మానెసర్ హింసకు కారకులెవరు?


Sat,October 6, 2012 04:58 PM

maruthiకార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం ఉద్యమించిన కంపెనీ కార్మికులకు, మెట్టు దిగని యాజమాన్యానికి మధ్య తలెత్తిన ఘర్షణ కాస్తా జూలై 1న ఉద్రిక్తతలకు దారితీసింది. యాజమాన్యం తరఫున బౌన్సర్లు(ప్రైవేట్ సెక్యూరిటీ) కార్మికులపై విచక్షణారహితంగా దాడి చేయగా, కోపోవూదిక్తులైన కార్మికులు కర్మాగారపు కార్యాలయానికి, మెయిన్ గేటుకు నిప్పు పెట్టారు. ఈ గొడవలో సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ అవనీష్ కుమార్ దేవ్ సజీవ దహనం కాగా వంద మందికి పైగా మేనేజర్లు, సూపర్‌వైజర్లు, కార్మికులు గాయపడ్డారు. ఈ అల్లర్ల నేపథ్యంలో ఫ్యాక్టరీని లాకవుట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గత జనవరిలో జరిగిన ఘటనల తర్వాత అంతటి స్థాయిలో కొనసాగిన మానేసర్ హింసపై మిశ్రమ స్పందన వెలువడింది. హింస వెనక వామపక్ష తీవ్రవాదుల హస్తం ఉన్నట్లు మారుతి సుజుకి సంస్థ చైర్మన్ ఆర్ సీ భార్గవ ఆరోపించారు. తీవ్రవాదులతో చేతులు కలిపిన కొద్దిమంది కార్మికుల కుట్రపూరిత దుశ్చర్యగా వర్ణించారు. దేశ పారిక్షిశామిక ప్రగతి మందగిస్తున్న వేళ ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పరిక్షిశమ వర్గాలు(అసోచామ్, సీఐఐ)పేర్కొన్నాయి. సమ్మె చేస్తున్న కార్మికలోకంపై ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పిన ఫలితంగానే హింస చెలరేగిందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. హర్యానాను అభివృద్ధికి నమూనాగా చూపిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు తన తల ఎక్కడ పెట్టుకుంటుందని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. హింసను ఖండించిన వామపక్షాలు పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించాయి. కాగా, మానేసర్ ఉదంతం భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తోందని, బహుళజాతి సంస్థలు పనిస్థలాల్లో పరిస్థితులను మెరుగుపర్చకుండా హక్కులను కాలరాచే పక్షంలో కార్మికులు ట్రేడ్ యూనియన్ రాజకీయాలను వదిలి హింసామార్గాన్ని అవలంబించే ప్రమాదముందని మేధావులు, సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. హింసకు మారుతి సుజుకి యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు అభివూపాయపడుతున్నారు.

వాస్తవానికి హర్యానాలోని మానెసర్ గత రెండున్నరేళ్లుగా రగులుతోంది. 2006లో ఇక్కడ మారుతి సుజుకి కంపెనీ కార్ల తయారీకి సంబంధించిన రెండవ యూనిట్‌ను (మొదటి యూనిట్ గుర్గావ్‌లో 190లలో మొదలైంది) నెలకొల్పినప్పటి నుంచీ కార్మికుల్లో అసంతృప్తి ఉంది. మొత్తం మూడు వేల మందిలో రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులే కావడం, చీటికి మాటికి వేతనంలో కోతలు, అధ్వాన పని పరిస్థితులు, సూపర్‌వైజర్ల, మేనేజర్ల వేధింపులు వారిని ఊపిరాడకుండా చేశాయి. ఇక్కడ పని చేసే కార్మికులంతా నవయువకులు కావడంతో సహజంగానే తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించడం ఆరంభించారు. నాయకత్వం వహించడానికి కొత్తగా ఓ యూనియన్‌ను ఏర్పాటు చేసుకోయత్నించారు. ఇక్కడే వివాదం మొదలైంది. గుర్గావ్ యూనిట్‌లో అప్పటికే ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మారుతి ఉద్యోగ్ కామ్‌గార్ యూనియనే(ఎంయుకేయు)మానెసర్ కార్మికులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తుందని ఒకవైపు యాజమాన్యం, మరోవైపు ఆ యూనియన్ నాయకులు బలవంతంగా వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే, యాజమాన్యం తొత్తుగా మారిన ఎంయుకేయు కార్మికుల సమస్యలు పట్టించుకోవడం మానేసిందని, అలాంటి యూనియన్ తమకొద్దని, కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామని మానేసర్ కార్మికులు పట్టుబట్టారు. 2010 డిసెంబర్ కల్లా వారి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొత్త యూనియన్‌కు నేతృత్వం వహించడానికి కొంతమంది యువకులు ముందుకువచ్చారు. యాజమాన్యం రంగంలోకి దిగి వారిని నయాన భయాన లొంగదీసుకోజూసింది. ఈ యత్నాలు బెడిసికొట్టాయి. 2011 జూన్ 3న మారుతి సుజుకి వర్కర్స్ యూనియన్ (ఎంఎస్‌డబ్ల్యుయూ) పేరున కొత్త సంఘాన్ని రిజిస్టర్ చేయాల్సిందిగా లేబర్ కమిషనర్‌కు దరఖాస్తు అందింది. ఆ వెంటనే దరఖాస్తుపై సంతకాలు చేసిన 11 మంది కార్మికనేతలను యాజమాన్యం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వాళ్ల ఇళ్లకు బౌన్సర్లను పంపి బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుంది. ఈ చర్యకు నిరసనగా కార్మికులు సమ్మెకు దిగి ఫ్యాక్టరీలోనే బైఠాయించారు. 13 రోజుల అనంతరం యాజమాన్యం దిగివచ్చి తొలగించిన కార్మికులను తిరిగి పనిలోకి తీసుకుంది. మరోవైపు, చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగారని, సంతకాలు చేసిన వారిలో కొందరు ఇప్పటికీ ఎంయుకేయులో సభ్యులని, కొన్ని సంతకాల ఫోర్జరీ జరిగిందని చెబుతూ లేబర్ కమిషనర్ కార్మికుల దరఖాస్తును త్రోసిపుచ్చారు. అయితే, తదనంతర పరిణామాల్లో కార్మికుల పోరాటానికి తలొగ్గి ఎంఎస్‌డబ్ల్యుయూను ప్రాతినిధ్య సంఘంగా గుర్తించినా పలు సమస్యలపై యాజమాన్య మొండి వైఖరి మాత్రం కొనసాగింది.

ఈ నేపథ్యంలోనే జూలై 1 ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు సాయంత్రం పనిలో ఉన్న ఓ దళిత కార్మికుడిని పైఅధికారి కులం పేరుతో దూషించాడు. ఆ కార్మికుడు అందుకు నిరసన తెలిపాడు. మామూలుగానైతే ఆ అధికారిపై చర్య తీసుకోవాలి. కాని యాజమాన్యం అలా చేయకుండా కార్మికుడినే సస్పెండ్ చేసింది. ఇది అన్యాయమంటూ కార్మికులంతా ఒకచోట గుమికూడారు. ఇదే విషయంపై యూనియన్ నాయకులు హెచ్‌ఆర్ విభాగంతో చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వందలాది మంది బౌన్సర్లు ఫ్యాక్టరీ లోపలికి దూసుకువచ్చారు. గేట్లను మూసేసి కార్మికులను చితకబాదడం మొదలుపెట్టారు. వీరికి సూపర్‌వైజర్లు, మేనేజర్లు తోడయ్యారు. తదుపరి రంగవూపవేశం చేసిన పోలీసులు సైతం కార్మికుల పైననే విరుచుకుపడ్డారు. కార్మికులు తిరగబడ్డారు. ఇలా ఫ్యాక్టరీ ఆవరణ రణరంగంగా మారగా గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయానికి, మెయిన్ గేటుకు నిప్పు పెట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ గందరగోళంలోనే జీఎం దేవ్ సహా పలువురికి మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. నిప్పు పెట్టింది కార్మికులేనని యాజమాన్యం పేర్కొనగా, బౌన్సర్ల రూపంలో వచ్చిన గూండాలే ఈ పని చేశారని ఎంఎస్‌డబ్ల్యుయూ ఆరోపించింది. కాగా, ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు హింసకు కారకులంటూ ఎంఎస్‌డబ్ల్యుయూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సహా 114 మంది కార్మికులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. మానెసర్ ఫ్యాక్టరీలో కార్మికులు కడు దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఉదయం 5 గంటలకు కంపెనీ బస్సు ఎక్కిన కార్మికుడు సాయంత్రం ఏడు తర్వాత గాని ఇంటికి రాడు. పొద్దున ఆరింటికి ఫ్యాక్టరీ గేటు వద్ద పంచ్ చేయాలి. ఒక్క సెకను లేటుగా వచ్చినా హాఫ్ డే జీతం కట్ చేస్తారు. 6.30కు కార్మికుల చేత ఎక్సర్‌సైజు చేయిస్తారు. సరిగ్గా ఏడు గంటలకు పని చక్రం తిరగడం ప్రారంభమవుతుంది. వరసగా వచ్చే కారు ప్రతి కార్మికుని వద్ద 3 సెకన్లు మాత్రమే ఆగుతుంది. ఆ సమయంలోనే అతడు తాను చేయాల్సిన పని అసెంబ్లింగ్, ఫిక్సింగ్ వగైరా) చేయాలి. ఇలా గంటల పాటు అక్కడినుంచి కదలకుండా, చూపు మరల్చకుండా, పక్కవాళ్లతో మాట్లాడకుండా ఒక యంత్రంలా వ్యవహరించాలి. పాత రోజుల్లో కొందరు కార్మికులకు ఒకరు చొప్పున రిలీవర్లు ఉండేవాళ్లు. ఇప్పుడదీ లేదు. పొరపాటున ఒక్క కారు మిస్సయినా కార్మికుని వేతనానికి కోత పడుతుంది. ఈ గంటల్లో ఒక టీ బ్రేక్ (7 నిమిషాలు), మరో లంచ్ బ్రేక్ (అరగంట) ఉంటుంది. అప్పుడే బాత్‌రూం తదితర పనులు కూడా చేసుకోవాల్సివుంటుంది. ఇక పర్మనెంట్ కార్మికులు సహా ఎవరికీ క్యాజువల్ లీవులు, సిక్ లీవులు లేవు. కర్మ కాలి ఎవరైనా సెలవు తీసుకుంటే రోజుకు రూ.1500 చొప్పున కట్ చేస్తారు. (చట్టబద్దంగా లీవ్ తీసుకునే హక్కున్నా ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఈ నిబంధన విధించారని సమాచారం) ఈ లెక్కన నెలకు 16 వేల జీతమున్న చాలా మంది కార్మికులకు 10 వేలకు మిం చి డబ్బులు రావంటే ఆశ్చర్యం కలుగకమానదు. కాంట్రాక్టు కార్మికులకు రోజుకు 200 చొప్పున నెలకు ఆరు వేలు చెల్లిస్తారు. డుమ్మా కొడితే ఆ మేరకు తగ్గుతుంది. మారుతి గుర్గావ్ యూనిట్‌లో కూడా ఇవే పరిస్థితులున్నా అక్కడ పని చేస్తున్న కార్మికులు నలభై పైబడిన వయస్సు వారవడం, గతంలో సమ్మె చేసినప్పుడు యాజమాన్యం వేధింపులకు గురికావడం, ఎంయుకేయు నేతలు అమ్ముడుపోయి కార్మిక ప్రయోజనాలకు ద్రోహం తలపెట్టడం తదితర కారణాల మూలంగా ఉద్యమించడానికి, మరో యూనియన్‌లో సంఘటితం కావడానికి జంకుతున్నారు. ఇందుకు విరుద్ధంగా మానెసర్ కార్మికులందరూ 25 ఏళ్ల లోపు అవివాహిత యువకులు. ఉద్యోగం పోతే కుటుంబాన్ని ఎలా పోషించాలన్న భయం వారికి లేదు. అందుకే పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అన్న స్ఫూర్తితో రాజీ లేకుండా ఉద్యమిస్తున్నారు. కార్మికుల కనీస హక్కులను గుర్తించి, సమస్యను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించాల్సిన యాజమాన్యం అరెస్టులు, లాఠీచార్జీలు, వేధింపులు, తొలగింపుల మార్గం అనుసరించడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తింది.

ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల హక్కుల ఉల్లంఘనను అడ్డుకోవాలి. వారి పని పరిస్థితులు మెరుగుపడేలా చట్టాలు చేయాలి. బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది రూపంలో ప్రైవేటు సైన్యాల్ని పెంచి పోషిస్తున్న యాజమాన్యాలకు అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానెసర్ ఘటనలు దేశవ్యాప్తమవుతాయి. కొన్ని వర్గాలు భయపడుతున్నట్లుగా వామపక్ష తీవ్రవాదం వైపు కార్మికులు మొగ్గు చూపుతారు. ఇప్పటికే మధ్యభారత అడవుల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రాబల్యశక్తిగా కొనసాగుతున్న మావోయిస్టులు పట్టణాలు, నగరాల్లో సైతం పాగా వేస్తారు.

-డి మార్కండేయ
[email protected]


35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ