రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం


Sat,October 27, 2012 05:45 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమైతేనే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధిష్ఠానం తమ సమ్మతిని తెలిజేస్తుందనే వార్తలు వినపడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సాధించుకోవడం సరైనదా కాదా అనే చర్చ టీఆర్‌ఎస్‌లోనూ, తెలంగాణవాదుల్లోనూ కొనసాగుతున్నది.ఆ చర్చల్లో అనేక అనుమానాలు, భయాలు, తెలంగాణ సాధన పట్ల చిత్తశుద్ధిలేని అవకాశవాద నాయకుల నిందలు, ఆరోపణలు వినపడుతున్నాయి. తెలంగాణవాదుల అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్, టీఆర్‌ఎస్ ఏం చేసి నా నిందించే వారి గురించి చర్చించే అవసరం ఎంత మాత్రం లేదు.

తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. 1969లో రాష్ట్ర సాధ న కోసం 360కి పైగా యువకులు అమరులయ్యారు. దీర్ఘ పోరాటం, ప్రజల పట్ల విశ్వాసంతో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అసాధ్యమేమీ కాదని అప్పటి నాయకత్వం అర్థం చేసుకోలేకపోయింది. ఇందిరాగాంధీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. దానికి తోడు సీమాంధ్ర నాయకుల కుట్రలు, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందడ్డి పోలీస్ నిర్బంధం తెలంగాణ నాయకుల ను అయోమయానికి గురిచేశాయి. దీనికి తోడు నాటి తెలంగాణ ఉద్య మ నాయకత్వం అనుసరించిన స్వార్థపూరిత విధానాలు కూ డా ఉద్యమ విరమణకు కారణమయ్యాయి. అయితే ప్రజలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం పట్ల సుముఖంగా ఉన్నారు అనే విషయం తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం ద్వారా నిరూపితమైంది.

తిరిగి తెలంగాణ ప్రజానీకం వివిధ సందర్భాల్లో తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ వచ్చారు. తెలంగాణ సమా జం ‘ఆంధ్ర’ అనే శబ్దాన్ని తమ శబ్దంగా ఎన్నడూ భావించలేదు. తాము ఆంధ్రా వారికి భిన్నమనే అభివూపాయాన్ని తెలంగాణ సమాజం బలంగా విశ్వసించి ‘మా తెలుగు తల్లికి’ అనే పాటను ఎన్నిసార్లు పాఠశాలల్లో పాడించినా ఈ ప్రాంత ప్రజల్లో పైన తెలిపిన భావనలో మార్పు రాలేదు.
గత పన్నెండు సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో సాగుతున్న ఉద్యమం ఒక నదిగా ప్రవహించి, అనేక ఉప నదులు కలవడంతో మహానదిగా మారింది. గెలుపు, ఓటములు, ఉద్యమంలో హెచ్చు తగ్గులు, వైఎస్, చంద్రబాబుల కుట్రలు, కొంతమంది తెలంగాణ నాయకుల అవకాశవాద విధానాలు అన్నింటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించే కీలక దశకు చేరుకున్నది. లెనిన్ విప్లవ సూత్రాలను తెలంగాణ ఉద్యమానికి అన్వయిస్తే ఈ కింది విషయాలు స్పష్టమవుతాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఏ విధమైన రాజీకి ఈ ప్రాంత ప్రజానీకం ఒప్పుకోదు. తెలంగాణకు ఒప్పుకోకపోతే సీమాంధ్ర పాలక వర్గాలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకుపోతాయి. వ్యూహాత్మక విధానాలు, సరైన ఎత్తుగడలతో ఉద్యమాన్ని నడిపించే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది.ఈ అంశాలను పరిశీలిస్తే తెలంగాణ సమాజాన్ని ఉద్యమపథాన నడిపించి, లక్ష్యాన్ని సాధించే కృతనిశ్చయంతో 2014లో జరిగే సాధారణ ఎన్నికలు ‘అంతిమ యుద్ధం’లో విజయం సాధించడం కష్టమైన పని కాదనే విశ్వాసం ఏర్పడుతున్నది. చైనా ప్రాచీన యుద్ధ నిపుణుడు ‘సన్ జూ’ చెప్పినట్టు యుద్ధం చేయకుండానే విజయం సాధించే అవకాశాలను పరిశీలించాలి. యుద్ధం చేయకుండానే విజయం సాధిస్తే అంతకన్నా గొప్ప యుద్ధం ఇంకేమీ ఉండదు. సన్ జూ యుద్ధశాస్త్ర నియమాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి.

ఆయన సూత్రాల ను అనుసరించే ‘మావో’ దీర్ఘ కాల యుద్ధంలో చాంకైషేక్‌ను, జపాన్ దురాక్షికమణను ఓడించి నవ చైనా నిర్మాణానికి అంకుర్పాణ చేశాడు. అమెరికా స్వాతం త్య్ర పోరాటంలో మహాసైన్యం చేసిన యుద్ధం కన్నా బెంజిమన్ ఫ్రాంక్లిన్ తన రాజకీయ దౌత్య నీతితో అనేక విజయాలు సాధించాడు. దౌత్యం లో ఇచ్చిపుచ్చుకునే సర్దుబాట్లు తప్పనిసరిగా ఉంటాయి. మౌలిక సూత్రాలకు భంగం కలగకుం డా, సర్దుబాటు చేసుకొని యుద్ధం లేకుండానే విజయం సాధించడం గొప్ప దౌత్యనీతి. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో (హైదరాబాద్‌తో కూడిన) రాజీ లేకుండా ఇతర విషయాల్లో సర్దుబాటు చేసుకోవడం తప్పు కాదు.
టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించింది.

శ్రీ మహా విష్ణువు రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తి లక్ష్యం నెరవేరగానే తన అవతారాన్ని చాలించాడు. అలాగే టీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తనకు తాను అంతం చేసుకుని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎంత మాత్రం తప్పుకాదు. పైగా మహాయుద్ధం చేయకుండానే విజయం సాధించడం ప్రాచీన చైనా యుద్ధ నిపుణుడు సన్ జూ చెప్పినట్టు గొప్ప యుద్ధ నీతి అవుతుంది. నవ తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ విలీనం అవ్వడం ఎంత మాత్రం అడ్డుకాదు. ఎందుకంటే తెలంగాణలోని కాంగ్రె స్ నాయకుల్లో అనేకమంది తమ పలుకుబడి కోల్పోయారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో నూతన నాయకత్వం ఏర్పడింది. తెలంగాణలో ఏర్పడిన నూతన నాయకత్వం ద్వారా నవ తెలంగాణ నిర్మాణానికి నాంది ఏర్పడుతుంది.శ్రీకాంతచారి లాంటి తెలంగాణ అమరవీరులు తమను తాము కాల్చుకొని జై తెలంగాణ అని నినదించారు. అలాగే టీఆర్‌ఎస్ కూడా తనను తాను అంతం చేసుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణకు కారణమవుతుంది.

టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవ్వ డం ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తే అది గొప్ప త్యాగంగా సీమాంధ్ర నాయకులు ఒకరు మాతో అంతరంగికంగా వర్ణించారు. పైవిధంగా చరివూతలో ఎవ రు చెయ్యలేదని చెప్పారు. ఇది కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకుల చిత్తశుద్ధిని, లక్ష్యశుద్ధిని తెలియజేస్తుంది. లక్ష్యసాధన కోసం కొంతవరకు రాజీపడడం చరివూత లో అనేకసార్లు జరిగాయి.

యూపీఏ ప్రభుత్వం మహా సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఎన్డీఏలో కనిపించడం లేదు. ఇక మూడవ ప్రత్యామ్నాయం ఊహించడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆర్థిక సంక్షోభం మూలం గా అమెరికా, ఐరోపా దేశాలు రాజకీ య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో రాజకీయంగా బలపడడానికి విభిన్న వ్యూహాలు అనుసరించాల్సిన అనివార్యత ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించవలసిన అగత్యం ఏర్పడింది. పైగా కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం తద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రం లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తుంది. ఈ అస్త్రం తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ మెడలో పూలమాలగా, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంది. కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ ఇస్తే సంబురాలు లేకపోతే సమరం. తెలంగాణ ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గాల డిపాజిట్లు గల్లంతయ్యేలా టీఆర్‌ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరించాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి.

-పెండ్యాల మంగళాదేవి35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles