ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?


Sun,November 18, 2012 12:07 AM

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ ఫిరాయింపులుగా, నీతిబాహ్యమైనవిగా ఖండిస్తున్నారు. ఈవిధంగా ఆకర్షించడం సరైన పద్ధతి కాదని కేసీఆర్, జగన్‌లను నిందిస్తున్నారు. విచివూతమేమిటంటే చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌డ్డిలు ప్రతిపక్షాలను చీల్చారు. సమాజంలో గౌరవవూపదంగా బతుకుతున్న వారిని తమ పార్టీలవైపు ఆకర్షించి, వారితో ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులను ఓడించారు. పీజేఆర్‌ను ఓడించడానికి రిటైర్డ్ పోలీస్ అధికారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేసిన నిర్వాకం. చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గంలో పనిచేశారు. ఎన్టీఆర్ ధాటికి ఆ పార్టీ ఓడిపోగానే ఆయన టీడీపీలోకి ఫిరాయించిన విషయం జనం మరిచిపోలేదు. అలాగే అవసరం లేకున్నా టీఆర్‌ఎస్ పార్టీని వైఎస్ నిలువునా చీల్చి, తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చడానికి ప్రయత్నించాడు.ఈ నేపథ్యంలో వివిధ రకాల ఫిరాయింపులను, వాటి స్వరూప స్వభావాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది.

కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలు, విశ్వసనీయతలేని పద్ధతుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి.2009 ఎన్నికల తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో సీమాంవూధలో నూ, తెలంగాణలోనూ ఓటమిపాలై, చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోయారు. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికారపార్టీ గెలుస్తుంది. అయితే ఇక్కడ అధికార, ప్రతిపక్షపార్టీలు ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రజామోదం ఉన్న పార్టీలవైపు అంటే తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంవూధలో వైఎస్‌ఆర్‌సీపీల వైపు మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. వచ్చే సార్వవూతిక ఎన్నికల నాటికి కాంగ్రెస్,టీడీపీలకు చెందిన ప్రముఖ నాయకులు వారి వారి పార్టీలను వీడడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రజామోదం ఉన్న పార్టీలవైపు నాయకులు వెళ్లడం సహజమైన మార్పు అయినప్పటికీ అది ధర్మమా కాదా అనే చర్చ ముందుకు వస్తున్నది.

వైఎస్‌ఆర్‌సీపీ లక్ష్యం జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం. తద్వా రా ఆ పార్టీ నాయకులు అధికారాన్ని పొందడం. సీమాంవూధలో వైఎస్ పట్ల ఉన్న సానుభూతిని ఉపయోగించుకొని, కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను బహిర్గతం చేసి, తప్పుడు వాగ్దానాల ద్వారా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులను ఆకర్షించి తద్వారా ఆయా పార్టీల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇతర పార్టీల నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలోకి మారడంలో సీమాంవూధలో ఓట్లను సంపాదించిపెట్టే సామర్థ్యం కాంగ్రెస్, టీడీపీల్లో లేకపోవడం!, జగన్ ద్వారా 2014 ఎన్నికల్లో తాము గెలిచే అవకాశం ఉండడం వల్ల. జగన్‌కు ఉన్న ధనబలం, ప్రచారశక్తి తమ గెలుపునకు ఉపయోగపడతాయనే నమ్మకం వల్ల వివిధ పార్టీల నాయకులను వైఎస్‌ఆర్‌సీపీ ఆకర్షిస్తున్నది. పై అంశాలను పరిశీలిస్తే జగన్‌వైపు వెళ్లే నాయకులకు వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు తప్ప వేరే కారణాలు లేవు. కాబట్టి ఇక్కడ నీతి,ధర్మము అంటే ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి.

‘ఏది సరైంది, ఏదికాదు’ అనే ప్రశ్నకు బుద్ధుడు ‘మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు మేలు చేసే పని సరైనది, మేలు చేయనిది సరైనది కాదు. అనగా ధర్మ విరుద్ధమైనది, నీతి విరుద్ధమైనదిగా ‘బహుజన హితయ’ అనే సూత్రాల ద్వారా చెప్పారు. వైఎస్, చంద్రబాబు హయాంలలో వనరులను కోటీశ్వరులకు కట్టబెట్టిన వైనం, విద్యుత్తు, నీళ్లు తదితర రంగాల్లో సీమాంధ్ర కోటీశ్వరులకు మేలుచేశారు. ఈ ఇరువురి పాలనా కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అన్యాయానికి, దోపిడీకి గురైంది. కాబట్టి జగన్ పార్టీలోకి వెళ్లడం ఫిరాయింపులుగా చూసి, వాటిని నీతిబాహ్యమైనవిగా ఖండించవలసి ఉంటుంది.

తెలంగాణ ఉద్యమం తీవ్రమైన ప్రతి సందర్భంలో ఉద్యమకారులు, యువకులు, విద్యార్థులు ‘జై తెలంగాణ’ నినాదంతో గెలిచిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను తమ పదవులకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. తెలంగాణ పట్ల దొంగనాటకాలాడుతున్న కాంగ్రెస్, టీడీపీలను వదిలి బయటికి రావాలని ఉద్యమకారులు కోరారు. అయినా తాము ఆ పార్టీలలో కొనసాగుతూ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలుస్తామంటే ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణ సమాజం మొత్తం ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యమైంది. కానీ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుల మధ్య ఐక్యత రాలేదు. ఇందుకు కారణం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అధినాయకులు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడమే. కనుక కాంగ్రెస్, చంద్రబాబు, జగన్‌లను ధిక్కరించకుండా స్వరాష్ట్రం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామంటే ప్రజలు విశ్వసించరు. 2014 ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంతో పోల్చవచ్చు. ధర్మాధర్మాల మధ్య, న్యాయాన్యాయాల మధ్య జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం.

కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి ముందు ధర్మరాజు ‘ఈ యుద్ధం ధర్మాధర్మాలకు మధ్య యుద్ధం’గా ప్రకటించారు. ఇరుపక్షాలకు చెందిన సైనికులు, సేనానాయకులు ఎవ్వరైనా ధర్మము ఎటువైపు ఉందో అటువైపు పోవచ్చని స్పష్టపరిచారు. అంటే ధర్మము వైపు పార్టీ మారమని ఆహ్వానించారు. ఆ పిలుపుతో దుర్యోధను ని సవతి తమ్ముడైన ’యుయుత్సు’ ధర్మరాజు వైపు తన సైన్యాన్ని తీసుకుకొని పార్టీ మారతాడు. పై ఘటనను భీష్మ, ద్రోణాది పెద్దలు చివరికి గాంధారి సైతం ఖండించలేదు సరికదా సమర్థించారు. కాబట్టి తెలంగాణ సమాజం గురించి పార్టీ మారడం ధర్మ సమ్మతం. ధర్మం, న్యాయం కోసం రావణుని దుర్మార్గ విధానాలను నిరసించి ఎంతో బలవంతుడైన తన అన్నను విడనాడి రాముని శరణుజొచ్చాడు విభీషణుడు. దుర్మార్గుడైన తండ్రిని సైతం విడనాడి ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడయ్యాడు. పై సందర్భాలన్నీ ధర్మం, న్యాయం కోసం తనవారిని వదిలి త్యాగం చేసి చరితార్థులైన సందర్భాలే కానీ ఫిరాయింపులు కావు. శ్రీకృష్ణ భక్తురాలైన మీరాబాయికి హిందీ భాషలో మహాకవి తులసీదాస్ ప్రత్యుత్తరం రాసి రాజపుత్ర వంశ మర్యాదలను, ఆచారాలను, రాజభవనాన్ని వదిలి శ్రీకృష్ణునికి అంకితం కమ్మని ఉపదేశించాడు. ధర్మం కోసం వారిని వదలడం దైవ కార్యంగా అభివర్ణించాడు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీలకు చెందిన నాయకులు సీమాంధ్ర నాయకత్వాలను ధిక్కరించి తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేయాల్సిన చారివూతక బాధ్యత వారిపై ఉన్నది.

సీమాంధ్ర నాయకత్వం కింద ఉన్న పార్టీల్లో ఉంటూ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తామనడం ఆత్మవంచన అవుతుంది. గ్రీకుల దండయావూతలను తిప్పికొట్టడానికి విష్ణుగుప్త చాణక్యుడు నాటి యువతను, ప్రజలను సమీకరించడంతో పాటు వివిధ రాజ్యాల రాజులను, గణ రాజ్యాలను సమీకరించి ఏకం చేశాడు. వారి స్వార్థాలను, అవకాశవాద విధానాలను, పరస్పర శత్రుభావాలను అధిగమించి, ఐక్యతకు కృషి చేసి, గ్రీకులను ఓడించి భారతదేశ గౌరవాన్ని కాపాడారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో వ్యాన్‌గార్డ్ గా ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య ఐక్యతకు కృషి చేయాలి.
సీమాంధ్ర నాయకత్వాలను ధిక్కరించిన వివిధ పార్టీల నాయకులను గౌరవించి దగ్గరికి తీయాలి. తెలంగాణ కోసం తమ పార్టీల నాయకత్వాలను ధిక్కరించిన నాయకులు టీఆర్‌ఎస్‌లోకి మారడం పార్టీ ఫిరాయింపు ఎంత మాత్రంకాదు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ మారడం ధర్మ సమ్మతం, ప్రజా సమ్మతం. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, సీమాంధ్ర మీడియా ఈ పరిణామాలను పార్టీ ఫిరాయింపులుగా వర్ణించడం ఎంత మాత్రం సరైనదికాదు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని తెలంగాణను సమర్థించిన కాంగ్రె స్, టీడీపీలు ఆ తర్వాత తెలంగాణకు ద్రోహం చేసిన తర్వాత ఆ పార్టీలను వీడడం తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకుల నైతిక బాధ్యత.

టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ. ఏ నిర్మాణము, ఎన్నికల బూత్ కమిటీలు లేకుండానే కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న బలము, నిర్మాణము తెలంగాణ ప్రజలు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ పార్టీ అయినప్పటికీ ఉద్యమ పార్టీగా కేసీఆర్ నిర్మించారు. నిజమైన తెలంగాణవాదులకు ఉద్యమ పార్టీలో సరైన స్థానం ఉంటుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కోసం వివిధ పార్టీలు, సంఘాల నాయకులు టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి. తెలంగాణే ఏకైక ఎజెండా కలిగిన రాజకీయ పార్టీకి పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది.

-పెండ్యాల మంగళాదేవి
-వి. ప్రకాశ్,రాజకీయ విశ్లేషకులు

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ