బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు


Fri,April 19, 2013 02:16 AM

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం మేకపోతు గాంభీర్యం నటిస్తూ, తమ ప్రభుత్వాలు సుస్థిరంగా ఉన్నాయని ప్రకటిస్తున్నాయి.జనరల్ ఎన్నికలు ఏ సమయంలోనైనా రావచ్చని అందరూ అభివూపాయపడుతున్నారు. ప్రభుత్వాధినేతల ప్రచారసరళి చూస్తున్నా ఎన్నికలు త్వరలో రావచ్చని అనుమానాలు వస్తున్నాయి.

కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం తెలంగాణ సమాజం స్వీయ రాజకీయ అస్తిత్వం రూపొందించుకోవడానికి అనుకూలం. తెలంగాణ జాతి తన వనరులను, నిధులను, నీళ్ళను కోల్పోతూ, అవమానాలను భరించి కీలక పోరాటానికి సమాయత్తం అవుతున్నది. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వనని, అవమానకరంగా మాట్లాడితే ఎదుర్కొలేని తెలంగాణ కాంగ్రె స్ నాయకులను, తెలంగాణ తల్లి అసహ్యించుకుంటున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు కురుక్షేత్ర మహా సంగ్రామం. ధర్మధర్మాల మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో టీఆర్‌ఎస్ ఒంటరిగా పోవాలా, ఇతర పార్టీలను కలుపుకోవాలా అనే చర్చలు వస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీలు తెలంగాణకు వ్యతిరేకం. అందుకే ఆ ప్రజలు పార్టీలను తెలంగాణకు శత్రువులుగా భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉండలా వద్దా అనే చర్చలో అనేక అనుమానాలు, సంకోచాలు, వాదనలు వస్తున్నాయి.

వాస్తవ పరిస్థితులను సరిగా అర్థం చేసుకుంటే, భవిష్యత్తు స్పష్టంగా అగుపడుతుంది. అన్ని రకాల భ్రమలు వదులుకొని ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకుంటే ప్రజాభివూపాయం ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. రూసో మహాశయుడు చెప్పినట్టు ‘జనాభివూపాయం’ అన్ని పరిణామాలను శాసిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు కుహకాలు చేసి ప్రజల ముందు ద్రోహపు పార్టీలుగా బట్టబయలైన కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ‘జనాభివూపాయం’ ఉంది. ఆయా పార్టీ ల ధన, కండబలం నిర్మాణశక్తి, సీమాంధ్ర మీడియా ప్రచారశక్తి ఎందుకూ పనికి రాకుండాపోతాయి.

సందేహంలేదు. తెలంగాణ ప్రజలు యావత్తూ మౌనంగా కసితో ఎదురు చూస్తున్నారు. బీజేపీ పార్టీతో పోత్తు పెట్టుకొంటే మంచిదని కొందరు అభివూపాయపడుతున్నారు. ఈవిధంగా అభివూపాయపడే వారిలో కొందరు నిజమైన తెలంగాణవాదులు మరికొందరు కరుడుగట్టిన బీజేపీవాదులు ఉన్నారు. దీనికితోడు కేసీఆర్ ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే సీమాంధ్ర మీడియా గందరగోళం కూడా ఉన్నది.
బీజేపీ పార్టీ స్వభావం, తెలంగాణ ఉద్యమం పట్ల దాని వైఖరి, పాత్ర, రాష్ట్ర బీజేపీ నాయకత్వం దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాంతీయపార్టీలపై ఆధారపడే పరిస్థితులు అర్థం చేసుకోకుంటే భవిష్యత్తు కార్యక్షికమం సరిగ్గా రూపొందించుకోగలుగుతాము.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తానని ప్రకటించిం ది. బీజేపీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. బీజేపీని సమర్థించ డం మంచిది. కనీసం బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది’ అని కొందరు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక విధంగా ఎవరో ఏదో చేస్తారని ఆశపడటం,మన వంట మనమే వండుకోవాలి. మనకు ఎవ్వరూ ఏమి చేయరు’ అనేది మరచిపోవటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లు కీలకం అని మరిచిపోవటం. బీజేపీఅయినా కాంగ్రెస్ అయినా, ఇవ్వవలసిన ఒత్తి డి, అవసరం ఉంటే తెలంగాణ ఇస్తాయి. లేకపోతే ఇవ్వవు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ విషయంలో మొండిచెయ్యి చూపించింది. ఇచ్చిన మాట మీద నిలబడే పద్ధతి బీజేపీకి కూడలేదు.

ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల కష్టాలకు బీజేపీ కూడా కారణం అవుతుంది. ‘చంవూదబాబు టీడీపీలు అడ్డుపడ్డాయని, అందుకే తెలంగాణ ఇవ్వలేక పోయామని’వివరణ ఇవ్వడం నిజంగా సిగ్గులేకుండా చేసిన ద్రోహాన్ని సమర్థించటం అవుతుంది. బీజేపీ ఒంటరిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ డం సాధ్యం కాదు. ‘భాగస్వామ్య పక్షాలు అంగీకరించడంలేదు, ఏ ఆంధ్రాబాబో జగన్ అడ్డుపడ్డడు తెలంగాణ ఇవ్వలేకపోతున్నాం. సరైన సమయం చూసి ఇస్తాం’ అని ‘తెలంగాణ ఏర్పాటు విషయంలో (కాంక్షిగెస్ మోసం చేసినట్టు), బీజేపీ మోసం అవకాశంలేదు’ అని ఎవరు చెప్పలేరు. భవిష్యత్తులో సంకీర్ణ రాజకీయాలు సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. కాంగ్రెస్ కాని బీజేపీ కాని ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యంకాదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఏకైక ఎజెండా కలిగిన టీఆర్‌ఎస్ 15 పార్లమెంటు సీట్లు. 100 అసెంబ్లీ సీట్లు గెలవడం అత్యంత ఆవశ్యం. తద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యం.

రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెంకయ్యనాయుడు కన్నుసన్నల్లో ఉంది. వెంకయ్యనాయుడు రాష్ట్ర బీజేపీని తెలుగుదేశం పార్టీకి తోకపార్టీగా మార్చడం వల్ల ఆ పార్టీ ప్రజా పునాది కేడర్ చాలావరకు తగ్గిపోయింది. తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ఉందనే విషయం మనం మరిచిపోవద్దు. బీజేపీ తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉంటే టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగేది కాదు. అందుకే బీజేపీ పట్ల అనేక అనుమానాలు తెలంగాణవాదులకు ఉన్నాయి. కేసీఆర్, టీఆర్‌ఎస్ పట్ల బీజేపీ నాయకుల్లో , కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ ప్రతి కీలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టే ప్రయత్నం చేయటం తద్వారా సీమాంధ్ర శక్తులను బలపరిచింది. ఇందుకు స్పష్టమైన ఉదాహరణ కేసీఆర్ కరీంనగర్‌లో రాజీనామా చేసి, పోటీ చేస్తే విద్యాసాగర్‌రావు పోటీ చేయటం, ఈ విషయాన్ని బీజేపీ, విద్యాసాగర్‌రావులు మరిచిపోయి బలాదూరుగా జేఏసీలో తిరగవచ్చు. కానీ కరీంనగర్ ఓటర్లు మరిచిపోరు.

తెలంగాణ సమాజంలో హిందువులు, ముస్లింలు, కైస్తవులు తదితర మైనారిటీ ప్రజ లు వైషమ్యాలు లేకుండా శతాబ్దాలుగా బతుకుతున్నారు. సీమాంధ్ర పాలకుల కుట్రల తో హైదరాబాద్‌లో జరిగిన మతఘర్షణలు జరిగిన విషయం మనం మరువకూడదు. తెలంగాణ సమాజాన్ని బీజేపీ, ఎంఐఎం మతపరంగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది సమాజపరంగా, రాజకీయంగా నష్టదాయకం. తెలంగాణలో దాదాపు 40 సీట్లలో గణనీయ ప్రభావం చూపే స్థితిలో మైనారిటీ ఉన్నారు. బీజేపీ పొత్తు, మైనారిటీల్లో అనుమానాలు కలుగచేస్తాయి. నరేంద్ర మోడీ నాయకత్వం హిందూ మతవాదులకు ఆనందం కలుగచేయవచ్చు కాని దేశవ్యాప్తంగా కూడా మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారు. మోడీ నాయకత్వం మైనారిటీలను నయాన ఒప్పించడం సాధ్యంకాదు. దేశంలో అనేక సెక్యులర్ పార్టీలు ఉన్నాయి. ముస్లింల రక్షణకు కచ్చితంగా నిలబడే పార్టీలు, ప్రభుత్వాలు ఉన్నాయి.

టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయడంలో ఉపయోగం లేదు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీఆర్‌ఎస్ మైనారిటీ ఓట్లు తగ్గే ప్రమాదం ఉంది. పైగా బీజేపీకి సీమాంధ్ర పార్టీలను ఓడించే సత్తాలేదు. ఆ విషయం పరకాల ఎన్నికల్లో రుజువైంది. పొత్తుపెట్టుకుని బీజేపీకి కేటాయించిన సీట్లలో ఆంధ్రపార్టీలు గెలుస్తాయి. తద్వారా తెలంగాణ ఉద్యమానికి నష్టం. బీజేపీకి ఉన్న కొద్ది ఓట్లు టీఆర్‌ఎస్‌కు బదిలీ కావు. ఎందుకంటే బీజేపీకి టీఆర్‌ఎస్ ప్రధా న శత్రువుగా ఉంది. టీడీపీతో దీర్ఘకాలం పొత్తుపెట్టుకోవడం వల్ల బీజేపీ జవసత్వా లు నశించాయి. టీడీపీతో పొత్తు భస్మాసురహస్తం. ఈ విషయంలో టీఆర్‌ఎస్ కూడా నష్టపోయిన సంగతి మనం మరిచిపోకూడదు. చంద్రబాబుకు సొంతంగా ప్రజా పునాదిని సంపాదించటం సాధ్యంకాదు.ఎన్‌టీఆర్ వల్లనో, బీజేపీ వల్లనో అధికారానికి వచ్చా డు.

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏపార్టీ అధికారానికి వస్తుందో చెప్పడం సాధ్యంకాదు. ఎందుకంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలం నడుస్తున్నది. ఒక ఓటుతో వాజపాయి ప్రభుత్వం పడిపోవటం చిన్నపార్టీలు కేంద్రంలో ప్రభా వం చూపడం, దేవగౌడ ప్రధాని కావటం లాంటి పరిణామాల ను ప్రస్తుత యూపీఏ ప్రభుత్వంలో 9 మంది పార్లమెంట్ సభ్యులలో శరద్‌పవార్ చక్రం తిప్పటం లాంటి విషయాలను అర్థం చేసుకొంటే రెండు విషయాలు స్పష్టం అగుతాయి. ఒకటి- టీఆర్‌ఎస్ పార్టీకి 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే, కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించవచ్చు. రెండు- ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం వల్ల కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం సాధ్యంకాదు. రాబోయే ఎన్నికల్లో ముందస్తు పొత్తు పెట్టుకొంటే ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టమవుతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు తెలపటం తెలంగాణ సాధించుకోవచ్చు. టీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ మించిన రాజకీయాలు లేవు. రాష్ట్ర సాధనే ఏకైక ఎజెం డా. సంకీర్ణ ప్రభుత్వాల సందర్భంలో ఎన్నికలు ముందే ఒక పార్టీతో పెట్టుకొంటే టీఆర్‌ఎస్ డైనమిక్ రాజకీయాలు చేయ డం సాధ్యంకాదు. జయశంకర్ మాటల్లో చెప్పాలంటే యాచించటం ద్వారా కాదు శాసించటంతో తెలంగాణ ‘తెచ్చుకోవచ్చు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చివరికి ములాయం కూడా అధికారానికి రావ చ్చు. రాజీ అభ్యర్థిగా శరద్‌పవార్ ప్రధాని కావచ్చు. వాదన కోసం టీఆర్‌ఎస్, బీజేపీతో పెట్టుకొని, బీజేపీ సభ్యులు గెలిస్తే వారు తెలంగాణ కోసం ములాయం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును స్వాగతించరు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రం ఏకైక ఎజెండాకాదు. బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది’ అని చెప్పడం ఊహ మాత్రమే. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బెంగాల్‌లో బీజేపీ లేదు. కర్ణాటకలో తిరిగి అధికారానికి రావటం కష్టం. ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్, మహారాష్ట్రలలో బలమైన రాష్ట్ర నాయకులు ఉన్నారు. పైగా మోడీ పీఎం అభ్యర్థి విషయంలో బీజేపీలో ఉన్న కుమ్ములాటలు ఉన్నాయి. మోడీ ప్రధాని అభ్యర్థిగా బలంగా దేశ ప్రజలను ఆకర్షించడం సాధ్యంకాదు. ఒకవేళ నరేంవూదమోడీ పీఎం అభ్యర్థిగా ముందుకు వస్తే మైనారిటీ ఓట్లు బీజేపీ వ్యతిరేక పార్టీలకు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశరాజకీయాల్లో డైనమిక్ మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా సంకీర్ణ రాజకీయ ప్రభుత్వం రావచ్చు. కేసీఆర్ చెప్పినట్టు సందర్భమేదైనా తెలంగాణ ఒక్కటిగా ఉండాలి. అంటే బలమైన రాజకీయశక్తిగా టీఆర్‌ఎస్ అవతరించాలి.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ