స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం


Wed,July 24, 2013 11:59 PM

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు. విద్య, ఆరోగ్యం,ఉపాధి అవకాశాలు, నీటి పారుదల, జీవన ప్రమాణం పెంపుదల, పారిక్షిశామీకరణ, హైదరాబాద్ నగరాభివృద్ధి వంటి అనేక అంశాలపై విరంగా బ్లూప్రింట్ తయారు చేస్తున్నారు. ఈ విషయం కేసీఆర్‌ను కలిసిన పెద్దలందరికి తెలుసు. నీటిపారుదల, విద్య, సంక్షేమ కార్యక్షికమాలు సవివరంగా బడ్జెట్‌యుక్తంగా చర్చించి, ప్రకటించిన విషయాలు మనకు తెలుసు. సీమాంధ్ర రాజకీయ నాయకులకు రాజకీయ మార్గదర్శిగా తాను భావించుకున్న ఓ పెద్దమనిషి ‘తెలంగాణలో యుద్ధ విధ్వంసం జరగలేదు. పునర్నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ కృషి చేస్తుంది అనే వాదన తప్పు’ అని తేల్చేశాడు.

సీమాంధ్ర వలసవాదికి తెలంగాణలో జరిగిన విధ్వంసం ఎలా అర్థమవుతుంది? పైగా జరిగిన విధ్వంసాన్ని అభివృద్ధిగా మసిబూసి మారేడుకాయ చేయడం వలసవాది లక్షణం. ఇంగ్లిష్ వలసవాదులు భారతదేశాన్ని దోచుకోవటం కోసం చేసిన కార్యక్షికమాలను అభివృద్ధిగా వర్ణించిన విషయం మనకు తెలుసు. ‘భారతదేశాన్ని ఉద్ధరించటానికి ఇంగ్లిష్ వారు ఎన్నో కష్టనష్టాల కొర్చి భారత సమాజాన్ని అభివృద్ధి చేశారు’ అని వలసవాదాన్ని సమర్థించే కవులు గానం చేశారు. ఇంగ్లిష్ వలసపాలనకాలంలో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ నశించింది. కానీ కొత్త వ్యవస్థ ఏర్పడలేదు. ఫలితంగా భారతీయులు ఎన్నో కష్టాలను బాధలను, అవమానాలు భరించారు. సాధించిన అభివృద్ధికి చెల్లించిన మూల్యం భారీ విధ్వంసం. ప్రజల కష్టాలు, బాధలు ప్రజల శ్రమతో కూడినదే ఆ మాత్రం అభివృద్ధి.

తెలంగాణ సమాజం ఇంగ్లిష్ వలసపాలనలో ప్రత్యక్షంగా లేకపోవడం వల్ల సంప్రదాయ ప్యూడల్ వ్యవస్థ కొనసాగింది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రత్యక్ష వలసపాలన తెలంగాణ ఆంధ్రలో కలిసి ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఆవరణతో మొదలయింది. నీళ్ళు, నిధులు, ఉద్యోగాల్లో తెలంగాణ సమా జం తీవ్రమైన దోపిడీకి, అణచివేతకు గురైన విషయం మనకు తెలిసిందే. చివరికి భాష, సంస్కృతి విషయాలపై పెద్దఎత్తున దాడి జరిగి సాంస్కృతిక విధ్వంసం కొనసాగింది. జయశంకర్ సార్ చెప్పినట్టు టీడీపీ పాలనలో సాంస్కృతిక విధ్వంసం పెద్దఎత్తున జరి గి, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఇంగ్లిష్‌వారు రెండు వందల సంవత్సరాల్లో సీమాంవూధలో చేసిన నష్టం కన్నా 50 ఏళ్లలో సీమాంవూధులు తెలంగాణకు ఎక్కువ నష్టం చేశారు. పైగా చేసిన విధ్వంసాన్ని అభివృద్ధిగా ప్రచారం చేయడం సీమాంధ్ర వలసవాదులకే చెల్లింది. విప్లవ పోరాటాలతో భూస్వామ్య వ్యవస్థను నాశనం చేసిన తెలంగాణ సమాజానికి ప్రస్తుతం సీమాంధ్ర వలసవాదమే ప్రధాన శత్రువుగా ఉన్న పరిస్థితిలో భూస్వామ్య వ్యవస్థనే ప్రధాన శత్రువుగా చెప్పడం సీమాంధ్ర వలసవాద కుయుక్తి మాత్రమే.

పునర్నిర్మాణం అనే పదానికి యుద్ధ విధ్వంసం తర్వాత జరిగే పునర్నిర్మాణం కార్యక్షికమాలు అనేది ఒక అర్థం మాత్రమే. వలసవాద పరాయిపాలనలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక రంగాలలో జరిగిన విధ్వంసాన్ని గుర్తించి, పాత కొత్తల మేలు కలయికలతో జరిగే గొప్ప కార్యక్షికమాలను పునర్నిర్మాణం అంటారు. తెలంగాణవాదులు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగే పునర్నిర్మాణం కార్యక్షికమాల గురించి చర్చిస్తున్నారు. వలసవాదుల పాలనలో ‘పరాయీకరణ’ ఏవిధంగా జరిగిందో కళాకారులు గొప్ప కవితావేశంతో పాటలు రాశారు. గానం చేశారు. వలసవాద, పెట్టుబడిదారీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని తత్వవేత్తలు తమ సిద్ధాంతాలతో నిరూపించి, పునర్నిర్మాణం ప్రాముఖ్యం నొక్కి చెప్పారు. విధ్వంసం జరగకపోతే కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఉద్యమం తిరిగి ప్రారంభమయ్యేదికాదు. విధ్వంసాన్ని అభివృద్ధిగా వర్ణించే వ్యక్తి పునర్నిర్మాణాన్ని అవహేళన చేయటం మామూలే. తెలంగాణ ఉద్యమాన్ని ద్వేషించే వ్యక్తి ఉద్యోగులను, విద్యార్థులను, కేసీఆర్‌ను అవహేళన చేయటం సహజమే. సీమాంధ్ర వలసవాదులు కేసీఆర్‌పై, తెలంగాణ విద్యార్థులపై, ఉద్యోగులపై దాడి చేయడం ద్వారా ఉద్యమంలో వారి పాత్రను చూసి భయపడుతున్నారని అర్థం.

తెలంగాణ పునర్నిర్మాణం-నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, వైద్యం తదితర రంగాలలో మాత్రమే కాకుండా స్టేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు సీబీఎస్‌ఈ విద్యావిధానం మొదలైనవి కేసీఆర్ ప్రతిపాదించిన విషయం మనం మరువకూడదు. సీమాంధ్ర యూనివర్సిటీలు ఏవిధంగా గొప్ప విద్యా ప్రమాణాలతో ఉన్నయో చెప్పకుండా కేవలం తెలంగాణ విద్యార్థులపై దాడి చేయడానికి కారణం విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడమే. తెలంగాణ ఉద్యోగులపై దాడి చేయటం అర్థం అదే. తెలంగాణలో జరిగిన విధ్వంసం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘రాస్తే రామాయణమంత చెప్పితే భారతమంత’. తెలంగాణ రాష్ట్ర సాధన పునర్నిర్మాణం ద్వారా బంగారు తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో జీవించటం కోసమే.

-పెండ్యాల మంగళాదేవి

135

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles