పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం


Tue,March 25, 2014 12:28 AM

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఏర్పడింది. తెలంగాణ సమాజం యావత్తూ ఎన్నో ఆశలతో, కోరికలతో తమ కష్టాలు, బాధలు తొలిగి, సుఖసంతోషాలతో జీవించే అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు.
అంటే పునర్నిర్మాణం ఎజెండాగా ముందుకు వచ్చింది. పునర్నిర్మాణం గొప్పగా కొనసాగి, బంగారు తెలంగాణ ఏర్పడాలి. ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్ణాలకు మేలు కలగాలి. ఆర్థికాభివద్ధి, సామాజిక న్యాయం రెండూ సాధించాలి. ప్రస్తుత పరిస్థితిలోని అనుకూల అంశాలను అననుకూల అంశాలను విశ్లేషించుకొని ఎలాముందుకు పోవాలో ఆలోచించుకోవాలి.

leadershipసీమాంధ్ర వలసపాలనతో తెలంగాణ సమాజం ఆర్థిక, రాజకీయ, సాంస్కతిక విధ్వంసానికి గురైంది. తద్వారా సీమాంద్ర వలసవాదులకు తొత్తులుగా ఉన్న లంపెన్ రాజకీయ వర్గాలు ఏర్పడ్డాయి. నిరంతరం తెలంగాణ పురోగామి శక్తులపై దాడి చేస్తాయి. సీమాంధ్ర వలసవాదం తెలంగాణ సమాజంలోని బడుగు, బలహీన వర్గాలపై మొసలి కన్నీరు కారుస్తూ కేసీఆర్‌పై దాడి చేయడం జరుగుతున్నది.
సీమాంధ్రలో దళిత వర్గాలపై నిర్దాక్షిణ్యంగా దాడిచేసి, కంచికచర్ల, కారంచేడు, పదిరికుప్పం లాంటి రాక్షస దాడు లు చేసిన వర్గాలు తెలంగాణలోని దళిత, బలహీన వర్గాలపై సానుభూతిలోని మర్మాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నది. దీనికితోడు సీమాంధ్ర మీడియా విష ప్రచారం కొనసాగుతుందునే విషయం మరువకూడదు. సీమాంధ్ర వలసపాలనతో ఏర్పడిన తప్పుడు అభిప్రాయాలు, వ్యాపార సంస్కతి ప్రభావం తొలగించడం కష్టం. అందుకు బలమైన నాయకత్వం తెలంగాణకు అవసరం.
విద్యుత్, నీటిపారుదల, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలువాలి. ఆర్థికాభివద్ధి సాధించాలి అనే సంకల్ప బలం, చైతన్యం ప్రగతికి అవసరం. తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని బంగారు తెలంగాణ గా మార్చడానికి ఉపయోగించాలి. తెలంగాణ రాజకీయ అస్తిత్వం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటాను పొందగలుగుతాం. ఆర్థికాభివృద్ధి, ప్రజా సంక్షేమాలతో కూడిన ఆర్థికాభివద్ధి మోడల్ తెలంగాణలో అనుసరించవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో మహిళల అభివద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలి.
మహిళాభివృద్ధే సమాజ అభివద్ధిగా ఫ్రెంచ్ తత్వవేత్త Charles Fourier వర్ణించాడు. తెలంగాణ సాధించిన కీర్తి కేసీఆర్‌కు శాశ్వతం. ఆయన జీవితం ధన్యం. ఏ ఆశలతో, కోరికలతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమాజం యావత్తూ కేసీఆర్‌పై విశ్వాసంతో ముందుకు కదిలిందో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత కేసీఆర్‌పై ఉన్నది. నిందలు, అవమానాలు లెక్కపెట్టకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత తన భుజాలపై పెట్టుకోవాలి.
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ, గాంధీలాగా ఇతరులకు అధికారం అప్పజెప్పకూడదు. రష్యన్ విప్లవం విజయవంతం కావడంతో లెనిన్ అధికారం చేపట్టి సోషలిస్ట్ విప్లవ ప్రభుత్వ స్థాపన చేశాడు. అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఎన్నో అవమానాలు, నిందలు లక్ష్యం చేయకుండా స్టాలిన్ రష్యాను బలమైన, ఆధునిక రష్యాను నిర్మించాడు. అమెరికా స్వాతంత్య్ర పోరాటం విజయం తర్వాత జార్జ్ వాషింగ్టన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ అమెరికా పునర్నిర్మాణం కోసం కషి చేశారు. ప్రపంచ దేశాల అనుభవం, గాంధీ, అంబేద్కర్‌ల సిద్ధాంతాలు ఆధునిక ఆర్థికాభివద్ధి పద్ధతులు, అమర్త్యసేన్ ఆలోచనలు మిళితం చేసి తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలి.
ఆదర్శాలు, ఆలోచనలు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఉన్న భావజాలాల సమన్వయం, పార్టీపై ప్రజలపై పట్టు, నాయకుల ఎత్తుగడలు అన్నింటికి మించి ప్రజల ఆశయాలు తీర్చవలసిన బాధ్యత కేసీఆర్‌కు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చే ఐదేండ్ల పాలనలో గొప్పగా అభివద్ధి చెందకపోతే ప్రజల ఆశలు, ఆశయాలు తీర్చడం సాధ్యం కాదు. పునర్నిర్మాణ ఆశయం నెరవేరకపోతే తెలంగాణ సమాజం నిరాశకు గురవుతుంది.
అంతేకాదు సీమాంధ్ర పెట్టుబడిదారీశక్తులు వారి తొత్తు మీడియా అవహేళనలకు గురవుతుంది. పునర్నిర్మాణ బాధ్యత ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌పైనే ఉన్నది. కేసీఆర్‌ను బలపర్చవలసిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నది. ఇక్కడ ఒక వాస్తవం మనం అంగీకరించాలి. ఆంధ్ర పార్టీల నాయకుల ప్రాబల్యంలో వారి నియోజకవర్గాల ప్రజలు ఉన్నారు. కావున వారిని టీఆర్‌ఎస్‌వైపు తీసుకరావడం అవసరం. వంద అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానాలు గెలవడం తక్షణ లక్ష్యం. సర్వశక్తులను కేంద్రీకరించాలి. ఆవేశాలకు తావులేదు. కొండా సురేఖ చేరికపై రాద్ధాంతం తగదు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడితే గానీ కొండా సురేఖ ను ఓడించలేకపోయాం. దీనర్థం ఆమె ప్రజా నాయకురాలని. జీసస్ చెప్పినట్టు దారి తప్పిన గొర్రెపిల్ల పట్ల శ్రద్ధ చూపించాలి.
యుద్ధ ప్రారంభానికి ముందే శత్రు పార్టీలను నిర్వీర్యం చేయాలి. అనగా ప్రజా పునాది కలిగిన నాయకులను టీఆర్‌ఎస్‌వైపు ఆకర్షించాలి. ఎన్నికలకు ముందే గెలుపు ఖాయంగా ఉండే వ్యూహం, ఎత్తుగడలు అనుసరించాలి. ఈ విషయాన్ని కొంతమంది తెలంగాణ మేధావులు అపార్థం చేసుకుంటున్నారు. కేసీఆర్‌ను సమర్థించడమే తక్షణ కర్తవ్యం. అనే విషయాన్ని అర్థం చేసుకొని తెలంగాణ సమాజానికి అర్థం చేయించడమే తెలంగాణ మేధావుల ప్రస్తుత కర్తవ్యం.
-పెండ్యాల మంగళాదేవి

342

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ