తెలంగాణ పునర్వ్యవస్థీకరణ


Fri,September 2, 2016 12:18 PM

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది. నీటి ప్రాజెక్టుల
రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు చేపట్టి 60 ఏళ్ల నీటి సమస్యలను పారదోలడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతేకాకుం డా కేంద్రం నుంచి నిధులను అధికంగా
రాష్ర్టానికి తీసుకురావటం కోసం నిరంతర ప్రయత్నం జరుగుతున్నది. ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపట్టడమే కాకుండా, టీఎస్ ఐపాస్ ద్వారా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముం దుకు రావడం వల్ల ఉద్యోగ కల్పన పెరుగుతున్నది. తెలంగాణ మానవాభివృద్ధి సూచీని పెంచడమే కాకుండా ప్రతి పౌరుని అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎంతో దోహదపడుతుంది.

టీఆర్‌ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పొందుపరిచింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఎన్నికల సమయం లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ, సబ్బండ వర్ణాలను అభివృద్ధికి చేరువచేసే దిశలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ప్రజాప్రతినిధులతో, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన అనంతరం 27 జిల్లాలతో కూడిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజలకు సూచనలను, అభ్యంతరాలను తెలియజేయడానికి ప్రభుత్వం నెలరోజుల సమయం ఇచ్చింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణను ప్రజలు సం తోషంగా ఆహ్వానిస్తున్నారు. ఆన్‌లైన్లో, ప్రత్యక్షంగా ప్రజల నుంచి సూచ నలు, అభ్యంతరాలు ప్రభుత్వానికి అందుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

దేశంలో జిల్లాకు సగటు జనాభా సుమారు 15 లక్షలుగా ఉండగా, తెలంగాణలో సగటు జనాభా 36. 5 లక్షలుగా ఉంది. పని ఒత్తిడిలో ఉండే పాలకులు తమంత తాము అన్నివిషయాలు చూసుకోలే క, క్లర్కుల చేతిలోకి పాలనా యంత్రాంగం పోతు న్నది అని, అది పాలనావ్యవస్థకు ప్రమాదకరమని రూసో మహానుభావుడు అభిప్రాయపడ్డాడు. మాంటెస్క్యూ నుంచి మాడిసన్ వరకు అనేక రాజకీయతత్వవేత్తలు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజల ప్రాతినిధ్యం, జవాబుదారీతనం, ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతాయని అభిప్రాయపడ్డారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేవలం కంప్యూటర్‌లో మ్యాపులలోనే గీతలు గీయడం ద్వారా జరుగడం లేదు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్ డీపీ) వికేంద్రీకరణ ఆవశ్యకతను, దానివల్ల జరిగే ప్రయోజనాలను దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కొలంబియా, మొరాకో, చైనా, నేపాల్, శ్రీలంక, జోర్డాన్ వంటి అనేక దేశాల్లో అధ్యయనం చేసి విశదీకరించింది. వికేంద్రీకరణ ప్రపంచ ధోరణి గా మారుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 27 జిల్లాల ప్రతిపాదన విడుదలైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాకుండా అనే క అభివృద్ధి కారక విషయాలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న పరిణామం.

కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ 2015 జనవరి 1న విడుదల చేసిన panchayat Raj Instructions-Gateway to Sushan మార్గదర్శకాలలో జిల్లా ప్రణాళికా కమిటీల (DPS) పాత్ర, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయిం చే గ్రాంట్ల గూర్చి తెలియజేసింది. అనేక కేంద్ర ప్రభు త్వ నిధులు నేరుగా కేంద్రం నుం చి పంచాయతీలకు తీసుకెళ్లే విధానాన్ని రూపొందించారు. పంచాయత్ వికేంద్రీకరణ సూచిక (PDI) ప్రాముఖ్యాన్ని వివరించారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ స్థాపించిన ప్లాన్ ప్లస్ అనే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా నిధులు కేటాయించడమే కాకుండా, పంచాయతీల పనితీరును ఎప్పటికప్పుడు కేంద్రం పరిశీలిస్తుంది. తద్వారా DPCల పనితీరును అంచనా వేస్తుంది. DPC కూర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ZD లో చెప్పిన మేరకు 80 శాతం మంది ప్రజలచే ఎన్నుకోబడిన జిల్లాస్థాయి, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధు లు ఉండాలి. DPS పంచాయతీ, మున్సిపాలిటీల అభివద్ధి ప్రణాళికలను రూపొందించాలి.

స్మిత్ బి.సి.1985లో రచించిన డిసెంట్రలైజేషన్: ది టెరిటోరియల్ డైమెన్షన్ ఆఫ్ స్టేట్ పుస్తకంలో వికేంద్రీకరణ వల్ల రాజకీయ విద్య, రాజకీయ శిక్షణ, రాజకీయ సుస్థిరత, రాజకీయ సమానత్వం, జవా బుదారీతనం పెరుగుతుందని చెప్పారు. వికేంద్రీకరణ సమాజానికి ఒక శక్తిమంతమైన లబ్ధి అని స్మిత్ అభిప్రాయపడ్డారు. దేశ చట్టాలను అనుసరించి, మన రాష్ర్టాల ప్రకారం పంచాయతీ, మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సుమారు యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు రాజ్య నిర్ణయాధికారంలో అధిక భాగస్వామ్యం కలుగుతుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా అంబేద్కర్ కలలుగన్న విధంగా బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యమ య్యే అవకాశం పెరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలలో తొమ్మిది జిల్లాలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాంలో భాగంగా ఇచ్చే నిధులను జిల్లా ఒక యూనిట్‌గా ఇస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నియమావళిని అనుసరించి కనీసం పది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెనుకబడిన జిల్లాగా ప్రకటించిన దానికి కేటాయించాలి. Capacity Building Component ప్రకారం ప్రతి వెనుకబడిన జిల్లాకు ప్రతీ సంవత్సరం కోటి రూపాయలు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ నియమావళిలో ఉన్నది. ఈ నియమావళిని అనుసరించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ వ్లల తెలంగాణకు అథమ పక్షంలో సంవత్సరానికి సుమా రు 150 కోట్ల ప్రయోజనం కలుగవచ్చు. రాజీవ్‌గాంధీ పంచాయత్ సశక్తికరణ్ అభియాన్ (RGPA) ద్వారా వచ్చే నిధులు కూడా పెరిగే అవకాశం ఉన్నది.

వ్యవసాయంలో అనేక సబ్సిడీలు,లోన్లు, ఇన్స్యూరెన్స్ కరువు నివారణకు సంబంధించిన నిర్ణయాలు జిల్లాలను యూనిట్‌గా చేసుకొని జరుగుతాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల రైతులకు పంట బీమా, కరువు నివారణ మొదలగు విషయాలలో ఇప్పుడున్న నిబంధనల మేరకు అధిక ప్రయోజనం కలుగుతుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వారి నియమావళిని అనుసరించి కనీసం జిల్లాకు ఒకటి కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి జిల్లాలు పెరిగినప్పుడు సుమారు 10-12 కేంద్రీ య విద్యాలయాలతో పాటు నవోదయ విద్యాలయాలు కొత్తవి కేంద్రం ప్రకటించవలసి ఉంటుం ది. తద్వారా కొన్నివేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం జరుగుతుంది. అంతే కాకుండా పరోక్షంగా ఆ విద్యాలయాలు ఏర్పడినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల ద్వారా ఉపాధి పెరుగుతుంది.

జిల్లా హాస్పిటల్స్ పెరుగడం ద్వారా పేదవారికి వైద్యం చేరువ అవడమే కాకుండా, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ద్వారా ఐసీయూ యూనిట్స్, స్త్రీ,శిశు సంక్షేమ యూనిట్స్, డయాలసిస్ యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖలలో అనేక గణనీయమైన మార్పులు సంభవించి ప్రజల కు జిల్లా యంత్రాంగం చేరువై, ప్రజలను ప్రగతిపథంలో తీసుకువెళ్లే అవకాశం వికేంద్రీకరణ ద్వారా సాధ్యమవుతుంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరా జ్యం దిశగా తెలంగాణను నడిపించే ప్రయత్నంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణను చూడాలి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థను కేరళ రాష్ట్రం స్థాయిలో పటిష్ఠ పరిచేందుకు చర్యలు చేపట్టాలి.
14 రాష్ర్టాలతో ప్రారంభమైన భారతదేశం, కాలానుగుణంగా 29 రాష్ర్టాలుగా రూపాంతరం చెందినప్పుడు ముక్కలవుతున్న భారతదేశ అద్దంగా మేధావులు భావించలేదు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ గొప్పతనంగా భావించారు. 10 జిల్లాలతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం 27 జ్లిలాలుగా రూపాంత రం చెందడాన్ని అత్యధిక ప్రజలు హర్షించడమే కాకుండా స్వాగతిస్తున్నారు. తామంతా తెలంగాణ వారమనే గర్వపడుతున్న శుభ సందర్భం ఇది. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన తెలంగాణ పునర్వ్యవస్థీకరణ ప్రజల ఆమోదం పొందినందువల్లే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ప్రజావాక్కే దైవ వా క్కు అనే నానుడిని అనుసరించి జరుగుతున్న జిల్లా ల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకించడం ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించడమే.
రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది.

నీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు చేపట్టి 60 ఏళ్ల నీటి సమస్యలను పారదోలడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతేకాకుం డా కేంద్రం నుంచి నిధులను అధికంగా రాష్ర్టానికి తీసుకురావటం కోసం నిరంతర ప్రయత్నం జరుగుతున్నది. ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపట్టడమే కాకుండా, టీఎస్ ఐపాస్ ద్వారా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముం దుకు రావడం వల్ల ఉద్యోగ కల్పన పెరుగుతున్నది. తెలంగాణ మానవాభివృద్ధి సూచీని పెంచడమే కాకుండా ప్రతి పౌరుని అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎంతో దోహదపడుతుంది.

2138

MANGALADEVI PENDYALA

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles