తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు


Mon,October 15, 2012 02:58 PM

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర రాజకీయాలు ఏవిధంగా ఉండే అవకాశం ఉంటుందో తార్కికంగా ఊహించడం వల్ల వర్తమాన పరిస్థితులు సరిగ్గా విశ్లేషించుకోవచ్చు. తద్వారా భవిష్యత్తును స్పష్టంగా దర్శించుకోగలుగుతాము. చంద్రబాబు 2004 ఎన్నికల్లో సమైక్యవాదంతో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. తర్వాత ప్రాంతాల వారీగా పార్టీలో చర్చించి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు. 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని పోటీ చేసి 2004 ఎన్నికల్లో కంటే మెరుగైన స్థానాలు దక్కించుకున్నారు. అయి తే అవిశ్వాస రాజకీయాలు, పీఆర్‌పీ వల్ల ఓట్లు చీలడం వంటి ఇత్యా ది కారణాలతో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. అలాగే బాబు తెలంగాణపై 2009 డిసెంబర్ 9న వచ్చిన ప్రకటనను యూటర్న్ తీసుకుని అడ్డుకున్నారు. తద్వారా చంద్రబాబు మాట మీద నిలబడని వ్యక్తిగా అటు సీమాంవూధలోనూ, ఇటు తెలంగాణలోనూ నిరూపితమయ్యారు. తద్వారా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి బాబు మసకబారిన చంద్రుడు అయ్యారు.

బాబు రెండుకండ్ల సిద్ధాంతాన్ని పక్కనపెట్టి సమైక్య, తెలంగాణ వాదాల్లో ఏదో ఒకదానికి కట్టుబడి ఉంటే టీడీపీకి ఈ దుస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు ఇప్పటికీ గ్రహించడం లేదు. నిత్యం ‘స్పష్టత’ గురిం చి మాట్లాడే చంద్రబాబు దాన్ని ఆచరణలో అనుసరించకపోతున్నారు. దీంతో పార్టీని కాపాడుకోవడానికి 63 ఏళ్ల వయసులో పాదయాత్ర చేయాల్సి వస్తోంది. ‘సరైన విధానం లేకుండా నిర్మా ణం, టెక్నిక్‌ల వల్ల ప్రయో జనం ఉండదని’ లెనిన్ చెప్పారు. చంద్రబాబుకు ఏ విషయంలోనూ నిజాయితీతో కూడిన విధానం లేదు. ముఖ్యం గా తెలంగాణ గురించి అసలే లేదు.

వైఎస్ మరణానంతరం జగన్ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అధిక శాతంమంది వైఎస్ అనుచరులే ఉన్న విషయం విదితమే. చైనా ప్రాచీన యుద్ధ నిపుణుడు సన్‌జు చెప్పినట్టు-తనను తాను అర్థం చేసుకొని, శత్రువును సరిగ్గా అర్ధం చేసుకుంటే నూరు యుద్ధాలైనా అవలీలగా జయించవచ్చు. అయితే జగన్ తన బలా న్ని కొంత వరకు అర్థం చేసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి కావడానికి ఉన్న ప్రధాన అడ్డంకులను అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో లేదా ఏ ఇతర బూర్జువా పార్టీలోనైనా శాసనసభ్యుల మద్దతు కన్నా అధిష్ఠా నం ఆశీర్వాదమే ముఖ్యం. అధిష్ఠానాన్ని ప్రభావితం చేయడం లేదా ఒత్తిడి చేయడం కొంత వరకు సహిస్తారు, కానీ ధిక్కారాన్ని అంగీకరించరు. వైఎస్ చనిపోయిన తర్వా త అప్పుడున్న సానుభూతి వాతావరణం లో జగన్ కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉండేది. జగన్ తనకున్న అంగబలం, అర్ధబలంతో అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది.

ఓదార్పు యా త్రతో ప్రజా బలం పెంచుకున్నప్పటికీ కాం గ్రెస్ హైకమాండ్‌కు జగన్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్టి వైరంగా మారాయి. అంటే జగన్ అనుసరించిన వ్యూహాత్మక తప్పిదం వల్ల కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ శాసనసభ్యుల, కార్యకర్తల బలం కోల్పోయారు. వైఎస్‌కు విశ్వాసపావూతులైన వారు కూడా జగన్‌కు శత్రువులయ్యారు. పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ సభ్యుల నుంచి ప్లకార్డు లాక్కొన్ని సమైక్యవాదాన్ని వినిపించడం వల్ల తెలంగాణలో ప్రభావాన్ని కోల్పోయారు. ఓదార్పు యాత్ర పేరుతో ఓరుగల్లుకు బయలుదేరి మానుకోట ఘటనతో అభాసుపాలయ్యారు. తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదించిన సంపాదనను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ సమైక్యావాదాన్ని వినిపించడం ద్వారా తెలంగాణ ప్రజల దృష్టిలో శత్రువుగా మిగిలిపోయారు. జగన్ చేసిన తప్పిదాల వల్ల ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి జైలు పాలయ్యారు. దీంతో భవిష్యత్తు అంధకారమైంది. అయితే దీనికి జగనే బాధ్యుడు అనలేం. తన తండ్రి వైఎస్ అనుసరించిన అధర్మమైన, అన్యాయమైన విధానాలు, రాష్ట్ర సంపదను, వనరులు అక్రమంగా దోచుకోవడం ప్రధాన కారణాలుగా భావించాలి.

కేసీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపెట్టుకోకుండా, పీఆర్‌పీతో పొత్తుపెట్టుకుని ఉంటే ఎన్నికల అనంతరం నమ్మకవూదోహాలు, అవమానాలు సంభవించేవి కావు. చంద్రబాబు ద్రోహబుద్ధి కేసీఆర్‌కు స్పష్టం గా తెలిసినప్పటికీ, పార్టీలో ప్రజాస్వామ్య సూత్రాన్ని అనుసరించి మెజారిటీ నిర్ణయానికి అనుకూలంగా టీడీపీతో పొత్తుపెట్టుకున్నారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరించి టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. చంద్రబాబు మహాకూటమిని విచ్ఛిన్నం చేయడం వల్ల తాను అధికారంలోకి రాకపోవడమే కాకుండా టీఆర్‌ఎస్‌ను కూడా సంక్షోభంలోకి నెట్టారు. దీన్ని అవకాశంగా భావించి టీఆర్‌ఎస్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని కాపాడడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ ప్రకటన చేయించగలిగారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడం వల్ల జరిగిన తప్పులను సరిదిద్దుకొని తదనంతర కాలంలో సరైన వ్యూహాలు, ఎత్తుగడలలను అనుసరించారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, న్యూడెమోక్షికసీలతో కలిపి జేఏసీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో ఉద్యోగ, కార్మిక, కుల సం ఘాలు, సబ్బండ వర్ణాలను ఏకం చేశారు.అయితే సీమాంధ్ర ఆధిపత్య నాయత్వంలో నడిచే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జేఏసీ నుంచి వైదొలిగాయి. దీంతో ఆ పార్టీలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయి.

మొన్న జరిగిన తెలంగాణ మార్చ్‌లో కేసీఆర్ స్వయంగా పాల్గొనకపోయినా మార్చ్‌ను విజయవంతం చేయడానికి టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేశారు. అలాగే కేంద్రంతో తాను జరిపే చర్చలకు విఘాతం కలగకుండా చూసుకున్నారు. ఒకవేళ కేసీఆర్ మార్చ్‌లో పాల్గొంటే లగడపాటి, రాయపాటి, కావూరి వంటి సీమాం ధ్ర పెట్టుబడిదారులు కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపేవారు. కానీ కేసీఆర్ తన వ్యూహాత్మక ఎత్తుగడలను ప్రదర్శించి తెలంగాణ మార్చ్‌ను, కేంద్రంలో చర్చల ను ఏకకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు. అయితే కోదండరామ్ సమష్టి నిర్ణయాలకు విరుద్ధంగా రాత్రంతా మార్చ్‌ను కొనసాగించాలనే అతివాదానికి పాల్పడ్డా రు. అయితే వెంటనే తన తప్పును గ్రహిం చి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అతివా దం, మితవాదం రెండు కవల పిల్లలే. సరై న విధానం మాత్రమే పైన తెలిపిన తప్పు డు వాదాలను రూపుమాపగలుగుతుంది. సరైన ఏర్పాటు చేసుకోకుండా, శత్రువు బలాన్ని అంచనా వేయకుండా, స్వపక్షంలోని బలాబలాలను అర్థం చేసుకోకుండా యుద్ధానికి దిగడం ప్రమాదకరం. ఎందుకంటే రాజకీయాల్లో, యుద్ధంలో వ్యూహా లు, ఎత్తుగడలు ఉంటాయి. రక్తపాతం కూడుకున్న రాజకీయాలే యుద్ధం.
రక్తపాతంలేని యుద్ధమే రాజకీయాలు.

మనదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రజా చైతన్యం, ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రసారమాధ్యమాల ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన ఎత్తుగడలు వేయా లి. లక్ష్యం మారినప్పుడల్లా వ్యూహాలు, ఎత్తుగడలు మారుతుంటాయి. సామ్రాజ్యవాదులను అభివృద్ధి నిరోధకులు, ప్రజా వ్యతిరేకులు, కాగితపు పులులుగా మావో అభివర్ణించారు. వారు పైకి భయంకరంగా, బలంగా కనిపించినా ప్రజా పోరాటంలో ఓటమి కాక తప్పదు. దీర్ఘకాలంలో ప్రజ లు మాత్రమే విజేతలు. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించే శక్తు లు, ప్రజా వూపయోజనాలకు అనుకూలంగా నిలబడే నాయకులు మంచితనంతోపాటు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగాలి. అందుకు అవసరమైన నేర్పు సాధించడానికి పరిశోధన పద్ధతులను అనుసరించాలి. బుద్ధుడు చెప్పినట్టు సంఘపరంగా ఆలోచించాలి, విశ్లేషించాలి. కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ నాయకులకు అవసరమైన ఓపిక, శ్రద్ధ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సబ్బండ వర్ణాలు సమక్షిగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలు మేధావులు రచించాలి.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles