జనాభా లెక్కలు- అపోహలు


Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదికలో పొందుపర్చారు. నివాసగృహాల సంఖ్యతో పాటు వాటికి సమకూరివున్న సదుపాయాలు, జనాభా పెరుగుదల రేటు, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, జననాల-మరణాల రేటు, సగటు జీవితకాలం, ఎస్‌సీ, ఎస్‌టీలు, మతాల వారీగా జనాభా, పట్టణీకరణ తదితర అనేక వివరాలు ఇందులో ఉన్నాయి. నివేదిక ప్రకారం 2011 మార్చ్ 1 నాటికి దేశ జనాభా 121కోట్ల ఒక లక్షా 93వేల 422 మందికి చేరింది. వీరిలో 62కోట్ల 37లక్షలు(51.54శాతం) పురుషులు కాగా, 5కోట్ల 64 లక్షల మంది(4.46శాతం) స్త్రీలు. ఆరేళ్ల లోపు బాలలు 15కోట్ల లక్షలు. 19కోట్ల 95లక్షలతో ఉత్తరవూపదేశ్ దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాతి స్థానాన్ని 11కోట్ల 20 లక్షల జనాభా కలిగిన మహారాష్ట్ర ఆక్రమించింది. కేవలం 6లక్షల 7వేల జనాభాతో సిక్కిం అతితక్కువ జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది. దేశంలోని వందకు పైగా జిల్లాలు సిక్కిం కంటే ఎక్కువ జనసంఖ్యను కలిగివుండడం విశేషం. అక్షరాస్యత 2001లో 64.3 శాతం ఉండగా, 2011 నాటికి అది 74.04 శాతానికి పెరిగింది. ఇక కనీస సౌకర్యాల విషయానికి వస్తే దేశ జనాభాలో 53.1 శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. 41.6శాతానికి స్నానపు గదులు లేవు. 49. శాతం గృహాలకు డ్రైనేజీ సౌకర్యం లేదు. 6 శాతం గృహాలకు రక్షిత మంచినీటి సరఫరా లేదు. 32. శాతం ఇళ్లకు కరెంటు లేదు. 2.5 శాతం కుటుంబాలు వంటకు ఎల్‌పీజీని ఉపయోగిస్తుండగా, 65. శాతం మంది కట్టెలు, పిడకలతో వంట చేసుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్ లేని వారు 41.3శాతం కాగా, టీవీలు ఉన్నవారు 47.2శాతం, రేడియోలు మాత్రం ఉన్నవారు 19.9శాతం, కంప్యూటర్లు ఉన్నవారు 6.3 శాతం, సైకిల్ ఉన్నవారు 44. శాతం, మోపెడ్ లేదా బైక్ ఉన్నవారు 21 శాతం, ఏ వాహనం లేనివారు 17.శాతం ఉన్నారు. జనాభాలో 63.2 శాతం మంది ఫోన్ సౌకర్యం కలిగివుండడం గమనార్హం.

వివరాలు, రికార్డులు, శాతాలు ఇలా ఉంటే, ఈసారి జనాభా లెక్కలకు సంబంధిం చి గమనించాల్సిన ఆసక్తికరమైన అంశాలు కొన్ని ఉన్నా యి. వీటిలో ప్రధానమైనది జనాభా పెరుగుదల రేటు. మన దేశ జనాభా అసాధారణ రీతిలో వేగంగా పెరిగిపోతున్నదని, మరికొన్ని దశాబ్దాల్లో చైనాను సైతం అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించనున్నదని మనకు తెలుసు. 110 ఏళ్ల ల కిందట 23కోట్ల 4లక్షలున్న జనాభా, ఐదు రెట్లు పెరిగి ప్రస్తుతం 121 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనం. 1921 జనాభా లెక్కల నాటికి దశాబ్దపు పెరుగుదల కేవలం 0.31 శాతమే ఉండ గా, 1971 నాటికి అత్యధికంగా 24.0 శాతానికి చేరి సర్వత్రా ఆందోళనకు కారణమైంది. ఆ తర్వాత ప్రభుత్వా లు ప్రత్యేకించి ఇందిరాగాంధీ ప్రభుత్వం కుటుంబ నియంవూతణ విషయంలో చేపట్టిన చర్యలు కొంతవరకు ఫలితాలనిచ్చాయి. అప్పటిదాకా పెరుగుదలను నమోదు చేసుకుంటున్న వృద్ధి శాతం పడిపోవడం ఆరంభమైంది. 191లో 24.66శాతం, 91లో 23.6 శాతం, 2001 లో 21.34శాతం, మొన్నటి లెక్కల్లో 17.64శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
జననాల రేటు తగ్గాల్సినంత తగ్గకపోవడం మూలంగానే మన జనాభా అదుపులో లేని స్థాయిలో పెరిగిపోతోందని చాలా మంది భావిస్తుంటారు. ఇది నిజం కాదు. 1901లో 49.2 పతి వేయి మందికి)గా ఉన్న జననాల రేటు క్రమంగా తగ్గుతూ 2011 నాటికి 20.9కి పడిపోయింది. అలాగే, స్త్రీల సాఫల్యతా రేటు కూడా బాగా తగ్గిం ది. 1951లో సగటున ప్రతి స్త్రీకి ఆరుగురు పిల్లలు పుడితే ప్రస్తుతం అది 2.62కి చేరింది. అంటే జనాభాలో అత్యధిక కుటుంబాలు కేవలం ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నాయన్నమాట. మరి అసలు కారణాలేమిటి? అంటే సాధారణ మరణాల రేటు, శిశు మరణాల రేటు బాగా తగ్గడం. భారతీయుల సగటు జీవితకాలం బాగా పెరగడం. లెక్కల్లోకెళితే, 1901లో సంవత్సరానికి వేయి మందికి 42.6 మంది చనిపోతే 2011 నాటికి 6.9 మంది మాత్రమే ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. మెరుగుపడిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం తదితరం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇవే కారణాలతో దేశంలో శిశు మరణాల రేటు సైతం తగ్గింది. 1901 లో ప్రతి వేయి జననాలకు 210 మంది శిశువులు ఆరేళ్లు పూర్తయ్యే లోపే కళ్లుమూస్తే ప్రస్తుతం 4 మంది శిశువులు మాత్రం చనిపోతున్నారు. ఇక, మన దేశపౌరుల సగటు జీవితకాలం కూడా బాగా పెరిగింది. వందేళ్ల కింద 1911లో భారతీయులు సగటున కేవలం 23 ఏళ్లు మాత్రమే బతికేవారు. ప్రస్తుతం ఇది 65 ఏళ్లకు చేరుకుంది. స్త్రీలు 66 ఏళ్లు, పురుషులు 63 ఏళ్లు నిండేవరకూ బతికేస్తున్నారు. ఈ కారణాలన్నింటి మూలంగానే జనాభా ఆశించిన స్థాయిలో తగ్గడం లేదనే విషయాన్ని గుర్తించాలి.

జననాల రేటు తగ్గుతున్నది నిజమే గాని అందులో ఓ మతలబు దాగివుంది. ఆ తగ్గడంలో ఘోరమైన లింగ వివక్ష అమలవుతోంది. మగ జననాల కంటే ఆడ జననా లు బాగా తగ్గుతున్నాయి. ఫలితంగా దేశంలో లింగ నిష్పత్తి వేగంగా పడిపోతున్నది. 1901లో ప్రతి వేయి మంది పురుషులకు 972 మంది స్త్రీలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 940కి పడిపోయింది. అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ వగైరా అభివృద్ధి చెంది న దేశాల్లో, బ్రెజిల్, నైజీరియా, ఇండోనేషియా, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉన్న పరిస్థితి ఉండగా మన దేశంలో ఈ నిష్పత్తి ఇలా దిగజారడం ఆందోళన కలిగించే విషయమే. ఆరేళ్ల లోపు పిల్లల విషయంలో ఈ నిష్పత్తి మరింత ఘోరంగా ఉంది. ప్రతి వేయిమంది బాలురకు 914 మంది మాత్రమే బాలికలున్నారు. అనగా కుటుంబ నియంవూతణ పద్ధతులు వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఉండే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది నిజమే కాని ఆడపిల్లలు మాత్రమే అధికంగా తగ్గారన్నది ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం.

దంపతులు ఆడపిల్లలు వద్దనుకోవడానికి కారణాలు అనేకం. హైటెక్ యుగంలో ప్రవేశించినా వరకట్న దురాచారం ఇంకా కొనసాగుతూనేవుంది. కూతురు పుడితే మరో ఇంటికి వెళుతుంది.. కొడుకైతే వారసత్వం కొనసాగిస్తాడన్న మూఢవిశ్వాసం సమాజాన్ని ఇంకా వీడలేదు. ఇవన్నీ కలిసి ఆడ శిశువుల భ్రూణహత్యలకు పురికొల్పుతున్నాయి. 190ల తర్వాత అమల్లోకి వచ్చిన లింగనిర్ధారణ పరీక్షలు, గర్భవూసావాల చట్టబద్ధత ఇందుకు తోడయ్యాయి. జన్యులోపాలతో శిశు జననాలను, అవాంఛిత గర్భాలను నివారించడానికి ఉనికిలోకి వచ్చిన ఈ పద్ధతులు ఆడపిల్లల పాలిట మృత్యుపాశాలుగా మారాయి. ఆడశిశువుల భ్రూణహత్యలను ఆపడానికి వివిధ ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితాలనివ్వడం లేదు. కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చితే, తల్లుల అక్షరాస్యతా స్థాయిని పెంచితే ఈ అకృత్యాలు ఆగిపోగలవని నిపుణులు భావిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా ఇదే దారిలో ఆలోచించి పథకాలను ప్రవేశపెట్టాయి. కాని 2011 జనాభా లెక్కలు వీరి నమ్మకాన్ని పటాపంచలు చేశాయి. ధనిక రాష్ట్రాలుగా పేరుగాంచిన పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రల్లో బాలల లింగ నిష్పత్తి 1991-2011 మధ్యకాలంలో ఘోరంగా పడిపోయింది. ఈ రాష్ట్రాల్లో ప్రతి వేయి మంది బాలురకు 30 నుంచి 6 మంది బాలికలే ఉన్నారు. ఇక, తల్లుల విద్యాస్థాయిని చూస్తే నిరక్షరాస్యులైన తల్లులను కలిగిన కుటుంబాల్ల్లో వేయి మంది బాలురకు 920 మంది బాలికలు ఉంటే, ప్రాథమిక విద్యనభ్యసించిన వారిలో 909 మంది, హైస్కూలు చదువు పూర్తి చేసిన వారిలో 5 మంది, డిగ్రీ ఆ పైన చదివిన తల్లు ల్లో కేవలం 76 మంది బాలికలున్నారు.

జనాభా అదుపులో ఉండడం అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌కు అవసరమే కాని ఈ పేరుతో లింగవివక్ష, ఆడపిల్లల హత్యలు కొనసాగడం మాత్రం అసమంజసం. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో అబ్బాయిలు పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరక్కపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మరో 20 ఏళ్లలో దేశంలో కోటి 20 లక్షల మంది అబ్బాయిలు జోడీ దొర క్క బ్రహ్మచారులుగా ఉండిపోవాల్సివస్తుంది. జనాభాను అదుపులో పెట్టే చర్యలను కఠినంగా అమలు చేసిన చైనా సైతం ఇలాంటి పరిస్థితినే తీవ్రంగా ఎదుర్కొంటున్నది. కనుక భారత ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. 2011 జనాభా లెక్కల వివరాలను విశ్లేషించి లింగవివక్షను మదింపు చేయడానికి ఓ నిపుణుల కమిటీని నియమించాలి. ఆడపిల్లల పట్ల వివక్షను నిర్మూలించడానికి తగిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్గాలను అన్వేషించా లి. ఏ రూపంలోనైనా వరకట్నం తీసుకోవడాన్ని నిషేధించాలి. లింగనిర్ధారణ పరీక్షలకు, గర్భవూసావాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలి. శిక్షలు పెంచా లి. అన్ని రంగాల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు సమాన హక్కులు కల్పించాలి. తల్లిదంవూడుల ఆస్తిలో వారు సమవాటా పొందేలా చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి.

జనాభాలో భాగమైన ప్రతి వ్యక్తీ దేశాభివృద్ధికి కీలకమనుకున్నప్పుడే అది నాగరిక సమాజమనిపించుకుంటుంది. భారతదేశం పేదల దేశమే తప్ప పేదదేశం కాదన్న ఆర్థిక శాస్త్రవేత్తల వక్కాణింపును ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటి జనాభాకు మించిన జనసంఖ్యకు సర్వం సమకూర్చగల వనరులు దేశంలో పుష్కలంగా ఉన్నా యి. జనాభా పెరుగుదలనే అన్ని సమస్యలకు కారణమనే విధానం సరికాదు. మానవ శక్తులే సకల ఉత్పత్తికి, అభివృద్ధికీ మూలమనే మౌలిక విషయాన్ని గుర్తించాలి. కేవలం జనాభా పెరుగుదలను అరికట్టడమన్న కోణంలోనే ఆలోచించకుండా పౌరులందరినీ ఉత్పత్తితో పాటు, అభివృద్ధి ఫలాల పంపకంలో సమ భాగస్వాములను చేసే విధానాలు అమలులోకి తేవాలి. విదేశీ కంపెనీల దోపిడిని అరికట్టి స్వదేశీ ఉత్పత్తి విధాన మనుగడను కాపాడాలి. అప్పుడు ప్రజలే చైతన్యవంతులై స్వచ్ఛందంగా కుటుంబనియంవూతణ పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధి, ఆరోగ్యకర సమాజానికి పునాదులు వేసి, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు.

-డి మార్కండేయ
[email protected]

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ