అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో


Mon,January 7, 2013 11:55 PM


తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ పండుగలను జరుపుకుంటారు. జరుపుకుంటున్నారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు చేయూతనిస్తారు. ఎవరికైనా రక్తం అవసరముంటే ఒకరికొకరు కులమతాలకు అతీతంగానే రక్తదానం చేస్తారు. మేమంతా ఒక్కటే, మాదంతా మనుష్య జాతని చాటుతారు. మట్టి మనుషులు ఉండే తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్బరుద్దీన్ లాంటి వ్యక్తులు.అక్బరుద్దీన్ ఎక్కడుంటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అంతుచిక్కని విధంగా ఉన్నది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో ఈరోజు ముస్లింలు సైతం ఆయన దిష్టిబొమ్మను దహ నం చేస్తున్నారు. చట్టమంటే వారికి గౌరవమేనట. తమ్ముడిని అప్పజెబుతామని మాట్లాడుతూనే తెలంగాణను అడ్డుకుంటానని, తెలంగాణ ఎట్ల ఇస్తరో చూస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన అన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వీరు ముస్లింలకు ప్రతినిధులమని చెప్పుకుంటున్నారు! ఎవరు వీరిని ప్రతినిధులను చేశారు? హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే, ఎంపీలు అయినంత మాత్రాన మొత్తం తెలంగాణలో ఉన్న ముస్లింలందరికి తామే ప్రతినిధులమనుకుంటే పొరపాటు.

ఇటు తెలంగాణలోనే కాదు అటు రాయలసీమ అయినా ఆంధ్రా అయినా ఏ ముస్లిం కూడా ఎంఐ ఎం పార్టీని తమ పార్టీగా భావించడంలేదు. ముస్లింలను ఉద్ధరించే రాజకీయ పార్టీ అని కూడా ఎవరూ అనుకుంటలేరు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, తన పబ్బం గడుపుకోవడం తప్ప ఈ ఎంఐఎం నాయకులు తాముంటున్న ఓల్డ్ సిటీలో ముస్లింలకు ఏం చేశారు? ముస్లిం సమాజం ఎన్నోరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారెప్పుడైనా పట్టించుకున్నారా? అక్కడి పరిస్థితిని తమ స్వార్థం కోసం, తమ పబ్బం గడుపుకోవడానికి,ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. అక్కడి జీవన పరిస్థితులు, ఆడబిడ్డల దీనగాథలు ఉపాధి కోసం సౌదీకి తరలిపోతున్న వారి ఇబ్బందులు పట్టించుకున్న పాపానపోలేదు.ఎన్నడయినా ఓల్డ్ సిటీలోని ముస్లిం పేదల విషయంలో సోయితోని వ్యవహరించారా? ఈరోజు హిందూ-ముస్లిం భాయి భాయీగా, హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరం ఒక్కటిగా ఉంటున్న తెలంగాణలో, కేవలం తెలంగాణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోని తప్పుడు వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సమంజసం కాదు. అది ఎంత వరకు సమంజసమో ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్కటి మాత్రం వాస్తవం. అసదుద్దీన్ తాత దిగి వచ్చినా ఇక్కడ రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లింలు సిద్ధంగాలేరు. ఈ దేశంలో ఉండటానికి ఇష్టం లేకుంటే మరో ఏదయినా దేశానికి పోయి అన్నదమ్ములిద్దరు బతుకండి. అనవసరంగా ఇక్కడ చిచ్చు పెట్టి మీరు సాధించేది ఏమి ఉండదు.


తెలంగాణను అడ్డుకోవాలనుకుంటే అది మీ తరంకాదు. వెయ్య మందికిపైగా విద్యార్థి యువజనులు ఆత్మబలిదానాలు చేసుకున్నది మీకు కనబడటం లేదా. 90 శాతం ముస్లింలు రోడ్ల మీదకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన వల్లనే తమ బతుకులు బాగుపడుతాయని గొంతెత్తి చెబుతున్నది మీకు వినిపించలేదా. ఇప్పటికయినా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సాటి వాడికి సాయం చేయలేని మీరు, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఓల్డ్ సిటీని వాడుకుంటున్న మీకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతలేదు. మీకు తెలంగాణ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. అదే ఓల్డ్ సిటీలో మీరు డిపాజిట్‌లు కోల్పోయే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ముస్లిం పిల్లలను చదువుకోనీయకుండా వారిని అభివృద్ధి చెందకుండా మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతో కాలం సాగదు.

వారిని మీ కబంధ హస్తాల నుంచి, మీ మతతత్వ వ్యవహారాల నుంచి బయటకు వెళ్లనీయకుండా ఎంత కాలం ఉంచగలుగుతారు. కేవలం ఓల్డ్ సిటీకి పరిమితమయిపోయిన మీరు మొత్తం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ముస్లింలకే ప్రతినిధులుగా మాట్లాడటంను ముస్లింలు ఎవరూ సహించబోరు.‘నా హిందు బనేగా, నా ముసల్మాన్ బనే గా.., ఇన్‌సాన్‌కి ఔలాగ్‌హే ఇన్‌సాన్ బనేగా’ అనే రఫీ సాబ్ పాటను జర వింటే ఫిర్ ఏక్ బార్ యాద్ చేసుకొని అక్బర్ సాబ్ జర ఇన్‌సాన్ బనో. అనవసరమయిన అవాకులు, చెవాకులు మానుకో. ఏ మతస్థులనైనా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం మంచిది కాదు. క్షమార్హం కాదు. అందరితో కలిసి మెలిసి ఉంటున్న అలాయ్ భలాయ్ బతుకులకు అలవాటు పడ్డ తెలంగాణ హిందూ ముస్లిం సోదరులను విడగొట్టే ప్రయత్నం చేయొద్దు.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన