అంతులేని అమెరికా ఉగ్రవాదం..


Sat,October 6, 2012 04:59 PM

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రెండు బాంబుదాడుల్లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది సంవత్సరాల తరబడి రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ కారణంగా తనువు చాలించారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపునకు వస్తున్న వేళ జరిగిన ఈ రెండు ఘటనలు మానవ చరివూతలోనే అత్యంత విషాదకరమైనవిగా నిలిచా యి. ప్రతి సంవత్సరం ఆగస్టులో హిరోషిమా, నాగసాకి డేలను జరుపుకోవడం ద్వారా ప్రపంచం అప్పటి మృతులను స్మరించుకుంటున్నది. విచివూతమేమిటంటే ఈ మారణహోమాల సృష్టికర్త అయిన అమెరికా సైతం ఇటీవలికాలంలో మొసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. 2010 ఆగస్టు 6న హిరోషిమాలో జరిగిన నివాళి కార్యక్షికమానికి జపాన్‌లో అమెరికా రాయబారి జాన్ రూస్ మొట్టమొదటిసారి హాజరయ్యారు. గత సంవత్సరం నాగసాకిలో నిర్వహించిన సంస్మరణ సభకు ఆ దేశ ఉప రాయబారి జేమ్స్ జుమ్‌వాల్ట్ హాజరై అధ్యక్షుడు ఒబామా సందేశాన్ని వినిపించారు. అణ్వస్త్ర రహిత ప్రపంచ సాధన కోసం జపాన్‌తో కలిసి పని చేస్తామని ఒబామా వాగ్దానం చేశారు. అమెరికా చర్య పై జపాన్ సహా ప్రపం చ దేశాల్లో ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. ఒబామా సందేశం దయ్యాలు వేదాలు వల్లించి నట్లుగా ఉందని తీవ్రంగా నిరసించారు. యుద్ధం ముగుస్తున్న సమయాన, లొంగుబాటుకై జపాన్ ప్రయత్నిస్తున్న క్రమంలో కేవలం తన ప్రపంచాధిపత్యాన్ని చాటుకోవడానికి లక్షలాది ప్రాణాలను బలి తీసుకున్న అమెరికాకు మృతులకు నివాళులర్పించే అర్హత లేదని నిందించారు. మానవజాతి మనుగడ పట్ల అగ్రరాజ్యానికి ఏ మాత్రం నిబద్ధత ఉన్నా వెంటనే జపాన్ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజానికి హిరోషిమా-నాగసాకి ఘటనలు పథకం ప్రకారం అమెరికా సాగించిన హత్యాకాండలేనని అప్పటి చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. పోలండుపై నాజీ జర్మనీ దురాక్షికమణతో 1939 సెప్టెంబర్ 1న రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై కదన రంగాన దూకినా తన రేవు పట్టణం పెరల్‌హార్బర్‌పై జపాన్ దాడి చేసే వరకూ అమెరికా అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. రెండు పులులు కొట్లాడుకుంటుంటే చోద్యం చూస్తూ తన శక్తిని కాపాడుకునే విధానాన్ని అవలంభించింది. పోరులో ఇరుపక్షాలూ ఢీలాపడిన స్థితిలో యుద్ధంలో ప్రవేశించి ప్రాబల్యశక్తిగా అవతరించి ప్రపంచాధిపత్యాన్ని సాధించాలన్నది మొదటినుంచీ ఆ దేశ వ్యూహం గా ఉండింది. ఈ వ్యూహంలో భాగంగానే ఐన్‌స్టీన్ తదితరుల సహకారంతో 1939 అక్టోబర్‌లో అణుబాంబుల తయారీ ప్రక్రియ(మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్)ను చేపట్టింది. అమెరికా యుద్ధంలో ప్రవేశించిన నాటికి ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చింది. ఒకవైపు అక్షరాజ్యాలపై మిత్రరాజ్యాల పోరు ఉధృతమై యుద్ధం ముగింపు దశలో ప్రవేశిస్తుండగా ఈ అణుబాంబుల నిర్మాణం పూర్తయింది. 1945 ఏప్రిల్ 3వ తేదీకల్లా యురేనియం, థోరియంలతో కూడిన రెండు రకాల బాంబులను మెక్సికన్ ఎడారిలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇక నిజ ఫలితాలు ఎలా ఉంటాయో, ఎన్ని టన్నుల యురేనియం లేదా థోరియంలను విచ్ఛిన్నం చేస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో.. ఎంత మంది జనం చనిపోతారో.. రేడియేషన్ ప్రభావం ఎంత ఉంటుందో చూడడమే మిగిలింది. ఈ క్రమంలోనే అణుబాంబులతో భారీ విధ్వంసాన్ని, మారణహోమాన్ని సృష్టించడం ద్వారా ప్రపంచాన్ని బెదరగొట్టాలని, ఎర్రసైన్యం జోరుతో ముందుకువచ్చిన సోవియట్ యూనియన్‌ను భయపెట్టాలని అమెరికన్ పెద్దలు నిర్ణయించారు. జర్మనీని లక్ష్యంగా చేసుకుంటే తన సొంత జాతి(ఆంగ్లో-సాక్సన్) ప్రజలే బలవుతారు కనుక వారి దృష్టిలో మనుషుల కిందికే లెక్కకురాని మంగోలులపై అనగా జపాన్‌పై ప్రయోగించడానికి రంగం సిద్ధం చేశారు.

యుద్ధ పరిస్థితులతో నిమిత్తం లేకుండా లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న జపాన్‌పై అణుదాడి కొనసాగించడానికి, సాధ్యమైనంత ఎక్కువ విధ్వంసాన్ని, జనహననాన్ని సృష్టించడానికి అమెరికా ముందు నుంచే కుట్రకు పాల్పడిందనడానికి అనేక ఆధారాలున్నాయి. బాంబులు ఎక్కడ వేయాలనే విషయాన్ని నిర్ణయించడానికి జరిగి న టార్గెట్ కమిటీ సమావేశాల మినిట్సే ఇందుకు సాక్ష్యాలు. జనసాంవూదత అంతగా లేని టోక్యో బే మొదలుకొని జపాన్‌కు చెందిన 17 పట్టణాలు కమిటీ ముందుండగా మూడు లక్షల జనాభా కలిగిన హిరోషిమాను యురేనియం బాంబుకు మొదటి టార్గెట్‌గా, రెండు లక్షలకు పైగా జనాభా కలిగిన నిగటా పట్టణాన్ని ప్రత్యామ్నా య టార్గెట్‌గా నిర్ణయించారు. థోరియం బాంబుకు మొదటి టార్గెట్‌గా నిర్ణియించిన కొకురా పట్టణం, ప్రత్యామ్నాయ టార్గెట్‌గా నిర్ణయించిన నాగసాకి కూడా అధిక జనాభా కలిగిన పట్టణాలే.(కొకురాపై మేఘాలు దట్టంగా ఆవరించివున్న కారణంగా దానిని వదిలి నాగసాకిపై బాంబు వేశారు) పైగా హిరోషిమా, కొకురా పట్టణాల చుట్టూ ఎత్తైన పర్వతాలు విస్తరించివున్నాయి కనుక పేలుడు ప్రభా వం రెట్టింపై ఎక్కువ మందిని చంపుతుందని ఆశించారు. ఆసక్తికరమైన మరో విషయమేమిటంటే 1945 ఫిబ్రవరిలో అమెరికన్, బ్రిటన్ వైమానిక దళాలు టోక్యో సహా జపాన్‌కు చెందిన 66 పట్టణాలపై కార్పెట్ బాంబింగ్ చేసి భారీ విధ్వంసం సృష్టించాయి. సుమారు పది లక్షల మంది జపానీయులను పొట్టనబెట్టుకున్నా యి. 25 లక్షల భవనాలు ధ్వంసం కాగా కోటి మంది నిరాక్షిశయులయ్యారు. అయితే, ఈ విధ్వంసం నుంచి హిరోషిమా, నాగసాకి, కొకురా, నిగటాలను మినహాయించారు. అక్కడ ఒక్కటంటే ఒక్క బాంబు పడలేదు. తమ పట్టణాలపై అమెరికా విమానాలు బాంబులు ఎందుకు వేయడంలేదో హిరోషిమా-నాగసాకి ప్రజలకు అప్పుడు అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి వాళ్లీ లోకంలో లేరు.

లక్ష్యసాధన కోసం బీభత్సకాండను ఆయుధంగా వాడుకోవడమే ఉగ్రవాదమని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చెబుతోంది. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే హిరోషిమా-నాగసాకిల్లో అమెరికా సాగించిన మారణహోమం ఒక వ్యూహం ప్రకారం కుట్రపూరితంగా సాగించిన ఉగ్రవాదమేనని చెప్పకతప్పదు. ఆ మాటకొస్తే నాటి నుంచి నేటి వరకు ప్రపంచ దేశాలపై అమెరికా సాగించిన దురాక్షికమణ దాడులన్నీ రాజ్య ఉగ్రవాదం (స్టేట్ టెర్రరిజం) కిందికే వస్తాయి. అమెరికన్ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం కోటి మంది ప్రజానీకం మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి రెండేళ్లయినా కాకముందే గ్రీస్ అంతర్యుద్ధంలో రైటిస్టులకు మద్దతుగా బలగాలను దించి వందలాది ఉద్యమకారుల చావుకు అమెరికా కారణమైంది. 1948 నుంచి ఆరేళ్ల పాటు ఫిలిప్పైన్స్‌లో హక్‌ల తిరుగుబాటును, 1950లో పోర్టరికోను ఆక్రమించడమే కాకుండా స్థానికుల తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. 1950లలో కొరియన్ సంక్షోభంలో జోక్యం చేసుకుని వేలాది కమ్యూనిస్టులను ఊచకోత కోసింది. 1953 లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోసి రాజు షాను గద్దెనెక్కించింది. 54లో గ్వాటేమాలలో అధికారంలోకి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని దించేసి సైనిక ముఠాకు పగ్గాలప్పగించింది. 60లో వియత్నాం అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి కమ్యూనిజాన్ని అంతం చేసే పేరిట పదిహేనేళ్ల పాటు క్రూర దమనకాండను కొనసాగించి బాంబుదాడులు చేసి 20 లక్షల ప్రాణాలను హరించింది. ఇదే కాలం లో కంబోడియాలో, లావోస్‌లో సైతం బలగాలను దించి మరో 20లక్షల మంది చావుకు కారణమైంది. 1961లో క్యూబాలో, 62లో లావోస్‌లో, 64లో పనామాలో జోక్యం చేసుకుంది. 65లో ఇండోనీషియాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసింది. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో 10 లక్షల మంది చనిపోయారని అంచనా. 65-66లో డొమినిక్ రిపబ్లిక్‌లో, గ్వాటెమాలలో, 70లో ఒమన్‌లో సైనికచర్యలు నిర్వహించింది. 73లో చిలీలో సైనిక కుట్ర చేసి అధ్యక్షుడు అలెండీ సహా వందలాది మంది కమ్యూనిస్టులను హత్యచేసింది. 80లలో నికరాగ్వాలో అమెరికా సాగించిన మారణకాండను ప్రపంచ న్యాయస్థానం సైతం అంతర్జాతీయ ఉగ్రవాదంగా అభివర్ణించింది. 82-84 మధ్య లెబనాన్‌లో విధ్వంసం సృష్టించింది. 84లో గ్రెనెడా సర్కారును కూలదోసింది. 89లో పనామాపై దాడిచేసి అధ్యక్షుడిని బంధించి అమెరికన్ జైలులో ఖైదు చేసింది.

1990లో అంతర్గత సంక్షోభంతో సోవియట్ క్యాంపు కుప్పకూలిన తర్వాత ఇక అమెరికాకు ఎదురే లేకుండా పోయింది. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగానే దాడులను కొనసాగిస్తోంది. 9/11 తదనంతర పరిణామాల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై దాడిచేసి ఆక్రమించుకుంది. ఇక ఇరాక్ సంగతి మనకు తెలిసిందే. బాంబుల వర్షంతో ఇరాక్‌ను వల్లకాడు చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో లిబియా అధినేత గడ్డాఫీని అంతమొందించింది. ప్రస్తుతం ఆపరేషన్ ఇరాన్ బాటలో పయనిస్తూ ఆ మార్గంలో అడ్డుగా నిలిచిన సిరియాపై కారాలు మిరియాలు నూరుతోంది.కొలంబస్ ఆ గడ్డపై కాలుమోపిన నుంచీ అమెరికన్ చరిత్ర అంతా మూలవాసుల అస్తిత్వాన్ని, దేశాల సార్వభౌమత్వాన్ని, స్థానిక పాలకుల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన చరిత్రే. అయితే, ప్రపంచం నలుమూలలా అమెరికా ఆధిపత్య ధోరణులపై తిరగబడుతున్నారు. నాడు వియత్నాంలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగానే నేడు ఆఫ్ఘనిస్తాన్‌లోనూ తీవ్ర ప్రతిఘటనతో బలగాలు వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. రేపు సిరియాలోనూ, ఇరాన్‌లోనూ ఇదే పునరావృతమవుతుంది. భారీగా బలగాలు, లెక్కకు మిక్కిలి ఆయుధా లు, అణుబాంబులతో పులిలా పంజా విసురుతున్న అమెరికా చివరకు కాగితపు పులై ప్రజా వెల్లువలో కొట్టుకుపోవడం ఖాయం.

-డి మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ