పని మనుషులా? బానిసలా?


Sat,October 6, 2012 05:01 PM

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకరణ విధానాల ఫలితంగా పెరిగిన పట్టణ ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల నివాసాలే ఈ కొత్త వ్యవస్థకు నిలయాలుగా మారాయి. పంట పొలాల నుంచి పరిక్షిశమలకు కార్మికులుగా, ఉద్యోగులుగా వెళ్లాల్సిన స్త్రీ పురుషులు పనిమనుషులుగా స్థిరపడుతున్నారు. ఏ నగరంలోని ఏ ఇంటిని చూసినా ఇప్పుడు పనిమనుషులో లేక పనిపిల్లలో కనబడడం సాధారణమైంది. యజమాని ఇంట్లోనే నివాసముంటూ 24 గంటలూ బండచాకిరీ చేసేవాళ్లు కొందరైతే, కొన్ని గంటల పాటు కొన్ని రకాల పనులు చేసి తమ ఇళ్లకు తిరిగి వెళ్లేవాళ్లు మరికొందరు. పురుషులు, స్త్రీలు, వృద్ధులు, ముక్కుపచ్చలారని పసిపిల్లలు.. ఇలా అన్ని వయస్సుల వాళ్లూ పనిమనుషుల్లో ఉన్నారు. ఒక అధికారిక అంచనా ప్రకారం 2008 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల మంది పనిమనుషులు ఉన్నా రు. సాధారణంగా వీరంతా కింది కులాలవాళ్లు. నిరుపేదలు. నిరక్షరాస్యులు. వీరిలో 8కోట్ల మంది 10 నుంచి 70ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్త్రీలు. కోటి 10 లక్షల మంది 14ఏళ్లలోపు బాలికలు. ఏ హక్కులూ, చట్టపరమైన రక్షణలు లేకుండా కేవలం యజమానుల దయాదాక్షిణ్యాల పైననే ఆధారపడి కాలం గడుపుతున్న ఈ ఇంటి పనివారికి సంబంధించి గత వారం కేరళలోని త్రివేంవూడంలో ఓ సదస్సు జరిగింది. దక్షిణాసియా దేశాలన్నింటి నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి కూడా నలుగురు వెళ్లారు. ఇంటి పనిని గౌరవనీయమైన పనిగా, పనిమనుషులను పూర్తి స్థాయి కార్మికులుగా గుర్తించాలని, కార్మికులకు వర్తించే అన్ని చట్టాలను, హక్కులను వీరికి కూడా వర్తింపజేయాలన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) తీర్మానాన్ని అమలుచేయాలని సమావేశం డిమాండ్ చేసింది. గృహ కార్మికులకు సంబంధించి నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ రూపొందించిన ముసాయిదా జాతీయ విధానాన్ని కేంద్ర కేబినెట్ వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది.


దేశంలో పనిమనుషులకు కడుదీనమైన చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకముందు తెల్లదొరల, రాజుల, జమీందార్ల, జాగీర్దార్ల ఇళ్లలో పాచి పనులు, వంటలు చేయడానికి సేవకులు ఉండేవాళ్లు. శూద్ర, నిమ్న కులాలకు చెందిన పేదలు కొందరు పూర్తికాలం యజమానుల సేవలు చేస్తే, మరికొందరు వెట్టి రూపంలో ఇతర పనులు నిర్వహించేవాళ్లు. 1947 తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోగా దినదినం పట్టణాలు వృద్ధి చెందుతూ ఒక కొత్త వర్గం ఉనికిలోకి వచ్చింది. పరిక్షిశమలు, పెట్టుబడులే ప్రాతిపదికగా ఈ వర్గం దినదినాభివృద్ధి చెందింది. వీరిళ్లలో కూడా కొన్ని కింది కులాలకు చెందిన పేదలు, అనాథ పిల్లలే పని చేస్తుండేవాళ్లు. 1980 వరకూ ఈ పరిస్థితే కొనసాగింది. తర్వాతికాలంలో వరుస ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పులు సృష్టించాయి. పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయానికి బదులుగా పరిక్షిశమలు, సేవల రంగానికి పెద్దపీట వేయడం ఆరంభమైంది. ప్రపంచీకరణ పేరిట మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు బార్లా తెరువడం, ప్రైవేటు రంగంలో చిన్నా పెద్దా పెట్టుబడులకు ఇతోధిక ప్రోత్సాహం, ఐటీ విస్తరణ, ప్రభుత్వ విభాగాల్లో, సంక్షేమ పథకాల్లో అవినీతి ప్రవాహం.. ఇవన్నీ కలిసి సమాజ స్వరూపాన్ని పూర్తి గా మార్చివేశాయి. నగరాలు, పట్టణాల సంఖ్య బాగా పెరిగింది. ధనికులు మరింత ధనికులయ్యారు. వారి సంపద లక్షల నుంచి కోట్లకు చేరింది. పట్టణ మధ్యతరగతిలోని ఒక వర్గం సైతం దళారులుగా, అధికారులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి శ్రమకు దూరమైంది. డబ్బు కు, విలాసాలకు దగ్గరైంది. మరో వర్గం పశ్చిమ సంస్కృతికి దగ్గరై ఊహాలోకాల్లో విహరిస్తూ డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా తల్లిదంవూడులను, తోబుట్టువులను కూడా పట్టించుకోకుండా ఎప్పుడెప్పుడు పెద్దోళ్లమవుదామా అని అర్రులుచాచి ఎదురుచూస్తోంది.


వ్యవసాయానికి ఆసరా కరువై పల్లెల్లో భూస్వాములు మినహా అన్ని వర్గాలూ అప్పుల పాలై దివాళా తీశాయి. నిరుద్యోగం, ఆత్మహత్యలు, ఆకలిచావులు నిత్యకృత్యమయ్యాయి. ఓసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి రైతులను దెబ్బతీస్తే పెరిగిన వినిమయ వస్తు సంస్కృతి చేతివృత్తుల వారిని కోలుకోకుండా చేసింది. గనుల పేరిట, కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు, డ్యాంల నిర్మాణం పేరిట, రహదారుల అభివృద్ధి పేరి ట, వన్యవూపాణుల సంరక్షణ పేరిట లక్షలాది ఎకరాలను లాక్కోవడం మూలంగా అనేక కుటుంబాలు వీధినపడ్డాయి. ఇలా పల్లెల్లో అన్ని రకాలుగా బతుకుదెరువును కోల్పోయిన అభాగ్యులకు విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలు ఆశ్రయమిచ్చాయి. పురుషులు అడ్డాకూలీలుగా మారితే, స్త్రీలు, పిల్లలు పనిమనుషులుగా స్థిరపడ్డారు. అలా పనిమనుషుల సంఖ్య రోజురోజుకూ పెరిగింది. ఆకలి, నిరక్షరాస్యత కలగలిసి యజమాని ఇచ్చేది ఎంతని చూడకుండా గొడ్డుచాకిరీ చేయడం అలవాటైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ధనవంతుల కాలనీల్లోని ఏ భవంతిలో చూసినా బట్టలుతుకుతూ నో, వంట చేస్తూనో, అంట్లు తోముతూనో, ఇళ్లు కడుగుతూనో, పిల్లలను ఆడిస్తూనో డజన్ల కొలదీ నేడు ఇలాంటి ముక్కుపచ్చలారని పిల్లలు, స్త్రీ, పురుషులు కనిపిస్తారు. కుటుంబసభ్యులంతా ఒకే అపార్ట్‌మెంటులోని వివిధ ఇళ్లలో రకరకాల పనులు చేస్తుం ఆ కుటుంబపెద్ద వాచ్‌మన్‌గా గేటు వద్ద నిలబడివుండడం మనం గమనించవచ్చు.

పనిమనుషుల పద్ధతిని ప్రస్తుత కాలపు బానిసవ్యవస్థగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అభివూపాయపడింది. కూలీడబ్బుల కోసం ప్రైవేటు గృహాల్లో ఇంటి పని చేసే వారు పనిమనుషులని, వీరిని గృహకార్మికులుగా గుర్తించాలని ఐఎల్‌ఓ పేర్కొంది. వీరు అసంఘటితంగా, చెల్లాచెదురుగా పనిచేస్తారు. ఎలాంటి హక్కులు లేవు. చట్టాల రక్షణ లేదు. కూలీ యజమాని ఇష్టం. సాధారణ కార్మిక చట్టాలు వీరికి వర్తించకపోవడం వల్ల వీరికి నైపుణ్యం లేని కార్మికులకు చెల్లించే వేతనాల్లో నాలుగోవంతు కూడా చెల్లించరు. కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి లేదా గంటలను బట్టి లేదా పనిని బట్టి జీతం నిర్ణయిస్తారు. రూ. 150 నుంచి 2వేల వరకు ఇస్తారు. ఇంట్లోవాళ్లు తినగా మిగిలింది వీరికి అంటగడతారు.వీక్లీ ఆఫ్‌లు, సెలవులు ఉండవు. జ్వరమొచ్చి పని మానేసినా మరునాడు తిట్ల పురాణాన్ని భరించాల్సివుంటుంది. ఏదైనా వస్తువు మాయమైతే వీరినే బాధ్యులు చేస్తారు. దొంగగా ముద్ర వేస్తారు. కొడతారు. కేసులు పెడతారు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు పిల్లలు చాలామంది యజమాని ఇంట్లోనే ఉండి 24 గంటలూ బానిసల్లాగా పనిచేస్తారు. చదివిస్తాం.. బాగోగులు చూస్తామంటూ పల్లెటూరి పేద కుటుంబాల నుంచి, ఆదివాసీ తండాల నుంచి తెచ్చుకుంటారు కనుక బాలకార్మిక చట్టాలు కూడా వీరి విషయంలో చాలాసార్లు వర్తించవు. దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వోద్యోగుపూవరూ 14 ఏళ్లలోపు బాలలను పనిమనుషులుగా పెట్టుకోవడం నేరం. కాని ఆయా చట్టాల్లో ఉన్న లొసుగుల మూలంగా ఏ ఒక్క కేసులోనూ శిక్ష పడిన సందర్భాలు లేనేలేవు. ఇక, సౌదీ లాంటి గల్ఫ్ దేశాలకు పనిమనుషులుగా, సేవకులుగా వెళ్లినవారి పరిస్థితి బానిసల కంటే కూడా హీనాతిహీనం. శారీరక, మానసిక, లైంగిక చిత్రహింసలు సర్వసాధారణమని చెప్పవచ్చు. యజమాని ఆమోదముద్ర లేకుండా స్వదేశానికి తిరిగి అక్క డ అమలులో ఉన్న చట్టాల ప్రకారం కుదరదు కనుక ఎన్ని ఇబ్బందులనైనా భరిస్తూ పదో పాతికో సంపాదించుకుని బయటపడక తప్పదు.

పనిమనుషుల హక్కుల రక్షణ కోసం దేశంలో మొదటిసారిగా 1985లో జాతీయ గృహ కార్మికుల ఉద్యమం (ఎన్‌డీడబ్యూఎం) ఏర్పడింది. బెల్జియంకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త జియాన్నె డెవోస్ ఈ సంస్థను స్థాపించి ఇప్పటికీ జాతీయ సమన్వయకర్తగా పని చేస్తున్నారు. 17 రాష్ట్రాల్లో బలమైన నిర్మాణమున్న ఈ సంస్థ ప్రపంచీకరణ నేపథ్యంలో పనిమనుషుల దీనస్థితి, పట్టణాలకు వలసలు, మానవహక్కులు, పనిపిల్లల లైంగిక వేధింపులు, నిర్బంధచాకిరీ తదితర అంశాలపై ఇతర సంస్థలతో కలిసి ఉద్యమిస్తోంది. ఫలితంగా 2006 తర్వాత ఆంధ్రవూపదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ ప్రభుత్వాలు పనిమనుషులను కనీసవేతనాల చట్టం పరిధిలోకి తెచ్చాయి. కేంద్రం కూడా వీరిని అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం పరిధిలోకి తేవడమే కాకుండా ఒక జాతీయవిధానాన్ని రూపొందించడానికి టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. దీనిపై 2008లో ముసాయిదా బిల్లును తయారుచేయగా కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సివుంది.


అయితే, విధానాలు, చట్టాలు మన దేశంలో అంతగా పనిచేయవని ఎప్పుడో రుజువైపోయింది. జనాభాలోని వివిధ వర్గాల, సమూహాల హక్కుల, అధికారాల రక్షణకని తెచ్చిన కనీస వేతనాల చట్టం.. బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక చట్టం.. అసంఘటిత కార్మికుల హక్కుల రక్షణ చట్టం.. వరకట్న నిషేధ చట్టం, బాల్యవివాహాల నివారణ చట్టం.. గృహహింస నివారణ చట్టం.. ఇలా లెక్కకు మిక్కిలిగా వచ్చిన ఎన్నెన్నో చట్టాలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో మనకు తెలియంది కాదు. ఒకవేళ కేంద్రం పనిమనుషుల విషయంలోనూ భవిష్యత్తులో చట్టం తెచ్చినా అది వీటి సరసన మరో పనికిరాని చట్టంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పనిమనుషుల బతుకులు మారాలంటే ముందు ఇంటి పనిని ఒక పరిక్షిశమగా, సేవల రంగంగా గుర్తించాలి. పనిమనుషులు పరుల ఇళ్లల్లో, గృహిణులు తమ సొంత ఇంట్లో చేసే శ్రమకు విలువను, వేతనాన్ని నిర్ణయించాలి. పురుషుడు బయటకు వెళ్లి ఉద్యోగం చేసి సంపాదిస్తే గృహిణి ఇంట్లో పనిచేసి సంపాదిస్తుందన్న చైతన్యం సమాజంలో పెరగాలి. అప్పుడే బయటకు వెళ్లి ఉద్యోగం చేసే మహిళ స్థానం లో ఇంటి పని చేసే పనిమనిషికి గృహ కార్మికురాలిగా గౌరవం లభిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఈ లోపు తాము చేసిన చట్టాలను చిత్తశుద్ధితో కఠినంగా అమలుచేయాలి. గృహ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి.

-డి. మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Featured Articles