జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!


Thu,October 11, 2012 05:50 PM

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194 దేశాలకు చెందిన సుమారు పది వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. జీవ వైవిధ్య ఒడంబడిక (కాన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ)లో భాగంగా భాగస్వామ్య పక్షాలకు (కాన్ఫన్స్ ఆఫ్ పార్టీస్-కాప్) సంబంధించి ఇది 11వ సమావేశం. 1-5 తేదీల మధ్య జీవ భద్రత విషయమై కార్టజినా ప్రొటోకాల్‌పై సభ్యదేశాల ప్రతినిధి బృందాల మధ్య చర్చలు జరుగుతా యి. అనంతరం 8వ తేదీ నుంచి జీవ వైవిధ్యంపై ప్రధాన ఎజెండా చేపట్టనున్నా రు. చివరి మూడు రోజుల్లో జరిగే అత్యున్నతస్థాయి సమావేశంలో వివిధ దేశాల అధినేతలు, పర్యావరణ, అటవీ శాఖ మంత్రులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

స్వాతంవూత్యానంతరం మన దేశం లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సదస్సు నిర్వహణ కోసం కేంద్రం రూ. 300 కోట్లు మంజూరు చేయగా, కిరణ్ సర్కారు సైతం దానికి తీసిపోకుండా రూ.125 కోట్లు కేటాయించింది. నగరాన్ని యుద్ధవూపాతిపదికన సుందరంగా తీర్చిదిద్దే పనిలో జీహెచ్‌ఎంసీ నిమగ్నమైంది.
20వ శతాబ్దం చివరి అంకాన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలకు ప్రపంచ దేశాలు పెద్దపీట వేయడం వేగవంతమైంది. లాభాల వేటలో పడిన మానవుడు పుడమిని ఒకేసారి మింగేసే ప్రయత్నం చేస్తున్నాడు. భవిష్యత్ తరాల మనుగడను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వనరులను కొల్లగొడుతున్నాడు. ఫలితంగా జీవన సమతౌల్యం దెబ్బతింటున్నది. ఒకప్పుడు నీటితో, పచ్చని అడవులతో మాత్రమే కప్పబడివున్న భూగో ళం క్రమేపీ ఎడారులుగా, కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నది.

అతివృష్టి లేదంటే అనావృష్టి ఆనవాయితీ అయింది. వానాకాలం ఎండలు, ఎండాకాలం వానలు సాధారణమయ్యాయి. భూగర్భ జలం, భూసా రం తగ్గుతున్నది. జల, వాయు, శబ్ద, ఆహార కాలుష్యం పెరుగుతున్నది. ఉష్ణోక్షిగతల్లో వస్తున్న మార్పులు ఓజోన్ పొరను నష్టపరుస్తున్నాయి. వృక్ష, జంతు జాతులకు చెందిన అనేక అరుదైన తెగలు నశిస్తున్నాయి. ప్రకృతి విపత్తులకు బల య్యే మానవుల సంఖ్య బాగా పెరుగుతున్నది. అభివృద్ధి పేరిట నిర్వాసితులుగా మారుతున్న మూలవాసులు అస్తిత్వం కోల్పోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మానవుల మనుగడకు మూలమైన ధరివూతిని, జీవ భద్రతను, వైవిధ్యాన్ని కాపాడుకోవాలన్న డిమాండు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అనేక మంది సామాజిక, జీవ, రసాయన, పర్యావరణ శాస్త్రవేత్తలు, మేధావులు మానవజాతికి సమీప భవిష్యత్తులోనే పొంచివున్న ముప్పును ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. భూమిని, భూమిపై ఉన్న జీవజాలాన్ని కాపాడాలంటూ పలు దేశాల్లో ఉద్యమాలు వెల్లు ఫలితంగా ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది.

1972లో స్వీడన్‌లోని స్టాక్‌హోంలో మానవ పరిసరాలకు సంబంధించిన సమావేశం నిర్వహించింది. పర్యావరణ, జీవజాతుల పరిరక్షణకు వీలుగా వ్యాపార కార్యకలాపాలను నియంవూతించే విధానాలకు రూపకల్పన చేసింది. అనేక దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ ఆచరణలో పెట్టకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందమైం ది. 1987లో సమితి మరోసారి పూనుకుని ‘పర్యావరణం-అభివృద్ధి’ అంశంపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి కొనసాగింపుగానే 1988లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్షికమానికి(యూఎన్‌ఈపీ) శ్రీకారం చుట్టింది. భవిష్యత్ తరాల మనుగడకు విఘాతం కలుగజేయకుండానే మానవుల జీవన పరిస్థితులను మెరుగుపర్చుకునే దిశలో ప్రపంచాన్ని నడిపించడం ఈ సంస్థకు లక్ష్యంగా నిర్దేశించింది. మరోవైపు ప్రపంచ దేశాలచే ఒక జీవ వైవిధ్య ఒడంబడికను ఆమోదింపజేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది.

ఈ ప్రయత్నాలు సఫలమై యూఎన్‌ఈపీ ఆధ్వర్యంలో 1992లో చరివూతాత్మక రియో ఎర్త్ సమ్మిట్ (ధరిత్రి సదస్సు) జరిగింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఈ సదస్సుకు 172 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అప్పటి మన ప్రధా ని పీవీ నర్సింహారావు సహా 108 దేశాల అధినేతలు హాజరై ప్రసంగించారు. విషపదార్థాలను విరజిమ్మే ఉత్పత్తి ప్రక్రియల పైన, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న సంప్రదాయ ఇంధన వనరుల పైన, నీటి కొరత పైన సదస్సులో చర్చ జరిగింది. క్యొటో ప్రొటోకాల్‌గా చెప్పుకునే వాతావరణ మార్పుల ఒడంబడిక కుదిరింది. పర్యావరణానికి నష్టం కలుగజేసే ఎలాంటి కార్యకలాపాలను మూలవాసుల భూముల్లో చేబట్టబోమని తీర్మానించారు. గమనించాల్సిన విషయమేమిటంటే ఈ సదస్సులోనే జీవ వైవిధ్య ఒడంబడికను సంతకాల కోసం ప్రపంచ దేశాలముందుంచారు. 168 దేశాలు ఒడంబడికపై అక్కడే సంతకాలు చేయగా తర్వాతి కాలంలో మరో 26 దేశాలు ఇందులో చేరాయి. 1993 డిసెంబర్ 29 నుంచి ఈ ఒడంబడిక అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగానే భాగస్వామ్య పక్షాల సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి సమావేశం 1994లో బహమాస్‌లో జరగ్గా ప్రస్తుతం హైదరాబాద్‌లో 11వ సమావేశం జరగనుంది.

ప్రస్తుత సమావేశంలో చర్చించడానికి తయారుచేసిన ఎజెండాలో జీవ వైవి ధ్యం, వాతావరణ మార్పులు, కాలుష్యం, అరుదైన జీవజాతులకు పొంచివున్న ముప్పు, అడవుల సంరక్షణ వంటి పలు అంశాలున్నాయి. వీటిపై వివరంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే గత పది సమావేశాల్లోనూ ఈ అంశాలపై తీవ్రస్థాయిలోనే చర్చ జరిగింది. అనేక తీర్మానాలు సైతం చేశారు. విషాదకరమైన విషయమేమంటే సమావేశంలో ఆయా తీర్మానాలను ఏకక్షిగీవంగా ఆమోదించిన దేశాలేవీ ఆ తర్వాత వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. మన దేశం విషయానికే వస్తే, రియో, బహమస్ నుంచి మొదలుకొని నగొయ 10వ సమావేశం వరకూ అన్ని సమావేశాల్లోనూ అభివృద్ధి ముసుగులో జీవ వైవిధ్యానికి జరుగుతున్న నష్టంపై ఘాటైన ఉపన్యాసాలిచ్చిన మన అధినేతలు, మంత్రులు స్వదేశంలో మాత్రం పూర్తిగా అందుకు విరుద్ధమైన విధానాలను అమలు చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా-వూపపంచ బ్యాంకుల మాయలో పడి, పర్సెం మత్తులో జోగుతూ మూలవాసుల, ఆదిమ తెగల అస్తిత్వానికి, అటవీ సంపదకు, పర్యావరణానికి ముప్పు చేకూర్చేలా గనుల తవ్వకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. దేశ వనరులను బహుళజాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. స్థానికుల, మేధావుల, ప్రజాసంఘాల నిరసనను ‘పోలీసు’ పద్ధతిలో పరిష్కరిస్తున్నారు.

ఫలితంగా నేడు పల్లెల, పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమనుకున్న అనేకం నేడు గత స్మృతులయ్యాయి. గుట్టలు మాయమై మైదానాలు వెలుస్తున్నాయి. పచ్చని పంట పొలాల మధ్యలో ఓపెన్‌కాస్ట్ మట్టిగుట్టలు ప్రత్యక్షమవుతున్నాయి. చెరువులు లేఅవుట్లుగా మారుతున్నాయి. వర్షిం చే మేఘాలని భ్రమపడే స్థాయిలో వాయుకాలు ష్యం, నదులను డ్రైనేజీలని పొరబడే రీతిలో జలకాలుష్యం, చెవులు గింగురుమనే శబ్ద కాలుష్యం పట్టణాలను పట్టి పీడిస్తున్నాయి. ‘కొండ’ల్లో ఉండాల్సిన ‘చిలువలు’ పేలుళ్ల ప్రకంపనలకు ఊళ్ల దారి పట్టి ప్రాణం తీసుకుంటున్నాయి. అడవిని ఏలాల్సిన పులులూ, చిరుతలూ, ఎలుగుబంట్లూ జనావాసాల్లోకి వచ్చి బందీ అవుతున్నా యి. కోతుల దండు గ్రామాలపై దండెత్తింది. రామచిలుకలు బోనుల్లో నిలబడి సామాన్యుల బతుకు జోస్యం చెబుతున్నాయి. కోయిలలు, ఊరపిచ్చుకలు, సీతాకోకచిలుకలు, మిడతలు, ఆరువూదలు, ఇంకా అనేక ప్రాణులను పాఠ్యపుస్తకాల్లో, ఫొటోల్లో చూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అలా అని మానవజాతిని వదిలేస్తున్నారా అంటే అదీ లేదు. వనరుల వేటలో పడిన కార్పొరేట్ల ధాటికి ఓ అబూజ్‌మాడ్.. మరో నియాంగిరి.. ఇంకో సుర్జాగఢ్ అస్తిత్వం కోల్పోతున్నాయి. పురాతనమైనవిగా భావించే మాడియా గోండులు, డోంగ్రియా, కుటియా కోందులు తదితర ఆదివాసీ తెగల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

పర్యావరణ సమతౌల్యంతో, కాలుష్యరహిత పరిసరాలతో, జీవన వైవిధ్యంతో ప్రాణకోటి విలసిల్లాలన్నా, మానవులు సుఖశాంతులతో ప్రశాంతంగా బతకాల న్నా అగ్రరాజ్యాలు సహా ప్రపంచ దేశాలు తమ విధానాలను విప్లవాత్మకంగా మార్చుకోవాలి. అభివృద్ధి పేరిట ధరివూతికి, జీవజాతులకు ముప్పు వాటిల్లజేయ డం మానుకోవాలి. బయట నీతులు చెప్పి ఇంట్లో గోతులు తవ్వడం ఆపేయాలి. హైదరాబాద్ సమావేశానికి హాజరయ్యే నేతలు ఇక్కడ భారీ సందేశాత్మక ఉపన్యాసాలివ్వడం కాదు.. స్వదేశానికి వెళ్లాక కాప్-11 తీర్మానాలను చిత్తశుద్ధితో అమలుచేయాలి. జీవ వినాశనానికి కారణమవుతున్న చట్టాలకు, విధానాలకు స్వస్తి చెప్పాలి. మొదటిసారి అంతర్జాతీయ సదస్సుకు ఆత్మీయ ఆతిథ్యమిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మన కేంద్ర ప్రభుత్వం మూలవాసుల అస్తిత్వానికి, పర్యావరణానికి చేటు చేకూర్చే భారీ ప్రాజెక్టులను, బహుళజాతి కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఈ డిమాండుతో దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్షికమాలు చేపట్టాలి.

-డి.మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ