ఆహారం భద్రమేనా!


Mon,July 8, 2013 12:41 AM


ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును చర్చకు పెట్టే వీలు కుదరకపోవడంతో కేంద్ర కేబినెట్ హడావుడిగా గత బుధవారం ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించి సంతకం కోసం రాష్ట్రపతికి పంపించింది.శుక్రవారం రాజ్యాంగ అధినేత అయిన ప్రణబ్ ఆమోదముద్ర కూడా వేశారు. సోనియాగాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు భారత పౌరుల్లో మూడింట రెండు వంతుల జనాభాకు ఆహార భద్రతను కల్పిస్తుంది. జీవించడానికి అవసరమైన ఆహారాన్ని అందుబాటు ధరల్లో పంపిణీ చేస్తుంది. పథకానికి ఎంపికైన కుటుంబాల్లోని ప్రతి సభ్యునికీ నెలకు ఐదు కిలోల చొప్పున తిండిగింజలను సబ్సిడీ ధరలకు అందజేస్తారు. బియ్యం కిలో మూడు రూపాయలకు, గోధుమలు రెండు రూపాయలకు, తృణధాన్యాలను ఒక రూపాయికి అమ్ముతారు. లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అందిస్తాయి. అంత్యోదయ అన్నయోజన కింద నెలకు 35 కిలోల బియ్యాన్ని పొందుతున్న కుటుంబాలకు ఇక ముందూ ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తారు. ఇదికాకుండా గర్భిణులకు,బాలింతలకు ప్రసూతి ప్రయోజనం కింద ఒకేసారి రూ. ఆరు వేలు మంజూరు చేస్తారు. ఆరు నెలల నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు అంగన్‌వాడీలు, పాఠశాలల్లో వండిన పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తారు. లేదంటే వారి వంతు రేషన్‌ను కుటుంబాలకు ఇస్తారు. ఈ కార్యక్షికమమంతా ఇప్పటికే ఉనికిలో ఉన్న ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా కొనసాగుతుంది. పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో ఆహార కమీషన్‌లను, జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార అధికారిని నియమిస్తారు. పథకానికి అవసరమైన బియ్యం,గోధుమలను భారత ప్రభుత్వం రైతుల వద్ద కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. ఆహారధాన్యాలను అందించలేని పరిస్థితి తలెత్తినప్పుడు చట్టంలోని లబ్ధిదారులకు ఆహాభవూదత భత్యాన్ని రాష్ట్రవూపభుత్వాలు చెల్లించాల్సిపుంటుంది. పథకం ఆచరణలో అమలైతే ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్షికమం అవుతుందనివిశ్లేషకులు వ్యా ఖ్యానిస్తున్నారు.

బిల్లుతో అట్టడుగు వర్గాలకు ఊరట కలుగుతుందని, పౌరులందరికీ ఆహారహక్కును కల్పించడమంటే మాటలు కాదని కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుభారమని, సర్కారు ఖజానాకు ఏటా ఒక లక్షా 25వేల కోట్ల రూ.ల చిల్లువేస్తుందని మరికొందరు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే యూపీఏ సర్కారు ఈ పథకాన్ని ముందుకు తెచ్చిందని, పార్లమెంటులో కనీస చర్చ లేకుండానే దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ను జారీ చేయడం అక్రమమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఎవరేం వ్యాఖ్యానించినా సమర్థవంతంగా అమలుచేసిన పక్షంలో ఆహార భద్రత బిల్లులో జనాలకు మేలుచేసే అనేక అంశాలున్న మాట వాస్తవం. మూడేళ్ల లోపు పిల్ల ల్లో 46శాతం,్ల మహిళల్లో 33శాతం, పురుషుల్లో 28 శాతం భారహీనత (అండర్ మూడేళ్ల లోపు పిల్లల్లో 79 శాతం,్ల వివాహిత మహిళల్లో 56 శాతం, గర్భిణుల్లో 58శాతం, వివాహిత పురుషుల్లో 24 శాతం రక్తహీనత(ఎనీమియా)తో బాధపడుతున్న దేశంలో సబ్సిడీ ధరలకు తిండిగింజలను పొందే హక్కును చట్టబద్దం చేయడం ఆహ్వానించదగిన పరిణామమే. రోజుకు కనీసం రూ.20 కూడా ఖర్చు పెట్టలేని వారు జనాభాలో 77శాతం ఉన్నచోట సర్కారు అందించే ఐదు కిలోల ఆహారం పేదరికం పోగొట్టకపోవచ్చు కాని ఆకలిచావులనైతే నివారిస్తాయి. గర్భిణులకు పోషకాహారం కోసం ఇచ్చే ఆరువేల రొక్కం అనేకమంది తల్లులను ప్రసూతిమరణం నుంచి కాపాడుతుంది. ప్రతి వేయిమంది శిశువుల్లో 48 మంది ఇంకా కళ్లు తెరువకముందే ఈ లోకాన్ని వీడడాన్ని అరికడుతుంది. అంగన్‌వాడీల్లో, పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్నభోజనం దేశంలో గల కోటిన్నర మంది బాలకార్మికుల్లో కొందరినైనా బడిబాట పట్టిస్తుంది. ఏటా అతివృష్టి, అనావృష్టిల బారిన పడి కరువులో అల్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడే రైతుల కుటుంబాలను సర్కారీ రేషన్ బతికిస్తుంది. రోడ్డున బతికే అనాథలకు, అభాగ్యులకు తిండి పెడుతుంది. మొత్తం కుటుంబానికి సంబంధించిన రేషన్‌ను ఆ ఇంటి ఇల్లాలికి అప్పగించడమన్నది మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది.

సమర్థవంతంగా అమలు చేస్తారా అన్నదే ఇక్కడ కీలక ప్రశ్న. ఎందుకంటే ఈ పథకం అమలుకు పీడీఎస్‌ను ఎంచుకోవడం, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను రాష్ట్రాలకు వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే ఆంధ్రవూపదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై సరుకుల పంపిణీ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. పేదలకు అందాల్సిన సరుకులు కాస్తా పక్కదారి పట్టి బ్లాక్‌మ్కాట్‌కు తరలడం, టన్నుల కొద్దీ పట్టుబడడం కళ్లారా చూస్తూనేవున్నాం. సర్కారు సరఫరా చేస్తున్న బియ్యం, కిరోసిన్, చక్కెర తదితర పదార్థాల్లో 51శాతం ఇలా దుర్వినియోగమవుతోందని ప్రభుత్వవర్గాల పరిశీలనలో తేలింది. అత్యంత లోపభూయిష్టంగా, అవినీతిమయంగా ఉన్న ఇలాంటి వ్యవస్థ ద్వారా అమలయ్యే ఆహారభవూదత పథకం గతీ రేపు ఇలాగే అవుతుందన్న విమర్శలు వెల్లు ఇక లబ్ధిదారుల ఎంపిక కూడా అస్తవ్యస్తంగానే ఉండబోతోంది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు పేదలను గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహించలేదు. ప్రజల జీవనవూపమాణాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం 1951 నుంచి ఇప్పటివరకు 67 జాతీయ శాంపిల్ సర్వేలు నిర్వహించినప్పటికీ ఎవరిని పేదలుగా పరిగణించాలనే విషయంలో లెక్కలు తేలలేదు. ఈ అంశంపై అధ్యయనం కోసం 1993లో లక్డావాలా కమిటీ, 2005లో టెండూల్కర్ కమిటీ, 2009లో సక్సేనా కమిటీ, 2012లో రంగరాజన్ కమిటీలను నియమించినా స్పష్టత రాలేదు.

ఇలాంటప్పుడు గ్రామీణ జనాభాలో 75శాతం, పట్టణ జనాభాలో 50శాతం కుటుంబాలను దారివూద్యరేఖకు దిగువన ఉన్న పేదలుగా, ఆహారభవూదత పథకానికి అర్హులుగా పేర్కొంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించే జాబితాలు ఎంత తప్పుల తడకలుగా ఉంటాయో మనం ఊహించవచ్చు. తెల్లకార్డులున్న వారందరినీ అర్హులుగా గుర్తిస్తారని భావించినా వాటిలో 30శాతం వరకు బోగస్‌కార్డులేనని సాక్షాత్తూ మంత్రులే ఒప్పుకునివున్నారు కనుక ఆ పేరుతో ఈ సరుకులు కాస్తా నల్లబజారుకు తరలి ఖాయంగా కనిపిస్తోంది. పైపెచ్చు ఇళ్లూ జాగా లేకుండా బతుకులీడుస్తున్న కడుపేదలకు, అనాథలకు, సంచారజాతులకు ఎలాంటి కార్డులూ లేనందున లబ్ధి పొందలేరు.ఆహారభవూదత బిల్లు నిజానికి పౌరులకు ఆరోగ్యభవూదత కల్పించలేదన్న విమర్శ ఉంది. ఒక మనిషి ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే నెలకు సగటున 10 నుంచి 13 కిలోల బియ్యం, 600 నుంచి 800 గ్రాముల పప్పులు, తగినంత నూనె, చక్కెర, కూరగాయలు అవసరమవుతాయని నిపుణులు పేర్కొంటుండగా, బిల్లులో కేవ లం ఐదు కిలోల తిండిగింజల తో సరిపెట్టారు. పది రూపాయలకు ఐదు కిలోల బియ్యం తెచ్చుకుని ఒక వ్యక్తి మిగతా పప్పు, ఉప్పుల కోసం నెలకు కనీసం ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సివచ్చినప్పుడు భద్రత కల్సించినట్టు ఎలా అవుతుందన్న ప్రశ్నకు సర్కారు వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఇక ఈ బిల్లు రైతులను బజారుకీడ్చి, కొత్త బిచ్చగాళ్లుగా తయారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అతితక్కువ ధరలకే మెజారిటీ జనాభాకు ప్రభుత్వం తిండిగింజలను అందించడం మూలంగా ఓపెన్ మార్కెట్‌లో బియ్యం,గోధుమలకు డిమాండు తగ్గి ధరలు భారీగా పడిపోతాయి.కనీస మద్దతు ధరకు సర్కారీ కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని అమ్ముకోలేని రైతులు మధ్యదళారుల చేతికి చిక్కి ఎంతకంటే అంతకు అమ్ముకునే పరిస్థితి వస్తుంది.

ఈ బిల్లును కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీఏ ప్రభుత్వం ఆదరాబాదరాగా ముందు కు తెచ్చిందన్న వాదనలూ ఉన్నాయి. పౌరులకు పాలకులు కొత్తగా ఇస్తున్నదేమీ లేదని, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ, స్కూ ళ్లలో మధ్యాహ్నభోజనం, గర్భిణులకు పోషకాహారం, అంగన్‌వాడీల నిర్వహణ తదితర పథకాలను కలగలిపి ఆహారభవూదత అంటూ కొత్త పేరు పెట్టారని కొందరు విమర్శిస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పీడీఎస్ నిర్వహణ కోసం ప్రతియేటా కేంద్రం భారీ సబ్సిడీలను ఇస్తుందని, మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో సైతం 90వేల కోట్ల రూపాయలను ఇందుకు కేటాయించిందని వివరిస్తున్నారు.ఏమైనా పౌరులకు ఆహారాన్నిపొందే హక్కును కల్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నం అభినందనీయం. అయితే బిల్లులో కొన్ని కీలక మార్పులు చేయడం తక్షణావసరం. ముఖ్యంగా పేదరికాన్ని అంచనా వేసే విషయంలో వెంటనే కేంద్రం ఒక స్పష్టతకు రావాలి. ఆయా కమిటీల నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా దారివూద్యరేఖకు దిగువన జీవిస్తున్న వారి జాబితాను రూపొందించి రాష్ట్రాలకు అందజేయాలి. అవసరమై తే ఆరు నెలల కాలపరిమితితో ఒక సమగ్ర సర్వేను నిర్వహించాలి. కనీస ఆహార భవూదత లేని కుటుంబాలను గుర్తించాలి. వేలకోట్ల ఖర్చుతో ఆధార్ లాంటి ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పాలకులకు ఇది అసాధ్యమేంకాదు. మరోవైపు, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా,పర్యవేక్షణ యంత్రాంగాన్ని పకడ్బందీగా పనిచేయించాలి. బియ్యంతోపాటు పప్పు, ఉప్పు, నూనె, కూరగాయలను సరఫరా చేయాలి. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో దళారుల పాత్రను నివారిస్తూ ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరను సవరించాలి.

-డి. మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ