చారిత్రక అనివార్యత: తెలంగాణ


Sat,October 6, 2012 05:10 PM

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో..నాలుగు కోట్లమంది చేయి చేయి కలిపి నడుస్తున్నరు. సీమాంధ్రుల కుట్రలను, విష ప్రచారాలను లెక్క చేయకుండా ఉద్యమపథంలో ఐక్యంగా కదులుతున్నరు. భవిష్యత్తు పట్ల విశ్వాసంతో తెలంగాణ నిర్మాణం పట్ల చిత్తశుద్ధితో తెలంగాణ సమాజమంతా ఉద్యమిస్తున్నది. చంద్రబాబు, జగన్‌ల అనుచరగణం, రాయపాటి, కావూ రి, లగడపాటి కుట్రలను ఛేదిస్తూ జనం ఉద్యమ నినాదంతో సాగిపోతున్నరు. ఇది చరివూతలో ఎన్నటికీ మరిచిపోలేని సుందర దృశ్యం. ఆధునిక చరివూతలో అపురూప దృశ్యంగా నిలిచిపోయే ఘట్టం. ఫ్రెంచి విప్లవానికి ముందు వాల్టేరు , రూసో, మాంటెస్క్యూ సిద్ధాంతాలతో ఫ్రెంచి సమాజం పునీతమై కొత్త సమాజానికి ఎలా పురుడు పోసిందో.., తెలంగాణ సమాజం కూడా అలా గే సరికొత్త తెలంగాణను ఆవిష్కరించుకోవడానికి సన్నద్ధం అవుతున్నది. కేవలం రాష్ట్ర సాధన మాత్రమే కాకుండా.. సమున్నత లక్ష్యాల కోసం తెలంగాణ సమాజం కలలుగంటున్నది.ఆ కలల సాకారాన్ని తెలంగాణ రాష్ట్రసాధనలో భాగంగా ఆవిష్కరించుకునేందుకు ఆరాటపడుతున్నది. మానవతా విలువలు, దళిత, బీసీవర్గాల అభ్యున్నతి గురించి నిర్మాణాత్మక ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే మునుపెన్నడూ లేనంతగా అన్నివర్గాల ప్రజలు తెలంగాణ విముక్తిలో తమ గౌరవప్రద జీవితాన్ని, విముక్తిని చూసుకుంటున్నారు. భవిష్యత్తు పట్ల విశ్వాసంతో పోరాడుతున్నారు. ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నా, భవిష్యత్తు మహోద్యమానికి తెలంగాణ సన్నద్ధంగా ఉన్నది. సీమాంధ్ర పాలకులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తెలంగాణ ఉప్పెనలా లేచి ఉద్యమిస్తుంది. రాష్ట్ర సాధన ఉద్యమం కీలక దశకు చేరుకున్న దశలో పాలు నీళ్లూ వేరవుతున్నాయి. ఉద్యమ ద్రోహుపూవరో తేలిపోతున్నది. ఉద్యమ స్వభావం ఈ తీరుగా ఉన్నప్పుడు కూడా ఇంకా సీమాంధ్ర పార్టీల్లో ఉంటూ వాటి అధినేతల చెప్పుచేతల్లో ఉంటున్న తెలంగాణ నేతలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది.
తెలంగాణ ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించుకునే దిశగా ఆలోచిస్తుంటే.. సీమాంధ్ర జనం ఎందుకు ఆలోచించడంలేదన్నది గమనించాల్సిన విషయమే. అయితే.. సీమాం ధ్ర ప్రాంతంలో కూడా అక్కడి ప్రజలకు పోరాడిన చరిత్ర ఉన్నది. కృష్ణా జిల్లాలో చల్లపల్లి రాజా జమీందారుకు వ్యతిరేకంగా, శ్రీకాకుళంలో మందస జమీందారుకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమాలు ఉన్నాయి. శ్రీకాకుళ గిరిజన ఉద్యమం కూడా ఉత్తరాంవూధలో సాగినది. ఐతే సీమాంధ్ర భూభాగ విస్తీర్ణంతో పోలిస్తే ఉద్యమాల ప్రభావం తక్కువ అనే చెప్పవచ్చు. అలాగే కరీంనగర్, సిరిసిల్లా, జగిత్యాల పోరాటాల వంటి రైతాంగ పోరాటాలు రాయల సీమలో జరగక పోవడంవల్ల ఫ్యాక్షనిస్టు సంస్కృ తి నిర్మూలింపబడలేదు. అక్కడ కూడా విప్లవ ఉద్యమాలు ఉంటే.. ఎంతో కొంత ప్రజాస్వామిక వాతావరణం, విలువలు పాదుకుని ఉండేవి.

ఏ సమాజాన్ని తీసుకున్నా అభ్యుదయ విప్లవ భావాలతో ఉద్యమాలు జరగకుండా సమాజంలో ప్రజాస్వామిక విలువలు పాదుకొనడం కష్టమే. ఆ సమాజం కూడా ప్రగతి పథాన పయనించదు. ఇంగ్లాండులో కూడా విప్లవాత్మక మార్పులకు పునాదుల వేసిన ఉద్యమాలు లేకుండా అక్కడి పారిక్షిశామిక విప్లవాన్ని ఊహించలేము. ఫ్రెంచి విప్లవ ప్రభావంతో ఫ్రాన్స్‌లో ఫ్యూడల్ వ్యవస్థ కూలి పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్నది. జర్మనీలో రైతుయుద్ధం ఓటమి పాలవడం వల్ల భూస్వామ్య వ్యవస్థ నాశనం కాలేదు. తెలంగాణలో సాగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల వల్ల ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందటానికి కావలసిన సామాజిక పునాది ఏర్పడ్డది. అయితే ఈ పోరాటాలు అనుకున్నంత విజయాలు సాధించి వేళ్లూనుకోక పోవడం వలన లంపెన్ శక్తులు కూడా పెరిగాయి. ఆధునిక విద్య, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అంతా కలిసి తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పులకు పునాదిగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం ముందు కుసాగే క్రమంలో తెలంగాణ ప్రగతి రథానికి సీమాంధ్ర వలసవాదు ల ప్రధాన అడ్డంకిని మారారు. ఈ అడ్డంకిని తొలగించుకునే క్రమంలోనే నేడు తెలంగాణ సంఘర్షిస్తున్నది.సీమాంధ్ర వలస వాదుల సకల పీడనలను, వివక్షను ఎదిరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక చారివూతక అనివార్యత నుంచి ఉద్భవించిన తెలంగాణ ఉద్యమాన్ని ఏశక్తీ అడ్డుకోజాలదు. తెలంగాణ సమాజమంతా కదిలి ఏక కంఠంతో నినదిస్తుంటే.. చెవికెక్కనట్టుగా సీమాంధ్ర పాలకులు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే దానికి తగిన మూల్యం వారే చెల్లించుకోక తప్పదు. రాబోయే మహోద్యమంలో సీమాంధ్ర దోపిడీదారుల కుట్రలు, కుహకాలన్నీ వమ్ముగాక తప్పదు. తెలంగాణ రాక తప్పదు. ఇది చారివూతక అనివార్యత.

పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles