ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు


Sat,October 6, 2012 05:01 PM

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీలిపోయారు. మావోయిస్టు పార్టీ చైర్మన్ పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ, ప్రధాని బాబూరామ్ భట్టరాయ్‌ల వర్గం అనుసరిస్తున్న నయా రివిజనిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ జూన్ 16-18 తేదీల మధ్య ఖాట్మండూ సమీపంలోని బౌద్ధలో సమావేశమైన అసంతృప్త వర్గం మాతృసంస్థ నుంచి వైదొలిగి కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు (సీపీఎన్-ఎం) పేరిట కొత్త పార్టీని ఏర్పరుస్తున్నట్లు ప్రకటించింది. నూతన రాజకీయ పంథాను, నిబంధనావళిని ఏకక్షిగీవంగా ఆమోదించింది. చైర్మన్‌గా మోహన్ వైద్య అలియాస్ కిరణ్, ప్రధాన కార్యదర్శిగా రామ్‌బహదూర్ థాపా అలియాస్ బాదల్, కార్యదర్శిగా సీపీ గజూల్‌లను ఎన్నుకుంది.

పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలకు సభ్యులను ఎంపిక చేసే అధికారాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేసిన సెంట్రల్ వర్కింగ్ కమిటీకి ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరిలో జాతీయ మహాసభలను నిర్వహించాలని నిశ్చయించింది. కొత్త పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిణామాలను మంగళవారం మీడియాకు వివరించిన చైర్మన్ వైద్య నేపాల్‌లో ప్రజా రిపబ్లిక్ స్థాపనకై తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. సాయుధ ప్రజా తిరుగుబాటే తమ మార్గమని, పార్లమెంటరీ పంథాను అనుసరించబోమని స్పష్టం చేశారు. ప్రచండ, భట్టరాయ్ వర్గాలు విప్లవ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కాయని, భారత విస్తరణవాద ప్రభుత్వానికి తొత్తులుగా మారాయన్నా రు. మెజారిటీ ప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ 2005 చున్‌వాంగ్ సమావేశంలో ప్రజాయుద్ధం స్థానంలో ప్రజాస్వామిక రిపబ్లిక్ పేరిట బూర్జువా పార్టీలతో ఐక్యసంఘటన ఏర్పాటు ఎత్తుగడలకు పూనుకున్నాయని చెప్పా రు. అప్పటి నుంచి తాము పార్టీలోనే అంతర్గత పోరా టం కొనసాగిస్తున్నామని, అయితే అధికార మత్తులో నిండా మునిగిన ప్రచండ తప్పులను గుర్తించే స్థితిలో లేడనే నిర్ణయానికి వచ్చి ‘వేర్పాటు’ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

మాతృసంస్థతో ఐక్యతా చర్చలకు వెళ్లబోమని, వాళ్లే తమ వద్దకు రావాలని ప్రకటించారు. పాత కేంద్ర కమిటీలోని మూడవ వంతు (77 మంది) సభ్యులు తమతో ఉన్నారని, రాష్ట్ర, జిల్లాస్థాయి కేడర్‌లో మెజారిటీ కొత్తపార్టీలోకి వచ్చారని వివరించారు.

మావోయిస్టుల్లో చీలిక రావడం నేపాల్ రాజకీయాలకే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి కీలకమైన పరిణామంగా భావించవచ్చు. 1994లో ఏర్పడిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 96లో దేశవ్యాప్తంగా ప్రజాయుద్ధాన్ని ప్రారంభించింది. రాజు నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలను కూడగట్టింది. ప్రజాస్వామిక ఉద్యమాల పేరిట అప్పటిదాకా పోరు సల్పుతూ అవకాశవాద పద్ధతు ల్లో రాజుతో కుమ్మక్కయి ప్రభుత్వాలనేర్పరుస్తున్న బూర్జువా, రివిజనిస్టు పార్టీల డొల్లతనాన్ని బయటపెట్టింది. వరుస రాజకీయ సంక్షోభాలకు ఈ పార్టీలే కారణమని ప్రకటించి నిజమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రజాయుద్ధం ద్వారానే సాధ్యమని చాటిచెప్పింది. యువతీ యువకులు ప్రజా విముక్తి సైన్యం(పీఎల్‌ఏ)లో పెద్దయెత్తున చేరి రాచరికాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చింది. శతాబ్దాలుగా ఫ్యూడల్ నియంతృత్వ పాలనలో మగ్గిన నేపాలీలు మావోయిస్టుల పిలుపునకు సానుకూలంగా స్పందించారు. వారి నాయకత్వంలో కొనసాగిన పలు సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాల్లో విస్తృతంగా పాల్గొన్నారు, కొద్ది సంవత్సరాల కాలంలోనే ఆ పార్టీ గ్రామక్షిగామానా విస్తరించింది. ప్రజా రాజకీయాధికారాంగాలు, పీపుల్స్ మిలీషియా ఏర్పడ్డాయి.

ఆరంభంలో రెండు మూడు ప్లాటూన్లుగా ఉన్న, పీఎల్‌ఏ కంపెనీలుగా, బెటాలియన్లుగా అభివృద్ధి చెంది ప్రభుత్వ బలగాలను కంటోన్మెంట్లకు పరిమితం చేసేస్థాయికి ఎదిగింది. 2004 కల్లా యూనిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు(యూసీపీఎన్-ఎం)గా ఏర్పడి ఖాట్మం డూ లాంటి నగరాలు, కొన్ని పెద్ద పట్టణాలు మినహా మిగతా ప్రాంతాలన్నింటినీ విముక్తి ప్రాంతాలుగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులతో పొంచివున్న ముప్పును గ్రహించిన రాజు జ్ఞానేంద్ర 2005 ఫిబ్రవరి 1న ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికైన అప్పటి షేర్ బహదూర్ దేవ్‌బా ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక పాలన విధించి సర్వాధికారాలు తన చేతిలోకి తెచ్చుకున్నారు.

ఇక్కడ నేపాల్ రాజకీయ చరివూతను క్లుప్తంగానైనా చెప్పాలి. క్రీస్తుపూర్వం నుంచీ రాచరిక పాలనలో నలిగిన నేపాల్‌లో 1940లలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం మొదలైంది. ఉద్యమ జోరుకు తలొగ్గిన అప్పటి రాజు త్రిభువన్ ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. 1959 నుంచి 89 వరకు సుమారు ముప్పై ఏళ్లు పార్టీ రహిత ‘పంచాయతీ’ పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ రాజ్యాంగబద్ద రాచరిక పాలన కొనసాగింది. 1990లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మరోసారి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం తీవ్రతరం కాగా, త్రిభువన్ మనుమడు బీరేంద్ర రాజ్యాంగ సంస్కరణలకు అంగీకరించి బహుళపక్ష పార్లమెంటరీ పద్ధతిలో పాలన సాగించడానికి ఒప్పుకున్నారు. 1990 నుంచి 2005 వరకు 14 ఏళ్ల కాలంలో నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్(యూఎంఎల్) పార్టీలకు చెందిన 13 ప్రభుత్వాలు అధికారంలో కొనసాగాయి.

థాపా ప్రభుత్వాన్ని రాజు రద్దు చేయగానే దేశంలో మరోసారి ప్రజాస్వా మ్య పునరుద్ధరణోద్యమానికి తెర లేచింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్ (యూఎంఎల్) తదితర ఏడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి వీధుల్లోకెక్కాయి. అయితే, దేశ రాజకీయ చిత్రపటంలో ప్రాబల్యశక్తిగా ఎదిగిన మావోయిస్టు పార్టీ భాగస్వామ్యం లేకుండా ఉద్యమం సఫలం కాదని గుర్తించిన కూటమి ఆ పార్టీతో చర్చలకు ముందుకువచ్చింది. మరోవైపు, మావోయిస్టులు సైతం ఈ సంక్షోభ పరిస్థితులను విప్లవానికి అనుకూలంగా మలుచుకోవడం కోసం సెప్టెంబర్‌లో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించారు. బూర్జువా పార్టీలతో శాంతి చర్చలకు అంగీకరించారు. 2005 నవంబర్ 22న ఏడు పార్టీల కూటమికి మావోయిస్టులకు మధ్య చారివూతాత్మక 12 అంశాల ఒప్పందం కుదిరింది. రాచరిక పాలనకు చరమగీతం పాడాలని, ప్రతినిధుల సభను ఎన్నుకుని కొత్త రాజ్యాంగాన్ని రచించి నూతన శకానికి నాంది పలకాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.

అటు మావోయిస్టుల సాయుధ ఉద్యమం, ఇటు ఏడు పార్టీల చట్టబద్ద ఆందోళన కలిసి లోక్‌తాంవూతిక్ ఆందోళన్ ఉప్పెనలా ఎగిసింది. 2006 ఏప్రిల్ 5 నుంచి 19 రోజుల పాటు ఉధృతంగా సాగి న ఈ ఆందోళన చివరకు రాజు దిగివచ్చి తన సార్వభౌమత్వాన్ని వదులుకుంటున్నట్లు, ప్రతినిధుల సభను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో విజయవంతంగా ముగిసింది.

ఆ తర్వాతి కాలంలో పరిణామాలు వేగంగా జరిగాయి. పునరుద్ధరించిన ప్రతినిధులసభ ఆ వెంటనే రాజు అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానించింది. దేశాన్ని లౌకికరాజ్యంగా ప్రకటించింది. జీ పీ కోయిరాలా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కొత్త రాజ్యాంగాన్ని లిఖించడం కోసం కానిస్టిట్యూషన ల్ అసెంబ్లీ(రాజ్యాంగసభ)కి వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 21న కోయిరాలా ప్రభుత్వంతో సమక్షిగశాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన మావోయిస్టులు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావడానికి, ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించారు. పదేళ్ల అంతర్యుద్ధం ముగిసిందని, తాము సాయుధపోరును విరమించి పార్లమెంటరీ బాటలో విప్లవ విజయానికి కృషి చేస్తామని యూసీపీఎన్(ఎం) చైర్మన్ ప్రచండ ప్రకటించారు.

అలా పార్లమెంటరీ పంథాకి మళ్లిన మావోయిస్టులు 2008 ఏప్రిల్ 10న రాజ్యాంగసభకు జరిగిన ఎన్నికల్లో 575 సీట్లకు గాను 220 సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచారు. మేలో సమావేశమైన సభ దేశాన్ని ఫెడరల్ రిపబ్లిక్‌గా ప్రకటించింది. రాజు స్థానంలో నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రాంభరణ్‌యాదవ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మూడు నెలల అనిశ్చితి తర్వాత ఆగస్టు 15న ప్రచండ ప్రధానిగా సీపీఎన్(యూఎంఎల్)తో కల్సి మావోయిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పరచారు. అయితే, సైన్యాధికారి తొలగింపు వివాదంతో కేవ లం 9 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత రెండేళ్ల లో రెండు ప్రభుత్వాలు మారి శాంతి ప్రక్రియకు విఘాతమేర్పడే వాతావరణంలో 2011 ఆగస్టు 28న మరోసారి రాజ్యాంగసభ మావోయిస్టుల వైపు మొగ్గు చూపింది. మదేశీ పార్టీల సహకారంతో మావోయిస్టు పార్టీ వైస్‌చైర్మన్ బాబురామ్ భట్టరాయ్ నేపాల్ 36వ ప్రధానమంవూతిగా బాధ్యతలు చేపట్టా రు. నవంబర్ 1న ప్రధానపక్షాలతో మావోయిస్టులు ఏడు సూత్రాల ఒప్పం దం చేసుకున్నారు. వీలైనంత త్వరగా రాజ్యాంగాన్ని రచించి ఆమోదించడం, సార్వవూతిక ఎన్నికలు జరిపి ప్రజావూపభుత్వాన్ని ఏర్పరచడం, పీఎల్‌ఏ గెరిల్లాలను నేపాల్ సైన్యంలో చేర్చుకోవడం ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు.

అయితే, ప్రజాయుద్ధాన్ని దారిమళ్లించి పార్లమెంటరీ బాట పట్టించిన ప్రచండ పంథాను పార్టీలోని ఓ బలమైన వర్గం మొదటినుంచీ వ్యతిరేకిస్తోం ది. 21వ శతాబ్దంలో నూతన ప్రజాస్వామ్యమంటే ఫ్యూడల్, సామ్రాజ్యవా ద శక్తులకు వ్యతిరేకంగా కలిసివచ్చే బూర్జువా పార్టీలతో సైతం శాంతియుత పద్ధతుల్లో పోటీ పడడమని ప్రవచించిన ప్రచండ విధానాలను అంతర్గతంగా తూర్పారబట్టింది. అయితే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన ప్రజాయుద్ధాన్ని, ప్రజాసైన్యాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేయడం ఇష్టం లేక పార్టీలోనే ఉంటూ పోరాడుతూ వచ్చింది. 2005 చున్‌వాంగ్ సభ నుంచి జరిగిన అనేక సమావేశాల్లో ఈ వర్గం ప్రచండ పంథా విప్లవ వ్యతిరేకమని వాదిస్తూ వచ్చింది. 2011 అక్టోబర్ 2న ఈ వర్గం నేత లు వైద్య, థాపాలు ఒక వివరమై న ‘నోట్ ఆఫ్ డిసెం ట్’ పెట్టారు.

ప్రజల ప్రయోజనాలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచింపజేయడంలో ప్రచండ విఫలమయ్యారని, రైతు లు ఆక్రమించిన భూస్వాముల భూములను, ఆస్తులను చట్టబద్దం చేయాల్సింది పోయి, వాటిని తిరిగి పాత యజమానులకు అప్పగించజూస్తున్నార ని ఆరోపించారు. మదేశీ పార్టీలతో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తిగా విప్లవ వ్యతిరేకమని అభివూపాయపడ్డారు. నాలుగు సంవత్సరాల పాటు కార్మికులు సమ్మె చేయడాన్ని నిషేధించడం ఏ విప్లవం కిందికి వస్తుందని ప్రశ్నించారు. పీఎల్‌ఏను విడదీసి (రీగ్రూపు చేసి) వివిధ ఆర్మీ యూనిట్లలో కలుపడం, ఆయుధాలను దాచిన పెట్టెల తాళంచెవులను ఆర్మీ ఇంటిక్షిగేషన్ స్పెషల్ కమిటీకి అప్పగించడం ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు. ఇప్పటికైనా ప్రచండ తన తప్పుడు విధానాలను మానుకోవాలని, కేంద్రకమిటీ విస్తృత సమావేశంలో చర్చించకుండా రాజ్యాంగ రచన, పీఎల్‌ఏ విలీనం విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. అయినా, ప్రచండ-బాబూరామ్ వర్గం తమ విధానాలు మార్చుకోకపోవడంతో ఇంతకాలం ఎదురుచూసిన వైద్య-థాపా వర్గం కేంద్ర, రాష్ట్రస్థాయి కేడర్ల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించింది. కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించకుండానే రాజ్యాంగసభను రద్దు చేయడం, కొత్త సభ ఏర్పాటు కోసం వచ్చే నవంబర్ 22న తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం ప్రచండ-బాబూరామ్‌ల విప్లవ వ్యతిరేక కుట్ర ఫలితమేనని ఆరోపించింది. ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రజాయుద్ధాన్ని, ప్రజాసైన్నాయన్ని బూర్జువా ప్రజాస్వామ్యానికి బలివ్వడం విప్లవ విద్రోహమేనని పేర్కొంది. ప్రచండ వదిలిన మార్గాన్ని తాము కొనసాగిస్తామని, నేపాల్‌లో సాయుధమార్గాన విప్లవం తెస్తామని స్పష్టం చేసిం ది. మాతృసంస్థలోని కేడర్ ప్రచండ తప్పులను గుర్తించి నూతన పార్టీలో సంఘటితం కావాలని పిలుపునిచ్చింది.

అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలను నేపాల్ పరిణామాలు కుదిపేశాయి. అంతర్జాతీయ పరిశీలకులు, మీడియా నేపాల్ మరో రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోనున్నదని వ్యాఖ్యానించగా, వామపక్ష మేధావు లు, పలు దేశాల మావోయిస్టు పార్టీలు ప్రపంచ సోషలిస్టు విప్లవానికి ఇవి శుభసూచకమని సంబరపడ్డాయి. ప్రచండ పార్లమెంటరీ పంథా శాంతియు త మార్గంలో నేపాల్‌లో విప్లవం తెస్తుందో లేక కొత్తగా ఏర్పడిన మావోయి స్టు పార్టీ సాయుధబాటలో నడిచి దేశాన్ని విముక్తం చేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.

-డి మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Featured Articles