ఉద్యమంతో పాటు ఎన్నికలు


Thu,April 4, 2013 12:04 AM

telangana-movementతెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్యమం అనగా 1969 స్థాయిలో ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుందని, ఎన్నికల మార్గం పనికిరాదని చెబుతున్నారు. జయశంకర్‌సార్ చెప్పినట్టు భావవ్యాప్తి, ఉద్యమం, ఎన్నికలు అనే మూడు పద్ధతుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయాలి. ఈ మూడు పద్ధతుల్లో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి అనే ప్రశ్న వస్తుంది. సందర్భానుసారం పద్ధతికి ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ సందర్భం, పద్ధతి మీద వివిధ అభివూపాయాలు, వాదనలు ఉన్నాయి. దీనికితోడు సీమాంధ్ర మీడియా విష ప్రచారంతో ‘గందరగోళం శాశ్వతం చేసే విధానం’ కొనసాగిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా సాధ్యపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం నామ మాత్రమే. కనుక కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని అర్థం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం ఎలా అనేది సమస్య. కేవలం తీవ్రమైన ఉద్యమం ద్వారా సాధ్యమవుతుందా అనే సమస్య ఉంటుంది. అందులో సందేహించాల్సిన పనిలేదు. అహింసాయుతంగా, ప్రజలు ఇబ్బంది పడకుండా సాగిస్తే ఉద్యమం తీవ్రం కావ డం సాధ్యం కాదు. అహింసామార్గం విడనాడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్కశంగా ఉద్యమాన్ని అణచివేస్తాయి. ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ అనుసరించిన విధానాలు, ముఖ్యంగా శత్రువును తక్కువగా అంచనా వేసి కొన్ని దుస్సాహస విధానాల వల్ల శ్రీలంక తమిళులు తమ సర్వశక్తులను కోల్పోయారు. తిరిగి ఉద్యమం బలపడాలంటే దీర్ఘకాలం అవసరం అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే సీమాంధ్ర పెట్టుబడిదారీ శక్తుల స్వభావం ప్రత్యేకమైనదిబిటిష్ వలసవాదం లాగా స్పష్టంగా కనపడదు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పెత్తనం, ఆర్థిక దోపిడీ పెత్తనం తెలంగాణ ప్రాంత నిధులను, నీళ్లను ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నది.తెలుగు జాతి పేరిట మెజారిటీ ఎమ్మెల్యేలు సీమాంవూధలో ఉండడం వల్ల, ప్రజాస్వామ్యం పేరిట తెలంగాణ ప్రాంతం వలసాధిపత్యంతో అనేక ఇబ్బందులకు, బాధలకు గురవుతున్నది.

ముఖ్యమంత్రి సీమాంధ్ర వ్యక్తి కావడం, ముఖ్యమంవూతికున్న అపారమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతం వివక్షను ఎదుర్కొంటున్నది. తెలంగాణ ప్రజలు ఉద్యమబాట పడితే పోలీసు నిర్బంధం, సీమాంధ్ర మీడియా ఉద్యమంపై బురద చల్లడం, ప్రజలను గందరగోళపరచడం అనే విధానాలను అనుసరిస్తున్నది. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, రాసిపెట్టుకోమని బాహాటం గా తెలంగాణ ప్రజలను బెదిరించడం చేస్తాడు. అవసరమైతే తాను హైదరాబాద్‌లో పుట్టానని మాట్లాడుతాడు. సీమాంధ్ర పాలకవర్గాలు తేనె పూసిన కత్తి లాంటివి. సీమాంధ్ర పాలక వర్గాలు తెలంగాణ రాజకీయ నాయకత్వంలో కులాల వారీగా ముఠాలు తెచ్చి, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకులపై అనేక నిందలు మోపి, కుట్రలు, కుహకాలతో ఈ ప్రాంత ప్రయోజనాల ను కాపాడే నాయకులు లేకుండా చేసింది. పాలకవర్గాలకు తొత్తులుగా ఉండే నాయకులను అభివృద్ధి చేసింది.

స్వతంవూతంగా ఉన్న నిజాంరాజ్యం భారత మిలటరీ ఆక్రమణతో ఓడిన రాజ్యం గా మారి, ఫలితంగా తెలంగాణ రాజకీయ నాయకత్వం పరాధీన స్థాయికి దిగజారింది. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన తెలంగాణ నాయకుల స్థానంలో సీమాంధ్ర వారే కమ్యూనిస్టు పార్టీలలో ప్రాబల్యం వహించారు.
తెలంగాణవాదం ఫ్యూడల్ శక్తుల వాదంగా నాడు కమ్యూనిస్టులు అభివర్ణించడంతో, ఈప్రాంతంలోని మేధావులు భ్రమలకు గురయ్యారు.1969లో జరిగిన మహత్తర తెలంగాణ ఉద్యమం స్వార్థపరులైన, అవకాశవాదులైన, పదవీ కోల్పోయిన ఉద్యమంగా ప్రచారం చేశారు. టీడీపీ హయాంలో ‘తెలుగుజాతి’ పేరిట తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగింది. అందుకే జయశంకర్ సార్ తెలంగాణకు ఎక్కువ నష్టం చేసింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అసెంబ్లీలో ‘తెలంగాణ పదము’ ఉచ్చరించడం తప్పయిపోయింది. నక్సలైట్ ఉద్యమంలో వేలాదిమంది మణిపూసలాంటి తెలంగాణ బిడ్డలు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య రాజకీయ వాతావరణంలేని నిరాశమయ పరిస్థితి నెలకొన్నది.

తెలంగాణవాదాన్ని బతికించడానికి జయశంకర్‌లాంటి మేధావులు ప్రయత్నించారు.అయితే అవకాశవాదులైన నాయకులు తమకు మంత్రిపదవి రాకపోతే ‘తెలంగాణ’ అని, రాగానే అన్నీ పోయిన సందర్భాలు తెలంగాణ ప్రజలు చూశారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో తెలంగాణవాదం బలపడింది. పన్నెండేళ్ళుగా కేసీఆర్, తెలంగాణ చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరిగాయి. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు పోయాయి. తెలంగాణవాదం మాటల్లో చెబుతూ ఆచరణలో తెలంగాణవాదాన్ని ఓడించే శక్తులను సీమాంధ్ర వలసవాదులు ప్రోత్సహించారు. సీమాంధ్ర వలసవాదం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల రూపాల్లో ఉన్నది. తెలంగాణ విషయానికి వస్తే అందరూ ఒక్కటైన సందర్భాలు చూశాం.

బీజేపీ పాత్ర అనుమానాస్పదమే. వెంకయ్యనాయుడు కనుసన్నల్లో రాష్ట్ర నాయకత్వం కలిగిన పార్టీ అది. బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీలు అనుమానపడే ప్రమాదం ఉన్నది. పైగా కొద్దిపాటి బీజేపీ ఓట్లు సైతం టీఆర్‌ఎస్‌వైపు బదిలీకావు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలో ్లటీఆర్‌ఎస్, కేసీఆర్ అంటే తీవ్ర వ్యతిరేకతను గమనిస్తున్నాం. ఆంధ్రలో టీడీపీతో వెళ్లే సీపీఐతో పొత్తు పెట్టుకోవడం అవకాశవాద విధానంగా, టీఆర్‌ఎస్ విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి టీఆర్‌ఎస్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం అన్ని విధాలా సమంజసం.

మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ విషయయై వెనుకడుగు వేసింది. ‘వంద రోజుల్లో తెలంగాణ’ అనే మాటను నమ్మి బీజేపీని బలపరిస్తే తెలంగాణకు ప్రమా దం. ఎందుకంటే బీజేపీ తెలంగాణ ఎజెండా మాత్రమే కలిగిన పార్టీ కాదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ను మించిన మోసకారి మరొకటి లేదు. సంకీర్ణ రాజకీయాలలో తెలంగాణ ఏకైక ఎజెండా కలిగిన టీఆర్‌ఎస్ 15పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణ సాధించే అవకాశాలు ఏర్పడుతాయి. తెలంగాణలో సీమాంధ్ర పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీలు కొన్ని సీట్లు గెలిచినా ఆ మేరకు తెలంగాణకు నష్టం జరుగుతుంది.

తెలుగుదేశం పార్టీకి తోకపార్టీగా వ్యవహరించి తాను నష్టపోయిన బీజేపీ తెలంగాణ విషయానికి వస్తే టీఆర్‌ఎస్ మీద దాడి చేయడానికి ఒంటికాలిమీద లేస్తున్నది. ఆర్థిక, రాజకీయ, మీడియా ప్రాబల్యంతో సీమాంధ్ర పాలకవర్గాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని ఉద్యమాన్ని అణచివేసే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అవసరమైతే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కలిసిపోయి తెలంగాణ వ్యతిరేకిస్తాయి. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం సాగే పోరాటంలో ఆర్గనైజేషన్‌ను మించిన ఆయుధం లేదు. ప్రజాఉద్యమం ద్వారా ముందుకుపోవడానికి తెలంగాణ సమాజం అన్ని భ్రమలు వదులుకొని పోరాటానికి సిద్ధం కావాలి. యూపీఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వదు అనే విషయం ప్రజలకు స్పష్టం కావాలి. కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్ నాయకులు, జేఏసీ నాయకులు ఉద్యమ ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ, ‘చర్చలు అన్ని బూటకం’ అని ప్రకటించాలి. ప్రజలకు సొంత అనుభవం వల్లనే నమ్మకం కలగాలి. కేంద్ర బడ్జెట్ ఆమోదం తర్వాత తెలంగాణ ప్రకటించకపోతే యూపీఏ తెలంగాణ ఇవ్వడం సాధ్యం కాదు. జూన్ తర్వాత ప్రజలకున్న భ్రమలు తొలిగిపోతాయి. ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటారు. అదేసమయంలో తెలంగాణ ఏర్పా టు రాజ్యాంగబద్ధంగా జరగాల్సినందు వల్ల టీఆర్‌ఎస్ 15 పార్లమెంటు స్థానాలు గెలువడం ద్వారా తెలంగాణ సాధించే అవకాశాలు కలుగుతాయి.

1969లో ఉద్యమం తీవ్రంగా నడిచినప్పటికీ 1971 లో తెలంగాణ ప్రజాసమితి 10 సీట్లు గెలిచినప్పటికీ తెలంగాణ రాలేదు. కారణం ఇందిరాగాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం. బంగ్లాదేశ్ యుద్ధం గెలుపుతో తెలంగాణలో తప్ప, దేశం యావత్తూ కాంగ్రెస్ గెలిచింది. నాడు దేశ రాజకీయ పరిస్థితులు తెలంగాణకు అనుకూలంగా లేవు. మరి ఇప్పుడు దేశంలో కాని, రాష్ట్రంలో కాని ఏ ఒక్కపార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు.సంకీర్ణ ప్రభుత్వాలే గతి.ఎన్డీఏ లేదా యూ పీఏ ప్రభుత్వం చిన్నపార్టీల (ఐదుగురు ఎంపీలకు మిం చని పార్టీల) ఒత్తిడికి లొంగుతున్నాయి. కాబట్టి 15 పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్ గెలిస్తే కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవచ్చు.

తెలంగాణ ఉద్యమానికి శత్రువుల గురించి ఆలోచించేటప్పుడు రష్యా విప్లవ నాయకుడు ప్లెకనొవ్, లెనిన్ తెలిపిన విషయాలు గుర్తించుకోవాలి. మన విప్లవ నాయకులకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. 1) ఇటు ఇంకా పూర్తిగా నిర్మూలించబడని పాత దురభిమానాలు 2) అటు కొత్త కార్యక్షికమాన్ని సంకుచితభావంతో అర్థం చేసుకోవడం. నిజమైన తెలంగాణవాదులకు కొందరికి కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడానికి అనుమానాలు, సంకోచాలు ఉన్నాయి. అదే సమయంలో కేసీఆర్ చెప్పిన ‘వంద అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లు సాధించడం ద్వారా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం తద్వా రా తెలంగాణ రాష్ట్ర సాధన అనే విషయాన్ని సంకుచితంగా అర్థం చేసుకోవడం. కొంద రు టీడీపీ నాయకులు తెలంగాణ అవసరం అని భావిస్తారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయకత్వం నుంచి బయటపడడానికి ఇష్టపడరు.

కొందరు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అంతే. విచివూతమేమంటే జగన్‌కు సలాం చేసే నాయకులు కొందరు తెలంగాణ గురించి మాట్లాడరు. జగన్ పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించడం ద్వారా తెలంగాణ వ్యతిరేకతను చాటుకొన్నాడు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న తెలంగాణవాదులు బయటకు వచ్చి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో చేరాలి. 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా స్వీయ రాజకీయ అస్తిత్వం, తద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరిగే క్రమంలో తెలంగాణ రాజకీయ శక్తి కీలకమవుతుంది. తద్వారా తెలంగాణ సాధించుకోవడం సాధ్యమవుతుంది.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ