక సంవత్సరంలో కోలిండియా 464 మిలియన్ టన్నులు, మార్చి 20 నాటికి 425 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్ప త్తి చేసింది.సింగరేణి లక్ష్యం 53.1 మిలియన్ టన్నులు కాగా ఇప్పటి వరకు 51 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇక మిగిలిన రోజుల్లో సింగరేణి మరో రెండు మిలియన్ టన్నులు బొగ్గు ఉత్ప త్తి చేస్తేనే లక్ష్యాన్ని దాటుతుంది.అయితే కోలిండియా ఈ సంవత్సరం మార్చి 31నాటికి లక్ష్యం అధిగమించడంతోపాటు 470 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేయనుంది.

రానున్న సంవత్సరాలల్లో దేశీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వరంగం అయిన కోలిండియా, ఇటు సింగరేణిపై కేంద్రం పెట్టుబడులు పెడితే విదేశీ బొగ్గు దిగుమతి తగ్గే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఎంతో ప్రాధాన్యం గల బొగ్గు సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఒక సింగరేణి నుంచే దక్షిణ మధ్య రైల్వేకు ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఇలాంటి సంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా యి. కేవలం 51 శాతం షేర్ తో రాష్ట్రం 49 శాతం షేర్‌తో కేంద్రం సింగరేణి లాంటి ప్రభుత్వరంగ సంస్థపై అజమాయిషీ చెలాయిస్తూ పన్నులు కూడా ఎప్పటికప్పుడు పిండుకుంటూ ఉండడమేనా, లేక బాధ్యతను ఎరిగి ప్రవర్తించడం ఏమైనా ఉందా? ఈ విషయాలేవీ తెలంగాణ ప్రాంత ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పట్టవా? ఇప్పటికైనా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Featured Articles