పౌరులపై నిఘా నేత్రం


Mon,June 24, 2013 12:27 AM


పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిళ్లు, వెబ్‌బ్రౌజింగ్‌లపై నిఘా పెట్టింది.ఇందుకోసం ఇండియన్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ (భారత కేంద్ర పర్యవేక్షక వ్యవస్థ-ఐసీఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఐటీ మంత్రి మిలింద్ దేవ్‌రా ఐసీఎంఎస్ ఏర్పాటును పార్లమెంటులో ప్రకటించారు.ఈ ప్రయత్నాలు ఏప్రిల్‌లో కొలిక్కి వచ్చాయి. ప్రయోగాత్మకంగా ఫోన్లపై, వెబ్‌సైట్లపై పర్యవేక్షణ మొదలైంది. దీంతో ఇకముందు నిఘా సంస్థలు ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రైవేటు ఆపరేటర్లను సంప్రదించాల్సిన అవసరముండదని, కావాల్సిన సమాచారాన్ని నేరుగా ఒక్క బటన్ నొక్కి పొందొచ్చు. ఈ విషయంలో మానవహక్కుల సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతి రేకిస్తున్నాయి. ఐసీఎంఎస్ ఏర్పాటు పౌరుల హక్కులకు భంగకరమని, ఎలాంటి ప్రైవసీ చట్టాలు లేని భారత్‌లో ఈ వ్యవస్థ దుర్వినియోగం కావడం ఖాయమని వాదిస్తున్నాయి. ఐసీఎంఎస్ ఏర్పాటుకు నేప థ్యం 26/11 ముంబై దాడులు. అనుమానిత వ్యక్తుల కాల్స్‌ను, మెయిళ్లను చెక్ చేసే వ్యవస్థ కను క ఉంటే ఇలాంటి దాడులను నిరోధించవచ్చని అంటున్నారు. దేశ పౌరులందరి సమగ్ర సమాచార సేకరణ యంత్రాంగంగా నాట్‌క్షిగిడ్ (నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్)ను, ఉగ్రవాదులపై అణచివేత చర్యలను కేంద్రస్థాయిలో సమన్వయపరచడానికి ఎన్‌సీటీసీ (జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం)ని ప్రతిపాదించారు. ఆసమయంలోనే రూపుదిద్దుకున్న మరో ఆలోచన పౌరుల ఫోన్ కాల్స్‌ను, ఎస్సెమ్మెస్‌లను, వెబ్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఒక వ్యవస్థ ఏర్పాటు. ఈ దిశలోనే ఐటీ యాక్ట్-2000కు- 2008లో ఒకసారి, 2011లో మరోసారి సవరణలు చేశారు. ఈ సవరణల ప్రకారం దర్యాప్తు అధికారులు తగిన కారణాలు చూ పించి పౌరుపూవరి ఫోన్‌కాల్ రికార్డులు, మెస్సేజ్‌లనయినా ఆయా టెలికామ్ సంస్థల నుంచి పొందవచ్చు.అయితే, ఈ పద్ధతిలో పొందే సమాచారానికి కొన్ని పరిమితులుండడంతో 2011లో ఈ ఐసీఎంఎస్‌కు రూపకల్పన జరిగింది.

ఐసీఎంఎస్ ప్రత్యేకత ఏమిటంటే.. కావాల్సిన సమాచారాన్ని రియల్ టైం (ఎప్పటికప్పుడు)లో అందించగలగడం.అంటే మనం మాట్లాడుతున్న ఒక కాల్‌ను అదే సమయంలో నిఘా అధికారులు వినవచ్చు. వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్న సైట్‌ను వెంటనే పసిగట్టవచ్చు. పంపిన మెయిల్‌ను ఉన్నపళంగా చదివేయవచ్చు. మన లాగిన్ వివరాలు, ఐపీ అడ్రస్‌ను కనిపెట్టవచ్చు. 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టులో భాగంగా టెలిఫోన్ కాల్ ఇంట్సప్షన్ సిస్టమ్ (టీసీఐఎస్)ను, ఆకాశంలో ఇంట్సప్టార్లను ఏర్పాటు చేస్తారు. ఇది వాయిస్ కాల్స్, విడియోకాల్స్, ఎస్సెమ్మెస్, ఎమ్మెమ్మెస్, జీపీఆర్‌ఎస్, ఫ్యాక్స్ సందేశాలను, 2జీ, 3జీ, జీఎస్‌ఎం,సీడీఎంఏ సిగ్నళ్లను ట్యాప్‌చేస్తుంది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఆపిల్, ఫేస్‌బుక్,ట్విట్టర్, స్కైప్ వంటి అమెరికన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నడిచే సోషల్ నెట్‌వర్క్‌లను ఛేదించడంలో మరో సంస్థ ఎన్‌టీఆర్‌ఓ (నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) నిమగ్నమైవుంది.ఇప్పటికే రెడిఫ్ మెయి ల్, సిఫీ వంటిది దేశీయ నెట్‌వర్క్‌ల్లోకి చొరబడగలిగింది. ఈ అన్నిమార్గాల్లో ట్యాప్ చేసిన సమాచారాన్ని సమన్వయించడానికి న్యూఢిల్లీలోని మెహ్రౌలి-గుర్గాం రోడ్డులో ప్రధాన కార్యాలయాన్ని, దేశం నలుమూలలా నాలుగు చోట్ల రీజనల్ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. రా(రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్), సీబీఐ, ఎన్‌ఐఏ, ఐబీ,సీబీడీటీ(సెంవూటల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్‌టాక్సెస్) ఎన్‌సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో), ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), ఆదాయపు పన్నుశాఖ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తదితర తొమ్మిది సంస్థలు ఐసీఎంఎస్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. సెబిని సైతం ఇందుకు అనుమతించాలని ఆలోచిస్తున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే.. ఐసీఎంఎస్ మూలంగా ఇప్పటి వరకూ మనకు మాత్రమే తెలుస్తాయనుకున్న విషయా లు ఇక మీదట ప్రభుత్వాలకు, నిఘా సంస్థలకు చేరతాయన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. మనం ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తాం. ట్విట్టర్‌లో కామెంట్లు రాస్తాం.గూగుల్‌లో మెయిళ్లు పంపుతాం.ఫోన్‌లో మిత్రులతో మాట్లాడతాం. మెస్సేజ్‌లు పంపుతాం. విచ్ఛలవిడిగా కామెంట్లు చేస్తాం. వ్యక్తులను నింది స్తాం..నేతలను తిడతాం.. ప్రభుత్వాల విధానాల ను దుయ్యబడతాం..ఓ గర్ల్ ఫ్రెండ్‌తో అనురాగాలు పంచుకుంటాం..మరో పార్టీతో సంబంధాలు పెంచుకుంటాం..ఇంకో ఉద్యమసంస్థతో అభివూపాయాలు కలబోసుకుంటాం.. ఇవన్నీ ఇకముందు మనకూ అవతలి వారికే కాకుండా బయటివాళ్లకూ తెలుస్తాయి. అలాగైతే కొంపలు మునుగుతాయి కదా! అంటారా..!ఆ విషయాన్నే మానవ హక్కుల సంఘాలు ఎత్తిచూపుతున్నాయి. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ప్రభుత్వానికి సైతం లేదని, రాజ్యాంగం భారత పౌరులందరికీ భావవూపకటనా హక్కును, స్వేచ్ఛను ప్రసాదించిందని మొత్తుకుంటున్నాయి.ఇప్పటికే ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ ఐసీఎంఎస్ ప్రాజెక్టును వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని పలువురు మేధావులు కేంద్రవూపభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెటిజన్లు సైతం ‘స్టాప్ ఐసీఎంఎస్’ పేరిట బ్లాగును నిర్వహిస్తూ ఐసీఎంఎస్‌కు వ్యతిరేకంగా ప్రజాభివూపాయాన్ని కూడగడుతున్నారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పేరుతో ముందుకు తెస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో కాని, పార్లమెంటులో కానీ ఎలాంటి చర్చ పెట్టకుండా భారత ప్రభుత్వం అమలుచేయజూస్తున్నది.ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి పౌరుల చిట్టాను భద్రపరిచే ఆధార్ ప్రాజెక్టును,ఆ వివరాలను నిఘా సంస్థలకు లింకు చేసే నాట్‌క్షిగిడ్‌ను యూపీఏ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రవేశపెట్టింది. ఇప్పుడీ ఐసీఎంఎస్ రూపంలో పౌరుల ప్రైవసీపై దాడి చేయజూస్తున్నది. అమలులో ఉన్న చట్టాల ప్రకారమే ఈ సంస్థ పనిచేస్తుందని చెబుతున్నా ఇటీవల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు,పౌరహక్కుల నేతలను, ఉద్యమ కార్యకర్తలను జైలుపాలు చేస్తున్న వైనం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, రచనలు చేస్తున్నారని పలువురిపై రాజవూదోహం కేసును (సెక్షన్ 124ఏ),చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ )ను మోపుతున్నారు. పౌరహక్కులనేత బినాయక్‌సేన్‌పముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కార్టూనిస్టు అసీమ్ త్రివేది, జర్నలిస్టులు సీమాఆజాద్, ఆమె భర్త విశ్వవిజయ్, నిరంజన్ మహాపాత్ర, కమలేశ్ పైంక్రా, లక్ష్మణ్‌చౌదరి, సైంటిస్టు గోపాల్, ప్రొఫెసర్లు నిషా బిస్వాస్, కనిష్క చౌదరి, విద్యార్థిని దేబాలినా చక్రవర్తి వంటి వారెందరినో కేవలం వారి రాజకీయాభివూపాయాల ప్రాతిపదికన వేధింపులకు గురిచేశారు. కేసులు పెట్టి జైలుకు పం పారు. రేపు ఐసీఎంఎస్ అమలులోకి వస్తే తమ విధానాలను వ్యతిరేకించే ఏ వ్యక్తినైనా జైలుకు పంపగలిగే పదు నైన ఆయుధం పాలకుల చేతికి వస్తుం ది.

బాల్‌థాకరేపై ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెట్టినందుకు ఇద్దరు ముంబై యువతులను పోలీసులు అరెస్టు చేయడం గురించి మనం ఇటీవల పేపర్లలో చదివివున్నాం. ఇలాంటి అరెస్టులు భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశముంది. ప్రత్యేకించి వివిధ ఉద్యమాల్లో పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను వారి ఫోన్ సంభాషణలు, కామెంట్లు, మెయిళ్ల ఆధారంగా చీటికి మాటి కి కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేసే ప్రమాదమున్నది.పౌరుల ప్రైవసీ రక్షణకై తగిన చట్టాలు లేని పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాజ్ఞల మేరకు ఏర్పాటు చేసిన ఐసీఎంఎస్‌ను దేశవూపజలందరూ వ్యతిరేకించాలి. తమ ఫోన్లపై, మెయిళ్లపై, బ్రౌజింగ్‌పై ప్రభుత్వవర్గాలు నిఘా పెట్టడాన్ని, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలి. భావవూపకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఉద్యమించాలి. పాలకులు తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ట్యాపింగ్‌ను అస్త్రంగా చేసుకునే అవకాశం ఉంది. కనుక అన్ని పార్టీలు ఈ అంశంపై పార్లమెంటులో సమక్షిగంగా చర్చించాలని డిమాండ్ చేయాలి. ఉగ్రవాదం అణచివేత పేరుతో ఇలా రోజుకో సంస్థను, వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బదులు ఇప్పటికే అపరిమిత అధికారాలున్న- రా, ఐబీ, సీబీఐ తదితర ఇంటెలిజెన్స్ సంస్థలను సమర్థవంతంగా పనిచేయించడంపై దృష్టిపెడితే చాలు. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై కేంద్రీకరించాలి.

-డి.మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Featured Articles