చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం


Sat,October 6, 2012 05:12 PM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తము బాగాలేదని వాపోయారు. పదే పదే వచ్చే ఉప ఎన్నికల పట్ల చ్రందబాబు నాయుడు బాధను వ్యక్త పరుస్తూ ప్రతిపక్షంలో ఉన్నందున డబ్బుల కొరత గుర్తించి నిర్లజ్జగా మాట్లాడారు. సాధారణంగా ఉప ఎన్నికల ను అధికార పార్టీ ప్రజా విశ్వాసాన్ని నిరూపించు కొనేందుకు, ప్రతిపక్షంపార్టీ, అధికార పార్టీ ప్రజల మన్ననను కోల్పోయిందని నిరూపించడానికి ప్రయత్నిస్తాయి. కాని ఉప ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి భయాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఒక విచివూతమైన రాజకీయ పరిస్థితి. రాజకీయ సంక్షోభం, అస్థిరత్వం తీవ్రం కావడంతో సీమాంధ్ర పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ కోటీశ్వరులకు, అధికారాన్ని విశృంఖలముగా అనుభవిస్తున్న వారికి ఆందోళన కలుగుతున్నది. బ్యూరోక్రాట్లకు, నిర్లజ్జగా ఏ పద్ధతి పాడు లేకుండా విపరిరీతంగా ధనాన్ని ఆర్జించే కొంత మంది ఘరానా దొంగలకు, వారికి ఊడిగం చేస్తున్న సీమాంధ్ర మీడియాకు కూడాఆందోళన కలుగు తున్నది.

ఈ పరిస్థితి తెలంగాణ ప్రజలకొరకు పోరాడే శక్తులకు ఉత్సాహం కలుగుతున్నది. తెలంగాణ కొరకు చేసుకొన్న ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నప్పటికీ పాలక వర్గాలు సంక్షోభంలో కూరుకొని పోవడం సంతోషించే సుందరదృశ్యం. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న సీమాంధ్ర కోటీశ్వరులు, అవినీతి పరులైన బ్యూరోక్రాట్‌లు, ఏ విలువలు పాటించని సీమాంధ్ర మీడియా బలమైన రాజకీయ నాయకత్వం అందించలేకపోతున్నందుకు కిరణ్‌కుమార్‌డ్డిని నిందిస్తున్నారు. ప్రజలను ఏదో ఒక కార్యక్షికమం (అది జన్మభూమి కావచ్చు. ప్రజల వద్దకు పాలన కావచ్చు) ద్వారా మభ్య పరుస్తు ప్రజా సంక్షేమానికి విఘాతం కల్గిస్తూ, అవసరమైతే తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తూ, చంద్రబాబునాయుడు నమూనా గొప్పదని ప్రశంసించే‘పెద్ద మనుషులను’ చూస్తూంటాం. విచివూతమేమిటంటే ఏ విధమైన మంచి లక్షణాలు, గొప్పతనం లేని కుట్రలు కుతంవూతాలు మాత్రమే తెలిసిన చంద్రబాబు నాయుడుని గొప్ప రాజనీతిజ్ఞునిగా మీడియా ప్రచారం చేసింది. సరిగ్గా ఇంగ్లిషుగాని, హిందీగాని, మాట్లాడలేని నాయకుడిని భారత రాజకీయాలలో చక్రము తిప్పిన మహానేతగా టీవీ చానెళ్లు, పత్రికలు వర్ణిస్తుంటాయి. అవినీతితో తెలంగాణ ప్రజల ఆస్తులను, దోచుకొని తెగబలిసిన ఈ వర్గాలు కాంగ్రెస్ పట్ల, చంద్రబాబు పట్ల విశ్వాసం కోల్పోతున్న సూచనలు కనబడుతున్నది. జగన్ పట్ల ప్రజాదరణ ఉందంటూ, ఆయనకు అలౌకిక శక్తులను ఆపాదిస్తూ కీర్తన మొదలు పెట్టాయి. మరణించిన వై.ఎస్. గొప్పవాడంటూ కూడా ప్రశంసించడం ప్రారంభించాయి. రాష్ట్ర సంపదను బాహటంగా దోచుకున్న రాజశేఖరడ్డి, జగన్‌మోహన్‌డ్డిలను కీర్తించడం మనకు కనబడుతున్నది. ఈ దోపిడీపై సీబీఐ దర్యాప్తు సాగుతున్నది. ఏ విధమైన అర్హతలు లేని జగన్‌మోహన్ రెడ్డిని ప్రజానాయకునిగా వర్ణించే విచిత్రం మనకు రోజూ చానళ్ళలో కనిపిస్తున్నది.

ఈ పని కేవలం వైఎస్సార్ పార్టీ వారే కాదు, కాంగ్రెస్, తెలుగుదేశంతోపాటు, తెలంగాణ ఉద్యమంలోని కొన్ని శక్తులు సైతం జగన్‌మోహన్‌డ్డి గొప్పతనం గురించి సన్నా యి నొక్కులు నొక్కుతున్నాయి. హద్దు అదుపులేకుండా కోట్ల కొలది డబ్బు సంపాదించి, మీడియాను ఉపయోగించుకొని ప్రజా నాయకునిగా చేలామణి అయ్యే తీరు జగన్‌మోహన్‌డ్డి అనుసరించే కొత్త పద్ధతి ఏమికాదు. చంద్రబాబు అనుసరించిందే జగన్ అనుసరిస్తున్నాడు. వస్తువులో వైవిధ్యం లేదు కేవలం రూపము, డిగ్రీలలో మాత్రమే తేడా. తెలగాణ విషయానికి వస్తే చంద్రబాబు, జగన్, కిరణ్ అందరూ ఒక్కటే.

వైఎస్ చనిపోకపోతే ‘రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంలో ఉండేవి కావు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేవాడు’ అని కొందరు వాదిస్తున్నారు. అవినీతితో లక్షకోట్లపైన ఆర్జించి తెలంగాణ ఉద్యమ నాయకులను కొనివేయడం ద్వారా ఉద్యమంలో చీలికలు సృష్టించి ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని నిందలపాలు చేయడం, బాహాటంగా సిగ్గు ఎగ్గుమాని అన్ని నీతినియమాలు వదిలి తన కుటుంబానికి తన వర్గానికి కోట్లు ఆర్జించి పెట్టడం వైఎస్ అనుసరించిన కుటిల నీతి. వైఎస్ కనుక చనిపోకపోతే తీవ్ర నిరసనను, ప్రజా వ్యతిరేకతను, తెలంగాణ ఉద్యమ పౌరుషాన్ని చూసేవాడుపజాశక్తికి మించిన శక్తిలేదని చరిత్ర చెబుతున్నది. తెలంగాణ ఎన్నికలు అయిన తరువాత నంద్యాల సభలో వై.ఎస్. మోసపూరితంగా మాట్లాడారు. తెలంగాణ వస్తే వీసా అవసరమని చెప్పాడు. ఒక విధంగా అది పిరికి తనంతో కూడిన మోసపూరిత విధానం మాత్రమే. తెలంగాణ విషయంలో జగన్ తెలుగుదేశం వారి ప్లకార్డును పట్టుకొని లోక్‌సభలో తెలంగాణ వ్యతిరేకతను చాటాడు. అందుకే జగన్, చంద్రబాబు, కిరణ్ ఎవరైన ఒకటే.

తెలంగాణ ప్రజలకు విశ్వాస ద్రోహం చేసిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మృత్యులోయలోకి తీవ్ర వేగంతో ప్రయాణిస్తున్నాయి. రూసో మహాశయుడు పోలెండ్ ప్రభుత్వం గురించి ఆనాడు చేసిన వర్ణన నేడు స్పష్టంగా సరిపోతున్నది. మెజారిటి నాయకులు ప్రాణమున్న శవాలు. చురుకుగా ఉన్న కొద్ది మంది ఏ లక్ష్యం లేకుండా పరస్పర దాడులకు దిగుతూ ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం మనుగడ కొనసాగించటమే అశ్యర్యం అని రూసో వ్యాఖ్యానించాడు. రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమమే. లేకపోతే జగన్ ముఖ్యమవూంతి పీఠాన్ని అధిష్టించేవాడు. తెలంగాణలోని వైఎస్సార్ తొత్తులైన నాయకులు, రౌడిమూకలు రోశయ్యను తొలగించి జగన్‌ను ముఖ్యమవూంతిని చేసేవారు. తెలంగాణ ప్రజా ఉద్యమం, తెలంగాణలోని కాంగ్రెస్ శక్తులను జగన్ వైపునకు పోకుండా కట్టడి చేస్తున్నది. ఇప్పటికి కూడా వైఎస్సార్‌ని కీర్తించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధించి తీరా చిదంబరం ప్రకటనతో రాత్రికి రాత్రే మోసం చేసి తెలంగాణ పట్ల ద్రోహం చేసి కా్రంగెస్ పార్టీని, చంద్రబాబును తెలంగాణలోనే కాదు సీమాంవూధలో సైతం ప్రజలు నమ్మటం లేదు.

వైఎస్సార్, జగన్‌ల అవినీతి గురించి చంద్రబాబు ప్రశ్నిస్తే, చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొందరు అవినీతి ప్రజా అంశమే కాదని సిద్ధాంతీకరిస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రవూపదేశ్ రాజకీయాలు నీతి పట్ల ఏ మాత్రము పట్టింపు లేని రాజకీయాలుగా దిగ జారిపోయాయి. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాల అవినీతి కూడా తోడైనది. ఒకనాడు బోఫోర్స్ అవినీతి గురించి వి.పి.సింగ్ దాటికి ఎంతో బలం కలిగిన రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పడిపోయినదా అదే అనుమానం వస్తున్నది. భారతదేశ ఘన చరిత్ర ఒక భ్రాంతియేనా అనిపిస్తున్నది. దేశంలో జరిగిన అభివృద్ధి కోటాను కోట్ల పేదలకు ఏమాత్రం మేలు చేయలేదు. సరికదా లక్షలకోట్ల అవినీతికి పాల్పడి టాటా, బిర్లా లతో పోటి పడే నూతన ధనిక వర్గాల ఆవిర్భావం జరిగింది. భారత జాతి తన ఔన్నత్యాన్ని, వీరత్వాన్ని కోల్పోతున్నది.
దేశ వ్యాప్తంగా తెలంగాణ మాదిరిగా జరుగుతున్న ఉద్యమాలే ఆలోచన పరులకు ఆశలు కల్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరుగుతున్న ఉద్యమం కేవలం సీమాంధ్ర కోటీశ్వరులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కాదు. సకల దుర్మార్గాలకు కుట్రలకు, కుతంవూతాలకు, సీమాంధ్ర పెట్టుబడి దారి విష పుత్రికలైన పత్రికలు, మీడియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమం తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పే ఉద్యమం.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Featured Articles