పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు


Sun,December 2, 2012 11:27 PM

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు. కాంగ్రెస్ ఎందుకు నాన్చివేత ధోరణిని కొనసాగిస్తున్నది. సీమాంధ్ర మీడియా గందరగోళాన్ని శాశ్వతం చేసే విధానాన్ని ఎందుకు సాగిస్తున్నది. స్పష్టంగా ఉండవలసిన అంశాలు సైతం ఎందుకు సంక్లిష్టంగా మారుతున్నాయి. దీనికి తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడ్డ సంక్షోభం ముఖ్యకారణం. తెలంగాణ ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి సీమాంధ్ర రాజకీయ పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ ప్రయత్నిస్తున్నాయి. మానసిక స్థైర్యం అంటే ఒక ప్రజా సమూహం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నాయకత్వం పట్ల విశ్వాసం, విధేయతతో కృషి చేయడానికి, సంకల్పించిన ఒక సామూహిక మానసిక భావన. ఇది వ్యక్తిగతం కాదు. పార్టీలోక్షికమశిక్షణ, కార్యకర్తల యోగక్షేమాలు, ప్రజాస్వామిక పద్ధతులు, నాయకత్వ పటిమ, కార్యకర్తల భవిష్యత్తు పట్ల భద్రత మొదలగు అంశాలు ప్రభావితం చేస్తాయి. అన్నింటికీ మించి లక్ష్యశుద్ధి అధికంగా ప్రభావితం చేస్తున్నది.

వైఎస్‌ఆర్‌సీపీ లక్ష్యం జగన్‌ను ముఖ్యమంవూతిని చేయడం. అందుకు ప్రజల్లో జగన్‌కు ఏదో అన్యాయం జరిగిందని, జగన్ ముఖ్యమంవూతి కావడం ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు వైఎస్ పాలనలో లాగా తిరిగి అందలం ఎక్కువచ్చని వైఎస్‌ఆర్‌పార్టీ నాయకుల ఆశ. వైఎస్ పరిపాలన కాలంలో విచ్చలవిడిగా రాష్ట్ర వనరులను కొల్లగొట్టి అన్ని నైతిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి తనకు, తన కార్యకర్తలకు మేలు చేసిన సంగతి మనం మరవకూడదు. ఫలితంగా వైఎస్‌ఆర్ పాలనాకాలంలో ఇబ్బడిముబ్బడిగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న కొంతమంది జైళ్లలో ఉన్నారన్నది తెలిసిందే. ఏ ప్రభుత్వం కూడా విద్యార్హతలు లేని అభ్యర్థులను టీచర్లుగా నియమించిన సందర్భం లేదు. ‘రాజన్నరాజ్యం’ అంటే తన అనుయాయులకు ఏదైనా చేయడం అన్నమాట.

వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ‘రాజన్న రాజ్యం’ లో ఎలాంటి ‘మేళ్ళు’ వస్తాయో తెలుసు. ఆ కలలు నిజం చేసుకోవడానికి ఆ పార్టీ నాయకులు, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేస్తూ, భ్రమలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకంకాదని చెబుతూ వైఎస్‌ఆర్ తను ముఖ్యమంవూతిగా అడుగడుగునా తెలంగాణకు అడ్డుకున్న విషయం, జగన్ సమైక్యాంధ్ర ఫ్లకార్డును పట్టుకున్న విషయం మరుగున పెడుతున్నారు. ప్రజల్లో ఉన్న సానుభూతి క్రమంగా తగ్గుతుందేమోనన్న అనుమానాలు, భయాలు ఆపార్టీలో వ్యాపించాయి. దీన్ని ఛేదించే లక్ష్యంతో పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో షర్మిల పాదయావూతను అర్థం చేసుకోవాలి. వైఎస్‌ఆర్ పార్టీ మనోస్థైర్యం కన్నా తెలుగుదేశం పార్టీ మరింత దిగజారి పాతాళానికి చేరింది.

2009 తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీని వీడి, వారు బయట పెట్టిన చేదు నిజాలు టీడీపీనీ, ఆపార్టీ నాయకుడు చంద్రబాబు విశ్వసనీయతను మరింత దిగజార్చాయి. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి అధికారానికి వచ్చిన దాంతో చంద్రబాబు అనేక అవిశ్వసనీయ పనులకు పాల్పడ్డాడు. ఎన్టీఆర్ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కాడు. రోశయ్య నాయకత్వాన అఖిల పక్ష సమావేశంలో, అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటును స్వాగతించి, డిసెంబర్9 చిదంబరం ప్రకటనతో ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో’ అని, రాత్రికి రాత్రి కుట్రలకు పాల్పడి, కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, బూటకపు రాజీనామాల డ్రామాను ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా చంద్రబాబు నడిపించడంతో తెలంగాణ ప్రజానీకం సీమాంధ్ర ప్రజానీకంలో కూడా విశ్వసనీయత లేని వ్యక్తిగా చంద్రబాబును భావిస్తున్నారు. చంద్రబాబు పార్టీని కాపాడుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాడు.

ఏదో ఒకవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కాపాడుకునే లక్ష్యంతో, 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహూల్‌ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌పార్టీ కలగంటున్నది. జమ్మిక్కులతో అధికా రంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ కూడా అదే పనిచేస్తున్నది. ప్రాథమికంగా రెండు పార్టీల మధ్య తేడా ఏమీలేదు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ విషయంతో మాటతప్పిన పార్టీలే.గతంలో టీడీపీ కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేకపోయామని బీజేపీ వివరణ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం టీడీపీ మద్దతుపై ఆధారపడడం వల్ల అలా జరిగిందని అద్వానీ అన్నారు.

దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం తప్పించి వేరే ప్రయోజనం లేనిపార్టీ టీఆర్‌ఎస్ కేంద్ర రాజకీయాల్లో నిర్ణాయక శక్తిగా అవతరించాల్సిన అవసరం ఉన్నది. టీఆర్‌ఎస్ 16 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం సాధ్యం. కేసీఆర్ ఆమరణ నిరాహర దీక్ష సందర్భంగా ప్రజల ఉద్యమానికి తలవంచి, రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించి డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన వచ్చింది. రాత్రికి రాత్రికే సీమాంధ్ర రాజకీయ పార్టీల కుట్రల ఫలితంగా ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ వెనుక్కు తీసుకున్నది. తెలంగాణలోని రాజకీయశక్తులు ఐక్యమై జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం కొనసాగించడంతో ప్రజా ఉద్యమాన్ని, ప్రజాచైతన్యాన్ని ప్రక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ కృష్ణకమిటీని నియమించింది.

శ్రీకృష్ణ కమిటీ అబద్దాలతో తప్పుడు లెక్కలతో తెలంగాణ ప్రజల మనోభావాలకు భిన్నంగా రిపోర్టు ఇచ్చి తద్వారా అభాసుపాలయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ పార్టీ ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగంగా ఉంటుంది. టీఆర్‌ఎస్‌ని విలీనం చేసుకుంటే రాజకీయ ప్రయోజనం ఎంతవరకు నెరవేరుతుంది. జగన్‌ను లొంగదీసుకుంటే తెలంగాణ ఇవ్వకుండానే అధికారంలోకి రా గలుగుతామా అనే ఎత్తులు జిత్తులతో కాంగ్రెస్‌పార్టీ ఆలోచిస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలకు, ఆశయాలకు పెద్దపీట వేయాలనే నియమాన్ని కాంగ్రెస్ విస్మరించి తెలంగాణ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ఉద్యమశక్తులు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం కాపాడి ఉద్యమాన్ని ఉన్నతస్థాయికి తీసుకపోవాలి. కేంద్రం చర్చల పేరిట ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించింది. కేసీఆర్ అదే చర్చలను కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని అంతం చేయడానికి విజయవంతంగా వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం చివరికి టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి ఒప్పుకోవడం ద్వారా కేసీఆర్‌కు కాని టీఆర్‌ఎస్‌కు కాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా వేరే లక్ష్యం ఏమి లేదని సోనియాగాంధీ నుంచి గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్త వరకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణకు ఒప్పుకుంటే దానికి మేలు,లేకుంటే శాశ్వతంగా తెలంగాణలో నాశనం కావడం ఖాయం.

సీమాంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణ అధికంగా అభివృద్ధి చెందిందని, తెలుగుజాతి ఐక్యత, నీరు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, విలువైన భూములు, సహజవనరులు ఏవిధంగా దోచుకున్నారనే విషయాన్ని మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం అసాధ్యమనే తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నారు. తెలంగాణ నాయకుల మధ్య అనుమానాలు, భయాలు కలుగచేసి నాయకుల మధ్య కుల, రాజకీయ విబేధాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన ప్రజాభివూపాయం ఒక బలమైన భౌతిక శక్తిగా కార్ల్‌మార్క్స్ వర్ణించాడు. తెలంగాణ రాజకీయ నాయకుల్లో క్రమంగా అనైక్యత నశించి ఐక్యత పెరుగుతున్నది. రాజకీయ శక్తుల పునరేకీకరణ సాగుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ‘వ్యాన్‌గార్డ్’గా ఉన్న టీఆర్‌ఎస్ తెలంగాణలోని రాజకీయ శక్తుల ఐక్యతకు కృషి చెయ్యాలి. కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితిని తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉపయోగించుకోవటంలో చాకచక్యం ప్రదర్శించాలి. 2014 ఎన్నికల్లో 16 పార్లమెంట్ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు గెలిచే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కార్యక్షికమాన్ని రూపొందిం చుకోవాలి.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేటి యుగంలో టీఆర్‌ఎస్ 16 పార్లమెంట్ సీట్లు గెలిస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ కచ్చితంగా సాధ్యపడుతుందని ప్రజలకు అర్థం చేయించాలి. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 16 పార్లమెంట్ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు గెలువగలుగుతామనే మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెం చాలి. అందుకు జయశంకర్‌సార్ చెప్పినట్టు ఉద్యమం, ఎన్నికలు, రాజకీయ ప్రక్రియలపై దృష్టి పెట్టాలి. సీమాంధ్ర మీడియా విష ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా బలమైన ప్రచార యుద్ధం, సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్రసాధన ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని కదిలించే విధంగా కార్యక్షికమాలు రూపొందించాలి. గ్రామాలు,పట్టణాలు, నగరాలు, హైదరాబాద్ నగరంతో సహా ప్రజలందరినీ కదిలించే విధంగా ఉద్యమాలు చేపట్టాలి. ప్రజలందరినీ కదిలించడం ద్వారా సీమాంధ్ర కోటీశ్వరుల కుట్రలను భగ్నం చేయగలుగుతాం. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సులభమవుతుంది. అందుకు తెలంగాణ సమాజాన్ని యావత్తు కదిలించడం కన్నా వేరే మార్గం లేదని అర్థం చేసుకోవాలి. గాంధీమార్గం ప్రజలందరినీ కదిలించే మార్గం. ఈ అహింసాయుత, రాజ్యాంగబద్ధ పోరాటంలో తెలంగాణ ప్రజల ధర్మ పోరాటం గెలవాలి. దీనికి ప్రతి ఒక్కరూ కంకన బద్ధులై కదలాలి.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles