తెలంగాణ-నాలుగు ప్రశ్నలు


Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందా? ఇవ్వదా? 2) టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం తప్పనిసరా? 3)టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తెలంగాణ ప్రజలు పెట్టుకొన్న ఆశలు నెరవేరుతాయా? లేదా? 4) భారత రాజకీయాల్లో తెలంగాణ నిర్వహించబోయే పాత్ర ఏమిటి? పై ప్రశ్నలు తెలంగాణ ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అధినాయకత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా సీమాంధ్ర పెట్టుబడిదార్ల ఒత్తిడికి లొంగిపోతుందా? అనే ప్రశ్న అందరి మనస్సుల్లో మెదులుతున్నది. కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి డిసెంబర్ 9 తెలంగాణ అనుకూల ప్రకటన సాధించారు.

ఆ తర్వాత పరిణామాలు, ముఖ్యంగా రోశయ్య, కేవీపీ, చంద్రబాబుల నాయకత్వాన సీమాంధ్ర పెట్టుబడిదారీ రాజకీయ నాయకుల కుట్రల ఫలితంగా వెయ్యి మందికిపైగా తెలంగాణ యువత బలిదానాలు, అనేక అనుమానాలు ప్రజల మనస్సులను పచ్చిపుండులాగా బాధపెడుతున్నవి.
కేంద్ర, రాష్ట్ర నాయకుల సంకేతాలు, సూచనలు, ప్రకటనలు చూస్తుంటే త్వరలోనే తెలంగాణ ఏర్పాటు చేస్తారనే విశ్వాసం కలుగుతున్నది. కానీ మనస్సు అనేక అనుమానాలను ఊహిస్తున్నది. 1969 వీరోచిత తెలంగాణ ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసిన అనుభవం, దీర్ఘకాల పోరాటం పట్ల విశ్వాసం లేని నాటి నాయకత్వ వైఫల్యం, డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పరిణామాలు అందరి మనస్సులను కలవరానికి గురిచేస్తున్నాయి. తర్కము, బుద్ధి మాత్రం ‘కాంక్షిగెస్ తప్పనిసరిగా తెలంగాణ ఇస్తుంది’ అని చెబుతున్నది. తాజా పరిణామాలు ముఖ్యంగా సీమాంధ్ర నాయకుల, సీమాంధ్ర మీడియా చిల్లరవేశాలు, నిరాశతో చేసే అసందర్భ ప్రేలాపనలు చూస్తుంటే తెలంగాణ వస్తుందని మరింత నమ్మకం కలుగుతున్నది.

ఏదిఏమైనా ఒక్క విషయం స్పష్టం. తెలంగాణ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ బతుకుతుందా చస్తుందా అనేది తేలుతుంది. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కూడా తెలంగాణ ఏర్పడకపోతే నాశనం అవుతాయి. విచివూతమేమిటంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఇచ్చినా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు తెలంగాణ రాజకీయాలలో సార్వవూతిక ఎన్నికల తర్వాత నశించి తీరుతాయి. జరుగుతున్న మార్పులు, సూచనలు చూస్తుంటే తెలంగాణ ఏర్పడుతుంది అనే విశ్వాసం కలుగుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం చేయవలసిన అవసరం ఉందా అనే ప్రశ్నను తెలంగాణవాదులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ‘తెలంగాణ ఇచ్చేస్తే కాంగ్రెస్‌కే తెలంగాణ ఓట్లన్ని పడుతా యి అని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ఖాళీ అవుతుంది. కేసీఆర్ ఇంటి ముందు ఎవరూ ఉండరు’ అని మాట్లాడుతున్నారు. ఈ మాటలు కేసీఆర్ పట్ల ఓర్వలేనితనంతో, మితిమీరిన ఆశలతో మాట్లాడుతున్న మాటలు. సీరియస్‌గా ఆలోచించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు, కేంద్ర నాయకత్వానికి స్పష్టంగా తెలుసు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో కలువకపోతే ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నదో, ఆ రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్‌కు సిద్ధించదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే 14 పార్లమెంట్, 80పైగా అసెంబ్లీ సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తుంది. టీఆర్‌ఎస్ ప్రమేయం లేకుండా తెలంగాణ ఇచ్చి, కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే 100 అసెంబ్లీ సీట్లు 16 పార్లమెంట్ సీట్లు టీఆర్‌ఎస్ గెలవడం ఖాయం. గతి తర్క సూత్రం అనుసరించి జరగబోయే పరిణామాలు ఇంతే.

పై విషయాలు కేంద్ర కాంగ్రెస్ నాయకులకు తెలు సు. కాబట్టి అనివార్యంగా టీఆర్‌ఎస్ విలీనం కోరడం ఖాయం. అయితే గతానుభవం రీత్యా కాంగ్రెస్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం అనివార్యమూ అనే ప్రశ్నను తెలంగాణవాదులను తీవ్రంగా కలవరపెడుతున్నది. తెలంగాణకు ఉన్న ఏకైక ఇంటి పార్టీని తక్షణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఓపిక పట్టాం, కొంత కాలం ఓపిక పడితే, సార్వవూతిక ఎన్నికల తర్వాత ఏర్పడే కేంద్ర ప్రభుత్వంతో టీఆర్‌ఎస్ తనకున్న రాజకీయ బలంతో తెలంగాణ సాధించుకోవచ్చు అనే వాదనలు కూడా వినబడుతున్నాయి. కానీ చాలామంది 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ సాధించుకోవాలనే ఆరాటంతో టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయినా సరే తెలంగాణ సాధించుకోవాలి అని వాదిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ కరీంనగర్ నుంచి నేటి వరకు పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే కింది విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి.

కేసీఆర్ నాయకత్వాన పిడికె డు మందితో మొదలై అనేక పోరాటాలు, త్యాగాలు, అవమానాలు, నిందలు ఎదుర్కొని టీఆర్‌ఎస్ మహానదిగా మారిం ది. పంచాయతీ ఎన్నికల్లో జయపతాక ఎగురవేసి, 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని, సోనియాగాంధీతో ‘జై తెలంగా ణ’ అనిపించింది. కరుడుగట్టిన సమైక్యవాది చంద్రబాబుతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవడం ద్వారా టీడీపీతో తెలంగాణకు జై కొట్టించింది. టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తు వల్ల కేసీఆర్, టీఆర్‌ఎస్ అనేక అవమానాలు ఎదురుకోవలసి వచ్చింది. తెలంగాణవాదం దెబ్బతిన్న నాటి నిరాశ పరిస్థితుల్లో కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి, నిరాహారదీక్ష చేసి, కేంద్ర ప్రభుత్వంతో డిసెంబర్ 9 తెలంగాణ అనుకూల ప్రకటన సాధించారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్ర నాయకులు కుట్రలతో అడ్డుకోవడంతో నిరంతర త్యాగాలతో ఉద్యమాలతో తెలంగాణ నినాదాన్ని గ్రామక్షిగామాన, వాడవాడనా వినిపించారు. ప్రజాభివూపాయాన్ని కూడగట్టి, తెలంగాణ సమాజాన్ని ఐక్యంగా నడిపించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అనివార్యంగా ఏర్పాటు చేయవలసిన పరిస్థితిని కల్పించారు. ఒక్క తుపాకి గుండు పేలకుండా నిరంతర ఉద్యమాలతో అహింసా పద్ధతులలో, దీర్ఘకాల పోరాటాన్ని కేసీఆర్ అనుసరించారు.

ఎంతటి అవమానాన్నైనా భరించి, ఉద్యమ పట్టు సడలకుండా, 1969 ఉద్యమంలాగా విఫలం చెందకుండా, అన్ని రకాల ప్రయత్నాలు కేసీఆర్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి నక్సలైట్ భావజాలం వరకు అన్ని రకాల వ్యక్తుల ను తెలంగాణ ఉద్యమంవైపు మోహరించారు. జేఏసీ నిర్మా ణం ద్వారా ఉద్యోగులను, విద్యార్థులను, కార్మికులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేశారు. తెలంగాణ ఉద్యమం వివిధ రూపాలలో కొనసాగింది, కొనసాగుతున్నది. ఈ పరిణామ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మహాశక్తిగా అవతరించి కాంగ్రెస్, టీడీపీ పునాదులను కదిలించివేసింది. సీమాంవూధలో బలంగా ఉన్న జగన్ తెలంగాణలో కాలు మోపడం కష్టం అయిపోయింది. తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న టీఆర్‌ఎస్‌ను తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటే మనస్సు చివుక్కుమనడం ఖాయం. ఎన్నో కష్టాలకు, బాధలకు, అవమానాలకు ఓర్చి, బలమైన పార్టీగా తయారుచేసిన టీఆర్‌ఎస్‌ను, ముసలి నక్క స్వభావం గలిగిన కాంగ్రెస్‌లో విలీనం చేసి తెలంగాణ సాధించుకోవడం ఎంతో విలువైన మూల్యాన్ని చెల్లించి, రాష్ట్రాన్ని సాధించుకోవడం అవుతుం ది.

చితికి, బలహీనమైన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపడంతో దీన్ని పోల్చడం సీమాంధ్ర విష ప్రచారం మాత్రమే. చిరంజీవి తన, తన అనుచరుల స్వార్థవూపయోజనాల కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఒకవేళ కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్‌లో విలీ నం చేస్తే అంతకన్నా పెద్ద త్యాగం ఇంకే మీ ఉండదని సీమాంవూధకు చెందిన నాయకుడు మాతో వ్యాఖ్యానించడం గమనార్హం. సీమాంవూధలో మూడు ముక్కలు (జగన్, చంద్ర బాబు, కాంగ్రెస్), తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని శక్తిగా ఉన్నారు. సొంత నియోజకవర్గాన్ని ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోని రాజకీయ నాయకులను మనం చూస్తున్నాం. కేసీఆర్ మాత్రమే తన సిద్దిపేటను, కరీంనగర్‌ను, చివరికి మెదక్‌కు కూడా తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేశాడు. పార్టీ బలంగా లేదు అనుకున్న మహబూబ్‌నగర్‌లో పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. కేసీఆర్ సాహస నిర్ణయాలు, త్యాగాలు తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపులు తిరిగి నేడు టీఆర్‌ఎస్ అజేయశక్తిగా నిలబడింది. కేంద్రం అనివార్యంగా తెలంగాణ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే... టీఆర్‌ఎస్ పట్ల కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు పెట్టుకొన్న ఆశల సంగతేంటి? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. నిధు లు, నీళ్లు, ఉద్యోగాలు తదితర విషయాల్లో జరిగిన అన్యాయాలను తొలగించడం టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌తో విలీనం చేస్తే సాధ్యం అవుతుందా? సీమాంధ్ర పెట్టుబడిదారుల అక్రమాస్తులను వెలికితీసి, చట్టబద్ధమైన చర్యలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేపడుతారా? మొదటి ప్రశ్నకు కొంతవరకు న్యాయం జరుగుతంది. గతంలో జరిగిన అన్యాయాలు ఎంతవరకు సవరిస్తారో చెప్పడం కష్టం కానీ భవిష్యత్తులో అన్యాయం జరగదు’ అన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఒకవేళ డి. శ్రీనివాస్ లాంటి మితవాది తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఆంధ్రకు తరలించడం సాధ్యం కాదు.

సీమాంధ్ర పెట్టుబడిదారుల అక్రమాస్తులను వెలికితీసి, హైదరాబాద్ చుట్టు పక్కల ఆక్రమించిన వేల ఎకరాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? పేద ప్రజల నోళ్లు గొట్టే సెజ్‌ల పేరిట ధనస్వాములకు కట్టబెట్టిన వేల ఎరకాలను తిరిగి పేద ప్రజలకు స్వాధీనం చేస్తుందా? కచ్చితంగా తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయదు. ఇలాంటి అనేక ఆలోచనలు, ఆందోళనలు తెలంగాణవాదుల మనస్సును కలవరబెడుతున్నాయి. అయినప్పటికీ మెజారిటీ తెలంగాణవాదులు టీఆర్‌ఎస్ విలీనం చేస్తేనే తెలంగాణ వచ్చ పరిస్థితి ఉంటే తప్పనిసరిగా విలీనం చేయాలని కోరుతున్నారు. తెలంగాణ సాధించిన వీరుని గా కేసీఆర్ కీర్తి శాశ్వతం. అయితే తెలంగాణ కోసం త్యాగాలు చేసి, ఆస్తులు నష్టపోయి, ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నంటి నడిచిన టీఆర్‌ఎస్ శ్రేణుల భవిష్యత్తును కాపాడే చతురత, వ్యూహం, ఎత్తుగడలు కేసీఆర్‌కు ఉన్నాయి. సంకుచిత, చిల్లర తెలంగాణ నాయకులు ఆశపడుతున్నట్లుగా కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రమేయం లేకుండా తెలంగాణను కేంద్రం ఇచ్చినట్లయితే టీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజల నెత్తిన కేంద్రం పాలుపోసినట్లే. పైకి ఎన్ని మాటలు చెప్పినా ఇది జరగడం అసంభవం. ఏ పరిస్థితి ఎదురైనా తెలంగాణ సమాజం, జాగరూకతతో ఐక్యంగా ఉండాలి.

తెలంగాణ భారత రాజకీయాలలో నిర్వహించవలసిన పాత్ర ఏమిటి? అనే ప్రశ్నను కూడా మనము ఆలోచించాలి. తెలంగాణ రాజకీయ నాయకులకు హిందీ భాష కూడా మాట్లాడడం వచ్చు. జిల్లాలో ఇంగ్లిష్ కాని, హిందీ కాని మాట్లాడడం చేతకాని రాజకీయ నాయకుల దైన్య పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారతదేశానికి వారధిగా తెలంగాణ ఉంటుంది. దీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో రాటుదేలిన అనేక నాయకులు తెలంగాణలో ఉన్నారు. రాజకీయ నాయకత్వం, ఉద్యమ నాయకత్వం, పరిపాలనా అనుభవం, పార్టీ నిర్మాణం ఒకే వ్యక్తిలో ఉండడం చరివూతలో అరుదుగా జరుగుతాయి.

కేసీఆర్‌లో పై లక్షణాలు నిరూపితం అయ్యాయి. పైగా ఆయనకున్న ఇంగ్లిష్, హిందీ భాషల పరిజ్ఞానం మరింతగా ఉపయోగపడతాయి. తెలంగాణ కోసం సాహస నిర్ణయాలు తప్పనిసరి. భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడం మాత్రమే కాకుండా కొత్తగా అనేక ప్రయోజనాలు కేంద్రం ద్వారా సాధించగలుగుతాం. తెలంగాణ భారతదేశంలో భాగం కావున తప్పనిసరిగా తెలంగాణ కోసం సాహసం చేయక తప్పదు. భారతదేశ అనేక సమస్యల పరిష్కారానికి కేసీఆర్ అనుభవం, జ్ఞానం, చిత్తశుద్ధి, సామర్థం తప్పనిసరిగా ఉపయోగపడుతాయి.
ముక్తాయుంపు ఏమిటంటే తెలంగాణ మేధావులు తటస్థంగా ఉండడం మర్యాద కాదు. ధర్మక్షేవూతమైన కురుక్షేవూతంలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతిగా ఉండి, ధర్మం కాపాడిన విషయం మనము మరువవద్దు. కీలక సమయంలో మోసాలకు, భ్రమలకు గురికాకుండా ప్రజలను జాగృతం చేయవలసిన బాధ్యత మేధావులకు ఉన్నది.

-పెండ్యాల మంగళాదేవి
-సింగిడ్డి వాసంతి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ