త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..


Sat,October 6, 2012 05:00 PM

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రిటి ష్ వాళ్లు ప్రవేశపెట్టిన పాత చట్టంలోని లొసుగులను సవరించే ఉద్దేశంతో తెస్తున్న ఈ నూతన చట్టం సైతం లోపభూయిష్టంగా, ప్రజావ్యతిరేకంగా ఉందన్న విమర్శలు వెల్లు ముఖ్యంగా ప్రజావూపయోజనాలను నిర్వచించే విషయంలో బ్రిటిష్ చట్టాన్నే అనుసరించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 7న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేశ్ ఈ ప్రతిపాదిత బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా అధ్యయనం కోసం దానిని స్టాండింగ్ కమిటీకి నివేదించింది. బిల్లులోని అంశాలను కూలంకషంగా పరిశీలించిన కమిటీ కొన్ని మార్పులను సూచించింది. లాభం ప్రాతిపదికగా పనిచేసే కంపెనీలకు, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలకు ప్రభుత్వాలు భూమిని సేకరించి పెట్టడం తగదని, బహిరంగ మార్కెట్‌లో నేరుగా అవి కొనుక్కునే విధంగా చట్టా న్ని సవరించాలని అభివూపాయపడింది. భూమిని సేకరించే విషయంలో, నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా స్థానిక గ్రామసభలకు విస్తృత అధికారాలివ్వాలని, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొంది. దేశమంతా ఒకే తరహా పునరావాస ప్యాకేజీని రుద్దడం తగదని సల హా ఇచ్చింది. సెజ్‌ల కోసం, రైల్వేలైన్ల కోసం, జాతీయ రహదారుల కోసం చేసే భూసేకరణను కూడా ప్రస్తుత చట్ట పరిధిలోకి తేవాలని, సేకరించిన భూమిని సంబంధిత అవసరాల కోసం పదేళ్ల లోపు వినియోగించని పక్షంలో ఆ భూమిని పాత యజమానులకు అప్పగించే విధంగా మార్చాలని సిఫారసు చేసింది. అయితే, కమిటీ ఇచ్చిన సలహాలను, సూచనలను కేంద్రం పూర్తిగా పెడచెవిన పెట్టింది. ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండే బిల్లునే చట్టరూపంలో ఆమోదించడానికి నిశ్చయించుకుంది. పేదల భూములను పెద్దలకు, విదేశీ గద్దలకు అప్పనంగా కట్టబెట్టే యూపీఏ సర్కారు విధానాలను పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అపార ఖనిజసంపదలున్న భారతావనిని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగంగానే కొత్త చట్టం వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పురాతన కాలంలో ప్రజలందరి ఉమ్మడి ఆస్తిగా ఉన్న భూమికి రాచరిక యుగంలో తొలిసారిగా యాజమాన్యహక్కు అమలులోకి వచ్చిం ది. సైనికబలంతో ఒక ప్రాంతాన్ని జయించిన రాజు తన బంధుగణానికి, సేనాధిపతులకు, అనుచరులకు, ఇష్టులకు, సేవలు చేసిన వారికి మాన్యాలు, రాజ్యాలు అప్పగించడం ప్రారంభమైంది. ఆ మాన్యాల రైతుల నుంచి వీళ్లు శిస్తు, కౌలు వసూలు చేసుకునేవారు. బ్రిటిష్‌వాళ్లు వచ్చాక పట్టాదారు హక్కుపవూతం(టైటిల్‌డీడ్) విధానాన్ని ప్రవేశపెట్టారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆ కాలంలో నామమావూతపు ధరలే ఉండేవి. స్వాతంవూత్యానంతరం ప్రత్యేకించి పంచవర్ష ప్రణాళికలు, హరితవిప్లవం నేపథ్యంలో ఈ ధరల్లో పెరుగుదల నమోదైంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల ఫలితంగా 1990ల తర్వాత పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని తాకింది. పల్లెల్లో సైతం భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అటవీ, పర్వ త ప్రాంతాలు తప్ప వృథా భూములన్నవి నేడు దాదాపుగా లేవు. అవి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్నాయి.ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్న భూముల్లో అభివృద్ధి ప్రాజెక్టుల స్థాపన ప్రతిపాదనల నేపథ్యంలో భూసేకరణ చట్టాలు అవసరమయ్యాయి. ముఖ్యంగా అప్పటి విప్లవాత్మక ఆవిష్కరణల్లో ఒకటైన రైల్వేల కోసం ప్రైవేట్ వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడం తప్పనిసరైం ది. 1894లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ చట్టంలో ఈ మేరకు పలు అంశాలను పొందుపర్చారు. (గనులకు భూసేకరణ కోసం 1885లోనే విడిగా చట్టం తెచ్చారు.) అభివృద్ధి ప్రాజెక్టుల కోసం, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీల కోసం భూమిని సేకరించేందుకు ఇందులో వీలు కల్పించారు. ఈ చట్టం ప్రకారం ఓ ప్రైవేట్ కంపెనీ కోసం సైతం ప్రభుత్వం భూమిని సేకరించి పెట్టవచ్చు. అందుకు స్థాని క ప్రజల సమ్మతి అక్కరలేదు. సామాజిక, పర్యావరణ ప్రభావాలను పట్టించుకోనక్కరలేదు. మార్కెట్ విలువపై ఆధారపడి అప్పటికి ఆ భూమిని ఏ రకంగా వినియోగించుకుంటున్నారనే విషయాన్ని బట్టి కేవలం నష్టపరిహారం మాత్రమే చెల్లిస్తారు. పునరావాసం ఊసే లేదు. సేకరించిన భూమిలో సంబంధిత ప్రాజెక్టును చేపట్టకున్నా పూర్వపు యజమానికి తిరిగి దఖలు పర్చడం ఉండదు. ఈ చట్టాన్ని అస్త్రంగా ఉపయోగించుకు ని ప్రభుత్వాలు దాదాపు అన్ని సందర్భాల్లోనూ బలవూపయోగంతోనే భూసేకరణ చేస్తుండేవి. గమనించాల్సిన విషయమేమిటంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వమూ ఒక సమగ్ర భూసేకరణ చట్టాన్ని తేలేకపోయాయి. అవసరాల మేరకు 1956లో జాతీయ రహదారుల కోసం, 1962లో అణువిద్యుత్ ప్రాజెక్టుల కోసం, 1989లో రైల్వేల కోసం, 2005లో సెజ్ పత్యేక ఆర్థిక మండళ్లు)ల కోసం భూసేకరణ చట్టాలను ఆమోదించాయి. తదనంతర కాలంలో ఈ చట్టాలకు సవరణలు సైతం తెచ్చా యి. అయితే, 1894 చట్టం సహా ఈచట్టాలన్నీ అరకొరగా ఉన్నాయని, పలు అంశాల్లో స్పష్టత కొరవడి దుర్వినియోగమవుతున్నాయని, నష్టపరిహారం విషయంలో ప్రాంతానికో న్యాయం జరుగుతోందన్న విమర్శలు వచ్చాయి. ఉదాహరణకు కోస్తాలో సేకరించిన భూములకు ఇచ్చే పరిహారంతో పోల్చితే తెలంగాణ భూములకు చాలా తక్కువ చెల్లిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు ఆదిలాబాద్‌లో ఒక రకం గా, కరీంనగర్‌లో ఒక రకంగా పరిహారం ఇచ్చారు. ఇక పునరావాసం, ఉపాధి కల్పన తదితర డిమాండ్లపై అనేక చోట్ల దశాబ్దాలుగా ఆందోళనలు కొనసాగుతుండడం మనం చూస్తూనేవున్నాం.

బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఇప్పటికీ సంస్కరించకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం 2007లో భూసేకరణ, పునరావాసంలపై రెండు విడి విడి బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. వీటిని స్టాండింగ్ కమిటీలకు నివేదించగా కొన్ని మార్పులు సూచించాయి. ఈ లోపు 14వ లోక్‌సభ 2009లో రద్దు కావడంతో ఈ బిల్లులకు కాలం చెల్లింది. తిరిగి అధికారంలోకి వచ్చిన యూపీఏ 2011లో రెండు విడి బిల్లులను ఒక్కటిగా చేసి ప్రస్తుత బిల్లును సభ ముందుంచింది. అయితే, ఈ బిల్లులోనూ ముఖ్యమైన లోపాలున్నయనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఒక సమగ్ర చట్టం తేవడమే ప్రభుత్వ లక్ష్యమైతే జాతీయ రహదారులు, రైల్వేలు, అణు ప్రాజెక్టులు, సెజ్‌లు తదితర 16 రకాల విడివిడి భూసేకరణ చట్టాలను కొత్త చట్టం పరిధిలో ఎందుకు చేర్చలేదన్నది వివాదాస్పదమైంది. ఈ 16 చట్టాల్లో భూసేకరణకు సంబంధించి తప్ప బాధితుల పునరావాసం, ఉపాధికి వీలు కల్పించే నిబంధనలు లేకపోవడం గమనార్హం. వీటికితోడు మరికొన్ని విడి చట్టాలను ఆమోదించే అధికారాన్ని సైతం కేంద్రానికి కొత్త చట్టం కల్పించింది. పబ్లిక్ అవసరాల కోసం కాకుండా ప్రైవేట్ అవసరాల కోసం భూమిని సేకరించినప్పుడు బాధిత ప్రజానీకంలో 80శాతం అందుకు సమ్మతించాలని కొత్త చట్టం చెబుతోంది. బాధిత భూయజమానులని కాకుండా బాధిత ప్రజలని పేర్కొనడంలో మతలబు ఉంది. ఉదాహరణకు ఓ ప్రైవేట్ విద్యుత్ ప్లాంటు భూసేకరణ కోసం భూమిని కోల్పోనున్న రైతులు కాకుండా ఆయా గ్రామాల ప్రజలందరిలో 80శాతం అంగీకరిస్తే చాలు భూస్వాధీనం చేసుకోవచ్చన్నమాట. ప్రజాభివూపాయ సేకరణ కూడా గ్రామసభ ఆధ్వర్యంలో కాకుండా అధికారుల నేతృత్వంలో జరుగుతుంది. అనగా భూయజమానులంతా వ్యతిరేకించినప్పటికీ ఓ ప్రైవేటు కంపెనీ లాభాల కోసం భూములను లాక్కునేందుకు కొత్త చట్టం సర్కారుకు అధికారమిస్తుంది.

భూవిలువను, దానిపై గల ఇతర ఆస్తుల విలువను అప్పటి మార్కెట్ రేటు ప్రకారం లెక్కకట్టాలని కొత్త చట్టం చెబుతోంది. స్టాంపు చట్టం ప్రకారం అక్కడి భూముల రిజిస్ట్రేషన్ కోసం పాటిస్తున్న రేటు.. ఆ ప్రాం త భూముల్లో మూడేళ్లుగా అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ ఫిఫ్టీ రిజిస్ట్రేషన్ల సరాసరి.. ఈ రెంటిలో ఏది ఎక్కువైతే దానిని మార్కెట్ రేటుగా నిర్ణయిస్తారు. పట్టణాల్లో అయితే ఇంతే మొత్తాన్ని, పల్లెల్లోనైతే ఈ మొత్తానికి రెట్టింపును భూయజమానికి చెల్లించాల్సివుంటుంది. చాలాసార్లు రిజిస్ట్రేషన్ విలువలు నిజవిలువతో పోల్చితే తక్కు వే ఉంటాయి కనుక యజమానులకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నా రు. మరో వివాదాస్పద అంశం ప్రభుత్వంతో సంబం ధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు స్వయంగా చేపట్టే భూ కొనుగోళ్లు. పట్టణాల్లో 50 ఎకరాలు, పల్లెల్లో వంద ఎకరాలు దాటి కొన్న పక్షంలో బాధిత కుటుంబాలకు పునరావాసం, ఉపాధి కల్పన బాధ్యత ఆయా కంపెనీలపై ఉంటుందని కొత్త చట్టం పేర్కొంటోంది. అయితే, వేరు వేరు కంపెనీల పేర్లతో ముక్కలు ముక్కలుగా పై సీలింగ్ వర్తించకుండా భూములు కొని కంపెనీలు పునరావాసాన్ని గాలికొదిలేసే వీలుంది. ఇక, ప్రతి భూసేకరణకూ సామాజిక ప్రభావ అధ్యయనం తప్పనిసరి చేసిన ఫలితంగా పబ్లిక్ టాయిపూట్ల, బస్‌షెల్టర్ల నిర్మాణం వంటి చిన్న చిన్న పనుల్లో అనవసర జాప్యం జరిగే అవకాశముంది.మొత్తంగా కొత్త చట్టం కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉందన్న విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. ప్రపంచీకరణ పేరిట దేశాన్ని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే, అభివృద్ధి నెపంతో జీవన విధ్వంసం సృష్టించే ప్రక్రియకు ఈ చట్టం ఊతమిస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావూపయోజనాలకు ఇచ్చిన నిర్వచనాన్ని మార్చడం ద్వారా పారిక్షిశామికీకరణ, ప్రైవేటీకరణ, పట్టణీకరణ విధానాలకు భూసేకరణను మన్మోహన్ సర్కారు చట్టబద్ధం చేయబోతోందని అభివూపాయపడుతున్నారు. కొత్త చట్టం కొండ ను తవ్వి ఎలుకను పట్టిందంటున్నారు. బాధితుల పునరావాసం అంశాన్ని చేర్చడం ద్వారా విప్లవాత్మక సంస్కరణకు పూనుకున్నామని ఊదరగొడుతున్న ప్రభుత్వం సెజ్‌ల పేరిట వేలాది ఎకరాలను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడాన్ని కొత్త చట్టం పరిధిలోకి ఎందుకు తేలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ అన్ని అంశాలను, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదిత బిల్లులో తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

-డి. మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Featured Articles