ఆకాంక్ష-ఐక్యత


Fri,March 1, 2013 11:23 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరనే అభివూపాయాలు విం టున్నాం. నిరాశామయమైన అభివూపాయాల వెనుక సీమాంధ్ర మీడియా ‘గందరగోళాన్ని’ శాశ్వతం చేసే విధానం కూడా కారణం. సీమాంధ్ర పెట్టుబడిదారుల ధన ప్రభావానికి ఆకర్షితులై, తొత్తులుగా పనిచేస్తున్న నాయకులను మనం చూస్తున్నాం. ‘ఏ సందర్భమైనా తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే’ కేసీఆర్ మాటలను అర్థం చేసుకోవాలి. సీమాంధ్ర పెట్టుబడిదారులను, రాజకీయ నాయకులను ఓడించే శక్తి తెలంగా ణ ప్రజానీకానికి ఉన్నది. తెలంగాణ ప్రజాశక్తి ముందు తెలంగాణ వ్యతిరేక శక్తులు కాగితపు పులులు మాత్ర మే.ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నప్పటికీ తెలంగాణ ఎందుకు రావడం లేదు? ఇందుకు సీమాంధ్ర రాజకీయ నేతలను, యూపీఏ ప్రభుత్వాన్ని నిందిస్తే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఐక్యత మరింత పెరగాలి. ‘ఎన్నికలైనా, ఉద్యమమైనా, ఏ సందర్భమైనా తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండాలి’ అనే కేసీఆర్ సూక్తిని ఈ ప్రాంత సమాజం సరిగ్గా అర్థం చేసుకోవాలి.

జర్మన్ భావవాద గతి తార్కికవేత్త హెగెల్ చెప్పినట్లు ‘అవసరాన్ని అర్ధం చేసుకోకపోతే అది గుడ్డిది అవుతుం ది.(Necessity is blind only safer ‘as it is not understood’) ‘గుడ్డిదైన అవసరం’ ఏమి సాధించలేదు. హెగెల్ చెప్పినట్టుగా అవసరాన్ని అర్థం చేసుకోవడమే స్వేచ్ఛ. (‘Freedom is the appreciation of Necessity’) తెలంగాణ రాష్ట్రం రావాలని కోరిక ఉంటే ప్రయోజనం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరోధకంగా ఉన్న బాహ్య, అంతర్గత శక్తులను అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలోని అనైక్యత ప్రధాన శత్రువు. రాజకీయ, కుల, మత విభేదాలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ ఐక్యం కావాలి. తెలంగాణ ఉద్య మ పథ నిర్దేశకులు కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై అవిశ్వాసం ప్రకటించడం ద్వారా తెలంగాణ ఉద్యమం ముందుకు ఎలా పోతుందో అర్థంకాదు. నిజమైన తెలంగాణ ఉద్యమ శక్తులన్నీ ఐక్యంగా నిలబడితే స్వరాష్ట్రం సాధించడం సులువు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ వ్యాన్‌గార్డ్ అయిన టీఆర్‌ఎస్ ఉద్యమశక్తులను ఐక్యం చేయాలి. గత పది సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ నుంచి అదృశ్యమైపోతుంది. కాంగ్రెస్ తన దీర్ఘకాల అవసరాల రీత్యా కాని, రాహుల్‌గాంధీని ప్రధాని కావాలనే తక్షణ కారణం వల్ల అయినా తెలంగాణ ఏర్పాటు చేసి తీరుతుంది. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఏ విధంగా ఆలోచించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయక తప్పదు. ఒకవేళ బుద్ధిహీనంగా ప్రవర్తించి మాయోపాయాలను నమ్మి, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలుపొంది, బలమైన రాజకీయశక్తిగా అవతరిస్తుంది. తద్వారా తెలంగాణ సాధిస్తుంది.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ