సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు


Tue,January 14, 2014 12:06 AM

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన
సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విముక్తి లేదు.
అందుకే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే కాదు సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు కూడా అనుకూలంగా సాగే ఉద్యమంగా చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రి య కొనసాగుతున్న సమయంలో సీమాంధ్ర రాజకీయ వ్యవస్థ నిరాశ, నిసృహ తో, ఆక్రోశంతో ఆత్మవంచన, పరవంచనతోబతుకుతున్నది. సీమాం ధ్ర ప్రయోజనాలు సైతం కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేని పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇందుకు ‘సమైక్యవాద’ ఉద్యమాన్ని నిందించవలసి ఉన్నది. సమైక్యవాద ఉద్యమం గొప్ప ప్రజా ఉద్యమంగా సీమాంవూధకు చెం దిన మేధావులు, నాయకులు వర్ణించారు. దాన్ని కృత్రిమ ఉద్యమంగా తెలంగాణ వాదులు వర్ణించారు. సమైక్యవాద ఉద్య మం ఎందుకు ప్రజా ఉద్యమం కాదు? అని ప్రశ్ని స్తే.. అది సీమాంధ్ర ప్రజావూపయోజనాలకు అనుకూలమైనది కాదు.పైగా తెలంగాణ ప్రజా వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నది. ‘సమైక్యవాద ఉద్యమ’ ప్రభావం వల్ల సీమాంధ్ర రాజకీయ నాయకులు సీమాంధ్ర ప్రయోజనాలు సైతం చెప్పలేని దౌర్భగ్య పరిస్థితిలో ఉన్నారు.

దయ్యాలను సృష్టించిన మాం త్రికుడు ఆ దయ్యాలను నియంవూతించలేక బలైన కథను సమైక్యవాద ఉద్యమాన్ని సృష్టించిన సీమాం ధ్ర రాజకీయ వ్యవస్థతో పోల్చవచ్చు. గొప్ప నాయకునిగా చెప్పుకునే చంద్రబాబు విజ్ఞతను ప్రదర్శించలేక, దివాలాకోరు రాజకీయాలు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందో అర్థంచేసుకుందాం.
కేసీఆర్ సీమాంవూధలో మేధావులు లేరా? సీమాంవూధలో మేధావులు ఎందుకు మౌనం పాటిస్తున్నార ని ప్రశ్నించాడు. ప్రకాశం, పట్టాభి వంటి వారు పుట్టి న గడ్డలో మేధావులు, నాయకులు లేని దౌర్భగ్య పరిస్థితి గురించి జైపాల్‌డ్డి వాపోయారు. ప్రకాశం పంతులు, పట్టాభి లాంటి వారు బతికుంటే సీమాం ధ్ర వలసవాదం మాట్లాడేవారు అని విశ్లేషణ కూడా ఉంది. అది వేరే విషయం. సీమాంవూధలో దౌర్భగ్య రాజకీయ పరిస్థితికి కారణమేమిటి అనేది మౌలిక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మార్క్స్ విశ్లేషించా డు. ‘ఒక జాతి ఇతర జాతులను పీడిస్తే అది స్వేచ్ఛ గా వుండజాలదు’ అనిమార్క్స్ చెప్పాడు. ఒకదేశం, ఒక జాతి ఒక ప్రాంతం ఇతర దేశాలను, జాతులను ప్రాంతాలను పీడిస్తే.. పీడక జాతి కూడా స్వేచ్ఛగా వుండజాలదు. సీమాంధ్ర వలసవాదం తెలంగాణను అన్ని విధాల దోపిడీ, పీడనకు అవమానాలకు గురిచేసింది. తన ప్రాంతంలోని దళిత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. సీమాంధ్ర వలసవాద కోటేశ్వరులు, సీమాంధ్ర మధ్యతరగతి తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు కొల్లగొట్టడం వల్ల తెలంగాణ ప్రాంత నిధులను, నీళ్లను, దోపిడీ చేయడం వల్ల అక్రమంగా లాభాలు పొందిన సీమాంధ్ర వర్గాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించటం సీమాంధ్ర వలసవాద లక్షణం. తెలంగాణ నిధులను, నీళ్లను, ఉద్యోగాలను కొల్లగొట్టడం దాని లక్షణం. సీమాంధ్ర వలసవాద ప్రభావం మెజారిటీ సీమాంధ్ర ప్రజలపై మేధావులపై తీవ్రంగా ఉన్నది. ఏ పిడికెడు మందో తప్పించి మేధావులు, విశాల మనస్సు కలిగి అనేక విషయాలను ప్రజ్ఞతో విశ్లేషించగలిగిన సీమాంధ్ర మేధావులు తెలంగాణ విషయానికి వస్తే లగడపాటి లాగా మాట్లాడడం మనం చూస్తున్నాం.ఈ పరిణామాలు చూసి తర్వాతనే కేసీఆర్ ‘లంకలో పుట్టిన వారంతా రాక్షసులే’ అన్నారు. పైన తెలిపిన పరిణామాలు అనేక దేశాల చరివూతలో జరిగినవే. పీడిత జాతిని గురించి పీడక జాతికి చెం దిన సోషలిస్టును ప్రశ్నిస్తాడు మార్క్స్. ఈ ప్రశ్నతో సోషలిస్టు ‘అసలు రంగు’ బయటపడుతుంది. అదేవిధంగా గొప్ప కార్మికోద్యమ నాయకులైన ఇంగ్లాండ్‌లోని చార్టిస్ట్‌లు, ఐర్లాండు విషయానికి వస్తే వలసవాదులుగానే మాట్లాడారు. బుద్ధిపూర్వకంగా అవమానించిన బ్రిటిష్ ప్రధాని గ్లాడ్‌సన్ వైఖరిని కార్ల్‌మార్క్స్ ఖండించిన మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. హరీష్‌రావును అవమానించిన కిరణ్‌ను గుర్తుకుతెచ్చుకుంటాం.అలాగే మిలియన్ మార్చ్ వీరులను ‘విధ్వంసకారులుగా’ వర్ణించిన సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర ప్రభుత్వం మనకు సహజంగా గుర్తుకు వస్తాయి.

‘సమైక్య’ ఉద్యమంలో ప్రభుత్వ పెద్దల ప్రత్యక్ష సహకారంతో, పోలీసుల పరోక్ష సహకారం తో సాగిన విధ్వంసాలను వీరోచితంగా వర్ణించడం వలసవాద లక్షణం తప్పించి మరేంకాదు. 1857 స్వాతంవూత్యోద్యమాన్ని ‘సిపాయిల తిరుగుబాటు’ గా వర్ణించి, దుష్ప్రచారంచేసి క్రూరంగా అణచివేసేన సంఘటన 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంతో పోల్చవచ్చు. సీమాంధ్ర వలసవాద స్వభావంలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏమంటే ‘భాష’ పేరిట తెలంగాణ ప్రజలను దోపిడీ, పీడనలకు, అవమానాలకు గురిచేస్తూ సీమాంధ్ర ప్రజానీకానికి వలసవాద స్వభావాన్ని నేర్పింది. తద్వారా ఒక విధమైన ‘మిథ్యా భావన’లో సీమాంధ్ర ప్రజానీకం ఉన్నది. తెలంగాణ నిధులపై, నీళ్లపై, వనరుసలపై ఆధారపడుతూ తెలంగాణను అవమానించడం నేర్చుకున్నారు. బలవంతంగానైనా తెలంగాణను కలిపి ఉంచాలనే భావనలో ఉన్నారు. వారి కష్టాలకు కేసీఆర్, సోనియాలు కారణమనుకుంటూ, మిథ్యాభావనలను ప్రచారం చేసిన సీమాంధ్ర నాయకులను స్వార్థపరులుగా, అబద్ధాలకోరులుగా చూస్తున్నారు. అంతేగానీ సీమాంధ్ర వలసవాదమే దౌర్భాగ్యానికి కారణంగా భావించడం లేదు.

సమైక్య ఉద్యమం సీమాంధ్ర ప్రజలకు, తెలంగా ణ ప్రజలకు నష్టదాయకమైనది. వలసవాదం వల్ల మెజారిటీ సీమాంధ్ర ప్రజానీకం బాగుపడడం సాధ్యం కాదు. సీమాంధ్ర ప్రజలు భ్రమలు వదులుకొని, సీమాంధ్ర అభివృద్ధి నిరోధకులకు వ్యతిరేకం గా పోరాటం చేయడానికి సమయం పడుతుందనే విషయం వామపక్షాల వారు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపి డీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విముక్తి లేదు. అందుకే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే కాదు సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు కూడా అనుకూలంగా సాగే ఉద్యమంగా చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్య మం వాస్తవానికి రాజ్యాంగబద్ధ డిమాండ్ మాత్ర మే. కానీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగడం వల్ల ప్రజాస్వామ్య ఉద్యమంగా మారింది. దళిత, బలహీన వర్గాల ప్రజలు పాల్గొనడం వల్ల సామాజి క తెలంగాణ ఉద్యమంగా మారి, ముస్లిం ప్రజానీ కం పాల్గొనడం వల్ల ‘సెక్యులర్’ స్వభావం కలిగి ఉన్నది. విప్లవ వర్గాలు పాల్గొనడం వల్ల విప్లవ స్వభావాన్ని కూడా కలిగి ఉన్నది. శాంతియుతంగా సాగడం ద్వారా గాంధీ, అంబేద్కర్ ప్రభావం కూడా చూస్తున్నాం. అందుకే తెలంగాణ ఉద్యమం మన కండ్ల ముందు జరుగుతున్న అద్భుతం. నవ తెలంగాణ నిర్మాణంతో మరో అద్భుతాన్ని ఈ దేశ ప్రజలందరూ భవిష్యత్తులో చూస్తారు.
-పెండ్యాల మంగళాదేవి

505

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles